
మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి
విశాఖపట్నంలోని హెచ్ పీసీఎల్ రిఫైనరీలో జరిగిన భారీ ప్రమాదంపై వెంటనే న్యాయ విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు డిమాండ్ చేశారు.
విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(హెచ్ పీసీఎల్) రిఫైనరీలో జరిగిన భారీ ప్రమాదంపై వెంటనే న్యాయ విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని, తీవ్రంగా గాయపడిన వారందరికీ రూ.25 లక్షల పరిహారం, శాశ్వత ఉపాధి కల్పించాలని పార్టీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. విశాఖ నగరం చుట్టూ ఉన్న అనేక పెట్రో, రసాయనిక, ఫెర్టిలైజర్స్, ఫార్మా వంటి పరిశ్రమలలో భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కార్మికులకు రక్షణ కరువైందని విమర్శించారు. వీటిని పర్యవేక్షించాల్సిన ప్రభుత్వ విభాగాలన్నీ ఉద్ధేశ్యపూర్వకంగానే బలహీన పరుస్తున్నారని పేర్కొన్నారు.