k.narayana
-
CPI Narayana: రుషికొండపై టూరిజం నిర్మాణాలే జరుగుతున్నాయి
విశాఖ: రుషికొండపై టూరిజం నిర్మాణాలే జరుగుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ స్పష్టం చేశారు. కొత్త నిర్మాణాలతో టూరిజం అభివృద్ధి చెందుతుందని నారాయణ తెలిపారు. ఈరోజు(శుక్రవారం) రుషికొండలో జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించిన అనంతరం నారాయణ మాట్లాడారు. ‘రుషికొండపై టూరిజం నిర్మాణాలే జరుగుతున్నాయి. కొత్త నిర్మాణాలతో టూరిజం అభివృద్ధి చెందుతుంది. సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మాణమనేది అవాస్తవం.కొండపైకి ఎవరినీ అనుమతించకపోవడం వల్లే అపోహలు’ అని పేర్కొన్నారు. -
పవన్ కల్యాణ్.. చెంగువీరా అయ్యారు..
సాక్షి, విజయవాడ : భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై సీపీఐ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ తీరును ఆ పార్టీ నేతలు ఎండగట్టారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ‘పవన్‌వి స్వార్థ ప్రయోజనాలు ...ఆయన మాకు దూరమైనందుకు బాధ పడటం లేదు. కమ్యూనిస్ట్ భావజాలం ఉందని చెప్పుకునే పవన్ కల్యాణ్ మతతత్వ పార్టీలోకి ఎలా వెళ్లారు. వామపక్షాలకు బాకీ లేదన్న ఆయన.. ప్రజాస్వామ్యానికి మాత్రం బాకీ పడ్డారు.అవకాశ వాదంతో పార్టీలు మారడం సహజం. అయితే.. సిద్ధాంతాలు నచ్చాయని వ్యాఖ్యలు చేయడం ఎందుకు? ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో కలిసి పవన్ రాష్ట్రానికి ఏ ప్రయోజనాలను కాపాడతారు? సీఏఏ, ఎన్నార్సీని సమర్థించిన నరేంద్ర మోదీ, అమిత్ షా దేశద్రోహులు. అలాంటి చట్టాలను సమర్థిస్తున్న పవన్ కూడా దేశద్రోహే’ అని ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్‌ది అవకాశ వాదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. గతంలో ఏపీకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారన్న ఆయన... నడ్డాను కలిసిన తర్వాత మంచి బందరు లడ్డూలు ఇచ్చారా అని సూటిగా ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లిన నేతలు జేఎన్యూకు వెళితే పవన్ మాత్రం బీజేపీ కార్యాలయానికి వెళ్లారని విమర్శించారు. చేగువేరా ఆదర్శమన్నపవన్ ‘చెంగువీర’ అయ్యారని ఎద్దేవా చేశారు. అసలు బీజేపీతో పవన్ ఎందుకు కలుస్తున్నారో చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. దమ్మున్నవాడే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతారని, పవన్ దమ్ముందో లేదో సమాధానం చెప్పాలని అన్నారు. చదవండి: వామపక్షాలకు పవన్ కల్యాణ్ ఝలక్ పవన్‌కు రాజకీయాల్లో స్థిరత్వం లేదు : అంబటి -
వెంకయ్య నాలుకకు నరం లేదా?: నారాయణ
రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తానన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్వి కె. నారాయణ హర్షం వ్యక్తంచేశారు. కమ్యూనిస్టులతో చర్చిస్తాననడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుల్లో ఆదివారం సీపీఐ తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి బస్సు యాత్రను జాతీయ కార్యదర్శి కె. నారాయణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అబద్దాల కోరు అని, ఆయనకు తనను విమర్శించే నైతిక హక్కులేదని అన్నారు. పదేళ్ల పాటు ప్రత్యేక హోదా తెస్తానన్న వెంకయ్య నాలుకకు నరం లేదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ఆశలు, భ్రమలు కల్పించి మోసం చేయడం బీజేపీకే చెల్లిందన్నారు. గ్యాంగ్‌స్టర్ నయీం కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. -
'కన్హయ్యకు ఏదైనా జరిగితే కేంద్రానిదే బాధ్యత'
హైదరాబాద్ : ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్ధి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌కు ఏదైనా జరిగితే అందుకు కేంద్రప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ హెచ్చరించారు. కన్హయ్య ఎక్కడికి వెళితే అక్కడ బీజేపీ అనుబంధ విద్యార్ధి సంఘం- ఏబీవీపీ కార్యకర్తలు, సంఘ్‌పరివార్ దాడులు పరిపాటిగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా మీటింగ్‌లు పెట్టుకునే హక్కుందని, దాడులు, అల్లర్లతో కన్హయ్య నోరు నొక్కాలని చూస్తే బీజేపీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఢిల్లీ మొదలు పూణే వరకు అడుగడుగునా కన్హయ్య సభలకు ఆటంకాలు కల్పిస్తూ అల్లర్లు సృష్టిస్తున్న తీరును ఖండించారు. ఇపుడు ఏకంగా తుపాకులు, తూటాలతో బెదిరింపులు చేస్తున్నారని.. ఢిల్లీ జేఎన్‌యూ బస్‌లో తుపాకులు, తూటాలున్న సంచితో పాటు కన్హయ్యను హత మారుస్తామంటూ రాసిన బెదిరింపు లేఖ పోలీసులకు దొరికిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
సెన్సెక్స్‌ను తగలబెట్టాలి
- బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా పార్టీలు కదలాలి: నారాయణ సాక్షి, హైదరాబాద్: దేశానికి ప్రమాదకరంగా మారిన సెన్సెక్స్‌ను తగలబెట్టాలని సీపీఐ జాతీయ నేత కె.నారాయణ అన్నారు. మంగళవారం మఖ్దూంభవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, నేతలు అజీజ్‌పాషా, గుండా మల్లేష్, పల్లా వెంకటరెడ్డి, పశ్య పద్మతో కలసి మీడియాతో మాట్లాడారు. బిహార్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న క్రమంలో బీజేపీ గెలుస్తున్నట్లు ప్రచారం చేసుకుని కార్పొరేట్ కంపెనీలు షేర్లను అమ్ముకుని లాభపడ్డాయని చెప్పారు. ఈ ఫలితాల నేపధ్యంలో బీజేపీ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా జాతీయ, ప్రాంతీయపార్టీలు ఐక్యంగా ముందుకెళ్లాలన్నారు. మోదీని ప్రసన్నం చేసుకునేందుకు ఆయన విధానాలకు ఏపీ సీఎం బాబు వంతపాడుతూ పులి మీద స్వారీ చేస్తున్నారన్నారు. పార్టీ 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 26న దేశవ్యాప్తంగా రాజకీయ కార్యక్రమాలపై ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 1-25 వరకు బస్సుయాత్ర: సీపీఐ 90వ వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 25 వరకు రాష్ర్టంలో బస్సుయాత్ర, ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. 26న నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో సాంస్కృతిక మేళా, 27న బహిరంగసభ ఉంటుందన్నారు. ఈ నెల 14న ‘బహుళత్వ పరిరక్షణ-శాస్త్రీయ అవగాహన-అసమ్మతి హక్కు’ అనే అంశంపై మఖ్దూం భవన్లో సభ నిర్వహిస్తున్నామన్నారు. -
కార్పొరేట్ల కొమ్ముకాస్తున్న ప్రభుత్వం
సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కొమురంభీంనగర్ను సందర్శించిన అఖిలపక్ష నేతలు ఆదిబట్ల : జిల్లాలో చాలా మంది బడా వ్యాపారుల కబంధ హస్తాల్లో వేల ఎకరాలు ఉన్నాయని, పేదల గుడిసెలపై కాకుండా వాటి మీద ప్రభుత్వం చర్యలకు పూనుకుంటే మంచిదని ీసీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అ న్నారు. ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్162లో పేదల గుడిసెలను కూల్చిన ప్రాంతాన్ని శనివారం అఖిల పక్ష నాయకులు సందర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యద ర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి.జి నర్సింగ్‌రావ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్‌గౌడ్, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్, ఆర్ఎస్పీ, లోక్‌సత్తా నాయకులు తదితరుల అఖిలపక్ష బృందం గుడిసెలు కూల్చిన ప్రాంతాన్ని పరిశీలించింది. ఈ సందర్భంగా కె. నారాయణ విలేకరులతో మాట్లాడారు. కార్పొరేట్ వ్యాపారుల కొమ్ము కాస్తు పేదల ప్రజలను అన్యాయానికి గురి చేయడం తగదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకట్‌రెడ్డి మాట్లాడుతూ గుడిసెల కూల్చివేతకు కేసీఆర్ పర్యటనతోనే ప్రారంభమైందని, వారం క్రితం ఔటర్ రింగ్‌రోడ్‌లో హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కేసీఆర్ ఔటర్‌పై పర్యటిస్తూ కొమురంభీంనగర్లో ఉన్న ప్రాంతంపై కన్ను పడిందన్నారు. వెంటనే గుడిసెలను తొలగించడానికి ఆదేశాలు జారీ చేశారని దుయ్యబట్టారు. నగరంలోని హుస్సే న్‌సాగర్‌ను తర లిస్తామని, ఉస్మానియా యూని వర్సిటిలో ఇళ్ల కట్టిస్తామని పూటకో మాట చెబుతు పిచ్చివా డిలా మాట్లాడు తున్నాడని ఎద్దేవా చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నికల మందు పేదల పక్షాన మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు పేదలపై అహంకారంగా ప్రవర్తిం చడం దారుణమన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు ఉద్యమం ఆగదని, త్వరలోనే అఖిల పక్ష కార్యాచరణ ప్రకటిస్తామని నాయకులు తెలిపారు. ఈ పర్యటనలో సీపీఐ జిల్లా నాయకులు బాలమల్లేష్, జానకిరామ్, నరేందర్, భూ తం వీరన్న, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చిలు క మధుసుదన్‌రెడ్డి,ఇబ్రహీంపట్నం నియోజకవ ర్గ టీడీపీ ఇన్చార్జి రొక్కంభీం రెడ్డి, మాజీ ఎ మ్మెల్యే మస్కు నర్సింహ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షు డు కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు శిగవీరాస్వమి,దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సెక్షన్-8 అవసరం లేదు: నారాయణ
-
సెక్షన్-8 అవసరం లేదు: నారాయణ
'ఓటుకు కోట్లు' వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే మొదలైందని సీపీఐ జాతీయ నేత కె.నారాయణ అన్నారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ... టీడీపీకి అనుకూలంగా ఉంటే గవర్నర్ మంచోడు... కాకపోతే మంచి వారు కాదా? అని ప్రశ్నించారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు బాధ ప్రజల బాధగా చిత్రీకరిస్తున్నారన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సెక్షన్ -8 అవసరం లేదని నారాయణ అభిప్రాయపడ్డారు. -
విలువలకు నిలువుటద్దం సీఆర్
(సందర్భం) కమ్యూనిస్టు యోధులు చం డ్ర రాజేశ్వరరావు 101వ జయంతిని జూన్ 6న దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నా రు. రాజకీయ విలువలకు నిలువుటద్దం సీఆర్. తన చివ రి ఊపిరి వరకు నిబద్ధతతో ఆదర్శప్రాయుడైన చండ్ర రా జేశ్వరరావు, పుచ్చలపల్లి సుం దరయ్య, వి. సుబ్బయ్య లాంటి వారి త్యాగాలే మన పెట్టుబడులు. రాజకీయ వ్యవస్థ పవిత్రమైంది. పవిత్రమైన రాజకీయ వ్యవస్థను ద్రౌపది వస్త్రాపహరణం లాగా నడి వీధుల్లో ఆడుకుంటున్నారు. తాజాగా రేవంత్‌రెడ్డి ఓటు కొనుగోలు విషయంలో ఆధా రాలతో సహా పట్టుబడ్డాడు. ఎంతో పకడ్బందీగా ప్రభుత్వం పథకం రూపొందించ బట్టే ఆధారాలతోసహా దొరికిపోయారు. అసలు రేవంత్‌కు మూలం ఏంటి అనే వైపు దారితీసి చివరికి చంద్రబాబు కేరాఫ్‌కు పోయింది. సెల్‌ఫోన్ తదితర ఆధారాలతో విచారణ జరుగుతున్నది. ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడిలోనే కేసీఆర్ ఫామ్ హౌస్ చురుకుగా వ్యవహరిం చింది. టీడీపీ ఎమ్మెల్యేలను ఫిరాయింపు చేయించింది. టీఆర్ఎస్ నిజమైన ఓట్లతో 5వ అభ్యర్థి గెలవడం అసాధ్యం. అయినా ఐదు మందిని పోటీ పెట్టి గెలిపించుకోవాలనే వ్యూహంతోనే ముందుకు కదిలారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా ఫర్వాలేదు టీడీపీ అభ్యర్థి గెలవకూడదనే పట్టుదల టీఆర్ఎస్ది కాగా, కాంగ్రెస్ గెలిచినా ఫర్వాలేదు టీఆర్ఎస్ గెలవకూడదని టీడీపీ పట్టుపట్టింది. టీఆర్ఎస్ పట్టుదల వల్ల కాంగ్రెస్ పార్టీ క్షేమంగా బయటపడితే, రాజకీయ అవమానాలతో టీడీపీ కుదేలయింది. రేవంత్ జైలుకు వెళ్లాల్సివచ్చింది. ప్రత్యేక తెలంగాణ నినాదంతో స్పటికంలాగా పైకి వచ్చి, ఆచరణలో కల్తీ సరు కుగా మారాల్సిన పరిస్థితి టీఆర్ఎస్కు వచ్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు వెయ్యి మంది యువకులు ఆత్మ బలిదానాలకు పాల్పడ్డారు. సకల జనులు బరితెగించి పోరాడారు. ఆ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని స్థాపించింది. అందరూ హర్షిం చారు. అయితే తెలంగాణ ఏర్పాటుకు అడుగడుగునా అడ్డంగా మాట్లాడిన పార్టీలకు చెందిన గెలిచినా, ఓడినా ప్రతినిధులతో కేబినెట్ నింపేస్తున్నారు. ఇక టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో సొంత మెజారిటీతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసుకు న్నది. అయినా వైఎస్ఆర్ పార్టీ నుండి గెలిచిన ప్రజా ప్రతినిధులను టీడీపీ ఆకర్ష్ పథ కం అమలు చేశారు కానీ, తెలంగాణలో ఫిరాయింపులపై ఫిర్యాదులు చేస్తున్నారు టీడీపీ నాయకులు. తెలుగునాట రాజకీయ రక్తి రసం డ్రైనేజిగా మారి కంపుకొడు తోంది. అయితే రెండు రాష్ట్రాల్లోనూ కమ్యూనిస్టుల బలం కనీసం 10కి తగ్గకుండా ఉండి ఉంటే కూడా ఇంతటి అధ్వాన్నంగా సభ జరిగేది కాదు. రాజకీయ పరిణామాలు దిగజారేవి కాదు. ఈ రొంపిలో మనకెందుకని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తమకున్న చెరొక ఓటు ‘తటస్థం’ అని ప్రకటించి మంచి పని చేశారు. (డాక్టర్ కె. నారాయణ కార్యదర్శి, సీసీఐ జాతీయ సమితి, 94909 52222) -
'తీర్మానం చేయకుంటే... రెండు ఒక్కటే అనుకుంటారు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై టీడీపీ మహానాడులో తీర్మానం చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును సీపీఐ నేత కె.నారాయణ డిమాండ్ చేశారు. లేదంటే టీడీపీ దాని మిత్ర పక్షం బీజేపీ ఒక్కటే అని ప్రజలు భావించే ఆస్కారం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం విజయవాడలో కె. నారాయణ మాట్లాడారు. ప్రధాని మోదీ ఏడాది పాలన కార్పొరేట్లకే లాభం చేకూర్చిందని వ్యాఖ్యానించారు. టీడీపీ మహానాడు బుధవారం నగర శివారుల్లోని గండిపేటలో ప్రారంభమైనాయి. అదికాక ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలో ఉంటే... తెలంగాణలో ప్రతిపక్షం పార్టీల్లో ఒకటిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి మహానాడులో టీడీపీ పలు తీర్మానాలు చేయనుంది. అందులోభాగంగా తెలంగాణలో టీడీపీ మరింత బలం పుంజుకోవడానికి... ఏపీలో నూతన రాజధానిపై తీర్మానం చేయనుంది. ఆ తీర్మానాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై తీర్మానం చేయాలని చంద్రబాబును నారాయణ డిమాండ్ చేశారు. -
విద్యావ్యాపారాన్ని అరికట్టాలి
విద్యారంగంలో విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా ఉద్యమించాలి విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. నారాయణ మహబూబాబాద్ : ప్రజా ఉద్యమాల ద్వారానే విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నారాయణ పిలుపునిచ్చారు. విద్య పరిరక్షణ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక వీరభవన్‌లో శుక్రవారం విద్యారంగ పరిరక్షణ-సమస్యలు-కామన్ విద్యా విధానం అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మైస శ్రీనివాస్, విద్యా పరిరక్షణ కమిటీ సభ్యుడు టి.లింగారెడ్డి అధ్యక్షత వహించగా నారాయణ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యారంగంలోకి విదేశీ శక్తులను, పెట్టుబడిదారులను పాలకులు ఆహ్వానించటంతో విద్యారంగం వ్యాపారరంగంగా మారిందన్నారు. విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో విద్య కోసం కేటాయించిన నిధులే విద్యారంగం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి బయటపడిందన్నారు. విద్యారంగం ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మైస శ్రీనివాస్ మాట్లాడుతూ కామన్ విద్యావిధానం అనే పదానికి అర్థాన్ని ప్రభుత్వం మార్చేసిందన్నారు. ప్రైవేట్ కార్పోరేట్ రంగాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వ రంగంలోని వివిధ యాజమాన్యాలను కలపడమే కామన్ విధానం అని ప్రభుత్వం కొత్త అర్థాన్ని చెబుతూ ప్రజలను మభ్య పెడుతుందన్నారు. కార్యక్రమంలో కమిటీ కోకన్వీనర్ ఎ.రవీందర్ రెడ్డి, టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.గోవర్దన్, ఏఐఎస్ఎఫ్ నాయకుడు అశోక్ స్టాలిన్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి విజయసారథి, సీపీఐ పట్టణ కార్యదర్శి అజయ్, పీడీఎస్‌యూ నాయకులు బి.రవిచంద్ర, పైండ్ల యాకయ్య, టీవీవీ నాయకులు అనీల్, న్యూడెమోక్రసీ నాయకులు దేశెట్టి రాంచంద్రయ్య, పలు సంఘాల నాయకులు బాల కుమార్, లింగ్యా, సందీప్, యాకాంబ్రం, ఉపాధ్యాయ సంఘాల నాయకులు గీత, ప్రభాకర్, బి.రమేష్, చుంచు శ్రీశైలం, వనజ, సువర్ణ, రాజు, సైదులు, వీరస్వామి పాల్గొన్నారు. -
శివరామకృష్ణన్ కమిటీతో ఫలితం సున్నా
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం నియుమించిన శివరావుకృష్ణన్ కమిటీతో రాష్ట్రానికి ఒరి గిందేమిటని సీపీఐ జాతీయు కార్యవర్గ సభ్యుడు డాక్టర్ కె.నారాయుణ ప్రశ్నించారు. గురువారం చిత్తూరు జిల్లా వరదయ్యుపాళెంలో ఆయున వూట్లాడారు. ఆ కమిటీ రాష్ట్ర రాజధానిని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయూలనే విషయుంలో స్పష్టమైన ప్రకటన చేయకుండా నాన్చడం సరి కాదన్నారు. రాజధాని విషయుంలో ప్రాంతీయు విభేదాలు తలెత్తుతుండడం దురదృష్టకరవుని పేర్కొన్నారు. -
రుణమాఫీపై చంద్రబాబు కు చిత్తశుద్ధిలేదు
-
'చంద్రబాబు తీరు గడ్డపార నానబెట్టాను.. అనేలా ఉంది'
హైదరాబాద్: రైతు రుణమాఫీ హామీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధిలేదని సిపిఐ పొలిట్‌బ్యూరో సభ్యుడు కే.నారాయణ అన్నారు. రైతు రుణమాఫీపై చంద్రబాబు చేసిన సంతకం చేసిన తీరుపై నారాయణ అసంతృప్తిని వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీపై చంద్రబాబు తొలిసంతకం గడ్డపార నానబెట్టాను..చూసుకోండి అన్నట్టుగా ఉంది అని నారాయణ వ్యాఖ్యలు చేశారు. సకాలం వర్షాలు పడకపోవడం చంద్రబాబు అదృష్టమన్నారు. వర్షాలు పడివుంటే ఈ పాటికి రైతులు ఖరీఫ్ ప్రారంభించేవారని ఆయన అన్నారు. రుణమాఫీ కోసం చంద్రబాబు ముక్కును నేలకు రాయించాలని ఆయన అన్నారు. నగరం దుర్ఘటనకు గెయిల్‌తో పాటు ఓఎన్జీసీ సంస్థ కూడా బాధ్యత వహించాలని నారాయణ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
నగరం దుర్ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి: నారాయణ
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా మామిడివరం మండంలోని నగరం జరిగిన గ్యాస్ పైప్ లైన్ దుర్ఘటనపై దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐచే విచారణ చేయించాలని సీపీఐ నేత కే.నారాయణ డిమాండ్ చేశారు. కోనసీమలో చమురు సంస్థల కార్యకలాపాలపై జులై 11న అమలాపురంలో మేథావులతో చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నారాయణ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలి పలువురు మరణించగా, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లడం తెలిసిందే. నగరం గ్రామంలో గ్యాస్ పైపులైన్ పేలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య ఆదివారం నాటికి 20కి పెరిగింది. -
మద్యం మాఫియా గుప్పిట్లో ప్రభుత్వం
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ తిరుపతి: ప్రభుత్వం మారినా రాష్ట్రంలో మద్యం మాఫియా అధికారం చెలాయిస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. నారాయణ అన్నారు. తిరుపతిలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మద్యం మాఫియాకు అడ్డుకట్ట వేయాలంటే నూతన విధానం ప్రవేశ పెట్టక తప్పదన్నారు. మద్యం విధానాన్ని తమిళనాడు తరహాలో తీసుకువచ్చి ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపించాలన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చిన కేసీఆర్, చంద్రబాబు అధికారం చేపట్టాక వాటిని అమలు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్న చంద్ర బాబు ఆ తరువాత కమిటీ నియామకంపై సంతకం చేసి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. -
కేసీఆర్ తాతనైనా ఎదిరిస్తాం: నారాయణ
