హైదరాబాద్ : సీపీఎం కేంద్రకార్యాలయంలో పార్టీ అగ్రనేత సీతారాం ఏచూరి అధ్యక్షతన పోలిట్‌బ్యూరో సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు ప్రకాశ్ కారత్, బృందా కారత్, బీవీ రాఘవులు, మాణిక్ సర్కార్, పి. విజయన్ తదితరులు హాజరయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు దేశంలో చోటు చేసుకున్న పరిణామాలు... నరేంద్ర మోదీ రెండేళ్ల పాలన... జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులపై కూడా ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారు. శనివారం నుంచి మూడు రోజుల పాటు సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు జరగనున్నాయి.