రాష్ట్రం మరోసారి విడిపోతుంది: సీపీఐ | CPI leaders demands CBI Enquiry into land scam | Sakshi
Sakshi News home page

రాష్ట్రం మరోసారి విడిపోతుంది: సీపీఐ

Published Sun, Jun 18 2017 3:33 PM | Last Updated on Mon, Aug 13 2018 6:24 PM

రాష్ట్రం మరోసారి విడిపోతుంది: సీపీఐ - Sakshi

రాష్ట్రం మరోసారి విడిపోతుంది: సీపీఐ

విజయవాడ: విశాఖప‌ట్టణం భూకుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. విజయవాడలో ఆయన  ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. వేల కోట్ల రూపాయల భూకుంభకోణంలో అధికార పార్టీ నేతలూ ఆరోపణలు ఎదుర్కొంటున్నందున దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు.

రాజధానిలో మరో 14వేల ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని.. గతంలో సేకరించిన భూమిలో ఇంకా నిర్మాణాలు చేపట్టకపోగా.. మళ్లీ భూసేకరణ ఎందుకని ప్రశ్నించారు. అభివృద్ధి అంతా ఒకేచోట జరుగుతుందని అభిప్రాయ పడ్డారు. మిగిలిన ప్రాంతాలను విస్మరిస్తే రాష్ట్రం మరోసారి విడిపోయే ప్రమాదం ముందని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement