సాక్షి, మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీ సభ్యుడిగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారా యణ నియమి తులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎంవీవీకి స్థానం కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఉభయసభలకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చైర్మన్‌గా డాక్టర్ శశిథరూర్ వ్యవహరించనుండగా లోక్‌సభ నుంచి 21, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యుల చొప్పున మొత్తం 31 మందికి స్థానం కల్పించారు. ఏపీ నుంచి ఎంవీవీకి స్థానం లభించింది. ఈ విషయంపై ఎంపీ స్పంది స్తూ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఆ రంగ పురోగాభివృద్ధి సాధించాల్సిన అవసరంపై దృష్టి సారిస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment