పంచాయతీ సభ్యురాలికి ఘోర అవమానం | Mahila Panchayat Member Beaten Over Love Affair | Sakshi
Sakshi News home page

పంచాయతీ సభ్యురాలికి ఘోర అవమానం

Published Mon, Oct 21 2024 8:58 AM | Last Updated on Mon, Oct 21 2024 11:19 AM

Mahila Panchayat Member Beaten Over Love Affair

తాపీ: గుజరాత్‌లోని తాపీ జిల్లాలో పంచాయతీ సభ్యురాలిపై దాడి జరిగింది. తన భర్తతో ప్రేమ వ్యవహారం నడుపుతున్నదంటూ ఓ మహిళ.. పంచాయతీ సభ్యురాలిపై దాడికి తెగబడింది. అంతటితో ఆగక ఆమె జుట్టును కూడా కత్తిరించింది. ఈ అమానవీయ ఘటనలో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే సోంగాఢ్ పంచాయతీ సభ్యురాలైన ఊర్మిళ గమిత్‌పై ఒక మహిళతోపాటు మరో ముగ్గురు హాకీ స్టిక్‌లతో దాడి చేసి, ఆమె జుట్టును కత్తిరించారని సోంగాధ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. బాధిత మహిళ తన కుమార్తెతో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా ఆమెపై దాడి చేశారు.

పంచాయతీ సభ్యురాలు ఊర్మిళపై శోభనా గమిత్‌ అనే మహిళ, ఆమె కుమారుడితో పాటు వచ్చిన కొందరు వ్యక్తులు కలసి దాడి చేశారు. ఈ దాడిలో ఊర్మిళ ఎడమ చేతి ఎముక విరిగిందని, నడుము, తలపై గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఆమె వద్ద ఉన్న బంగారు లాకెట్‌ను నిందితులు లాక్కొని పారిపోయినట్లు బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. ఊర్మిళను వైద్య చికిత్స కోసం పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఊర్మిళ తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్నదని శోభనా గమిత్‌ పోలీసుల ఎదుట ఆరోపించింది. కాగా ఈ కేసులో ఒకరిని అరెస్టు చేశామని, సంఘటనా స్థలంలో లభ్యమైన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: హస్తినలో ‘అమర’ ప్రేమికుడు! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement