మాట్లాడుతున్న రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు ఆంజనేయులుగౌడ్
గద్వాల అర్బన్: దేశ చరిత్రను నూతన దారుల్లో నడిపించిన మార్గదర్శకులు జ్యోతిరావుపూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రామ్‌లను స్మరించుకోవాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు ఆంజనేయులుగౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం గద్వాల క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మహనీయుల స్ఫూర్తిని నడిగడ్డలో కొనసాగించేలా యువత ముందుకు సాగాలని సూచించారు. ఏప్రిల్‌ను సామాజిక న్యాయ మాసంగా అన్ని వర్గాల ప్రజలు పాటించాలన్నారు. బాబు జగ్జీవన్‌రామ్ (ఏప్రిల్ 5), మహాత్మాపూలే (ఏప్రిల్ 11), డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (ఏప్రిల్ 14) వంటి మహనీయుల జయంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు.
బడుగు, బలహీన, మైనారిటీల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ సమావేశంలో నడిగడ్డ జిల్లా బీసీ ఫోరం కన్వీనర్ గణేష్, సలహాదారులు దడవాయి నర్సింహులు, గట్టన్న, రవీందర్‌గౌడ్, జిల్లా నడిగడ్డ యువత అధ్యక్షుడు చక్రధర్‌రెడ్డి, కన్వీనర్ లక్ష్మీకాంత్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి భాస్కర్; నాయకులు పవన్, వీరేష్, సంచార జాతుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ∙
Comments
Please login to add a commentAdd a comment