భార్య బంగారంతో బెట్టింగ్‌.. ఆపై ఆత్మహత్య | hyderabad man committed suicide due to lose in bettings | Sakshi
Sakshi News home page

భార్య నగలతో బెట్టింగ్.. నవ వరుడు ఆత్మహత్య

Published Fri, Jun 9 2017 10:11 AM | Last Updated on Tue, Nov 6 2018 8:22 PM

భార్య బంగారంతో బెట్టింగ్‌.. ఆపై ఆత్మహత్య - Sakshi

భార్య బంగారంతో బెట్టింగ్‌.. ఆపై ఆత్మహత్య

హైదరాబాద్‌: క్రికెట్‌ బెట్టింగ్‌ ఓ యువకుడి ప్రాణం తీసింది. బెట్టింగ్‌లో అన్నీ కోల్పోయిన ఓ యువకుడు చివరకు సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పేట్‌బషీర్‌బాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది. స్థానిక బాపూజీనగర్‌లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న ఘనశ్యామ్‌(27) అనే యువకుడు క్రికెట్‌ బెట్టింగ్‌లో ఎంతో నష్టపోయాడు. ఈ ఏడాది ఏప్రిల్‌ 28న అతనికి వివాహం కాగా.. బెట్టింగ్‌ కోసం భార్యకు చెందిన 28 తులాల బంగారు నగలను కూడా బెట్టింగ్‌లో పోగొట్టుకున్నాడు.

ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై గురువారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఘనశ్యామ్ ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్‌లో చాలా కోల్పోయానని 'సారీ మమ్మీ, సారీ డాడీ' అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్‌ నోటు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఘనశ్యామ్ ఫోన్‌ కాల్స్‌పై దృష్టి సారించారు. అతడి కాల్‌ లీస్ట్‌ ఆధారంగా విచారణ చేపడితే క్రికెట్‌ బెట్టింగ్‌కు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని మృతుని బంధువులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement