నగరం దుర్ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి: నారాయణ
నగరం దుర్ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి: నారాయణ
Published Mon, Jun 30 2014 9:03 PM | Last Updated on Sat, Sep 2 2017 9:36 AM
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా మామిడివరం మండంలోని నగరం జరిగిన గ్యాస్ పైప్ లైన్ దుర్ఘటనపై దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐచే విచారణ చేయించాలని సీపీఐ నేత కే.నారాయణ డిమాండ్ చేశారు.
కోనసీమలో చమురు సంస్థల కార్యకలాపాలపై జులై 11న అమలాపురంలో మేథావులతో చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నారాయణ తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలి పలువురు మరణించగా, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లడం తెలిసిందే. నగరం గ్రామంలో గ్యాస్ పైపులైన్ పేలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య ఆదివారం నాటికి 20కి పెరిగింది.
Advertisement
Advertisement