సభ్యుడిగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎథిక్స్ (నైతిక విలువల) కమిటీ ఛైర్మన్‌గా బీజేపీకి చెందిన ఘన్‌శ్యామ్ తివారీ నియమితులయ్యారు. అక్టోబర్ 10 నుంచి ఈ కమిటీ మనుగడలోకి వస్తుందని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తెలిపారు. ఎథిక్స్ కమిటీలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వై.విజయసాయి రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు.
ప్రమోద్ తివారీ (కాంగ్రెస్), డెరెక్ ఒబ్రియాన్ (తృణమూల్ కాంగ్రెస్), తిరుచ్చి శివ (డీఎంకే), సంజయ్ సింగ్ (ఆప్), శస్మిత్ పాత్రా (బీజేడీ), ప్రేమ్‌చంద్ గుప్తా (ఆర్జేడీ), మేధా విశ్రామ్ కులకర్ణి, దర్శనా సింగ్ (బీజేపీ)లు కమిటీలోని ఇతర సభ్యులు. రాజ్యసభలో ఎంపీల ప్రవర్తనకు సంబంధించిన ఫిర్యాదులు వస్తే ఎథిక్స్ కమిటీ పరిశీలించి నిర్ణయాలు వెలువరిస్తుంది. అలాగే విజయసాయి రెడ్డిని రవాణా, పర్యాటక, సాంస్కృతిక స్టాండింగ్ కమిటీ నుంచి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల స్టాండింగ్ కమిటీకి మారుస్తూ ధన్‌ఖడ్ ఆదేశాలు జారీచేశారు.
Comments
Please login to add a commentAdd a comment