ghanashyam
-
ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా ఘన్‌శ్యామ్ తివారీ
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎథిక్స్ (నైతిక విలువల) కమిటీ ఛైర్మన్‌గా బీజేపీకి చెందిన ఘన్‌శ్యామ్ తివారీ నియమితులయ్యారు. అక్టోబర్ 10 నుంచి ఈ కమిటీ మనుగడలోకి వస్తుందని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తెలిపారు. ఎథిక్స్ కమిటీలో వైఎస్సార్సీపీ ఎంపీ వై.విజయసాయి రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు. ప్రమోద్ తివారీ (కాంగ్రెస్), డెరెక్ ఒబ్రియాన్ (తృణమూల్ కాంగ్రెస్), తిరుచ్చి శివ (డీఎంకే), సంజయ్ సింగ్ (ఆప్), శస్మిత్ పాత్రా (బీజేడీ), ప్రేమ్‌చంద్ గుప్తా (ఆర్జేడీ), మేధా విశ్రామ్ కులకర్ణి, దర్శనా సింగ్ (బీజేపీ)లు కమిటీలోని ఇతర సభ్యులు. రాజ్యసభలో ఎంపీల ప్రవర్తనకు సంబంధించిన ఫిర్యాదులు వస్తే ఎథిక్స్ కమిటీ పరిశీలించి నిర్ణయాలు వెలువరిస్తుంది. అలాగే విజయసాయి రెడ్డిని రవాణా, పర్యాటక, సాంస్కృతిక స్టాండింగ్ కమిటీ నుంచి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల స్టాండింగ్ కమిటీకి మారుస్తూ ధన్‌ఖడ్ ఆదేశాలు జారీచేశారు. -
భార్య బంగారంతో బెట్టింగ్.. ఆపై ఆత్మహత్య
హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణం తీసింది. బెట్టింగ్‌లో అన్నీ కోల్పోయిన ఓ యువకుడు చివరకు సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పేట్‌బషీర్‌బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది. స్థానిక బాపూజీనగర్‌లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న ఘనశ్యామ్(27) అనే యువకుడు క్రికెట్ బెట్టింగ్‌లో ఎంతో నష్టపోయాడు. ఈ ఏడాది ఏప్రిల్ 28న అతనికి వివాహం కాగా.. బెట్టింగ్ కోసం భార్యకు చెందిన 28 తులాల బంగారు నగలను కూడా బెట్టింగ్‌లో పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై గురువారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఘనశ్యామ్ ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్‌లో చాలా కోల్పోయానని 'సారీ మమ్మీ, సారీ డాడీ' అంటూ సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోటు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఘనశ్యామ్ ఫోన్ కాల్స్‌పై దృష్టి సారించారు. అతడి కాల్ లీస్ట్ ఆధారంగా విచారణ చేపడితే క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని మృతుని బంధువులు చెబుతున్నారు.