సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ నిర్వాసితుల కోసం సిద్దిపేట జిల్లా ముట్రాజ్‌పల్లిలో భూసేకర ణకు సంబంధించి గెజిట్ జారీ కోసం ప్రింటింగ్‌కు రాసిన లేఖను సమర్పించాలని రాష్ట్ర ప్రభు త్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కోర్టును తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. చేసిన పనులను సమర్థించుకునేందుకు తప్పులు చేస్తే సహించేది లేదని చెప్పింది. తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.
ఆర్ అండ్ ఆర్ కాలనీ కోసం 102 ఎకరాల సేకరణ నిమిత్తం 2021, జనవరి 31న ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ బాలాజీ స్పిన్నర్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని సింగిల్ జడ్జి కొట్టివేయడంతో అప్పీల్ వేసింది. ఈ అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. గతంలో గెజిట్ జారీకి సంబంధించి రిజిస్టర్‌లో ఎంట్రీలు నమోదు చేసిన వారి వివరాలను ప్రభుత్వ న్యాయవాది సంజీవ్‌కుమార్ అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment