
సాక్షి, విశాఖపట్టణం: విశాఖలో జరిగిన అగ్రిటెక్ సదస్సుతో సన్న, చిన్నకారు రైతులకు ఒరిగిందేమీ లేదని సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే సదస్సు నిర్వహించారన్నారు. అలాగే స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులకు చట్టరూపం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి కల్పించలేని పారిశ్రామికరణతో ప్రయోజనంలేదని, ఆహార ఉత్పత్తులను పక్కనబెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కడపలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలని రాఘవులు డిమాండ్ చేశారు.