CPI (M) Politburo
-
సీపీఎం సీనియర్ నేత నిరుపమ్ సేన్ మృతి
కోల్‌కతా : వామపక్ష దిగ్గజం, సీపీఎం సీనియర్ నేత నిరుపమ్ సేన్ సుదీర్ఘ అస్వస్థతతో సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తీవ్ర గుండెపోటుతో సేన్ మరణించారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా గతంలో పనిచేసిన సేన్ పశ్చిమ బెంగాల్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిగానూ వ్యవహరించారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. సేన్ భౌతిక కాయాన్ని బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలిస్తారని, అక్కడ ప్రజలు, కార్యకర్తలు ఆయనకు తుది నివాళులు అర్పిస్తారని సీపీఎం వర్గాలు తెలిపాయి. కాగా అదే రోజు సేన్ స్వస్థలం బుర్ద్వాన్ పట్టణంలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
ముగిసిన సీపీఎం పోలిట్ బ్యూరో సమావేశాలు
సాక్షి, ఢిల్లీ: సీపీఎం కేంద్ర కార్యాలయంలో రెండు రోజుల పాటు జరిగిన పోలిట్ బ్యూరో సమావేశాలు మంగళవారం ముగిశాయి. సమావేశంలో బ్యూరో సీపీఎం మహాసభలలో తీసుకున్న నిర్ణయాల అమలు, భాద్యతల అప్పగింత అంశాలపై చర్చించింది. 22వ సీపీఎం అఖిల భారత మహాసభల తరువాత మొదటిసారి భేటీ అయిన పోలిట్ బ్యూరో ఇది. జూన్ 22 నుంచి 24 వరకు కేంద్ర కమిటీ సమావేశాలు నిర్వహించి పోలిట్ బ్యూరోలో చర్చించిన అంశాలను కేంద్ర కటిటీ ముందుంచనున్నారు. సీపీఎం పోలిట్ బ్యూరో కర్ణాటక రాజకీయ పరిణామాలను స్వాగతించింది. రేపు కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హాజరుకానున్నారు. సమావేశంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. కర్ణాటకలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూసిందన్నారు. బీజేపీ ప్రజాతీర్పును కాదని గోవా, మణిపూర్, మేఘాలయ, బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పరచినట్లుగా కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుందని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కాంగ్రెస్, జెడిఎస్‌కు 56.6 శాతం ప్రజలు ఓటు వేశారు. కానీ అధిక సీట్లు వచ్చిన బీజేపీకి కేవలం 36.2 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలపై తీవ్ర భారం పడుతోందని ఏచూరి అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా అత్యధికంగా పెరిగాయి. గడిచిన నాలుగేళ్ళలో గ్రామీణ భారతం సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, గతంలో ప్రజలు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోలేదని తెలిపారు. నోట్లరద్దు, జీఎస్టీ వల్ల ప్రజలపై ఆర్థిక భారాలు మరింత పెరిగాయాయని, వారిపై భారం పెంచుతూ 11 లక్షల కోట్ల రుణాలను బడా కార్పోరేట్లకు బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసిందని, ప్రజలపై మోడీ ప్రభుత్వం వేస్తున్న భారాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సీపీఎం పిలుపునిచ్చింది. ‘త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చాక సీపీఎం కార్యకర్తలపై దాడులు పెరిగాయి. ఇద్దరు కార్యకర్తలు చనిపోయారు. 50 పార్టీ కార్యాలయాలు ధగ్దం చేశారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ దాడులతో 500 కార్యకర్తలు ఇళ్ళను వదిలి పార్టీ ఏర్పాటు చేసిన కార్యాలయాల్లో ఉంటున్నారు.’అని సీపీఎం పోలిట్ బ్యూరో త్రిపురలో సీపీఎం కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండించింది. అదేవిధంగా బీజేపీ బెంగాల్లో మమత సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, పంచాయతీ ఎన్నికలలో 40 మంది ప్రాణాలు కోల్పోయారని, బెంగాల్ లో ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా ఓటు వేసే హక్కును కోల్పోయారు. అలాంటిది బెంగాల్లో హింసను ప్రేరేపిస్తూ.. కర్ణాటకలో ప్రజాస్వామ్యం గురించి మమత బెనర్జీ మాట్లాడటం హాస్యాస్పదమని ఏచూరి అన్నారు. అస్సాం, ఈశాన్య రాష్ట్రాలలో మైనారిటీలు వివక్షకు గురవుతున్నారు. సిటిజన్ షిప్ యాక్ట్ అమలులో మత ప్రాతిపదికను కేంద్రం అమలు చేస్తుంది. కేంద్రం సిటిజన్ షిప్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని బ్యూరో డిమాండ్ చేసింది. పార్లమెంట్లో సీపీఎం సిటిజన్ షిప్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తుందని సీతారాం ఏచూరి అన్నారు. -
కాంగ్రెస్‌తో ఒప్పందంపై పీటముడి
న్యూఢిల్లీ: బీజేపీని గద్దె దింపేందుకు కాంగ్రెస్‌తో రాజకీయ ఒప్పందం కుదుర్చుకోవాలా? వద్దా? అన్న విషయంపై ఏకాభిప్రాయానికి రాకుండానే సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశాలు ముగిశాయి. రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశాల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ప్రవేశపెట్టిన రెండు అంశాలపై చర్చలు జరిగాయి. 22వ సీపీఎం జాతీయ మహాసభల్లో చర్చించాల్సిన పలు అంశాలపై ఓ ముసాయిదాను కూడా రూపొందించారు. కాంగ్రెస్‌తో ఎన్నికల ఒప్పందమేదీ ఉండకూడదనీ, అయితే మోదీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపేసేందుకు అన్ని వామపక్షేతర పార్టీల సహకారాన్ని తీసుకోవాలని ఏచూరి సూచించారు. దీనిని కారత్ వర్గం వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్‌తో రాజకీయ ఒప్పందం ఉండనప్పటికీ, ఇప్పటికే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ప్రాంతీయపార్టీలతో సీపీఎం కలసి నడవాలనేది కారత్ సూచన. ఇది అసాధ్యమని ఏచూరి వర్గం వాదిస్తోంది. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ముసాయిదాను పార్టీ కేంద్ర కమిటీ ముందు ఉంచనున్నారు. కేంద్ర కమిటీ జనవరి 19 నుంచి 21 వరకు మూడురోజులపాటు కోల్‌కతాలో సమావేశమై చర్చలు జరపనుంది. కాగా కాంగ్రెస్ పార్టీపై కారత్ విరుచుకుపడ్డారు. 1992లో బాబ్రీ మసీదు కూలిపోతుంటే నాటి ప్రధాని పీవీ నరసింహారావు ఆపడానికి ప్రయత్నం కూడా చేయలేదనీ, కాంగ్రెస్ బయటకు మాత్రమే లౌకికవాద పార్టీ కానీ లోపల కాదని ఆయన ఆరోపించారు. -
కాంగ్రెస్‌తో కలవాలా? వద్దా?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఢిల్లీలో రెండ్రోజులపాటు జరిగే సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ భేటీలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ, ఆరెస్సెస్ శక్తులను ఓడించేందుకు భావసారూప్య పార్టీలతో కలిసి పనిచేయాలనే రాజకీయ తీర్మానంపైనే చర్చ జరిగింది. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరీ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో మతతత్వ శక్తులను ఓడించేందుకు కాంగ్రెస్‌తో పనిచేయాలా వద్దా? అనే అంశంపై చర్చించారు. కేరళ యూనిట్, కారత్ వర్గం దీనిపై అభ్యంతరం తెలపగా పశ్చిమబెంగాల్, త్రిపుర యూనిట్లు సానుకూలంగా స్పందించాయి. -
పాలకులు పంచుకోవడానికే ప్యాకేజీ
ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఆయువుపట్టు పవన్ మాటల్లో కాదు.. చేతల్లో చూపాలి సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీని టీడీపీ, బీజేపీ పాలకులు అంగీకరించడంపై సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మండిపడ్డారు. ప్యాకేజీ సొమ్మును వారు పంచుకోవడానికే అని ఆయన ఆరోపించారు. బీజేపీ, టీడీపీ నేతలకు ప్రత్యేక హోదా ఇష్టం లేదన్నారు. అందుకే ప్రజల ఆకాంక్షను విస్మరించి ప్యాకేజీకి ఆమోదం తెలిపి నమ్మక ద్రోహం చేశారని విమర్శించారు. ఆదివారం విశాఖపట్నంలో ఏయూ ప్లాటినం జూబ్లీ హాలులో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక నిర్వహించిన సదస్సులో పాల్గొన్న బీవీ రాఘవులు మాట్లాడారు. ఇప్పుడు ప్యాకేజీ సరిపోతుందంటున్న వారు... విభజన సమయంలో పార్లమెంటులో ఐదేళ్లకు బదులు పదేళ్లు కావాలని ఎందుకు డిమాండ్ చేశారని ప్రశ్నించారు. కేంద్రమంత్రి వర్గంలో కొనసాగుతూ హోదా సాధించడం టీడీపీకి సాధ్యం కాదన్నారు. ప్రత్యేక హోదా రాకపోతే టీడీపీ, బీజేపీలకు రాష్ట్రంలో నూకలుండవని ఎద్దేవా చేశారు. సదరు రెండు రాజకీయంగా ఘోరీ కట్టుకోవలసిందేనని జోస్యం చెప్పారు. రాష్ట్రం విడిపోయాక రైల్వేజోన్ ఇస్తామన్నారని... కానీ ఇప్పటికీ ఈ అంశంపై ప్రకటన చేయకపోవడం ద్రోహమేనన్నారు. మాటలు కాదు.. చేతల్లో చూపాలి ప్రత్యేక హోదా గురించి మాటలతో సరిపెట్టకుండా చేతల్లో చేసి చూపించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు బీవీ రాఘవులు సూచించారు. చెగువేరా గురించి పవన్ కల్యాణ్ తరచూ ప్రస్తావిస్తాడు... ప్రశంసిస్తాడు ఆయన గుర్తు చేశారు. అయితే చెగువేరా మాటలు చెప్పలేదు.. తుపాకీతో సాయుధ పోరాటం చేశాడని చెప్పారు. చెగువేరాలా పవన్‌ను తుపాకీ పట్టుకోమని చెప్పం.. కానీ రాజ్యాంగ పరిధికి లోబడి ప్రజల పక్షాన