రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తానన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్వి కె. నారాయణ హర్షం వ్యక్తంచేశారు. కమ్యూనిస్టులతో చర్చిస్తాననడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుల్లో ఆదివారం సీపీఐ తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి బస్సు యాత్రను జాతీయ కార్యదర్శి కె. నారాయణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అబద్దాల కోరు అని, ఆయనకు తనను విమర్శించే నైతిక హక్కులేదని అన్నారు. పదేళ్ల పాటు ప్రత్యేక హోదా తెస్తానన్న వెంకయ్య నాలుకకు నరం లేదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ఆశలు, భ్రమలు కల్పించి మోసం చేయడం బీజేపీకే చెల్లిందన్నారు. గ్యాంగ్‌స్టర్ నయీం కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
వెంకయ్య నాలుకకు నరం లేదా?: నారాయణ
Published Sun, Sep 11 2016 1:14 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM
Advertisement
Advertisement