జేసీ మనిషా? పశువా? : బొత్స | Botsa Satyanaraya Slams TDP MPs On Usage Of Language | Sakshi
Sakshi News home page

జేసీ మనిషా? పశువా? : బొత్స

Published Wed, Jul 4 2018 6:02 PM | Last Updated on Mon, Aug 20 2018 6:07 PM

Botsa Satyanaraya Slams TDP MPs On Usage Of Language - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎంపీల భాష జుగుప్సాకరంగా ఉందంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జేసీ దివాకర్‌ రెడ్డి పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని తీవ్ర స్థాయిలో గర్హించారు. ఇలాంటి నాయకుల వల్లే మిగిలిన వారికి చెడ్డపేరు వస్తుందని అభిప్రాయపడ్డారు. వైజాగ్‌ రైల్వే జోన్‌ కావాలని టీడీపీ నేతలు ఇప్పుడు దీక్ష చేయడం హాస్యాస్పదమని అన్నారు.

ఎన్నికలు దగ్గరపడుతున్న వేల డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. విభజన హామీల్లో ఉన్న రైల్వే జోన్‌ గురించి నాలుగేళ్లుగా ఏం చేశారని నిలదీశారు. ఏం ముఖం పెట్టుకుని దీక్ష చేస్తున్నారని ప్రశ్నించారు. ఎంపీ అనే రెండు పదాలు పేరుకు ముందు ఉన్నాయనే అహంకారంతో టీడీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని అన్నారు. అందుకే వారు వినియోగిస్తున్న భాష అత్యంత జుగుప్సాకరంగా ఉందని చెప్పారు. పదేళ్ల పాటు మంత్రిగా పని చేసిన తాను ఇలాంటి భాషను వినియోగించడం ఎక్కడా చూడలేదన్నారు.

వైఎస్సార్‌ సీపీ నుంచి సంతలో పశువుల్ని కొన్నట్లు తీసుకున్న ఎంపీలతో కలిపి టీడీపీ వద్ద ఉన్న 18 మంది ఎంపీలు ఏం సాధించారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి వైజాగ్‌ రైల్వే జోన్‌ను వైఎస్సార్‌ సీపీ సాధిస్తుందని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement