వైఎస్సార్ టీఎఫ్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కె. ఓబుళపతి
అనంతపురం అర్బన్: జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విరివిగా చేపట్టి వైఎస్సార్ టీఎఫ్ బలోపేతం చేయాలని ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఓబుళపతి పిలుపునిచ్చారు. స్థానిక న్యూటౌన్ జూనియర్ కళాశాలలో ఆదివారం జిల్లా అధ్యక్షుడు పి. అశోక్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు.
ఓబుళపతి మాట్లాడుతూ సభ్యత్వ నమోదు మండల వారీగా మెంబర్‌షిప్ పుస్తకాలను పంపిణీ చేయాలని సూ చించారు. రాష్ట్ర నాయకత్వం చేపట్టిన కార్యక్రమాలను ఆయన విశదీకరించారు. జిల్లాలో సత్వరం చేపట్టవాల్సిన పదోన్నతులు, రేగ్యులైజేషన్, జెడ్పీ పీఎఫ్ స్లిప్పులు, హెల్త్‌కార్డులు, ప్రీమియం చెల్లింపు, పీఆర్సీ ఫిట్‌మెంట్ 60శాతం స్పెషల్ టీచర్లకు నేషనల్ ఇక్రిమెంట్లు, పండిట్స్ రెగ్యులైజేషన్, హెల్త్‌కార్డులు సంబంధిత అంశాలపై చర్చించారు.
సమావేశంలో సహ అధ్యక్షుడు ఈ రెడ్డిప్పరెడ్డి వైఎస్సార్‌టీఎఫ్‌కు రూ. 5,116 విరాళంగా అందజేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ పుల్లారెడ్డి, కార్యవర్గ సభ్యులు హజీముద్దీన్, శివప్రసాద్, మదన్‌మోహన్‌రెడ్డి, నాగేంద్ర, సురేష్, చంద్రశేఖర్, ప్రసాద్, గిరిధర్‌రెడ్డి, దానమయ్య, సుధాకర్‌రెడ్డి, రాధాక్రిష్ణరెడ్డి, అల్తాప్ హుస్సేన్, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొనానరు.
సభ్యత్వ నమోదును విరివిగా చేపట్టండి
Published Mon, Nov 24 2014 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 4:59 PM
Advertisement
Advertisement