Jyothiraopule jayanthi
-
నేడు పూలే వర్థంతి కార్యక్రమానికి సీఎం జగన్
సాక్షి,అమరావతి/భవానీపురం (విజయవాడ పశ్చిమ): విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం ఉదయం 10.35 గంటలకు జరిగే జ్యోతిరావు పూలే వర్థంతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్‌నారాయణ, ఎమ్మెల్యేలు పార్ధసారథి, మల్లాది విష్ణు, జోగి రమేష్, సీఎం ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురామ్ బుధవారం పరిశీలించారు. కార్యక్రమంలో కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, జేసీ కె.మాధవీలత, డీసీపీ విక్రాంత్‌పాటిల్, సబ్ కలెక్టర్ హెచ్ఎం ధ్యానచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
విజయం మాదే: సింథియా
భోపాల్: దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని గుణ లోకసభ అభ్యర్థి జ్యోతిరాదిత్యా సింథియా ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనదని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ సరళిని బట్టి చూస్తే తమ పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని సింథియా అభిప్రాయపడ్డారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారనే విశ్వాసం తమకుందన్నారు. దేశంలో జరిగిన అభివృద్ధంతా కాంగ్రెస్ హాయాంలోనే జరిగిందన్నారు. మధ్య ప్రదేశ్‌లోని గుణ లోక్‌సభ స్థానం నుంచి ఆయన ఐదోసారి పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. -
బెజవాడలో ఘర్షణలు జరగడం దురదృష్టకరం..
సాక్షి, అమరావతి : జ్యోతిరావు పూలే విగ్రహ నివాళి ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు శనివారం లేఖ రాశారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా విజయవాడలో ఘర్షణలు జరగడం దురదృష్టకరమని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. మూడు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకూ చర్యలు తీసుకోలేదన్నారు. మహాత్మల జయంతి, వర్థంతులకు ప్రముఖులను ఆహ్వానించడం ఆనవాయితీ అని, కానీ విజయవాడలో పోలీసులు ఓవరాక్షన్ చేశారని కేవీపీ ఆరోపించారు. జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసేందుకు కూడా అంగీకరించలేదని, అంతేకాకుండా తమను బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రోటోకాల్ ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకోవాలని కేవీపీ లేఖలో కోరారు. కాగా పూలే విగ్రహానికి నివాళి వివాదంలో కాంగ్రెస్ అగ్రనేతలపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం, గిడుగు రుద్రరాజు, పల్లంరాజు సహా 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటనపై కేవీపీ సీఎస్‌కు లేఖ రాశారు. పోలీసులు మా హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరించారని లేఖలో పేర్కొన్నారు. -
మార్గదర్శి.. మహాత్మా పూలే: జోగు
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిరావుపూలే దేశానికి మార్గదర్శనం చేసిన మహనీయుడని బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న అన్నారు. పూలే జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ గడ్డం సాయికిరణ్ అధ్యక్షతన బుధవారం ఇక్కడ రవీంద్రభారతిలో పూలే 192వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జోగు రామన్న మాట్లాడుతూ సమాజంలో విలువలతో బతకాలన్నా, సంస్కారంతో ఉండాలన్నా విద్యతోనే సాధ్యపడుతుందన్నారు. అణగారిన వర్గాల ఉన్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ మరొక పూలే అని కొనియాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.33 వేల కోట్లను కేటాయించిందన్నారు. కేసీఆర్ నిర్ణయం మేరకు వచ్చే జయంతికల్లా పూలే విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పుతామని హామీనిచ్చారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ మైనార్టీలకు ఎక్కువ సంఖ్యలో రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. అన్ని వర్గాల ప్రజలకు కేసీఆర్ అండగా ఉంటూ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేసే ప్రయత్నంలో ఉన్నారని పేర్కొన్నారు. పశు సంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పూలే బడుగు, బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన యోధుడని, అందరికీ సమానహక్కులు ఉండాలని ఆకాంక్షించిన మహనీయుడని అన్నారు. ఒకప్పుడు దొరలకు, భూస్వాములకు మాత్రమే భూములెక్కువగా ఉండేవని, ప్రస్తుతం గ్రామాల్లోని రికార్డుల ప్రకారం అధికశాతం భూములు బీసీలకే ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల పక్షపాతి అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ప్రవేశ పెడితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. బీసీలకు చట్టసభల్లో వాటా తెచ్చే విధంగా పోరాడితేనే పూలేకు ఘనమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ ముదిరాజ్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీసీ సంక్షేమశాఖ కమిషనర్ అనితారాజేంద్ర, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఉత్సవ కమిటీ కోఆర్డినేటర్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
మహనీయులను స్మరించుకోవాలి
గద్వాల అర్బన్: దేశ చరిత్రను నూతన దారుల్లో నడిపించిన మార్గదర్శకులు జ్యోతిరావుపూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్రామ్లను స్మరించుకోవాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు ఆంజనేయులుగౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం గద్వాల క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మహనీయుల స్ఫూర్తిని నడిగడ్డలో కొనసాగించేలా యువత ముందుకు సాగాలని సూచించారు. ఏప్రిల్‌ను సామాజిక న్యాయ మాసంగా అన్ని వర్గాల ప్రజలు పాటించాలన్నారు. బాబు జగ్జీవన్‌రామ్ (ఏప్రిల్ 5), మహాత్మాపూలే (ఏప్రిల్ 11), డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (ఏప్రిల్ 14) వంటి మహనీయుల జయంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. బడుగు, బలహీన, మైనారిటీల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ సమావేశంలో నడిగడ్డ జిల్లా బీసీ ఫోరం కన్వీనర్ గణేష్, సలహాదారులు దడవాయి నర్సింహులు, గట్టన్న, రవీందర్‌గౌడ్, జిల్లా నడిగడ్డ యువత అధ్యక్షుడు చక్రధర్‌రెడ్డి, కన్వీనర్ లక్ష్మీకాంత్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి భాస్కర్; నాయకులు పవన్, వీరేష్, సంచార జాతుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ∙ -
జ్యోతిరావుపూలేకు వైఎస్ జగన్ నివాళి!
హైదరాబాద్: లోటస్‌పాండ్‌లోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జ్యోతిరావుపూలే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జ్యోతిరావుపూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయనతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, కొడాలి నాని, వైఎస్ఆర్సీపీ నేతలు తదితరులు జ్యోతిరావుపూలేకు నివాళులు అర్పించారు.