మల్లన్నసాగర్ రైతులను పరామర్శించేందుకు వెళుతున్న కాంగ్రెస్ నాయకుల అరెస్టు
తాండూరు: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలన సాగిస్తోందని తాండూరు కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల రైతులను పరామర్శించేందుకు మంగళవారం వెళుతున్న తాండూరు నియోజకవర్గానికి చెందిన నాయకులు దారాసింగ్, ద్యావరి విష్ణువర్ధన్‌రెడ్డి, అపూ, సంతోష్, ప్రభాకర్‌గౌడ్, జనార్దన్‌రెడ్డి, విద్యాసాగర్, రఘు, రాజ్‌కుమార్, అశోక్, నారాయణరెడ్డి, రాజు, పునీత్, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు తదితరులను శామీర్‌పేట మండలం తుర్కపల్లి వద్ద పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేశారు. అనంతరం వారిని దుండిగల్ ఠాణాకు తరలించి, వ్యక్తిగత పూచీకత్తుపై వదిలిపెట్టారు. ఈసందర్భంగా నాయకులు ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడారు. బలవంతంగా రైతుల నుంచి భూములను లాక్కోవడం అన్యాయమన్నారు. దౌర్జన్యంగా కాకుండా ఇష్టపూర్వంగా రైతుల నుంచి భూములు తీసుకుని ప్రాజెక్టులు నిర్మించాలని వారు ప్రభుత్వానికి సూచించారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోయడమే తప్ప రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ప్రజావ్యతిరేక పాలన
Published Tue, Jul 26 2016 5:42 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement