
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ ఏకగ్రీవంగా తిరిగి ఎంపికయ్యారు.

2016లో రియో డి జెనీరోలో జరిగిన ఒలింపిక్ క్రీడల సందర్భంగా ఆమె తొలిసారి ఐఓసీ సభ్యురాలిగా ఎంపికయ్యారు.

2020 టోక్యో(కరోనా కారణంగా 2022లో నిర్వహించారు) ఒలింపిక్ కమిటీలో భారత్ తరఫున ఆమె సభురాలికి ఉన్నారు.

ఐఓసీలో చేరిన మొదటి భారతీయ మహిళగా ఆమె గుర్తింపు పొందారు.

న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ ట్రస్టీ బోర్డులో చేరిన మొదటి భారతీయురాలు నీతా.

ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్‌కు యజమాని.

ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ లిమిటెడ్‌కు నీతా అంబానీ వ్యవస్థాపక చైర్‌పర్సన్‌గా ఉన్నారు.



