సాక్షి, హైదరాబాద్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు రాసిన లేఖపై సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కె.నారాయణ తీవ్రంగా స్పందించారు. రాఘవులు దిగజారుడు రాజకీ యం ముందు తానెంత అని శనివారం రాసిన బహిరంగలేఖలో ఆరోపించారు. ‘తాను ప్రస్తావించిన అంశానికి సూ టిగా సమాధానం చెప్పకపోగా డొంకతిరుగుడు జవాబులు చెప్పేందుకే సమయం కేటాయించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు విషయాన్ని ప్రస్తావించినపుడు అలాంటి చర్చ జరగలేదని పేర్కొన్నప్పటికీ బహిరంగ రహస్యాన్ని సూటిగా చెప్పటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
ఒక పార్టీగా మేము చెప్పిన అభిప్రాయం ప్రజలు ముందు ఉంది. ఆ ప్రకటనతో మీరు విబేధించారు. ఎవరు నిజాయితీగా మాట్లాడింది భవిష్యత్తులో తెలుస్తుంది’ అని నారాయణ తన లేఖలో పేర్కొన్నారు.