సంగారెడ్డి టౌన్: పెట్టుబడి దారీ విధానం వల్ల కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారని, కేంద్రంలో మరోసారి నరేం ద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వస్తే కార్మికులకు ఎలాంటి హక్కులు, రక్షణ, చట్టాలు ఉండవని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. శనివారం సంగారెడ్డి పట్టణం లో సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోషలిజం – సమకాలీన కార్మిక వర్గ కర్తవ్యం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన రాఘవులు మాట్లాడుతూ.. కార్మికుల శ్రమను దోచుకుంటూ, పెట్టుబడిదారుల సంక్షేమాన్ని కోరుకునే ఏ ప్రభుత్వాలూ ప్రజలు, కార్మికవర్గ శ్రేయస్సు ను కోరవన్నారు. మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే అది గడ్డు కాలమే అవుతుందన్నారు. కార్యక్రమంలో మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment