Member
-
పంచాయతీ సభ్యురాలికి ఘోర అవమానం
తాపీ: గుజరాత్‌లోని తాపీ జిల్లాలో పంచాయతీ సభ్యురాలిపై దాడి జరిగింది. తన భర్తతో ప్రేమ వ్యవహారం నడుపుతున్నదంటూ ఓ మహిళ.. పంచాయతీ సభ్యురాలిపై దాడికి తెగబడింది. అంతటితో ఆగక ఆమె జుట్టును కూడా కత్తిరించింది. ఈ అమానవీయ ఘటనలో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.వివరాల్లోకి వెళితే సోంగాఢ్ పంచాయతీ సభ్యురాలైన ఊర్మిళ గమిత్‌పై ఒక మహిళతోపాటు మరో ముగ్గురు హాకీ స్టిక్‌లతో దాడి చేసి, ఆమె జుట్టును కత్తిరించారని సోంగాధ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. బాధిత మహిళ తన కుమార్తెతో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా ఆమెపై దాడి చేశారు.పంచాయతీ సభ్యురాలు ఊర్మిళపై శోభనా గమిత్ అనే మహిళ, ఆమె కుమారుడితో పాటు వచ్చిన కొందరు వ్యక్తులు కలసి దాడి చేశారు. ఈ దాడిలో ఊర్మిళ ఎడమ చేతి ఎముక విరిగిందని, నడుము, తలపై గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఆమె వద్ద ఉన్న బంగారు లాకెట్‌ను నిందితులు లాక్కొని పారిపోయినట్లు బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. ఊర్మిళను వైద్య చికిత్స కోసం పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఊర్మిళ తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్నదని శోభనా గమిత్ పోలీసుల ఎదుట ఆరోపించింది. కాగా ఈ కేసులో ఒకరిని అరెస్టు చేశామని, సంఘటనా స్థలంలో లభ్యమైన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: హస్తినలో ‘అమర’ ప్రేమికుడు! -
ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా ఘన్‌శ్యామ్ తివారీ
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎథిక్స్ (నైతిక విలువల) కమిటీ ఛైర్మన్‌గా బీజేపీకి చెందిన ఘన్‌శ్యామ్ తివారీ నియమితులయ్యారు. అక్టోబర్ 10 నుంచి ఈ కమిటీ మనుగడలోకి వస్తుందని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తెలిపారు. ఎథిక్స్ కమిటీలో వైఎస్సార్సీపీ ఎంపీ వై.విజయసాయి రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు. ప్రమోద్ తివారీ (కాంగ్రెస్), డెరెక్ ఒబ్రియాన్ (తృణమూల్ కాంగ్రెస్), తిరుచ్చి శివ (డీఎంకే), సంజయ్ సింగ్ (ఆప్), శస్మిత్ పాత్రా (బీజేడీ), ప్రేమ్‌చంద్ గుప్తా (ఆర్జేడీ), మేధా విశ్రామ్ కులకర్ణి, దర్శనా సింగ్ (బీజేపీ)లు కమిటీలోని ఇతర సభ్యులు. రాజ్యసభలో ఎంపీల ప్రవర్తనకు సంబంధించిన ఫిర్యాదులు వస్తే ఎథిక్స్ కమిటీ పరిశీలించి నిర్ణయాలు వెలువరిస్తుంది. అలాగే విజయసాయి రెడ్డిని రవాణా, పర్యాటక, సాంస్కృతిక స్టాండింగ్ కమిటీ నుంచి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల స్టాండింగ్ కమిటీకి మారుస్తూ ధన్‌ఖడ్ ఆదేశాలు జారీచేశారు. -
ఒలింపిక్ కమిటీకి ఏకగ్రీవంగా ఎన్నికైన నీతా (ఫొటోలు)
-
రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతే..
సాక్షి, అమరావతి: రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ వచ్చే మార్చి తర్వాత గల్లంతు కానుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ అంటే గత 41 ఏళ్లలో రాజ్యసభలో ఆ పార్టీకి సభ్యులు లేకపోవడం ఇదే తొలిసారి అవుతుంది. నిజానికి.. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ఆ పార్టీని చేజిక్కించుకున్న తర్వాత టీడీపీ క్రమంగా ప్రాభవం కోల్పోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో.. త్వరలో ఖాళీకానున్న మూడు రాజ్యసభ స్థానాలూ అసెంబ్లీలో సంఖ్యా బలం ద్వారా వైఎస్సార్సీపీనే కైవసం చేసుకుంటుంది. దీంతో రాజ్యసభలో టీడీపీ తొలిసారిగా కనుమరుగు కావడం ఖాయం. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 250 లోపు ఉండాలి. ప్రస్తుతమున్న సభ్యుల సంఖ్య 245. ఇందులో 233 మందిని ఆయా రాష్ట్రాల శాసనసభ్యులు ఎన్నుకుంటారు. మిగతా 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. రాష్ట్ర కోటాలో రాజ్యసభ సభ్యుల సంఖ్య 11. ఇక రాజ్యసభలో 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీకి ఇద్దరు.. టీడీపీకి 9 మంది సభ్యులు ఉండేవారు. రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 50 శాతం ఓట్లతో 151 శాసనసభ స్థానాల్లో ఘనవిజయం సాధించగా.. టీడీపీ 23 స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని మచ్చిక చేసుకుని కేసుల నుంచి బయటపడేందుకు టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేశ్‌లను బీజేపీలోకి ఫిరాయించేలా చంద్రబాబు పావులు కదిపారు. ఇక రాష్ట్ర కోటాలో ఎన్నికైన రాజ్యసభ సభ్యుల్లో 2020లో నలుగురు (టీడీపీ), 2022లో నలుగురు (ముగ్గురు టీడీపీ, ఒకరు వైఎస్సార్సీపీ) పదవీకాలం పూర్తవడంతో ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించింది. నాడు అసెంబ్లీలో వైఎస్సార్సీపీకి ఉన్న సంఖ్యాబలం ఆధారంగా ఎనిమిది రాజ్యసభ స్థానాలు ఆ పార్టీకే దక్కాయి. ఇందులో నలుగురు బీసీలను రాజ్యసభకు పంపి సామాజిక న్యాయమంటే ఇదీ అని సీఎం వైఎస్ జగన్ దేశానికి చాటిచెప్పారు. ఆ మూడూ వైఎస్సార్సీపీ ఖాతాలోకే.. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 2 నాటికి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి (వైఎస్సార్సీపీ), సీఎం రమేష్ (బీజేపీ), కనకమేడల రవీంద్రకుమార్ (టీడీపీ)ల పదవీకాలం పూర్తికానుంది. ఖాళీ అయ్యే ఈ మూడు స్థానాలకు ఫిబ్రవరి ఆఖరు లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేయనుంది. రాజ్యసభకు ఎన్నికకు కావాలంటే 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ప్రస్తుతం శాసనసభలో వైఎస్సార్సీపీకి ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే.. ఈ మూడు స్థానాలు ఆ పార్టీ ఖాతాలో చేరడం ఖాయం. దీంతో రాజ్యసభలో వైఎస్సార్సీపీ బలం 11కు చేరనుంది. అంటే రాష్ట్ర కోటాలో సీట్లన్నీ వైఎస్సార్సీపీ ఖాతాలోకే చేరుతాయి. టీడీపీ ఉనికే లేకుండాపోతుంది. -
పేదరికం తగ్గిన ఆహార వినియోగం పెరగలేదు!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: తలసరి ఆదాయం పెరిగి పేదరికం తగ్గిన దశలో శక్తినిచ్చే ఆహార వినియోగం పెరగటం ప్రపంచదేశాల్లో సర్వసాధారణం కాగా, భారత్‌లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు, ప్రముఖ వ్యవసాయ ఆర్థిక వేత్త డాక్టర్ రమేశ్ చంద్ అన్నారు. 2012కు ముందు 30 ఏళ్లలో తలసరి ఆదాయం పెరిగి, పేదరికం తగ్గినప్పటికీ శక్తినిచ్చే ఆహార వినియోగం మాత్రం తగ్గిందన్నారు. పేదరికాన్ని తగ్గించినంత సులువుగా శక్తినిచ్చే ఆహార వినియోగాన్ని పెంపొందించలేకపోవటం అనే విచిత్ర పరిస్థితి మన దేశంలో నెలకొన్నదన్నారు. ప్రపంచ దేశాల పోకడకు భిన్నమైన ఈ ఆహార వినియోగ ధోరణికి మూలకారణాన్ని శోధించాలన్నారు. శనివారం సాయంత్రం ఇక్కడి జాతీయ పోషకాహార సంస్థలో ఆయన డా. గోపాలన్ స్మారకోపన్యాసం చేశారు. ఆహార లభ్యత గత 50 ఏళ్లలో గణనీయంగా పెరిగినప్పటికీ శక్తినిచ్చే ఆహార వినియోగం తగ్గటం వెనుక మర్మాన్ని మన పౌష్టికాహార నిపుణులు శోధించాల్సిన అవసరం ఉందని డా. రమేశ్ చంద్ తెలిపారు. 1980 నుంచి 2012 నాటికి భారత్‌లో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారి శాతం 38 నుంచి 16కి తగ్గిందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార-వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.)చెబుతున్నదన్నారు. అయితే, హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్.ఐ.ఎన్.) గణాంకాల ప్రకారం మాత్రం వీరి శాతం 2012 నాటికి 77%గా ఉందన్నారు. ఎన్.ఐ.ఎన్. విశ్లేషణ నమూనాను ఎఫ్.ఎ.ఓ. నమూనాతో అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంతో పోల్చితే ప్రజలకు యాంత్రీకరణ పెరిగి, శారీరక శ్రమ చేయాల్సిన అవసరం తగ్గింది. కాబట్టి, ప్రొటీన్లు, ఐరన్ వంటి పోషకాలు తీసుకోవటం పెరిగినా శక్తినిచ్చే ఆహార ధాన్యాల వినియోగం తగ్గి ఉంటుందన్నారు. భారతీయ సంస్కృతిలోని ఆహారం తక్కువగా తినటం ఆరోగ్యదాయకం అన్న భావన కారణంగానే కేలరీల వినియోగం తగ్గిందని ఫ్రెంచ్ ఆంత్రపాలజిస్ట్ ఫ్రెడరిక్ లెండి విశ్లేషించారని, ఈ కోణంలో పరిశోధనలు చేయాలని డా. రమేశ్ చంద్ అన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే ఆహార ధాన్యాలు మనుషులతో పాటు పశువులకు మేపుతున్నామా? లేకపోతే ఆహారధాన్యాలు ఏమవుతున్నాయన్నది అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు. తక్కువ పరిమాణంలో ఆహార వినియోగం జరుగుతున్నందున పోషకాల సాంద్రత ఎక్కువగా ఉన్న ఆహారోత్పత్తి చేపట్టాలి. స్థానిక / సంప్రదాయ ఆహారాన్ని వినియోగించే దిశగా ప్రోత్సహించాలన్నారు. చిరుధాన్యాలను మధ్య, ఉన్నతి తరగతి ప్రజలు మరింతగా తింటున్నారని, అంటూ చిరుధాన్యాలకు మరింత ధర చెల్లిస్తే సాగుతో పాటు లభ్యత పెరుగుతుందని డా. రమేశ్ చంద్ అన్నారు. ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత తదితరులు పాల్గొన్నారు. దేశీయంగా గత పదేళ్ల నేషనల్ శాంపుల్ సర్వే గణాంకాల సేకరణ ఫలితాలు వెలువడాల్సి ఉందన్నారు. 2012 తర్వాత ప్రజల ఆదాయం బాగా పెరిగిందని అంటూ.. ఈ గణాంకాల్లో ఎంత మార్పు కనిపిస్తుందో వేచిచూడాలన్నారు. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు (చదవండి: సహకార ‘భారత్ ఆర్గానిక్స్’! -
అంతర్జాతీయ మీడియేటర్ ప్యానెల్ సభ్యుడిగా మాజీ జస్టిస్ ఎన్వీ రమణ!
సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేటర్ ప్యానల్ సభ్యునిగా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సింగపూర్‌లోని ప్రధాన తెలుగు సంస్థలైన సాంస్కృతిక కళాసారథి, తెలుగుదేశం ఫోరమ్ మొదలైన సంస్థల ప్రతినిధులు వారిని గౌరవపూర్వకంగా కలిసి తమ సంస్థల తరఫున అభినందనలు తెలియజేసి సత్కరించారు. “తెలుగువారికే గర్వకారణమైన జస్టిస్ ఎన్వీ రమణను, వారి సింగపూర్ పర్యటన సందర్భంగా కలుసుకోవడం, వారికి తమ సంస్థ గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను అన్నింటిని తెలియపరచి వారి ఆశీస్సులు అభినందనలు అందుకోవడం చాలా సంతోషదాయకంగా ఉందని" 'సాంస్కృతిక కళాసారథి' అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలిపారు. జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ "తెలుగు వారంతా ఒక్కటిగా, ఒకే మాట మీద, ఒకే తాటి మీద ఉంటే తెలుగుని సింగపూర్ ప్రభుత్వం కూడా గుర్తించి మీరంతా ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకుంటున్న విధంగా తెలుగు భాషను సింగపూర్ ప్రభుత్వ పాఠశాలలో బోధించడం సులభతరం అవుతుందని, ఆ ప్రక్రియలో తమ సహాయ సహకారాలు కూడా ఎప్పుడూ ఉంటాయని" అన్నారు. ఈ సందర్భంగా సభ్యులు టేకూరి నగేష్, అమ్మయ్య చౌదరి, సతీష్ పారేపల్లి తదితరులు జస్టిస్ రమణని కలిసి సత్కరించారు. (చదవండి: ఆతిథ్యం ఇచ్చిన సింగపూర్ తెలుగు ప్రజలు!) -
ఆంగ్లో ఇండియన్ అంటే ఎవరు? వీరి ప్రాధాన్యత ఏమిటి?
దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని లోక్‌సభ, అసెంబ్లీలలో ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీ ప్రాతినిధ్యం ఉండేది. లోక్‌సభకు ఆంగ్లో ఇండియన్ ప్రతినిధులను రాష్ట్రపతి స్వయంగా ఎన్నుకునేవారు. సభలో ఈ సంఘానికి రెండు సీట్లు రిజర్వ్ చేసేవారు. పార్లమెంట్లో అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉంటుంది. దేశంలో ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీ చరిత్ర గురించి తెలుసుకుందాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 366 (2)లో ఆంగ్లో ఇండియన్ ప్రస్తావన కనిపిస్తుంది. ఆంగ్లో-ఇండియన్ అంటే భారతదేశంలో నివసిస్తూ, వారి తండ్రి లేదా అతని తండ్రితరపు పూర్వీకులు యూరోపియన్ సంతతికి చెందినవారై ఉండాలి. చరిత్రను పరిశీలిస్తే భారతదేశంలో ఆంగ్లో-ఇండియన్ల రాక బ్రిటీష్ వారు భారతదేశంలో రైల్వే ట్రాక్‌లు,టెలిఫోన్ లైన్లు వేసినప్పుడు ప్రారంభమైంది. ఈ పనుల కోసం యూరప్ నుండి జనం భారతదేశానికి తరలి వచ్చారు. తర్వాత ఇండియాలో ఇక్కడి యువతులనే వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడ్డాడు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 331 ప్రకారం.. భారతదేశంలోని ఆంగ్లో-ఇండియన్ల సంఘం ప్రతినిధులను దేశంలోని పార్లమెంటు, రాష్ట్రాలలోని అసెంబ్లీలకు నామినేట్ చేసేవారు.ఈ సంఘానికి సొంత నియోజకవర్గం అంటూ లేదు. ఈ హక్కును తొలిసారిగా ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుంచి ఫ్రాంక్ ఆంథోనీ అందుకున్నారు. లోక్‌సభలో మొత్తం 545 స్థానాలు ఉన్నాయి. వీటికి 543 మంది ఎంపీలు ఎన్నికవుతారు. ఈ ఎంపీలలో ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీకి చెందినవారు ఎవరూ లేకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 331 ప్రకారం, రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్ సంఘానికి చెందిన ఇద్దరు ప్రతినిధులను లోక్‌సభకు నామినేట్ చేసేవారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం సభకు నామినేట్ అయిన ఆంగ్లో-ఇండియన్ 6 నెలల్లోపు ఏదైనా పార్టీ సభ్యత్వం తీసుకోవచ్చు. సభ్యత్వం తీసుకున్న తర్వాత వారు ఆ పార్టీ విప్‌కు కట్టుబడి ఉండాలి. దీనితో పాటు పార్టీ నియమనిబంధనల ప్రకానం నడుచుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా చదవండి: సిక్కుల తలపాగా రహస్యం ఏమిటి? ఎందుకు ధరిస్తారు? రాష్ట్రాలలో ఏ ఆంగ్లో ఇండియన్లు అసెంబ్లీ ఎన్నికలలో గెలవని పక్షంలో గవర్నర్ ఆంగ్లో-ఇండియన్‌ను ఎన్నుకుని అసెంబ్లీకి పంపే హక్కు కలిగి ఉంటారు. ఇలా ఎన్నికైనవారు ప్రజల నుంచి ఎన్నుకోనివారై, రాష్ట్రపతి లేదా గవర్నర్ ద్వారా నామినేట్ అయితే వారికి రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసే హక్కు వారికి ఉండదు. 2012 రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసిన ఏకైక ఆంగ్లో-ఇండియన్ డెరెక్ ఓ బ్రియన్. ఈయన తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా ఎంపికయ్యారు. ఆదరణ పొందిన కీలర్ సోదరులు పలువురు ఆంగ్లో-ఇండియన్లు మనదేశంలో ఆదరణ పొందారు. వారిలో కీలర్ సోదరులు ప్రముఖంగా కనిపిస్తారు. వీరిద్దరూ లక్నోలో పుట్టారు. ఎయిర్ ఫీల్డ్ మార్షల్ డెంజిల్ కీలర్, వింగ్ కమాండర్ ట్రెవర్ కీలర్ భారత వైమానిక దళంలో పని చేశారు. వీరు ప్రదర్శించిన ధైర్యసాహసాల కారణంగా 1965 ఇండో-పాక్ యుద్ధంలో వీరిద్దరికీ వీర చక్ర అవార్డు లభించింది. లక్నోలో చదువుకున్న ఫ్లైట్ లెఫ్టినెంట్ ఆల్ఫ్రెడ్ కుక్ కూడా 1965 ఇండో-పాక్ యుద్ధంలో వీర చక్ర అవార్డును అందుకున్నారు. పీటర్ ఫాంథమ్ పలుమార్లు ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యునిగా ఉన్నారు. మోడీ ప్రభుత్వ నిర్ణయంతో.. మోడీ ప్రభుత్వం తన రెండవ టర్మ్ సమయంలో, ఆంగ్లో ఇండియన్ల ఎంపిక విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంది. 2019 సంవత్సరంలో పార్లమెంటులో ఆంగ్లో-ఇండియన్ల ప్రాతినిధ్యాన్ని రద్దు చేసింది. ప్రతి పదేళ్ల తర్వాత పార్లమెంటులో రిజర్వేషన్లకు సంబంధించి సమీక్ష జరుగుతుంది. ఈ సమీక్షలో ఈ రెండు రిజర్వ్డ్ సీట్లలో రిజర్వేషన్ ఉంచాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. వారి రిజర్వేషన్ వ్యవధి 2020, జనవరి 25తో ముగిసింది. రాజ్యాంగంలో 126వ సవరణ సమయంలో జరిగిన సమీక్ష సందర్భంగా ఈ రిజర్వేషన్‌ను కొనసాగించకూడదని మోదీ మంత్రివర్గం నిర్ణయించింది. దీంతో జార్జ్ బేకర్, రిచర్డ్ హే.. ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీ నుండి పార్లమెంటుకు ఎంపికైన చివరి ఎంపీలుగా నిలిచారు. ఇది కూడా చదవండి: ఆమె మన దేశపు రాకుమారి.. పాక్ ప్రభుత్వంలో పనిచేస్తూ.. -
కిసాన్ మోర్చా మహిళా నేత ఆత్మహత్య.. బీజేపీ కీలక నిర్ణయం..