హైదరాబాద : తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పాలనలో పారదర్శకత లోపిస్తే ఆయన తాతనైనా ఎదిరిస్తామని సీపీఐ నేత కె.నారాయణ హెచ్చరించారు. తెలంగాణ ఆవిర్భావ సంబురాలను సోమవారం స్థానిక మఖ్దూంభవన్‌లో ఘనంగా నిర్వహించారు. నారాయణ మాట్లాడుతూ, తెలంగాణలో వనరులకు, కష్టపడే ప్రజలకు కొదవలేదన్నారు. తెలంగాణ ఏర్పడినా భూమి, భుక్తి కోసం ఇంకా పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. మన ప్రభుత్వమే కదాని ప్రజలు ఉదాసీనతగా ఉంటే మరో నిజాం ఏలుబడి వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రజలను చైతన్య పరిచేందుకు వామపక్ష పార్టీలన్నింటినీ ఒక గొడుగు కిందకు తెచ్చేం దుకు కృషి చేస్తామని చెప్పారు. కమ్యూనిస్టులు కలసి ఉంటే నిన్నటి ఎన్నికల్లో గులాబీ స్థానంలో ఎర్రజెండా ఎగిరేదన్నారు. టీసీపీఐ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో అందరి పాత్రా ఉందన్నారు. -
ఇది సాంఘిక బహిష్కరణ
ఖమ్మం: తాను హజరయ్యే సమావేశాలకు దూరంగా ఉంటానని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేసిన వ్యాఖ్యలపై సిపిఐ జాతీయ నేత కె.నారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది సాంఘిక బహిష్కరణ కిందకు వస్తుందన్నారు. ఇది కమ్యునిస్టుల సంస్కృతి కాదని నారాయణ వ్యాఖ్యానించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు ఖమ్మం లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న తనను ఓడించడానికి వీరభద్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారని నారాయణ ఆరోపించారు. ఆ తరువాత వ్యాఖ్యలపై నారాయణ విచారం వ్యక్తం చేస్తూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నప్పటికీ వీరభద్రం మాత్రం శాంతించినట్లు లేదు. -
15 కోట్లకు అమ్ముడుపోయారు!
సీపీఎం నేత తమ్మినేనిపై సీపీఐ నారాయణ తీవ్ర ఆరోపణలు హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో సీపీఎం వ్యవహరించిన తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ నిప్పులు చెరిగారు. సీపీఐని ఓడించడమే లక్ష్యంగా ధన ప్రభావానికి తలొగ్గి అనైతిక, అవకాశవాద రాజకీయాలకు సీపీఎం పాల్పడిందని తీవ్రంగా ఆరోపించారు.ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో తాను పోటీ చేస్తున్నట్టు సీపీఎంకు ముందే చెప్పి మద్దతు కోరినప్పటికీ తాము కూడా పోటీ చేస్తున్నట్టు చెప్పి.. ఆ తరువాత వైఎస్సార్సీపీ అభ్యర్ధి పి.శ్రీనివాసరెడ్డికి అనుకూలంగా సీపీఎం పోటీ నుంచి విరమించుకుందని విమర్శించారు. ఖమ్మంలో సీపీఐ అభ్యర్థి నారాయణను ఓడించేందుకు వైఎస్సార్సీపీ అభ్యర్థి నుంచి సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం రూ. 15 కోట్లు తీసుకున్నాడని స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారన్నారు. నారాయణ బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నామని, అందుకు పార్టీ జాతీయ నాయకత్వం నుంచి కూడా అనుమతి తీసుకున్నామన్నారు. తమతో సర్దుబాట్లకు రమ్మని సీపీఎంను కూడా ఆహ్వానించామని, అందుకు సీపీఎం తిరస్కరిస్తూ కాంగ్రెస్‌తో పొత్తును సాకుగా చూపిందని నారాయణ గుర్తుచేశారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నందుకు తమను కాదన్న సీపీఎం.. తెలంగాణలో సమైక్యవాద పార్టీ వైఎస్సార్సీపీతో పొత్తు ఎలా పెట్టుకుంటుందని ప్రశ్నించారు. -
నారాయణ విలువ 15 కోట్లేనా?
సీపీఎం నేత రాఘవులు ఎద్దేవా హైదరాబాద్: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ సీపీఎంపై చేసిన ఆరోపణలను ఆ పార్టీ పాలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తిప్పికొట్టారు. అసందర్భ, నిరాధార ఆరోపణలు మానాలని హితవు పలికారు. నారాయణకు ధైర్యం ఉంటే కోర్టుకు వెళ్లాలని, లేదా బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. కాంగ్రెస్, బీజేపీలను ఓడించాలన్న తమ జాతీయ విధానానికి అనుగుణంగానే వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్, జేఏస్పీ, మహాజన సోషలిస్టు పార్టీలకు మద్దతు ఇచ్చినట్టు తెలిపారు. ఖమ్మంలో తమ పార్టీ నేత తమ్మినేని వీరభద్రం డబ్బులకు అమ్ముడుపోయారన్న ఆరోపణలపై స్పందిస్తూ.. సీపీఐ తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై నిందలు వేస్తోందన్నారు. ఎన్నికలకు సంబంధించి సీపీఎం, సీపీఐల మధ్య ఎటువంటి పొత్తు లేదని రాఘవులు స్పష్టం చేశారు. తమ పార్టీ పోటీ చేసిన 13 స్థానాల్లో సీపీఐ తన అభ్యర్ధులను బరిలోకి దింపిన విషయం నారాయణకు గుర్తులేదా? అని ప్రశ్నించారు. నారాయణ మాదిరిగా చౌకబారు విమర్శలు చేసి ప్రజలకు వినోదాన్ని పంచాలనుకోవడం లేదని ఘాటుగా విమర్శించారు. నారాయణ విలువ 15 కోట్లేనా? అని ఎద్దేవా చేస్తూ సుమారు 150 కోట్లన్నా ఉంటుందనుకుంటున్నానని చమత్కరించారు. కాంగ్రెస్‌తో జత కట్టినందుకు సీపీఐని ఓడించమని వందసార్లయినా చెబుతామన్నారు. -
సీట్ట సర్దుబాటుకు కేసీఆర్ స్పందించలేదు
ఖమ్మం లోక్‌సభ సీపీఐ అభ్యర్థి కె.నారాయణ మధిర, టీఆర్ఎస్తో సీట్ల సర్దుబాటు చేసుకుందామని ప్రయత్నించినప్పటికీ ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు స్పందించలేదని ఖమ్మం లోక్‌సభ సీపీఐ అభ్యర్థి కె.నారాయణ తెలిపారు. మధిరలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ కోసం 2000 సంవత్సరం నుంచే తాము క్రమబద్దంగా పోరాటాలు చేస్తున్నామని చెప్పారు. సోనియాగాంధీ మాట తప్పకుండా రాష్ట్రం ఇచ్చినందున ఆ పార్టీతో తెలంగాణ ప్రాంతం వరకే సీట్ల సర్దుబాటు చేసుకున్నామని, టీఆర్ఎస్తో కూడా సీట్ల సర్దుబాటు చేసుకుందామని ప్రయత్నించినప్పటికీ కేసీఆర్ స్పందించలేదని తెలిపారు. ఈ విషయాన్ని తెలంగాణ అభిమానులు, జేఏసీ నాయకులు దృష్టిలో ఉంచుకుని తనను గెలిపించాలని ఆయన కోరారు. -
కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య సయోధ్యకు యత్నం: నారాయణ
వారు లోపల ఒకలా, బయట ఒకలా ప్రవర్తిస్తున్నారు అయినా ప్రజల కోసం కలిపే ప్రయత్నం చేస్తున్నాం మోడీ గడ్డం, చేగువేరా గడ్డం ఒకటికాదని పవన్‌కల్యాణ్ తెలుసుకోవాలని వ్యాఖ్య హైదరాబాద్: టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను కలిపే యత్నం చేస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు. ఆ రెండు పార్టీలతో కూటమిగా ఎన్నికలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో నారాయణ మాట్లాడారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరినొకరు దూషించుకుంటూ రహస్య ఎజెండాతో వ్యవహరిస్తున్నారని.. లోపల ఒకలా, బయట మరోలా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ పోతే అభివృద్ధి సాధ్యం కాదని... అందుకే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమర్థవంతమైన ప్రభుత్వం ఏర్పడడం కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్లతో కూటమిగా ఎన్నికలకు వెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నామని నారాయణ చెప్పారు. తెలంగాణవాదులను రాళ్లతో కొట్టించిన కొండా సురేఖను టీఆర్ఎస్లో చేర్చుకోగా లేనిది.. మూడు పార్టీలు కలసి పోటీ చేయడం అసాధ్యమేమీ కాదన్నారు. పోలవరం