
సాక్షి,అమరావతి/భవానీపురం (విజయవాడ పశ్చిమ): విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం ఉదయం 10.35 గంటలకు జరిగే జ్యోతిరావు పూలే వర్థంతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్‌నారాయణ, ఎమ్మెల్యేలు పార్ధసారథి, మల్లాది విష్ణు, జోగి రమేష్, సీఎం ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురామ్ బుధవారం పరిశీలించారు. కార్యక్రమంలో కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, జేసీ కె.మాధవీలత, డీసీపీ విక్రాంత్‌పాటిల్, సబ్ కలెక్టర్ హెచ్‌ఎం ధ్యానచంద్ర తదితరులు పాల్గొన్నారు.