
'పట్టిసీమ ఖర్చుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి'
విజయనగరం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ, ఉత్తరాంధ్ర లోని వెనుకబడిన ప్రాంతాల అభివద్ధిపై దృష్టి పెట్టడం లేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఏపీ రాజధానిపై మాత్రమే దృష్టి సారించడం వల్ల మిగతా ప్రాంతాలు వెనుకబడతాయన్నారు. ఈ క్రమంలో ప్రాంతీయ ఉద్యమాలకు బీజంపడే అవకాశం ఉందన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ది చేయాలని తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి పెట్టే ఖర్చుతో ఉత్తరాంధ్ర ను అభివృద్ధి చేయోచ్చన్నారు.