స్వాతంత్య్ర స్ఫూర్తితోనే రాణింపు
Published Tue, Aug 16 2016 1:50 AM | Last Updated on Mon, Aug 13 2018 9:06 PM
అత్తిలి: యువతలో స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తి రగిల్చిననాడే వా రు అన్ని రంగాల్లో రాణిస్తారని సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. స్థానిక ఎస్వీఎస్‌ఎస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ గాదం గోపాలస్వామి రచించిన భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పశ్చిమగోదావరి జిల్లా యోధు లు, పశ్చిమగోదావరి జిల్లా సాంస్కృతిక సౌరభాలు అనే గ్రంథాలను సోమవారం కళాశాలలో ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా బీవీ రాఘవులు మాట్లాడుతూ చరిత్రను అశ్రద్ధ చేసే ఏ దేశమైనా చరిత్ర లేకుండా పోతుందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే వంక సత్యనారాయణ మాట్లాడుతూ అవినీతి రహిత సమాజం ఏర్పడినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు అవుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు మాట్లాడుతూ అత్తిలి కళాశాల అభివృద్ధి కృషిచేయాలని కోరారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మా ట్లాడుతూ ఆచరించినవాడే ఆచార్యుడని పేర్కొన్నారు. దుబారా వ్యయాన్ని తగ్గించి, పేదల సంక్షేమానికి ఖర్చుచేయాలని సూచిం చారు. మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడారు. అనంతరం గాదం గోపాలస్వామి రచించిన రెండు గ్రంథాలను బీవీ రాఘవులు, వంక సత్యనారాయణ తదితరులు ఆవిష్కరించారు. రచయిత గాదం గోపాలస్వామి దంపతులను కళాశాల తరఫున సత్కరించారు. కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు దాసం గోవిందరావు, కార్యదర్శి మద్దాల నాగేశ్వరరావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ మండెల సూర్యనారాయణ, సూరంపూడి వెంకటరమణ పాల్గొన్నారు.
Advertisement
Advertisement