డిజైన్ మార్చొద్దు: ‘‘పోలవరం నిర్మాణంతో నష్టపోయే వారికి మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలి. అంతేకానీ డిజైన్ మార్చితే ప్రాజెక్టు వల్ల ఉపయోగం ఉండదు. ఉద్యోగులకు కొన్ని ఆప్షన్లు ఉంటాయని, అలాగని మెజారిటీ ఉద్యోగులు ఇక్కడే ఉంటామనడం సరికాదు’’ అని నారాయణ వ్యాఖ్యానించారు. పవన్ వ్యవహారం అర్థం కాలేదు: పవన్‌కల్యాణ్ రాజకీయాలేమిటో? ఆయన చెప్పిన విషయాలేమిటో.. తనకేమీ అర్థం కాలేదని నారాయణ వ్యాఖ్యానించారు. పవన్ మోడీని కలవడం, ఆయన ద్వారా ప్రచారం సాగించాలనుకోవడం సరికాదన్నారు. ‘‘చేగువేరాను ఎక్కువగా ఆరాధించే పవన్ ఒకటి తెలుసుకోవాలి. మోడీ గడ్డం, చేగువేరా గడ్డం ఒక్కటి కాదు! చేగువేరా గడ్డం సమాజాన్ని మార్చేది.. మోడీ గడ్డం సమాజాన్ని ధ్వంసం చేసేది’’ అని పేర్కొన్నారు. బూర్జువా పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలపై ఎన్నికల కమిషన్ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముందని నారాయణ పేర్కొన్నారు. -
3 ఎంపీ, 22 అసెంబ్లీ స్థానాల్లో పోటీ!
రానున్న ఎన్నికల్లో 3 ఎంపీ, 22 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీతో కలసి పోటీ చేయాలని సీపీఐ నిర్ణయించినట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ వెల్లడించారు. ఈ మేరకు ఆ జాబితాను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు అందజేసినట్లు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన పొన్నాలతో భేటీ ఆయ్యారు. ఈ సందర్భంగా పొన్నాల,నారాయణల మధ్య ఎన్నిలలో పార్టీల పొత్తు, సీట్లు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం నారాయణ విలేకర్లతో మాట్లాడుతూ... టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో పొత్తు పెట్టుకుని ఎన్నికలల్లోకి వెళ్లాలని కోరుకున్నామని తెలిపారు. అయితే పొత్తులపై టీఆర్ఎస్కు ప్రతిపాదన పంపామని, అయినా ఆ పార్టీ నుంచి ఎటువంటి స్పందన రాలేదని నారాయణ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
'కాంగ్రెస్ మాకు అంటరాని పార్టీ కాదు'
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని పార్టీలతో పొత్తులు వేర్వేరుగా ఉంటాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ శనివారం హైదరాబాద్‌లో వెల్లండించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తమకు ఏమీ అంటరాని పార్టీ కాదని ఆయన తెలిపారు.తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో సమన్వయంతో వెళ్తే బాగుంటుందని సీపీఐ భావిస్తుందని చెప్పారు. అయితే తమతో సీపీఎంను కూడా కలుపుకోవాలని ఉందని, అదే విషయాన్ని ఆ పార్టీ నాయకులను కలసి కోరామని తెలిపారు.అయితే సీపీఎం మాత్రం ఏ విషయాన్ని వెల్లడించలేదన్నారు.ఆదివారం విజయవాడలో సీమాంధ్ర సీపీఐ ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు కె.నారాయణ తెలిపారు. -
ఇలాగైతే జనమే కార్యాలయాలు ఆక్రమిస్తారు: సీపీఐ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రాజీనామాతో రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే ప్రజలే ప్రభుత్వ కార్యాలయాలను ఆక్రమించుకుంటారని హెచ్చరించింది. కేంద్రం రాష్ట్రానికి దిశానిర్దేశం ఇవ్వలేకపోవడాన్ని ఆక్షేపించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ అధ్యక్షతన జరిగిన కార్యదర్శివర్గ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఉభయ రాష్ట్రాల పార్టీ శాఖ కమిటీలు, భవిష్యత్ కార్యక్రమాల ఎజెండాపై చర్చించారు. మార్చి 3న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై హైదరాబాద్‌లో, 4న ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధిపై విజయవాడలో సదస్సులు నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయించారు. తెలంగాణ కల సాకారమైన నేపథ్యంలో మార్చి 12న వరంగల్‌లో విజయోత్సవ సభను పార్టీ నిర్వహించనుంది. -
పాలకులదే పాపం
కడప అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : పాలకుల నిర్లక్ష్యం వల్లనే సాగునీటి ప్రాజెక్టులకు గ్రహణం పట్టిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ తీవ్రంగా ధ్వజమెత్తారు. కడపలోని డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ మున్సిపల్ ఆడిటోరియంలో సాగునీటి ప్రాజెక్టుల సత్వర నిర్మాణం కోసం రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో నారాయణ ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు నీటి అవసరం ఎంతో ఉంటుందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి పాలకులు చిత్తశుద్ధితో కృషి చేయకపోవడంతో అవన్నీ పెండింగ్‌లో ఉండిపోయాయని ఆరోపించారు. రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీటి అవసరాలు తీరాలంటే కృష్ణా జలాల మళ్లింపే శరణ్యమన్నారు. ఇందు కోసం సీపీఐ అలుపెరుగని పోరాటం చేస్తున్నదన్నారు. 1937లో శ్రీబాగ్ ఒడంబడికను ఉల్లంఘించారన్నారు. 1953లో కేంద్ర జలవనరుల సంఘం ఆమోదించిన కృష్ణా-పెన్నార్‌ను తెలుగు ప్రజల ఐక్యత కోసం త్యాగం చేశారన్నారు. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంగా రాయలసీమ రాజధానిని, తుంగభద్ర డ్యామ్‌ను, బళ్లారిని కోల్పోవాల్సి వచ్చిందని అన్నారు. 1984-85లో మిగులు జలాల ఆధారంగా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రారంభించిన గాలేరు- నగరి(గండికోట), తెలుగు గంగ, హంద్రీ-నీవా, వెలిగొండ ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తున్నాయన్నారు. బ్రిజేష్‌కుమార్ మిశ్రా కమిటీ ఇచ్చిన ట్రిబ్యునల్ తీర్పుతో రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. బ్రిజేష్‌కుమార్ మిశ్రాను కమిటీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నీటి ప్రాజెక్టుల కోసం అలుపెరుగని పోరాటాలకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించినట్లు ఈ సందర్భంగా నారాయణ అన్నారుఉ. ఫిబ్రవరి 5న కలెక్టరేట్ల ఎదుట సామూహిక నిరాహారదీక్షలు, 15న సంతకాల సేకరణ, 17న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలతోపాటు హైదరాబాద్ కేంద్రంగా ప్రాజెక్టులు, పారిశ్రామిక అభివృద్ధి కోసం పోరాటాలు చేయనున్నామన్నారు. సదస్సులో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.రామకృష్ణ, జి.ఓబులేసు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకయ్య, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల పార్టీ కార్యదర్శులు కె.అరుణ, కె.రామాంజనేయులు, జగదీష్, రామానాయుడు, ఈశ్వరయ్య, రామరాజు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. -
అయ్యా! నేను గుర్తున్నానా?
డీఎస్ గారూ... నన్ను నరసింహన్ అంటారండీ! నారాయణ గారూ.. మీతో మాట్లాడాలంటేనే భయమేస్తోంది! దత్తాత్రేయగారు చాలా మంచి వారు.. ఉన్నదున్నట్లే మాట్లాడతారు! - గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో ఆదివారం సాయంత్రం ‘ఎట్ హోం’ పేరిట ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమంలో అక్కడికి వచ్చిన కొందరు అతిధులను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ చేసిన సరదా వ్యాఖ్యలివి. సాక్షి, హైదరాబాద్: రాజ్‌భవన్‌లో గవర్నర్ దంపతుల తేనీటి విం దుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, హైకోర్టు చీఫ్ జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్‌గుప్తా, శాసనమండలి చైర్మన్ డాక్టర్ చక్రపాణి, శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, త్రివిధ దళాల అధికారులు, స్వాతంత్య్ర సమరయోధులు, సినీ, సాహిత్య కళాకారులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్‌లు ప్రతి ఒక్కరి టేబుల్ వద్దకు వెళ్లి పేరు పేరునా పలకరిస్తూ, సరదాగా జోక్లేస్తూ, పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. దాదాపు గంట పాటు జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ దంపతులు సీఎంను వెంటతీసుకెళ్లి తన మిత్రులను, క్లాస్మేట్లను పరిచయం చేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ఒకేచోట నిలబడి మాట్లాడుకుంటుండగా అక్కడికి వచ్చి న నరసింహన్ డీఎస్‌ను ఉద్దేశించి ‘‘అయ్యా... నేను మీకు గుర్తున్నానా? నన్ను నరసింహన్ అంటారు. ఎప్పుడో 2, 3 నెలల కిందట కలిశాను. బాగున్నారా?’’ అని అన్నారు. దీంతో డీఎస్ ‘‘ఎంత మాట... మాఫ్ కీజియే’’ అంటూ చెంపలేసుకుంటున్నట్లు చేతులు కదిలించడంతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. ఆ వెంటనే నరసింహన్ నారాయణను ఉద్దేశించి.. ‘‘నారాయణ గారూ... నేను గుర్తున్నానా? అయినా మీతో మాట్లాడాలంటేనే భయమేస్తోంది. మీ పక్కనున్న దత్తాత్రేయ గారిని చూడండి. ఎంత మంచివారో! ఏదైనా సరే ఉన్నదున్నట్టే మాట్లాడతారు. బయట చేసే రాజకీయాలు వేరనుకోండి’’ అంటూ చమత్కరించారు. అంతకుముందు తన క్లాస్మేట్స్ వద్దకు వెళ్లిన గవర్నర్ వారిని సీఎంకు పరిచయం చేశారు. తెలంగాణ మంత్రుల డుమ్మా... రాజ్‌భవన్‌లో జరిగిన తేనేటి విందుకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సహా తెలంగాణ మంత్రులంతా గైర్హాజరయ్యారు. స్పీకర్‌తో సీఎం.. సీఎస్‌తో సదారాం ముచ్చట్లు తేనేటి విందు కార్యక్రమంలో సీఎం కిరణ్, స్పీకర్ నాదెండ్ల చాలాసేపు మాట్లాడుకోవడం కనిపిం చింది. అదే సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ రాజసదారాం కూడా అక్కడికి సమీపంలోని ఓ టేబుల్ వద్ద కూర్చొని మంతనాలు జరిపారు. -
అవినీతిపై పోరాటం
గోదావరిఖని, న్యూస్‌లైన్ : అవినీతికి వ్యతిరేకంగా పోరాడే బాధ్యత ఎర్రజెండా పార్టీలదేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ చెప్పారు. ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూని యన్ 14వ మహాసభల సందర్భంగా గోదావరిఖనిలో ఆదివా రం రాత్రి నిర్వహించిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో మద్యం మాఫియా, బస్సుల మాఫియా, ల్యాండ్ మాఫియా తదితర మాఫియాల ఆధ్వర్యంలోనే సమాంతర పరిపాలన సాగుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేవలం ఉత్సవ విగ్రహంగానే పనిచేస్తున్నారన్నారు. రాజకీయ పార్టీలు కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం దిగజారిపోయి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చించకుండా కాంగ్రెస్ పార్టీ రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోందని, ఒకవేళ ఆ పార్టీ తెలంగాణపై వెనక్కి తగ్గితే పాతాలగంగలో కలిసినట్టేనని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నేడు బీజేపీతో స్నేహం చేస్తున్నారని, తెలంగాణకు అడ్డుతగులుతూ బిల్లు రాకుండా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలకు ఢిల్లీలో పట్టిన గతే రాష్ట్రంలో పడుతుందని ఎద్దేవా చేశారు. ప్రజలు ఎర్రజెండా నాయకత్వాన్ని ఆదరించాలని కోరారు. తెలంగాణకు కిరణే అడ్డంకి తెలంగాణ బిల్లుపై శాసనసభలో చర్చించకుండా అడ్డుకుంటున్నది సీఎం కిరణేనని సీపీఐ శాసనసభపక్ష నేత గూండా మల్లేశ్, ఉపనేత కూనంనేని సాంబశివరావు ధ్వజమెత్తారు. రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని చెప్పి సీఎంగా ప్రమాణం చేసిన కిరణ్ మాట తప్పి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీని సజావుగా నడిపించాలని, సభను అడ్డుకునేవారిని మార్షల్స్‌తో బయటకు పంపించాలని సూచించారు. సభలో ఎమ్మెల్సీ, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పీజే చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి ఓబులేశు, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శులు మర్రి వెంకటస్వామి, కళవేణి శంకర్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పువ్వాడ నాగేశ్వర్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ వై.గట్టయ్య, ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. -
మోడీ కంటే మన్మోహన్ దుర్మార్గుడు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విశాఖపట్నం..న్యూస్‌లైన్: గుజరాత్లో మారణ హోమం సృష్టించిన మోడీ కంటే ప్రధాని మన్మోహన్సింగ్ దుర్మార్గుడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ ఘాటుగా విమర్శించారు. అణు ఒప్పందంతోపాటు బొగ్గు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాని.. అత్యంత ప్రమాదకరమైన వ్యక్తని ధ్వజమెత్తారు. శనివారం ఆయన విలేకరుల తో మాట్లాడుతూ.. దేశానికి బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రత్యామ్నాయాలు కాదన్నారు. కేంద్రంలో ఉన్న అసమర్థ పాలనే రాష్ట్రంలోనూ ఉందన్నారు. తెలంగాణ బిల్లుపై శాసనసభలో చర్చ జరగకుండా అడ్డుకోవడం అంటే చట్ట సభలపై గౌరవం లేకపోవడమేనన్నారు. -
నీతి, నిజాయితీ లేని పొత్తు
