
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఢిల్లీలో రెండ్రోజులపాటు జరిగే సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ భేటీలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ, ఆరెస్సెస్ శక్తులను ఓడించేందుకు భావసారూప్య పార్టీలతో కలిసి పనిచేయాలనే రాజకీయ తీర్మానంపైనే చర్చ జరిగింది. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరీ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో మతతత్వ శక్తులను ఓడించేందుకు కాంగ్రెస్‌తో పనిచేయాలా వద్దా? అనే అంశంపై చర్చించారు. కేరళ యూనిట్, కారత్ వర్గం దీనిపై అభ్యంతరం తెలపగా పశ్చిమబెంగాల్, త్రిపుర యూనిట్లు సానుకూలంగా స్పందించాయి.
Comments
Please login to add a commentAdd a comment