- సభ్యత్వ నమోదు చేపట్టాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ విస్తరణకు ఇదే సమయమని, కనీసం 20 లక్షలకు తగ్గకుండా సభ్యత్వ నమోదు చేయించాలని బీజేపీ కోర్ కమిటీ భావిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో శుక్రవారం ముఖ్యనేతల సమావేశం జరిగింది. సభ్యత్వాన్ని పుస్తకాలకే పరిమితం చేయకుండా చురుగ్గా నమోదు చేపట్టాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. కాగా, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ నెల 7న రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంటారని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
కిసాన్ మోర్చా కార్యవర్గం ఏర్పాటు
బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు. ఏడుగురు ఉపాధ్యక్షులు, ముగ్గురు ప్రధానకార్యదర్శులు, 8 మంది కార్యదర్శులు నియమితులుకాగా, ఎన్.భోజిరెడ్డి (రంగారెడ్డి)ని కోశాధికారిగా నియమితులయ్యారు.