
సీపీఎం సీనియర్ నేత నిరుపమ్ సేన్ కన్నుమూత (ఫైల్‌ఫోటో)
కోల్‌కతా : వామపక్ష దిగ్గజం, సీపీఎం సీనియర్ నేత నిరుపమ్ సేన్ సుదీర్ఘ అస్వస్థతతో సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తీవ్ర గుండెపోటుతో సేన్ మరణించారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా గతంలో పనిచేసిన సేన్ పశ్చిమ బెంగాల్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిగానూ వ్యవహరించారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.
సేన్ భౌతిక కాయాన్ని బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలిస్తారని, అక్కడ ప్రజలు, కార్యకర్తలు ఆయనకు తుది నివాళులు అర్పిస్తారని సీపీఎం వర్గాలు తెలిపాయి. కాగా అదే రోజు సేన్ స్వస్థలం బుర్ద్వాన్ పట్టణంలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.