కాంగ్రెస్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధ్వజం
బీజేపీ కార్యాలయంలో వాజ్‌పేయి శతజయంతి ఉత్సవం
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను జీవితాంతం అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. ఆయనకు భారతరత్న ఇవ్వకపోగా, పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో కనీసం చిత్రపటం కూడా ఏర్పాటు చేయకపోవడం చూస్తే కాంగ్రెస్‌కు అంబేడ్కర్ పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇందిరాగాంధీ సహా ఎంతోమందికి భారతరత్న ఇచి్చనా.. కాంగ్రెస్ అంబేడ్కర్‌కు ఇవ్వలేకపోయిందన్నారు.
మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా బుధవారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్‌ను రెండుసార్లు ఎన్నికల్లో కాంగ్రెస్ కావాలనే ఓడించిందని ఆరోపించారు. ఎన్డీయే హయాంలోనే అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చామని గుర్తుచేశారు. ఏడాదిపాటు వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
వాజ్‌పేయి జీవితం దేశానికి ఆదర్శమని, ఆయన ప్రసంగం వినడానికి దేశం నలుమూలల నుంచి వేలాదిమంది వచ్చేవారన్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.. అప్పట్లో జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో వాజ్‌పేయి జనసంఘ్ నేతలతో కలిసి పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, వారి సర్టిఫికెట్ బీజేపీకి అవసరం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ కుటుంబ, అవినీతి, నియంతృత్వ రాజకీయాల గురించి ప్రజలకు వివరిస్తూ.. కాంగ్రెస్ నిజస్వరూపాన్ని ఇంటింటికీ తెలియచేస్తామని కిషన్‌రెడ్డి అన్నారు.
అబద్ధాల్లో కాంగ్రెస్‌కు ఆస్కార్: బండి సంజయ్
కాంగ్రెస్ పార్టీకి అబద్ధాల్లో ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ 70 ఎంఎం సినిమా చూపించి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. వాజ్‌పేయి అందరికీ స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. దేశభక్తి, అభివృద్ధి, చతుర్భుజి పేరిట జాతీయ రహదారుల నిర్మాణంతో దేశాన్ని ఒక ప్రాంతంతో మరో ప్రాంతాన్ని అనుసంధానించారన్నారు. అన్ని పారీ్టల్లోనూ ఆయనను అభిమానించే నేతలు ఉన్నారని చెప్పారు.
ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పండుగ వాతావరణంలో వాజ్‌పేయి శతజయంతి వేడుకలు జరుగుతున్నాయన్నారు. సంతుïÙ్టకరణ విధానాలకు వాజ్‌పేయి వ్యతిరేకమని, అవినీతికి ఆమడదూరం ఉన్నారని చెప్పారు. మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, వాజ్‌పేయి మధ్య మంచి అనుబంధం ఉందని చెప్పారు.
కాంగ్రెస్‌కు, అంబేడ్కర్ గురించి మాట్లాడే కనీస అర్హత లేదని, అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వని కాంగ్రెస్ అంబేడ్కర్ గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
క్రైస్తవ మైనార్టీల అభ్యున్నతికి కృషి: భట్టి
మధిర: క్రైస్తవ మైనార్టీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర మండలం బయ్యారం రోమన్ కేథలిక్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన కేక్ కట్ చేశారు.
అనంతరం మాట్లాడుతూ.. అన్ని మతాల అభ్యున్నతికి స్థిర సంకల్పంతో పని చేస్తున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment