తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఉద్యమాలపై ఆంక్షలు పెట్టి నిర్బంధించడం తగదని సీపీఎం కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు అన్నారు.
నకిరేకల్: తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఉద్యమాలపై ఆంక్షలు పెట్టి నిర్బంధించడం తగదని సీపీఎం కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న వామపక్ష నేతల అరెస్టులను ఆయన ఖండించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో దివంగత నేత నర్రా రాఘవరెడ్డి పేరిట ఏర్పాటు చేసిన జనరిక్ మందుల షాపును ఆయన బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.