
టీడీపీ సభ్యత్వ నమోదులో జిల్లాకు రెండోస్థానం
మచిలీపట్నం : రాష్ట్రవ్యాప్తంగా జరిగిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా రెండోస్థానంలో ఉందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ బచ్చుల అర్జునుడు తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రం లో గుంటూరు జిలా 6,67,898 సభ్యత్వాలతో ప్రథమ స్థానంలో నిలిచిం దన్నారు. 4,70,174 మందికి సభ్యత్వాన్ని ఇచ్చి జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలో మైలవరం నియోజకవర్గంలో 38,983 మంది సభ్యత్వాన్ని తీసుకోవడంతో ప్రథమ స్థానంలోనూ, 36,151 మం దికి సభ్యత్వాలను ఇచ్చి గన్నవరం ద్వితీయ స్థానంలోనూ ఉన్నట్లు చెప్పారు. అతి తక్కువ నమోదు విజ యవాడ తూర్పు నియోజకవర్గంలో జరిగిందన్నారు.
రుణమాఫీ విషయంలో రెవెన్యూ, బ్యాంకర్ల మధ్య సమన్వయం కొరవడిందన్నారు. తద్వారా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. అర్హులైన వారికి అందాల్సిన రుణమాఫీ పక్కదోవపడితే సీఎం కఠిన చర్యలు తీసుకుం టారన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య మాట్లాడుతూ బందరు పోర్టును గుజరాత్ తరహాలో అభివృద్ది చేసేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. సమావేశంలో పార్టీ నేతలు బి.రమేష్‌నాయుడు, ఎంవీవీ కుమార్‌బాబు, జిల్లా ప్రచార కార్యదర్శి ఎ. సతీష్, బి.దాసు పాల్గొన్నారు.