ఆందోళనలు చేయాలని కోరారు. అమరావతి చుట్టూనే అభివృద్ధి రాష్ట్రవిభజన జరిగాక సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని పట్టించుకోకుండా అమరావతి చుట్టూనే అభివృద్ధిని కేంద్రీకరిస్తున్నారని రాఘవులు విమర్శించారు. ఇదే అంశం గతంలోనూ రాష్ట్ర విభజనకు దారితీసిన విషయాన్ని విస్మరిస్తూ మళ్లీ అదే తప్పునే చేస్తున్నారన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమను నిర్లక్ష్యం చేస్తే మళ్లీ అలాంటి ఉద్యమమే పునరావృతమవుతుందని టీడీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాయలసీమ వెనకబాటుకు కారణం ఉందని, కానీ ప్రకృతి వనరులున్నా ఉత్తరాంధ్ర వెన కబడి ఉండటానికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని బీవీ రాఘవులు ఆరోపించారు. -
స్వాతంత్య్ర స్ఫూర్తితోనే రాణింపు
అత్తిలి: యువతలో స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తి రగిల్చిననాడే వా రు అన్ని రంగాల్లో రాణిస్తారని సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. స్థానిక ఎస్వీఎస్ఎస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ గాదం గోపాలస్వామి రచించిన భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పశ్చిమగోదావరి జిల్లా యోధు లు, పశ్చిమగోదావరి జిల్లా సాంస్కృతిక సౌరభాలు అనే గ్రంథాలను సోమవారం కళాశాలలో ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా బీవీ రాఘవులు మాట్లాడుతూ చరిత్రను అశ్రద్ధ చేసే ఏ దేశమైనా చరిత్ర లేకుండా పోతుందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే వంక సత్యనారాయణ మాట్లాడుతూ అవినీతి రహిత సమాజం ఏర్పడినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు అవుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు మాట్లాడుతూ అత్తిలి కళాశాల అభివృద్ధి కృషిచేయాలని కోరారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మా ట్లాడుతూ ఆచరించినవాడే ఆచార్యుడని పేర్కొన్నారు. దుబారా వ్యయాన్ని తగ్గించి, పేదల సంక్షేమానికి ఖర్చుచేయాలని సూచిం చారు. మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడారు. అనంతరం గాదం గోపాలస్వామి రచించిన రెండు గ్రంథాలను బీవీ రాఘవులు, వంక సత్యనారాయణ తదితరులు ఆవిష్కరించారు. రచయిత గాదం గోపాలస్వామి దంపతులను కళాశాల తరఫున సత్కరించారు. కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు దాసం గోవిందరావు, కార్యదర్శి మద్దాల నాగేశ్వరరావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ మండెల సూర్యనారాయణ, సూరంపూడి వెంకటరమణ పాల్గొన్నారు. -
ప్రారంభమైన సీపీఎం పోలిట్ బ్యూరో సమావేశం
హైదరాబాద్ : సీపీఎం కేంద్రకార్యాలయంలో పార్టీ అగ్రనేత సీతారాం ఏచూరి అధ్యక్షతన పోలిట్‌బ్యూరో సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు ప్రకాశ్ కారత్, బృందా కారత్, బీవీ రాఘవులు, మాణిక్ సర్కార్, పి. విజయన్ తదితరులు హాజరయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు దేశంలో చోటు చేసుకున్న పరిణామాలు... నరేంద్ర మోదీ రెండేళ్ల పాలన... జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులపై కూడా ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారు. శనివారం నుంచి మూడు రోజుల పాటు సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు జరగనున్నాయి. -
కార్పొరేట్ శక్తులు, రియల్టర్ల కోసమే 'భూసేకరణ'
విజయవాడ: కార్పొరేట్ శక్తులు, రియల్టర్ల కోసమే 2013 - భూ సేకరణ చట్టానికి సవరణలు చేస్తూ నరేంద్ర మోదీ సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసిందని సీపీఎం పాలిటిబ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు ఆరోపించారు. దీని వెనక ఏపీ ప్రభుత్వం ఒత్తిడి ఉందని విమర్శించారు. ఆ ఆర్డినెన్స్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన తప్పదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజధాని కోసం సేకరిస్తున్న 35 వేల ఎకరాల భూసేకరణలో ప్రజా ప్రయోజనాలు ఏమీ లేవన్నారు. రాజధాని అనేది ప్రజల పాలన కోసం తప్పతే రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమో లేక రాజకీయ తాబేదారుల కోసమో ఏర్పాటు చేయకుడదని ప్రభుత్వానికి ఈ సందర్భంగా బి.వి.రాఘవులు హితవు పలికారు.