గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జైల్లో ఐదేళ్ల శిక్ష కాలం పూర్తి చేసుకున్న ఖైదీలను విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జైల్లో ఐదేళ్ల శిక్ష కాలం పూర్తి చేసుకున్న ఖైదీలను విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. శుక్రవారం హైదరాబాద్లో సీపీఎం కార్యాలయంలో నాలుగు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సు ఆయన పాల్గొన్నారు. రాష్ట విభజనపై చేపట్టిన సమ్మె కొనసాగిస్తారా? లేక విరమిస్తారా అనేది ఏపీఎన్జీవోలు ఇష్టమని ఆయన వ్యాఖ్యానించారు.
మీడియా, పాత్రికేయులపై కేసులు పెడుతూ డీజీపీ దినేష్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గ్యాస్పై విధించిన వ్యాట్ను ఎత్తివేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రతిపాదించిన భూ పరిమితి కుదింపును రాజకీయ పార్టీలు వ్యతిరేకించడం అనైతికమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. వచ్చే నెల 10 తేదీన ఇందిరా పార్క్ వద్ద నాలుగు వామపక్షా పార్టీల ఆధ్వర్యంఓ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు వారు వివరించారు.