కేంద్ర వైఫల్యాలపై ప్రచారం: రాఘవులు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేం దుకు ఈనెల 15 నుంచి జాతీయ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తెలిపారు. సెప్టెంబర్ 1వరకు ఈ కార్యక్రమాలను విస్తృతంగా సాగించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామన్నారు.
రెండ్రోజుల పాటు జరిగిన సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాల అనంతరం ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలసి మీడియాతో మాట్లాడారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఒకే ధోరణిని అనుసరిస్తు న్నాయన్నారు. ౖవివిధ కార్పొరేట్ సంస్థలకు 2016–17 సంవత్సరంలో రూ.1.56 లక్షల కోట్ల రుణమాఫీ చేశారన్నారు. కానీ రైతుల అప్పులు మాత్రం పైసా మాఫీ చేయలేదన్నారు. తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల పనులపై సంబంధిత మంత్రులు లేకుండా సీఎం సమీక్షలు నిర్వహిస్తున్నారని, ముఖ్యమంత్రి సచివా లయాన్ని పూర్తిగా మర్చిపోయారని విమర్శించారు.