leaders arrest
-
ప్యాకేజీ జిమ్మిక్కు.. హోదా మా హక్కు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :ప్రత్యేక హోదా కోరుతూ జిల్లా వ్యాప్తంగా ఉద్యమం ఎగసింది. ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. ప్యాకేజీ ఓ జిమ్మిక్కు’ అంటూ జనం సైతం నినదిస్తూ తమ ఇళ్ల వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక హోదా ఆకాంక్షను వెలిబుచ్చారు. జిల్లావ్యాప్తంగా ధర్నాలు, మౌనదీక్షలు, కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి. పోలీసుల నిర్బంధాన్ని కూడా లెక్కచేయకుండా ప్రజలు రోడ్డెక్కారు. వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, జనసేన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పలుచోట్ల ఆందోళనలు జరిగాయి. ఏలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని ఇంటి నుంచి ప్రదర్శనగా ఫైర్బయలుదేరారు. పోలీసులు ముందుగానే నాని ఇంటిముందు భారీగా మోహరించారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున అనుమతి ప్రదర్శనకు ఇవ్వడం లేదని, బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని చెప్పారు. అయినప్పటికీ నాని సహా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీతో బయలుదేరారు. మెయిన్ రోడ్డుపైకి రాగా, పోలీ సులు అరెస్ట్‌ల పర్వం ప్రారంభించారు. ఆళ్ల నానితోపాటు ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు తానేటి వనిత, పాతపాటి సర్రాజు, ఘంటా మురళీరామకృష్ణ, కన్వీనర్లు తలారి వెంకట్రావు, కవురు శ్రీనివాస్, గుణ్ణం నాగబాబు, కొఠారు రామచంద్రరావు, పుప్పాల వాసుబాబు, దయాల నవీన్‌బాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు, కోటగిరి శ్రీధర్, అనుబంధ సంఘాల నేతలను వాహనంపై ఎక్కిం చారు. కార్యకర్తలు ఆ వాహనాన్ని అడ్డగించి పెద్దపెట్టున నినాదాలు చేశారు. అయినా పోలీసులు బలవంతంగా వాహనాన్ని త్రీటౌన్ స్టేషన్‌కు తరలించారు. ఈలోగా మాజీ ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ ఇతర నేతలు పోలీసులను తోసుకుంటూ ఫైర్‌స్టే షన్వద్దకు వెళ్లి బైఠాయించారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. అక్కడ వారిని అరెస్ట్ చేసి త్రీటౌన్ స్టేషషన్‌కు తరలించారు. దీంతో ప్రదర్శనకు వచ్చిన వారంతా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని కొవ్వొత్తుల ప్రదర్శన కొనసాగించారు. నేతలను వెంటనే విడుదల చేయాలం టూ త్రీటౌన్ స్టేషష ఎదుట గంటన్నరకు పైగా బైఠాయించారు. చివరకు 8గంటల సమయంలో పోలీసులు నాయ కుల్ని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ చంద్రబాబు పతనం ప్రారంభమైందన్నారు. హోదా కోసం ప్రయత్నిం చాల్సిన ముఖ్యమంత్రి ఓటుకు నోటు కేసుతో మోదీకి దాసోహమయ్యారని, ఉద్యమిస్తున్న వారిని అణచివేసేందుకు పూనుకోవడంతో చంద్రబాబు నైజం ఏంటో బట్టబయలైందన్నారు. గతంలో జిల్లాలోని కాల్ధరిలో రైతులు, హైదరాబాద్‌లో విద్యుత్ ఉద్యమకారులపై కాల్పులు జరిపించి ఉద్యమాల అణచివేతకు ప్రయత్నించిన మేకవన్నె పులి చంద్రబాబు అని విమర్శించారు. వైఎస్ జగన్మోహనరెడ్డిని విశాఖలో అడ్డుకోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉదయం అన్ని నియోజకవర్గాల్లో శాంతియుత నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు ఆళ్ల నాని ప్రకటించారు. సీపీఎం, జనసేన ఆధ్వర్యంలో ఫైర్‌స్టే షన్ సెంట ర్లో ప్రదర్శనకు సిద్ధమైన నేతలను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఏలూరులో తలపెట్టిన కొవ్వొత్తుల ప్రదర్శనకు బయలుదేరిన భీమవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీ సులు, నాయకుల మధ్య తీవ్రవాగ్వివాదం, తోపులాట జరిగాయి. దీంతో శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ నాయకులు రాత్రి సమయంలో ఇంటి అవరణలోనే కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. విశాఖపట్నంలో చేపట్టిన ఆందోళనకు వెళ్లిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని పోలీ సులు నిర్భంధించడాన్ని నిరసిస్తూ గురవారం రాత్రి నరసాపురంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పోలీసులు ఆందోళనను అడ్డుకుని నాయకుల్ని అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. యలమంచిలి మండలం కలగంపూడిలో మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తాడేపల్లిగూడెంలో పవన్ కల్యాణ్ అభిమాని పవన్ విగ్రహాన్ని ఆవిష్కరించి.. క్షీరాభిషేకం చేసి, అక్కడే ఆమరణ దీక్షకు పూనుకున్నాడు పోలీసులు దీక్షను భగ్నం చేశారు. ప్రత్యేక హోదా కోసం విశాఖకు బయలుదేరుతున్న పవన్ అభిమానులను వేకువజామున పోలీసులు అరెస్ట్ చేశారు. జనసేన నాయకులు, కార్యకర్తలు నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని బీవీఆర్ కళా కేంద్రంలో మౌన దీక్ష చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం డీఎస్ చెరువు వద్ద నుంచి శేషమహల్ రోడ్డు, కె.ఎన్.రోడ్డు మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఉండ్రాజవరం, పాలకొల్లు, ఆచంటతోపాటు పలు ప్రాం తాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు జరిగాయి. దేవరపల్లి మండలం యాదవోలులో వైఎస్సార్ సీపీ నాయకుల ర్యాలీ నిర్వహించారు. చింతలపూడిలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో గురువారం రాత్రి నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన, రాస్తారోకోతో కదం తొక్కారు. జంగారెడ్డి గూడెంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మౌనదీక్ష జరిగింది. గళమెత్తిన పాత్రికేయులు ప్రత్యేక హోదా కోసం పాత్రికేయులు గళమెత్తారు. ప్రత్యేక హోదా మనహక్కు అంటూ నినాదాలు చేశారు. ఏపీయూడబ్ల్యూజే పిలుపుమేరకు తాడేపల్లిగూడెం ఏరియా ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ప్లకార్డులు చేతబూని ప్రదర్శన నిర్వహించారు. యూనియన్ పూర్వాధ్యక్షుడు దూసనపూడి సోమసుందర్ మాట్లాడుతూ హక్కుల సాధనకు ఉద్యమించే హక్కు ప్రతి పౌరునికి ఉందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారానే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్నారు. ప్రధానిమోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇచ్చిన హామీల మేరకే ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు అసెంబ్లీలో చేసిన తీర్మానానికి కట్టుబడకుండా ప్రజా ఉద్యమాన్ని అణచివేయాలనుకోవడం సరికాదన్నారు. ప్రత్యేక హోదా కోరుతూ ‘సాక్షి’లో పనిచేస్తున్న పాత్రికేయులు, సిబ్బంది ఏలూరు, పెంటపాడు మండలం ప్రత్తిపాడు కార్యాలయాల వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రదర్శన చేశారు. -
ప్రజావ్యతిరేక పాలన
మల్లన్నసాగర్ రైతులను పరామర్శించేందుకు వెళుతున్న కాంగ్రెస్ నాయకుల అరెస్టు తాండూరు: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలన సాగిస్తోందని తాండూరు కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల రైతులను పరామర్శించేందుకు మంగళవారం వెళుతున్న తాండూరు నియోజకవర్గానికి చెందిన నాయకులు దారాసింగ్, ద్యావరి విష్ణువర్ధన్‌రెడ్డి, అపూ, సంతోష్, ప్రభాకర్‌గౌడ్, జనార్దన్‌రెడ్డి, విద్యాసాగర్, రఘు, రాజ్‌కుమార్, అశోక్, నారాయణరెడ్డి, రాజు, పునీత్, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు తదితరులను శామీర్‌పేట మండలం తుర్కపల్లి వద్ద పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేశారు. అనంతరం వారిని దుండిగల్ ఠాణాకు తరలించి, వ్యక్తిగత పూచీకత్తుపై వదిలిపెట్టారు. ఈసందర్భంగా నాయకులు ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. బలవంతంగా రైతుల నుంచి భూములను లాక్కోవడం అన్యాయమన్నారు. దౌర్జన్యంగా కాకుండా ఇష్టపూర్వంగా రైతుల నుంచి భూములు తీసుకుని ప్రాజెక్టులు నిర్మించాలని వారు ప్రభుత్వానికి సూచించారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోయడమే తప్ప రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. -
బంద్‌ను ఆపాలని చూస్తోంది
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడం మాని బంద్‌ను ఆపాలని చూస్తోంది తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. ఈ ప్రభుత్వం రైతులకు ఒకే దఫా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం తెలంగాణ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నేతలు బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే శనివారం రాష్ట్రంలోని వివిధ బస్సు డిపోల వద్ద బంద్ నిర్వహిస్తున్న ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సదరు పార్టీల నేతలు స్పందించారు. నేతల అరెస్ట్ అప్రజాస్వామికమని వారు ఆరోపించారు. తాము పిలుపు నిచ్చిన బంద్‌కి అన్ని వర్గాల మద్దతు ఉందన్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతు రుణాలు ఒకే దఫాలో మాఫీ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాము పిలుపు నిచ్చిన బంద్‌ను టీఆర్ఎస్ ముఖ్యనేతలు మినహా ఎవరూ వ్యతిరేకించడం లేదని ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాల నాయకులు స్పష్టం చేశారు. -
‘ప్రజా ఉద్యమాలలో నిర్బంధం తగదు’
నకిరేకల్: తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఉద్యమాలపై ఆంక్షలు పెట్టి నిర్బంధించడం తగదని సీపీఎం కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న వామపక్ష నేతల అరెస్టులను ఆయన ఖండించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో దివంగత నేత నర్రా రాఘవరెడ్డి పేరిట ఏర్పాటు చేసిన జనరిక్ మందుల షాపును ఆయన బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. -
తాండూరు ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత
బస్సులను అడ్డుకున్న నాయకులు అధికారులు, కార్మికుల మధ్య వాగ్వాదం బస్సు కిందికి దూరిన కార్మికులు ఆరుగురు నాయకుల అరెస్టు తాండూరు : ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా నాలు గో రోజు తాండూరు డిపో వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డిపో నుంచి శనివారం ఉదయం 10 గంటలకు ఆర్టీసీ బస్సులను నడపాలని అధికారులు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న యూనియన్ నాయకులు, కార్మికులు డిపో గేట్ వద్ద ధర్నాకు దిగారు. బస్సులను ఎలా నడుపుతారంటూ డీప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ రాజేంద్రప్రసాద్, డిపో మేనేజర్ లక్ష్మీధర్మాలతో నాయకులు వాగ్వాదానికి దిగారు. కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోనప్పుడు ఎందుకు సహకరించాలని నాయకులు ప్రశ్నించారు. దీంతో అధికారులు, నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో డిపో నుంచి చించొళి, కరన్‌కోట్ రూట్లో బస్సులను నడిపేందుకు బస్సులు బయలుదేరాయి. దాంతో ఆగ్రహం చెందిన కార్మికులు, నాయకులు బస్సులకు అడ్డంగా వెళ్లారు. మరికొందరు కార్మికులు బస్సు కిందికి దూరారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. అర్బన్ ఎస్ఐ నాగార్జున, క్విక్ రియాక్షన్ టీం బలగాలు, పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో తోపులాట జరిగింది. పరిస్థితి విషమించడంతో యూనియన్ నాయకులు గోపాల్‌రెడ్డి, బాషా, రవిసింగ్, తేజ, అంజిగౌడ్, సత్తయ్యగౌడ్ తదితర ఆరుగురు యూనియన్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు డిపో ఎదుట కార్మికులు బైఠాయించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తాండూరు, కరన్‌కోట్ ఎస్ఐలు నాగార్జున, ప్రకాష్‌గౌడ్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బస్టాండ్‌లో వంటావార్పు.. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తాండూరు బస్టాండ్‌లో కార్మికులు వంటావార్పు నిర్వహించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున వంటావార్పుకు అనుమతి ఇవ్వమని ముందు పోలీసులు అభ్యంతరం చెప్పారు. ఈ విషయమై నాయకులు అధికారులతో మాట్లాడి అనుమతి తీసుకొని వంటావార్పు నిర్వహించారు. డ్రైవింగ్ పరీక్షలు.. పరిగి మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ డీటీసీఎం రాజేంద్రప్రసాద్, డీఎం లక్ష్మీధర్మా పలువురు ప్రైవేట్ డ్రైవర్లకు పరీక్షలు నిర్వహించారు. డిపోలోనే డ్రైవర్లతో బస్సులను నడిపించి, పలువురిని ఎంపిక చేశారు. -
రాష్ట్రపతి పర్యటన కారణంగా.. పోలీసుల ఓవర్‌యాక్షన్
రాష్ట్రపతి పర్యటన కారణంగా.. పోలీసుల ఓవర్‌యాక్షన్ కు దిగారు. ముందస్తు చర్యగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు గోపాల్ రెడ్డి, మధు, మారుతినాయుడులను అరెస్టు చేశారు. ఈ దృశ్యాలను చీత్రీకరిస్తున్న సాక్షి విలేకరిపై ఎస్సై నారాయణ జూలం చేశారు. అంతేకాకుండా అసభ్య పదజాలంతో ఎస్సై దూషణ చేసినట్టు తెలిసింది. అనంతపురంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెళ్తున్న సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. సర్కారుకు సమైక్యాంధ్ర భయం పట్టుకుంది. రాష్ట్రాన్ని ఒక్కటిగా ఉంచాలంటూ ఆందోళనలు ఉధృతంగా సాగుతుండంటంతో ప్రతి చిన్న విషయానికీ భయపడుతోంది. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా అనంతపురంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెళ్తున్న సందర్భంగా, ముందుగా సమైక్యవాదులను అరెస్టు చేస్తున్నారు. సమైక్యాంధ్ర జేఏసీ నాయకుడు కొగటం విజయభాస్కర రెడ్డితో పాటు దాదాపు 50 మంది సమైక్యవాదులను ముందుగా అరెస్టు చేశారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అనంతపురంలో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా పోలీసు బలగాలను మోహరించారు. రాష్ట్రపతి పాల్గొనే కార్యక్రమ వేదికను అణువణువునా గాలించారు. ఈ కార్యక్రమంలో అధికారలు అత్యుత్సాహన్ని ప్రదర్శించారు. పిల్లలకు మాత్రమే నీలం సంజీ వరెడ్డి స్టేడియంలోకి అనుమతిని ఇస్తున్నట్టు తెలుస్తోంది. -
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, నేతల అరెస్ట్
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రహదారుల దిగ్భంధంపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు. సీమాంధ్రలో బుధవారం రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో పాల్గొన్నపార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగులో నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని అరెస్ట్ చేశారు. రాజంపేటలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సహా 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో రోడ్లను దిగ్బంధించారు. అనంతపురంలో ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి సహా 500 మందిని అరెస్ట్ చేశారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కల్యాణదుర్గంలో మోహన్ రెడ్డి సహా పలువురిని అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా గరికపాడు వద్ద వైఎస్ఆర్ సీపీ నేత సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో 9వ నంబర్ హైవేను దిగ్బంధించారు. ఉదయభాను సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలో రోడ్లపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్న పార్టీ నేత గౌతంరెడ్డిని అరెస్ట్ చేశారు. విశాఖపట్నం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రవిబాబు సహా 60 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో హైవేను దిగ్బంధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితరులను అరెస్ట్ చేశారు.