గౌహతి: కిసాన్ మోర్చా నాయకురాలు ఆత్మహత్య కేసులో నిందితునిగా ఉన్న ఓ నాయకుని పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసింది అసోం బీజేపీ. గత శుక్రవారం బీజేపీ కిసాన్ మోర్చాకు చెందిన ఓ మహిళ గౌహతిలో తన సొంత నివాసంలో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తర్వాత రాష్ట్ర బీజేపీ అధిష్ఠానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళా నాయకురాలు ఇతర పార్టీ నాయకునితో ఉన్న అశ్లీల ఫొటోలు వైరల్ అయిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వ్యవహారంలో నిందితునిగా ఉన్న పార్టీ నాయకుని సభ్యత్వాన్ని బీజేపీ రద్దు చేసింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: 50 శాతం కమిషన్ వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీపై కేసు.. -
ఐటీ పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా ఎంపీ ఎంవీవీ
సాక్షి, మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీ సభ్యుడిగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారా యణ నియమి తులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎంవీవీకి స్థానం కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఉభయసభలకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చైర్మన్‌గా డాక్టర్ శశిథరూర్ వ్యవహరించనుండగా లోక్‌సభ నుంచి 21, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యుల చొప్పున మొత్తం 31 మందికి స్థానం కల్పించారు. ఏపీ నుంచి ఎంవీవీకి స్థానం లభించింది. ఈ విషయంపై ఎంపీ స్పంది స్తూ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఆ రంగ పురోగాభివృద్ధి సాధించాల్సిన అవసరంపై దృష్టి సారిస్తానన్నారు. -
సీపీఎం సీనియర్ నేత నిరుపమ్ సేన్ మృతి
కోల్‌కతా : వామపక్ష దిగ్గజం, సీపీఎం సీనియర్ నేత నిరుపమ్ సేన్ సుదీర్ఘ అస్వస్థతతో సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తీవ్ర గుండెపోటుతో సేన్ మరణించారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా గతంలో పనిచేసిన సేన్ పశ్చిమ బెంగాల్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిగానూ వ్యవహరించారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. సేన్ భౌతిక కాయాన్ని బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలిస్తారని, అక్కడ ప్రజలు, కార్యకర్తలు ఆయనకు తుది నివాళులు అర్పిస్తారని సీపీఎం వర్గాలు తెలిపాయి. కాగా అదే రోజు సేన్ స్వస్థలం బుర్ద్వాన్ పట్టణంలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
‘ఖమ్మం బార్’ ను ఎప్పటికీ మరువను
సాక్షి, ఖమ్మం లీగల్ : ఖమ్మం జిల్లాతో, ఖమ్మం బార్‌తో తనకు విడదీయలేని బంధం ఉందని, ఖమ్మం బార్‌ను ఎన్నటికీ మరువనని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రామచందర్‌రావు మాట్లాడుతూ న్యాయవాదులు నిరంతర విద్యార్థులని, ప్రతి క్షణం విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. గతంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తనను విశేషంగా ఆదరించి.. తన విజయానికి సహకరించారని పేర్కొన్నారు. బార్, గ్రంథాలయ అభివృద్ధి కోసం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారికి ప్రత్యేక విజ్ఞప్తి చేసి రూ.లక్ష మంజూరు చేయించడమే కాకుండా చెక్కును బార్‌కు అందజేసినట్లు తెలిపారు. అనంతరం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు ఎన్.రామచందర్రావును బార్ అసోసియేషన్ ఈపీ, సీనియర్ న్యాయవాదులు ఘనంగా సన్మానించి మెమెంటో అందజేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు పసుమర్తి లలిత, ప్రధాన కార్యదర్శి కూరపాటి శేఖర్‌రాజు, పూసా కిరణ్, మర్రి ప్రకాష్, పబ్బతి రామబ్రహ్మం, సీనియర్ న్యాయవాదులు జి.సత్యప్రసాద్, మలీదు నాగేశ్వరరావు, వెంకట్‌గుప్తా, తల్లాకుల రమేశ్, రామసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
ఎన్సీఎల్టీ సభ్యుడిగా రాతకొండ మురళి
సాక్షి, హైదరాబాద్: జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ సభ్యుడిగా రాతకొండ మురళి నియమితులయ్యారు. అంతకుముందు ఆయన ఎన్సీఎల్టీ, బెంగళూరు సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. మురళిని హైదరాబాద్‌కు బదిలీ చేసి, ఇక్కడ ఎన్సీఎల్టీ సభ్యుడిగా ఉన్న విత్తనాల రాజేశ్వరరావును బెంగళూరుకు బదిలీ చేస్తూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ ఎన్సీఎల్టీ సభ్యుడిగా మురళి బాధ్యతలు చేపట్టనున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని బిసెంట్ థియోసాఫికల్ కాలేజీలో మురళి బీఏ పూర్తి చేశారు. ఆయన తాత, తండ్రి కూడా న్యాయవాదులే. ఎస్వీ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ డిగ్రీ పొందిన మురళి.. చిత్తూరు జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1987లో జ్యుడీషియల్ సర్వీసులోకి ప్రవేశించారు. వివిధ హోదాల్లో ఉభయ రాష్ట్రాల్లో పనిచేశారు. 2015లో కర్నూలు జిల్లా జడ్జిగా పదవీ విరమణ చేశారు. -
మహనీయులను స్మరించుకోవాలి
గద్వాల అర్బన్: దేశ చరిత్రను నూతన దారుల్లో నడిపించిన మార్గదర్శకులు జ్యోతిరావుపూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్రామ్లను స్మరించుకోవాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు ఆంజనేయులుగౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం గద్వాల క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మహనీయుల స్ఫూర్తిని నడిగడ్డలో కొనసాగించేలా యువత ముందుకు సాగాలని సూచించారు. ఏప్రిల్‌ను సామాజిక న్యాయ మాసంగా అన్ని వర్గాల ప్రజలు పాటించాలన్నారు. బాబు జగ్జీవన్‌రామ్ (ఏప్రిల్ 5), మహాత్మాపూలే (ఏప్రిల్ 11), డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (ఏప్రిల్ 14) వంటి మహనీయుల జయంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. బడుగు, బలహీన, మైనారిటీల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ సమావేశంలో నడిగడ్డ జిల్లా బీసీ ఫోరం కన్వీనర్ గణేష్, సలహాదారులు దడవాయి నర్సింహులు, గట్టన్న, రవీందర్‌గౌడ్, జిల్లా నడిగడ్డ యువత అధ్యక్షుడు చక్రధర్‌రెడ్డి, కన్వీనర్ లక్ష్మీకాంత్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి భాస్కర్; నాయకులు పవన్, వీరేష్, సంచార జాతుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ∙ -
ఎంపీలు ఒత్తిడి తెస్తే ‘జోన్’ ఖాయం
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఎంపీలు సహకరిస్తే విశాఖ రైల్వే జోన్ త్వరగా వస్తుందని రైల్వే బోర్డు మెంబర్ జాన్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ బడ్జెట్లో రైల్వేకు అధిక కేటాయింపులు జరుగుతున్నాయన్నారు. రైల్వే జోన్ ఏర్పాటుకు వెయ్యి కోట్లు అవసరం ఉంటుందని, జోన్ నిర్ణయం జరిగితే ఈ బడ్జెట్లో కొంత కేటాయింపులు జరుగుతాయని వివరించారు. జోన్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ విశాఖ ఎంపీలు రైల్వే బోర్డుపై ఒత్తిడి తేవడం లేదని, వారు ఒత్తిడి తెస్తే జోన్ సమస్య పరిష్కారం అవుతుందని వ్యాఖ్యానించారు. ఎంపి హరిబాబు బోర్డు వద్ద జోన్ అంశం ప్రస్తావనకు తేలేదని, వేరే సమస్యలు తప్ప విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కోసం ఆయన కూడా మాట్లాడటం లేదని ఆయన అన్నారు. -
నాకు చెప్పకుండా ఎవడిమ్మన్నాడు..?
► సూక్ష్మపోషకాల పంపిణీపై వివాదం ► ఎంపీఈఓపై జన్మభూమి కమిటీ సభ్యుడి దౌర్జన్యం ధర్మవరం: ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, జన్మభూమి కమిటీల సభ్యుల దౌర్జన్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నిబంధనల మేరకు సూక్ష్మపోషకాలను పంపిణీ చేసిన ఎంపీఈఓపై జన్మభూమి కమిటీ సభ్యుడు దాదాగిరీ చేశాడు. ‘‘ఏరా..? నాకు చెప్పకుండా ఎవడిమ్మన్నాడు’’ అంటూ నానా దుర్భాషలాడుతూ కొట్టినంత పని చేశాడు. దీంతో వ్యవసాయశాఖ సిబ్బంది కన్నీటి పర్యంతమవుతూ తమగోడును విలేకరులతో వెల్లబోసుకున్నారు. ఇంతకీ ఏంజరిగిందంటే... ధర్మవరం మండలం ఓబుళనాయునపల్లి గ్రామానికి మంజూరైన జిప్పం, బోరాన్, జింక్ తదితర మైక్రో న్యూట్రిన్స్ ను గురువారం అర్హులైన రైతులకు నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ పద్ధతిన ఎంపీఈఓ పోతులయ్య శుక్రవారం పంపిణీ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న జన్మభూమి కమిటీ సభ్యుడు శ్రీరాములు అక్కడి వచ్చి ఎంపీఈఓపై దౌర్జన్యం చేశాడు. తమకు ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నా... పట్టించుకోలేదు. ‘‘ అంతా మీఇష్టమైతే మేమెందుకు.. మీరు ఏమి పని చేసినా, ఎవరికి ఏమి ఇవ్వాలన్నా మాకు చెప్పాలి’’ అంటూ నానా దుర్భాషలాడారన్నారు. అదంతా తమకు తెలియదని ఏదైనా ఉంటే ఉన్నతాధికారులను అడగాలని ఎంపీఈఓ సమాధానమివ్వడంతో కోపోద్రిక్తుడైన జన్మభూమి కమిటీ సభ్యుడు ఎంపీఈఓ పోతులయ్య గొంతుపట్టుకుని భౌతిక దాడికి యత్నించాడు. ప్రత్యేక అవసరాలుకలి్గన వ్యక్తి అన్న కనీస మర్యాద పాటించకుండా ఇలా దౌర్జన్యం చేస్తున్నారని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. పెత్తనం భరించలేకపోతున్నాం విలేకరులతో మాట్లాడిన పలువురు ఎంపీఈఓలు జన్మభూమి కమిటీ సభ్యుల పెత్తనాన్ని భరించలేకపోతున్నామని, ప్రతి చిన్న విషయం వారికే చెప్పాలని, లేదంటే నానా దుర్భాషలాడుతున్నారని వాపోయారు. గురువారం ఉదయం రావులచెరువు గ్రామానికి చెందిన అధికారపార్టీ నాయకుడు ఒకరు తనకు ఇన్పుట్ సబ్సిడీ పడలేదని నానాదుర్భాషలాడారని ఓ మహిళా ఎంపీఈఓ ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి సదరు రైతుకు రెండు చోట్ల భూమి ఉండటంతో అటువంటి వారి వివరాలు అన్నీ జేడీ కార్యాలయానికి పంపామని, అక్కడి నుంచి వారికి అనుమతి లభించాల్సి ఉందన్నారు. ఈ విషయాన్ని వివరించే ప్రయత్నం చేసినా ఆయన వినిపించుకోకుండా... ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడాదని ఆమె తెలిపింది. -
జాతీయ జట్టులో చోటు సాధించాలి
హకీ రాష్ట్ర జట్టుకు ఎంపికైన వీకే రాయపురం విద్యార్థి సామర్లకోట : జాతీయ స్థాయి హాకీ జట్టులో స్థానం సంపాదించి, పాకిస్థా¯ŒSతో ఆడి విజయం సాధించాలనేది తన లక్ష్యమని గొలుసు వీరబాబు తెలిపాడు. సామర్లకోట మండలం వీకే రాయపురం గ్రామానికి చెందిన ఇతడు జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతూ రాష్ట్ర స్థాయి హకీ జట్టుకు ఎంపికయ్యాడు. ఈనెల 22 నుంచి 26 వరకు బోపాల్‌లో జరిగే జాతీయ స్థాయి చాంపియ¯ŒS షిప్ పోటీలలో అండర్- 17 విభాగంలో పాల్గొంటున్నాడు. ఇటీవల అండర్-17 విభాగంలో నెల్లూరు జిల్లాలో 12, 13, 14 తేదీలల్లో జరిగిన రాష్ట్ర స్థాయి హాకీ పోటీలో జిల్లా జట్టు తరఫున ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికైనట్టు హకీ జిల్లా కోచ్ రవిరాజ్ ‘సాక్షి’కి తెలిపారు. 2014లో పైకా టోర్నమెంటులో పాల్గొన్న వీరబాబు 2015లో జిల్లా జట్టులో స్థానాన్ని స్థిరం చేసుకున్నాడని తెలిపారు. వ్యవసాయ కూలీ కుటుంబం నుంచి వచ్చి పాఠశాలలో చదువుకొంటున్నాడని, తల్లి అదే పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలిగా పని చేస్తోందన్నారు. డిగ్రీ పూర్తి చేసి స్పోర్ట్స్ కోటాలో పోలీసు ఉద్యోగం సంపాదించాలని ఉందని వీరబాబు ఆశాభావం వ్యక్తం చేశాడు. రాష్ట్ర హాకీ జట్టుకు ఎంపికైన విద్యార్థి వీరబాబును పాఠశాల హెచ్ఎం అనురాధ, గ్రామ సర్పంచ్ కుర్రా నారాయణస్వామి, కోచ్ రవిరాజ్‌లు, గ్రామ నాయకులు అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి బోపాల్ బయలు దేరాడు. -
ఆఫీసర్స్ క్లబ్లో సభ్యుడి హల్చల్
∙మద్యం మత్తులో పలువురితో అసభ్యకర ప్రవర్తన ∙మూడు నెలల పాటు సస్పెన్షన్ ? ∙సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు వరంగల్ : వరంగల్ ఆఫీసర్స్ క్లబ్లో మూడు రోజుల క్రితం కొంతమందితో గొడవకు దిగిన ఓ సభ్యున్ని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని పోలీసు ఉన్నతాధికారులు సైతం ఆదేశించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. వరంగల్ నగరంలో జరుగుతున్న ఓ వివాహానికి హాజరయ్యేందుకుగానూ ఈ నెల 4న ఓ సభ్యు డు కుటుంబసమేతంగా వచ్చి, ఆఫీసర్స్ క్లబ్‌లోని గదిలో బస చేశాడు. అదే రోజు క్లబ్లో ఉన్న మరో సభ్యుడు వారితో దురుసుగా మా ట్లాడాడు. అంతటితో ఊరుకోకుండా పోలీసులను పిలుచుకొని వచ్చి సదరు కుటుంబ సభ్యుల వివరాలను ఆరా తీయించాడు. వారు వివాహానికి వచ్చారని ధ్రువీకరణ కావడంతో పోలీసులు వెళ్లిపోయారు. మద్యం మత్తులో మళ్లీ అర్ధరాత్రి వచ్చి రూమ్ తట్టి లేపి మరీ బస చేసిన కుటుంబీకులను యక్షప్రశ్నలతో వేధిం చాడు. క్లబ్ సిబ్బంది జోక్యం చేసుకొని అతన్ని అక్కడి నుంచి పంపించారు. అయితే క్లబ్లో బస చేసిన కుటుంబానికి సైతం రాజకీయ పలుకుబడి ఉండటంతో.. వారు సీపీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో ఘటనపై దర్యాప్తునకు పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆఫీసర్స్ క్లబ్లో బస చేసిన కుటుంబీకులు తమతో గొడవకు దిగిన వ్యక్తిపై సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అయితే దీని నుంచి ఎలాగోలా బయటపడేందుకు సదరు వివాదాస్పద సభ్యుడు పలువురు ప్రజాప్రతినిధుల ద్వారా పైరవీలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు అధికార పార్టీలోని ప్రముఖ నాయకుడికి సంబంధించిందని ఆలస్యంగా తెలియడంతో.. ప్రస్తుతం సదరు ప్రజాప్రతినిధులు కూడా గొడవకు దిగిన సభ్యుడి తరఫున పైరవీలు చేసేందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అసభ్యంగా ప్రవర్తించిన సభ్యున్ని క్లబ్ నుంచి మూడు నెలల పాటు సస్పెండ్ చేయాలని క్లబ్ కార్యవర్గం నిర్ణయించినట్లు పలువురు పేర్కొంటున్నారు. అతడి సభ్యత్వాన్ని పూర్తిస్థాయిలో తొలగించడంపై దృష్టిసారించే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. -
ఏఎఫ్ఆర్సీ సభ్యుడిగా నిమ్మ వెంకటరావు
ఏయూక్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా విభాగాధిపతి, ఎడ్‌సెట్ పూర్వ కన్వీనర్ ఆచార్య నిమ్మ వెంకటరావు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్ అడ్మిషన్స్ అండ్ ఫీజ్ రెగ్యులారిటీ కమిటీ(ఏఎఫ్ఆర్సీ) సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ కమిటీలో స్థానం పొందిన ఇద్దరు విద్యావేత్తలలో ఆచార్య నిమ్మ వెంకటరావు ఒకరు. కమిటీలో ఫీజుల నిర్ణయ కమిటీ చైర్మన్‌గా జస్టిస్ జి.కృSష్ణమోహన్, ప్రవేశాల కమిటీæ చైర్మన్‌గా జస్టిస్ టి.రంగారావు, సభ్యులుగా ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు ఆచార్య ఎల్.వేణుగోపాల రెడ్డి, పాఠశాల విద్యాశాఖ మెంబర్ సెక్రటరీ, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వి.దుర్గా భవాని, ఏఐసీటీఈ రీజినల్ అధికారి ఎం.సుందరేశన్, చార్టెడ్ అకౌంటెంట్ బి.లోకనాథం ఉన్నారు. ఎనిమిది మంది సభ్యులుగా ఉన్న ఈ కమిటీలో ఏయూ ఆచార్యునికి స్థానం లభించడం పట్ల ఏయూ అధికారులు, ఆచార్యులు హర్షం వ్యక్తం చేశారు. -
ఎస్సీ హక్కుల పరిరక్షణే ధ్యేయం
– సమర్థవంతమైన పాలనతోనే ప్రజల్లో నమ్మకం – జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు పీఎం కమలమ్మ కర్నూలు(అర్బన్): షెడ్యూల్డు కులాల ప్రజల హక్కుల పరిరక్షణే కమిషన్ ధ్యేయమని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు పీఎం కమలమ్మ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో ఎస్సీ సంఘాల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన అనంతరం మధ్నాహం జిల్లా అధికారులతో అట్రాసిటీ కేసులు, భూసమస్యలు, ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల వ్యయం తదితర అంశాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, జాయింట్ కలెక్టర్ సీ హరికిరణ్, ఎస్పీ ఆకె రవికష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమలమ్మ మాట్లాడుతూ వర్తమాన, భవిష్యత్ కాలాలకు అనుగుణంగా డా.బీఆర్ అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారని, అందులోనే ఆర్టికల్ 338 ప్రకారం జాతీయ కమిషన్‌ను ఏర్పాటుకు అవకాశం కల్పించారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, జీఓలు, చట్టాలను జిల్లా అధికారులు సమర్థవంతంగా అమలు చేసినప్పుడే ప్రజల్లో ప్రభుత్వం పట్ల నమ్మకం ఏర్పడుతుందన్నారు. జిల్లా యూనిట్‌గా జిల్లా అధికారులు మాత్రం పనిచేస్తే సరిపోదని, క్షేత్ర స్థాయిలో ఉన్న అధికారులు కూడా విధులు సక్రమంగా నిర్వహిస్తే ప్రజల ఇబ్బందులను తొలగించిన వారవుతారన్నారు. ఉద్యోగానికి కొంత మానవత్వాన్ని కూడా జోడిస్తే పాలన సజావుగా సాగుతుందన్నారు. వినతులపై పూర్తి స్థాయి పరిశీలన ... వివిధ సమస్యలపై తమకు 200కు పైగా వినతి పత్రాలు అందాయని, వాటన్నింటిని పూర్తి స్థాయిలో పరిశీలించి చర్యలు చేపడతామన్నారు. ఇక్కడే పరిష్కారమయ్యే వాటిని మినహాయించి మిగిలినవాటిపై పరిశీలన జరిపి 15రోజుల్లో న్యాయం చేస్తామన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో 2010 నుంచి 2016 వరకు నమోదైన అట్రాసిటీ కేసులు, వాటిలో చార్జిషీట్ ఓపెన్ చేసినవి, రిజక్ట్ అయినవి తదితర వివరాలను ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీలు మురళీధర్, వినోదర్‌కుమార్ ద్వారా తెలుసుకున్నారు. ఇటీవల జంట హత్యలు జరిగిన ఉప్పలూరు ఘటనపై ఆరా తీశారు. బాధితులకు పరిహారం, చేపట్టిన చర్యలపై ప్రశ్నించారు. ఇప్పటికే బాధిత కుటుంబాలకు పరిహారం మంజూరు చేశామని జేసీ హరికిరణ్ సమాధానమిచ్చారు. సబ్‌ప్లాన్ నిధుల దుర్వినియోగం ... దేవనకొండ మండలంలో సబ్‌ప్లాన్ నిధులతో ఎస్సీ కాలనీల్లో అభివద్ధి పనులు చేపట్టకుండా ఇతర కాలనీల్లో పనులు చేపడుతున్నారని విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సమావేశం దష్టికి తీసుకువచ్చారు. విషయంపై కమిషన్ సభ్యురాలు కమలమ్మ అసహనం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నాన్ బ్యాకింగ్ పథకం కింద 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఆర్థిక సహాయాన్ని వెంటనే లబిధదారులకు అందించాలని ఈడీ వీర ఓబులును ఆదేశించారు. -
కోడల్నీ కుటుంబ సభ్యురాలుగా చూడాలి..