టీడీపీ, బీజేపీ దోస్తీపై సీపీఐ మండిపాటు సాక్షి, హైదరాబాద్: టీడీపీ-బీజేపీల మధ్య పొత్తంటూ కుదిరితే అది నీతి, నిజాయితీ లేనిదే అవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ అభిప్రాయపడ్డారు. అవకాశవాదంతో కూడిన టీడీపీ... మతోన్మాదాన్ని పుణికిపుచ్చుకున్న బీజేపీ ఒక వేదిక మీదకు వస్తే ప్రజలకు అంతకుమించిన విషాదం ఉండబోదని దుయ్యబట్టారు. పార్టీ నేతలు పల్లా వెంకటరెడ్డి, రామనరసింహారావుతో కలసి ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని కాపాడడానికి కిషన్‌రెడ్డి సిద్ధమైనట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ వ్యవహారంలో బీజేపీ నయవంచకపాత్ర పోషిస్తోందన్నారు. బీజేపీ నేతలు ప్రాంతాల వారీగా విడిపోయి రాష్ట్రపతిని కలవడం, రెండు వేర్వేరు నివేదికలు పార్టీ జాతీయ నాయకత్వానికి ఇవ్వడమే నయవంచక పాత్రకు నిదర్శనంగా అభివర్ణించారు. -
జగన్‌కు పోటీగా కిరణ్ పార్టీ: నారాయణ
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పోటీగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ పెట్టవచ్చని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే కిరణ్ కాంగ్రెస్‌లో కొనసాగే పరిస్థితి కనిపించట్లేదని నూతన సంవత్సరం సందర్భంగా నారాయణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జనవరి 23 తర్వాత కూడా ప్రస్తుత రాజకీయ సస్పెన్స్ కొనసాగుతుందని, అప్పటివరకు కిరణ్ సీఎంగా కొనసాగి సర్దుకోవాల్సిందంతా సర్దుకుని శాసనసభా వేదికగా సుదీర్ఘ ప్రసంగం చేసి రాజీనామా చేయవచ్చని నారాయణ అంచనా వేశారు. ‘‘రాజకీయ సంచలనం కలిగించాలన్నది కిరణ్ ప్రణాళికగా ఉంది. ఆయన పెట్టే పార్టీ వల్ల పెద్దగా ఫలితమేమీ ఉండకపోయినా వైఎస్సార్సీపీకి చెక్ పెట్టడానికేనన్న వాదన విస్తృతంగా వినిపిస్తోంది’’ అని పేర్కొన్నారు. -
‘తెలంగాణ’ను ఎవరూ ఆపలేరు
ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడం ఇక ఎవరి తరమూ కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ అన్నారు. బూర్జువ పార్టీలయిన కాంగ్రెస్, టీడీపీ తెలంగాణపై చేసిన తీర్మానాలకు కట్టుబడకుండా మాట మార్చాయని విమర్శిం చారు. సీపీఐ 88వ ఆవిర్భావ దినోత్సవరం సందర్భంగా స్థానిక రిక్కాబజార్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాం గ్రెస్, టీడీపీ అవకాశవాద రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ బిల్లును రాష్ట్రపతి అసెంబ్లీకి పంపిస్తే దానిపై చర్చించి అభిప్రాయం చెప్పకుండా, రాష్ట్రపతి, పార్లమెంట్, చట్టసభల పట్ల ఆ పార్టీల సభ్యులు అమర్యాదగా వ్యవహరిస్తున్నారని అన్నారు. చట్టాలపై తమకు నమ్మకం లేకపోయినా ఆమోదించామని, ఆ చట్టాల ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పారు. ఈ విషయంలో మాటకు కట్టుబడి ఉన్నదని కమ్యూనిస్టులేనని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొందని, ఏ నాయకుడు ఎప్పుడే పార్టీలో ఉంటాడో తెలియడం లేదని విమర్శించారు. ఒక విధానానికి కట్టుబడకుండా తమ స్వార్థం కోసం పార్టీలు మారుతున్నారని అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమం పెరిగితే అవకాశవాదాన్ని అరికట్టవచ్చని చెప్పారు. గతంలో నరేంద్రమోడీని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు బీజేపీ జపం చేస్తున్నారని, ఆయన అడ్రస్ కేరాఫ్ బీజేపీ కార్యాలయంగా మారిందని ఎద్దేవా చేశారు. లౌకిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసేందుకు అనేక పార్టీలు కుట్ర పన్నాయన్నారు. హిందువులను రెచ్చగొట్టడం ద్వారా అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కమ్యూనిస్టు పార్టీలతోనే లౌకికవాద మనుగడ సాధ్యమని స్పష్టం చేశారు. పోలీస్ వ్యవస్థలో అతితక్కువ వేతనం తీసుకుంటున్న హోంగార్డులే ఎక్కువగా కష్ట పడుతున్నారని, వారి వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. కోట్ల రూపాయల విలువైన భూములను స్వాహా చేసిన వారిని వదిలి, నిలువనీడ కోసం ప్రభుత్వ స్థలంలో పేదలు గుడిసె వేసుకుంటే దౌర్జన్యంగా తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ సీనియర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వర్రావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. దున్నే వాడికే భూమి కావాలని కమ్యూనిస్టు పార్టీలు ఉద్యమించాయని, ఎందరో వీరులు ప్రాణ త్యాగాలు చేశారని, మరికొందరు జైలు పాలయ్యారని చెప్పారు. నల్లమల గిరిప్రసాద్, రజబ్అలీ, యూనియన్ కొమరయ్య తదితరులు ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. జిల్లాలో అవినీతి పెచ్చుమీరిందని, ఎవరి వాటాలు వారికి అందుతున్నాయని, దీనిలో అధికారులు కూడా ఉన్నారని ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిద్ది వెంకటేశ్వర్లు, కొత్తగూడెం, వైరా ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, బానోత్ చంద్రావతి తదితరులు మాట్లాడుతూ పేదల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ఉద్యమంలో ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని, వారి ఆశయాల సాధన కోసం పత్రి కార్యక ర్త పని చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన గేయాలు ఆకట్టుకున్నాయి. సభలో సీపీఐ జిల్లా నాయకులు పోటు ప్రసాద్, ఎండి.మౌలానా, ఎస్కె.సాబీర్‌పాషా, మిరియాల రంగయ్య, రావులపల్లి రాంప్రసాద్, మేకల సంగయ్య, పోటు కళావతి, దండి సురేష్, సింగు నర్సింగరావు, బరిగెల సాయిలు, జమ్ముల జితేందర్‌రెడ్డి, ఎండి.సలాం, జక్కుల లక్ష్మయ్య, మందడపు నాగేశ్వరరావు, తిరుమలరావు, యలమంచిలి కృష్ణ, దొండపాటి రమేష్ పాల్గొన్నారు. -
కృష్ణాజలాలు లేకుంటే సీమ ఎడారే: నారాయణ
మదనపల్లె: కృష్ణాజలాలను అదనంగా తీసుకురాకపోతే రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. ఆదివారం చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని పార్టీ కార్యాలయంలో రాయలసీమ పరిధిలోని నాలుగు జిల్లాల పార్టీ కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలతో హంద్రీ-నీవా ప్రాజెక్టు సాధనకై రైతు సదస్సును నిర్వహించారు. నారాయణ మాట్లాడుతూ కృష్ణామిగులు జలాలను రాయలసీమ ప్రాంతానికి తీసుకురావడంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ఎన్టీఆర్ హయాంలో చేపట్టిన హంద్రీ-నీవా, గాలేరు ప్రాజెక్టుల నిర్మాణ పనులు పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయని తెలపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు వెడల్పు చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం రాయలసీమకు 40 టీఎంసీల కృష్ణాజలాలు ఇస్తున్నారని దాన్ని వంద టీఎంసీలకు పెంచాలని డిమాండ్ చేశారు. నీటి సమస్య పరిష్కారం కోసం డిసెంబర్ 5న రాయలసీమలోని అన్ని జిల్లాల మండల కార్యాలయాల ఎదుట తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్టు ఆయన చెప్పారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అసమర్థ పాలన వల్ల చిత్తూరు జిల్లాలోనూ నీటి సమస్య పెరిగిపోయిందన్నారు. సమావేశం జరుగుతుండగా టీడీపీ నాయకులు మధ్యలో వచ్చి సమైక్యవాదానికి మద్దతు తెలపాలని ఆయన్ను డిమాండ్ చేశారు. చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతాన్ని వదిలి సమైక్యానికి కట్టుబడితే తాను చెవులు కోసుకుంటానని వారితో నారాయణ అన్నారు. 28, 29న ఢిల్లీలో బైరెడ్డి ధర్నా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని విడదీస్తే రాజధానిని సీమాంధ్రలోనే ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డి ఈ నెల 28, 29 తేదీల్లో ఢిల్లీలో ధర్నా చేయనున్నారు. రాజధాని ఏర్పాటుతో పాటు నీటి ఒప్పందాలు సక్రమంగా జరగాలని, అలా కాని పక్షంలో రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. -
‘హైకమాండ్ వద్ద సీఎం ప్రాధాన్యం తగ్గింది’
సాక్షి, హైదరాబాద్: ‘మీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎక్కువగా మాట్లాడుతున్నారు. హైకమాండ్ వద్ద కూడా ఆయన ప్రాముఖ్యం తగ్గింది’ అని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తనతో చెప్పినట్లు సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కె. నారాయణ తెలిపారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందంతో ఇటీవల జరిగిన భేటీ ముచ్చట్లను శనివారం పత్రికా ప్రకటన రూపంలో వెలువరిస్తూ నారాయణ ఈ అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణపై లీకులతో తెలుగు ప్రజలను ఎందుకు చీలుస్తున్నారన్న తన ప్రశ్నకు జీవోఎం సభ్యులు చిరునవ్వు చిందించారని, కాలయాపన చేస్తే ఎన్నికల్లో కాంగ్రెస్ మట్టికొట్టుకుపోతుందని తాను హెచ్చరించానని చెప్పారు. విచారణకు హాజరయ్యేలా ఏజీకి సూచించండి కేంద్రమంత్రి సిబల్‌కు వినోద్ లేఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో అధికరణ 3, 371(డి)లకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు విచారణకు వచ్చే సమయంలో కోర్టుకు హాజరయ్యేలా అటార్నీ జనరల్(ఏజీ)కు సూచించాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్‌ను టీఆర్ఎస్ నేత వినోద్‌కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన శనివారం సిబల్‌కు లేఖ రాశారు. అధికరణ 3, 371(డి)లకు సంబంధించి 9 పిటిషన్లు దాఖలయ్యాయని, విభజనను అడ్డుకునేందుకే వీటిని దాఖలు చేశారన్నారు. వీటికి ఎటువంటి చట్టబద్ధత లేదని, వీటిని విచారణ సమయంలో కొట్టివేసే అవకాశం ఉందన్నారు. -
మీ దిగజారుడు ముందు నేనెంత?
సాక్షి, హైదరాబాద్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు రాసిన లేఖపై సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కె.నారాయణ తీవ్రంగా స్పందించారు. రాఘవులు దిగజారుడు రాజకీ యం ముందు తానెంత అని శనివారం రాసిన బహిరంగలేఖలో ఆరోపించారు. ‘తాను ప్రస్తావించిన అంశానికి సూ టిగా సమాధానం చెప్పకపోగా డొంకతిరుగుడు జవాబులు చెప్పేందుకే సమయం కేటాయించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు విషయాన్ని ప్రస్తావించినపుడు అలాంటి చర్చ జరగలేదని పేర్కొన్నప్పటికీ బహిరంగ రహస్యాన్ని సూటిగా చెప్పటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక పార్టీగా మేము చెప్పిన అభిప్రాయం ప్రజలు ముందు ఉంది. ఆ ప్రకటనతో మీరు విబేధించారు. ఎవరు నిజాయితీగా మాట్లాడింది భవిష్యత్తులో తెలుస్తుంది’ అని నారాయణ తన లేఖలో పేర్కొన్నారు. -
ఐదు లక్షల కోట్లని ఆ వేళ ఎందుకన్నావ్?:కె.నారాయణ
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో ప్రస్తుతం జరుగుతున్న విధ్వంసానికి రాజకీయపార్టీల నీతిమాలినతనమే కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటన చేశాక రూ.ఐదు లక్షల కోట్ల తో అద్దాల మేడలు కడతానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడెందుకు సమన్యాయమంటున్నారో చెప్పాలని నిలదీశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకటరెడ్డితో కలిసి ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడున్న వ్యక్తే(సీఎం) వ్యతిరేకిస్తుంటే శాంతిభద్రతల్ని, ప్రజల అనుమానాల్ని ఎవరు నివృత్తి చేస్తారని మండిపడ్డారు. ‘‘బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రే రెచ్చగొడుతుంటే, అబద్ధపు ప్రచారం చేస్తుంటే జనం మరింత చెలరేగిపోరా? అసెంబ్లీలో ఓటింగ్ ఉండదని తెలిసీ సీఎం అబద్ధాలు చెప్పడం అగ్నికి ఆజ్యం పోయడం కాదా? రాష్ట్ర విధ్వంసానికి సీఎం, కాంగ్రెస్‌వారే కారణం. మరోపక్క చంద్రబాబూ నాశనం చేస్తున్నారు.. బుర్రోన్నుళ్లు చేసే పనేనా ఇది? తెలంగాణకు అనుకూలమని ఉత్తరం ఇచ్చారా? లేదా? ఇప్పుడు సమన్యాయమనే డాన్స్ ఏమిటీ? వైఎస్సార్సీపీ కూడా ఇలాగే అని ఇప్పుడు సమైక్యాంధ్ర నిర్ణయం తీసుకుంది. సీమాంధ్రలో ఆధిపత్యానికి పోటీపడి మరీ పార్టీలు జనాన్ని రెచ్చగొడుతూ పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నాయి. ఇది ఘోరకృత్యం’’ అని మండిపడ్డారు. -
తెలంగాణపై సీపీఐదీ ద్వంద్వ వైఖరి కాదు: నారాయణ
తెలంగాణ ప్రకటనపై సీపీఐది ద్వంద్వ వైఖరి కాదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కే.నారాయణ బుధవారం నల్గొండలో స్పష్టం చేశారు. సీపీఐపై నిందలు వేస్తే ఎంపీ లగడపాటి, మంత్రి టీజీలకు నాలుకలుండవని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో పొత్తుపై చంద్రబాబుకు గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ కన్నుకొట్టపోయారని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో కాంగ్రెస్, బీజేపీలతో సీపీఐ పొత్తులుండవని నారాయణ ఈ సందర్భంగా పేర్కొన్నారు.