‘సిట్ పై మాకు నమ్మకం లేదు’ | ysrcp leaders demand the cbi enquiry on Visakha land scam | Sakshi
Sakshi News home page

‘సిట్ పై మాకు నమ్మకం లేదు’

Published Fri, Jul 14 2017 9:27 PM | Last Updated on Fri, Aug 10 2018 8:26 PM

‘సిట్ పై మాకు నమ్మకం లేదు’ - Sakshi

‘సిట్ పై మాకు నమ్మకం లేదు’

విశాఖపట్నం: విశాఖ భూకబ్జాలపై సీబీఐ విచారణ జరపాల్సిందేనని వైఎస్సార్ సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్‌ డిమాండ్ చేశారు. సిట్ పై తమకు నమ్మకం లేదని, ముమ్మాటికి సీబీఐ దర్యాప్తు జరగాల్సిందేనన్నారు. భూకబ్జాలతో సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ కు సంబంధం ఉందన్నారు. పోలీసులతో విచారణ చేయిస్తే ఏం న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. కలెక్టర్ రోజుకో తీరుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని  బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement