
భోపాల్: దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని గుణ లోకసభ అభ్యర్థి జ్యోతిరాదిత్యా సింథియా ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనదని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ సరళిని బట్టి చూస్తే తమ పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని సింథియా అభిప్రాయపడ్డారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారనే విశ్వాసం తమకుందన్నారు. దేశంలో జరిగిన అభివృద్ధంతా కాంగ్రెస్ హాయాంలోనే జరిగిందన్నారు. మధ్య ప్రదేశ్‌లోని గుణ లోక్‌సభ స్థానం నుంచి ఆయన ఐదోసారి పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment