జ్యోతిరావుపూలేకు వైఎస్ జగన్ నివాళి!
హైదరాబాద్: లోటస్పాండ్లోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జ్యోతిరావుపూలే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జ్యోతిరావుపూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఆయనతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, కొడాలి నాని, వైఎస్ఆర్సీపీ నేతలు తదితరులు జ్యోతిరావుపూలేకు నివాళులు అర్పించారు.