
సభ్యత్వ నమోదులో పాల్గొన్న కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు వర్క్‌షాపులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి. కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. సభ్యత్వ నమోదు వర్క్‌షాపును పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శనివారం ఉదయం ప్రారంభించారు. వర్క్‌షాపులో పాల్గొనడానికి వచ్చిన కిషన్‌రెడ్డి పూర్తిగా ఆ కార్యక్రమానికి మాత్రమే పరిమితం అయ్యారు. తెలంగాణలోని వివిధ సమస్యలపై నివేదించడానికి వచ్చే నెలలో ఆయన మరోసారి ఢిల్లీకి రానున్నారు.