కోడలికి కుటుంబంలో కనీస గౌరవం కూడ దక్కడం లేదని, కోడల్ని బయటి వ్యక్తిగాకాక, కూతురుగా చూసే సంప్రదాయం అలవరచుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. వైవాహిక జీవితాల్లో వచ్చే గొడవల్లో కోడల్ని పరాయి మనిషిగా చూస్తున్నారని, ఆమెను ఓ అద్దెకు తెచ్చుకున్న సేవకురాలిగానే తప్పించి స్వంత మనిషిగా స్వీకరించలేకపోతున్నారని, ముఖ్యంగా భారత దేశంలో కోడళ్ళు అనేక సందర్భాల్లో తీవ్ర వేధింపులకు గురౌతున్నారని భారత ఉన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. వివాహం తర్వాత అత్తవారింటికి వచ్చే కోడలు... ఎట్టిపరిస్థితుల్లోనూ బయటి వ్యక్తి కాదని సుప్రీం కోర్టు తెలిపింది. అంతేకాక ఆమెను భర్త, అత్తమామలు, కుటుంబ సభ్యులు, కోడలుగా కాక కూతురుగా చూడాలని సూచించింది. కోడలికి ఇచ్చే సమానత్వం, గౌరవం నాగరిక సమాజంలోని సున్నితత్వాన్ని ప్రతిబింబిస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది. భర్త చేతిలో చిత్రహింసలకు గురై ఆత్మ హత్య చేసుకున్న భార్య కేసుకు తీర్పు ఇచ్చిన సందర్భంలో, భర్తకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించిన కోర్టు... అత్తవారింట్లో కోడల్ని చూడాల్సిన విధానానంపై ప్రకటన చేసింది. వరకట్నదాహం, దురాశతో మానసిక, శారీరక వేధింపులకు గురిచేయడంతో ఒక్కోసారి వధువులు ప్రాణాలను సైతం తీసుకోవడం క్రూరత్వానికి నిదర్శనమని, ఇది అత్యంత సిగ్గు పడాల్సిన విషయమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నో కోరికలతో, కలలుగన్న జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాల్సిన వధువులు అవమాన భారంతోనో, భరించలేని బాధలతోనో ఆత్మహత్యలకు పాల్పడటం నిజంగా అత్తింటి రాక్షసత్వానికి పరాకాష్ట అని అభిప్రాయపడింది. కొందరు బాధలను భరిస్తూ బానిసలుగా బతుకుతున్నారని అటువంటి పరిస్థితుల్లో మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని న్యాయమూర్తులు రాధాకృష్ణన్, దీపక్ మిశ్రాల ధర్మాసనం సూచించింది. సుప్రీంకోర్టు ప్రకటనను దేశవ్యాప్తంగా మహిళా సంఘాలే కాక, ప్రజలు సైతం స్వాగతించారు. -
ముంబైకి చేరిన బ్రస్సెల్స్ దాడి బాధితురాలు
ముంబైః బ్రసెల్స్ ఎయిర్ పోర్టులో జరిగిన టెర్రర్ దాడిలో గాయపడ్డ జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగిని నిధి ఛాపేకర్ ముంబై చేరుకున్నారు. గాయాలనుంచి కొంతశాతం కోలుకోవడంతో ఆమె శుక్రవారం ఉదయం ముంబైకి తిరిగి వచ్చారు. చీలమండ విరిగి, 15 శాతం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందిన నిధి.. స్కిన్ గ్రాఫ్టింగ్ చికిత్స చేయించుకున్నారు. ఆమెతోపాటు జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది అమిత మోత్వానీ ఇంకా బ్రస్సెల్స్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. మార్చి నెలలో బ్రసెల్స్ విమానాశ్రయంలో జరిగిన ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడి, అక్కడే ఆస్పత్రిలో చికిత్స పొందిన జెట్ ఎయిర్ వేస్ క్రూ మెంబర్ నిధి ఛాపేకర్ ముంబై చేరుకున్నారు. 42 ఏళ్ళ నిధి ఇంకా కొంతశాతం గాయాలనుంచీ కోలుకోవాల్సిన అవసరం ఉండటంతో పారిస్ నుంచి జెట్ ఎయిర్ వేస్ విమానంలో ముంబై చేరగానే, ఎయిర్ పోర్టునుంచే ఆమెను ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. ఆమె కొంత రక్తహీనతతో బాధపడుతున్నారని, ఇంకా కొన్ని రోజులు ఆమె విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఎక్కువగా ఎవ్వరితో మాట్లాడకుండా ఉండటం మంచిదని డాక్టర్లు తెలిపారు. 1996 ఆగస్టు నుంచి జెట్ ఎయిర్ వేస్ లో పనిచేస్తున్న నిధి ఛాపేకర్... మార్చి 22న బ్రసెల్స్ ఎయిర్ పోర్టునుంచి జెట్ ఎయిర్ వేస్ ఫ్లైట్ లో న్యూయార్క్ వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో జరిగిన దాడితో ఆమె శరీరానికి 15 శాతం గాయాలు అవ్వడంతోపాటు, చీలమండ విరిగిపోయింది. అప్పట్నుంచీ బ్రసెల్స్ కు దగ్గరలోని గ్రాండె హాస్పిటల్ డి చెలేరియోలో 25 రోజులపాటు చికిత్స పొందిన ఆమె... గురువారం సాయంత్రం ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యి, అక్కడినుంచి పారిస్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం పారిస్ నుంచి ముంబైకి చేరారు. నిధి.. ఇప్పటికీ వీల్ ఛైర్ ఆధారంగానే కదలాల్సిన పరిస్థితి ఉండటంతో ఆమె భర్త రూపేష్ ఛాపేకర్, అతని సోదరుడు నీలేష్ ఛాపేకర్ ఎయిర్ పోర్టునుంచి, ఎయిర్ లైన్స్ సిబ్బంది, వైద్యాధికారుల సహాయంతో బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి చేర్చారు. -
