ప్యాకేజీ జిమ్మిక్కు.. హోదా మా హక్కు
ప్యాకేజీ జిమ్మిక్కు.. హోదా మా హక్కు
Published Fri, Jan 27 2017 12:16 AM | Last Updated on Tue, Sep 5 2017 2:11 AM
సాక్షి ప్రతినిధి, ఏలూరు :ప్రత్యేక హోదా కోరుతూ జిల్లా వ్యాప్తంగా ఉద్యమం ఎగసింది. ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. ప్యాకేజీ ఓ జిమ్మిక్కు’ అంటూ జనం సైతం నినదిస్తూ తమ ఇళ్ల వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక హోదా ఆకాంక్షను వెలిబుచ్చారు. జిల్లావ్యాప్తంగా ధర్నాలు, మౌనదీక్షలు, కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి. పోలీసుల నిర్బంధాన్ని కూడా లెక్కచేయకుండా ప్రజలు రోడ్డెక్కారు. వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, జనసేన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పలుచోట్ల ఆందోళనలు జరిగాయి. ఏలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని ఇంటి నుంచి ప్రదర్శనగా ఫైర్‌బయలుదేరారు. పోలీసులు ముందుగానే నాని ఇంటిముందు భారీగా మోహరించారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున అనుమతి ప్రదర్శనకు ఇవ్వడం లేదని, బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని చెప్పారు. అయినప్పటికీ నాని సహా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీతో బయలుదేరారు. మెయిన్ రోడ్డుపైకి రాగా, పోలీ సులు అరెస్ట్‌ల పర్వం ప్రారంభించారు. ఆళ్ల నానితోపాటు ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు తానేటి వనిత, పాతపాటి సర్రాజు, ఘంటా మురళీరామకృష్ణ, కన్వీనర్లు తలారి వెంకట్రావు, కవురు శ్రీనివాస్, గుణ్ణం నాగబాబు, కొఠారు రామచంద్రరావు, పుప్పాల వాసుబాబు, దయాల నవీన్‌బాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు, కోటగిరి శ్రీధర్, అనుబంధ సంఘాల నేతలను వాహనంపై ఎక్కిం చారు. కార్యకర్తలు ఆ వాహనాన్ని అడ్డగించి పెద్దపెట్టున నినాదాలు చేశారు. అయినా పోలీసులు బలవంతంగా వాహనాన్ని త్రీటౌన్ స్టేషన్‌కు తరలించారు. ఈలోగా మాజీ ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ ఇతర నేతలు పోలీసులను తోసుకుంటూ ఫైర్‌స్టే షన్‌వద్దకు వెళ్లి బైఠాయించారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. అక్కడ వారిని అరెస్ట్ చేసి త్రీటౌన్ స్టేషషన్‌కు తరలించారు. దీంతో ప్రదర్శనకు వచ్చిన వారంతా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని కొవ్వొత్తుల ప్రదర్శన కొనసాగించారు. నేతలను వెంటనే విడుదల చేయాలం టూ త్రీటౌన్ స్టేషష ఎదుట గంటన్నరకు పైగా బైఠాయించారు. చివరకు 8గంటల సమయంలో పోలీసులు నాయ కుల్ని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ చంద్రబాబు పతనం ప్రారంభమైందన్నారు. హోదా కోసం ప్రయత్నిం చాల్సిన ముఖ్యమంత్రి ఓటుకు నోటు కేసుతో మోదీకి దాసోహమయ్యారని, ఉద్యమిస్తున్న వారిని అణచివేసేందుకు పూనుకోవడంతో చంద్రబాబు నైజం ఏంటో బట్టబయలైందన్నారు. గతంలో జిల్లాలోని కాల్ధరిలో రైతులు, హైదరాబాద్‌లో విద్యుత్ ఉద్యమకారులపై కాల్పులు జరిపించి ఉద్యమాల అణచివేతకు ప్రయత్నించిన మేకవన్నె పులి చంద్రబాబు అని విమర్శించారు. వైఎస్ జగన్‌మోహనరెడ్డిని విశాఖలో అడ్డుకోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉదయం అన్ని నియోజకవర్గాల్లో శాంతియుత నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు ఆళ్ల నాని ప్రకటించారు. సీపీఎం, జనసేన ఆధ్వర్యంలో ఫైర్‌స్టే
షన్ సెంట ర్‌లో ప్రదర్శనకు సిద్ధమైన నేతలను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఏలూరులో తలపెట్టిన కొవ్వొత్తుల ప్రదర్శనకు బయలుదేరిన భీమవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీ సులు, నాయకుల మధ్య తీవ్రవాగ్వివాదం, తోపులాట జరిగాయి. దీంతో శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ నాయకులు రాత్రి సమయంలో ఇంటి అవరణలోనే కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. విశాఖపట్నంలో చేపట్టిన ఆందోళనకు వెళ్లిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పోలీ సులు నిర్భంధించడాన్ని నిరసిస్తూ గురవారం రాత్రి నరసాపురంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పోలీసులు ఆందోళనను అడ్డుకుని నాయకుల్ని అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. యలమంచిలి మండలం కలగంపూడిలో మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తాడేపల్లిగూడెంలో పవన్ కల్యాణ్ అభిమాని పవన్ విగ్రహాన్ని ఆవిష్కరించి.. క్షీరాభిషేకం చేసి, అక్కడే ఆమరణ దీక్షకు పూనుకున్నాడు పోలీసులు దీక్షను భగ్నం చేశారు. ప్రత్యేక హోదా కోసం విశాఖకు బయలుదేరుతున్న పవన్ అభిమానులను వేకువజామున పోలీసులు అరెస్ట్ చేశారు. జనసేన నాయకులు, కార్యకర్తలు నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని బీవీఆర్ కళా కేంద్రంలో మౌన దీక్ష చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం డీఎస్ చెరువు వద్ద నుంచి శేషమహల్ రోడ్డు, కె.ఎన్.రోడ్డు మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఉండ్రాజవరం, పాలకొల్లు, ఆచంటతోపాటు పలు ప్రాం తాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు జరిగాయి. దేవరపల్లి మండలం యాదవోలులో వైఎస్సార్ సీపీ నాయకుల ర్యాలీ నిర్వహించారు. చింతలపూడిలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో గురువారం రాత్రి నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన, రాస్తారోకోతో కదం తొక్కారు. జంగారెడ్డి గూడెంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మౌనదీక్ష జరిగింది.
గళమెత్తిన పాత్రికేయులు
ప్రత్యేక హోదా కోసం పాత్రికేయులు గళమెత్తారు. ప్రత్యేక హోదా మనహక్కు అంటూ నినాదాలు చేశారు. ఏపీయూడబ్ల్యూజే పిలుపుమేరకు తాడేపల్లిగూడెం ఏరియా ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ప్లకార్డులు చేతబూని ప్రదర్శన నిర్వహించారు. యూనియన్ పూర్వాధ్యక్షుడు దూసనపూడి సోమసుందర్ మాట్లాడుతూ హక్కుల సాధనకు ఉద్యమించే హక్కు ప్రతి పౌరునికి ఉందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారానే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్నారు. ప్రధానిమోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇచ్చిన హామీల మేరకే ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు అసెంబ్లీలో చేసిన తీర్మానానికి కట్టుబడకుండా ప్రజా ఉద్యమాన్ని అణచివేయాలనుకోవడం సరికాదన్నారు. ప్రత్యేక హోదా కోరుతూ ‘సాక్షి’లో పనిచేస్తున్న పాత్రికేయులు, సిబ్బంది ఏలూరు, పెంటపాడు మండలం ప్రత్తిపాడు కార్యాలయాల వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రదర్శన చేశారు.
Advertisement
Advertisement