ఎంపీటీసీ సభ్యురాలి ఆత్మహత్యాయత్నం
గ్రామసభలో అవమానపరిచారని ఆవేదన గూడూరు: వరంగల్ జిల్లా గూడూరు మండలం బొల్లెపల్లి ఎంపీటీసీ సభ్యురాలు చల్ల నిర్మల శుక్రవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనకు సంబంధించి ఆమె రాసిన నోట్లో వివరాలిలా ఉన్నారుు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం గ్రామసభ నిర్వహించారు. ఈజీఎస్ పనులపై చర్చ జరుగుతుండగా సర్పంచ్ బానోత్ సంధ్య, ఆమె భర్త నాగయ్య ఎంపీటీసీ సభ్యురాలైన నిర్మలను, ఆమె భర్త వెంకటరెడ్డిని అవమానించేలా మాట్లాడారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ కూడా తమను కులం పేరుతో దూషించారంటూ ఎంపీటీసీ దంపతులపై ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ వెంకటేశ్వర్రావు గురువారం గ్రామంలో విచారణ నిర్వహించారు. అనంతరం నిర్మల, వెంకటరెడ్డిపై అట్రాసిటీ కేసు న మోదు చేశారు. తాము చెప్పిన విషయూలను సీఐ పట్టించుకోలేదని నిర్మల నోట్లో ఆరోపించారు. రూ. 20 వేలు డిమాండ్.. గురువారం సాయంత్రం ఏఎస్సై భావ్‌సింగ్ వెంకటరెడ్డికి ఫోన్ చేసి సీఐకి రూ. 20 వేలు ఇస్తే కేసు లేకుండా చేస్తారని చెప్పారని, ఈ విషయూన్ని వెంకటరెడ్డి మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన కూడా పట్టించుకోలేదని వాపోయూరు. తన ఆత్మహత్యాయత్నానికి సర్పంచ్, ఆమె భర్తతోపాటు స్థానిక నాయకుడు చల్ల లింగారెడ్డి కారణమని నోట్లో పేర్కొన్నారు. నిర్మల ప్రస్తుతం నర్సంపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
వాళ్ల టార్గెట్ ఆగి ఉన్న లారీలు
-
ట్రైలర్ అదుర్స్..
బాతుపై ఆకాశ మార్గంలో ప్రయాణించడం, ఉన్నట్టుండి కత్తి ఝళిపించి డ్రాగన్‌ను చంపడం, పై నుంచి కిందపడుతున్న అమ్మాయిని పట్టుకుని కాపాడటం, గ్రహాంతర వాసులను కంటిచూపుతో కాల్చేయడం... కామిక్ హీరోలు సూపర్మాన్, స్పైడర్మాన్లు గుర్తుకొస్తున్నారు కదూ.!! కానీ ఇవన్నీ ఎన్నికల ప్రచారంలో భాగం!! కెనడాలో పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ఒక అభ్యర్థి ప్రచార వీడియో ఇది. ప్రజలను కాపాడే వాడు, ధరల డ్రాగన్లను చంపేవాడు, కన్జర్వేటివ్ పార్టీ గ్రహాంతరవాసుల్ని కాల్చేసేవాడు వచ్చేస్తున్నాడు... ఓటేసేయండహో అంటున్న స్టార్‌వార్స్ ట్రెయిలర్ లాంటి ప్రచార వీడియో ఇది. ఇది ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. కామిక్ పుస్తకాల పాఠకులే ఓటర్లు అయితే వయాట్స్కాట్ అనే ఈ అభ్యర్థి సూపర్ డూపర్ హిట్!! ట్రెయిలరే సూపర్... ఫస్ట్ డే ఫస్ట్ షో ఎలా ఉంటుందో మరి!! కానీ నెట్నగరంలో ఓట్లు పడటం కాదు. సొంత నగరంలో వయాట్స్కాట్కి ఓట్లు పడతాయా లేదా అన్నదే భేతాళ ప్రశ్న. -
ఎస్సీవో సభ్య దేశంగా భారత్
- ఇప్పటిదాకా పరిశీలక హోదా మాత్రమే - కూటమిలోని దేశాలకు మోదీ కృతజ్ఞతలు ఉఫా(రష్యా): షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో)లో భారత్‌కు ఇకపై పూర్తిస్థాయి సభ్యత్వం దక్కనుంది. గత పదేళ్లుగా ఈ కూటమిలో భారత్‌కు పరిశీలక దేశం హోదా మాత్రమే ఉంది. చైనా రాజధాని బీజింగ్ కేంద్రంగా ఉన్న ఎస్సీవోలో చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్లు సభ్య దేశాలుగా ఉన్నాయి. వచ్చే ఏడాది నుంచి ఈ కూటమిలో భారత్ కూడా చేరనుంది. పాకిస్తాన్‌ను కూడా సభ్య దేశంగా చేర్చుకోనున్నారు. ‘భారత్‌ను పూర్తిస్థాయి సభ్య దేశంగా చేర్చుకునేందుకు అంగీకరించిన ఎస్సీవో దేశాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇది ఎస్సీవో సభ్య దేశాలతో ఉన్న సహజ సంబంధాలకు పొడిగింపు మాత్రమే. ఇది ఈ ప్రాంతంలో శాంతి, సంపద సృష్టికి ఎంతగానో దోహదపడుతుంది. కూటమిలో చేరబోయే పాక్‌కు కూడా అభినందనలు తెలుపుతున్నా’ అని శుక్రవారమిక్కడ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అంతకుముందు మోదీతోపాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సమక్షంలో సదస్సు జరిగింది. ఈ సమావేశంలో.. ఎస్సీవోలో భారత్‌కు సభ్యదేశం హోదా కల్పించాలని నిర్ణయించారు. ఎస్సీవో కూటమిలో 2005 నుంచి భారత్ పరిశీలక దేశంగా వ్యవహరిస్తోంది. పూర్తిస్థాయి సభ్య దేశంగా పరిగణించాలని కిందటేడాదే కూటమిని భారత్ కోరింది. ఉగ్రవాదంపై పోరు, ఇంధన రంగంలో సహకారం, ప్రాంతాల అనుసంధానం, వాణిజ్య బంధాల బలోపేతం, మత్తుపదార్థాల అక్రమ రవాణాకు చెక్ పెట్టే ఉద్దేశంతో ఎస్సీవో ఏర్పడింది.