cbi enquiry
-
సీబీఐ విచారణ కోరే దమ్ముందా: కాకాణి సవాల్
సాక్షి,నెల్లూరు:సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి సీబీఐ విచారణ కోరే దమ్ముందా అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఇసుక అక్రమ రవాణాలో తనకు సంబంధం ఉందని నిరూపించే ధైర్యం సోమిరెడ్డికి ఉందా అని కాకాణి ప్రశ్నించారు.శనివారం(అక్టోబర్5) ఈ విషయమై కాకాణి మీడియాతో మాట్లాడారు.‘తాను చెప్పిన పనులు అధికారులు చెయ్యడం లేదనే ఫ్రస్టేషన్లో సోమిరెడ్డి ఉన్నారు.తాను చెప్పిన వారిని కేసుల్లో ఇరికించడం లేదని సోమిరెడ్డి బాధపడుతున్నారు.సోమిరెడ్డి బతుకు అంతా అవినీతిమయం.కేసులు,అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు. దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెడితే మా ప్రభుత్వం వచిన తర్వాత మంచంలో పడుకుని ఉన్నాలాక్కొస్తాం. నా పై చేస్తున్న అవినీతి ఆరోపణలలో ఒక్క దానినైనా రుజువు చెయ్యగలవా?నీకు దమ్ము దైర్యం ఉంటే నేను అవినీతి చేసినట్టు నిరూపించు. సూరాయి పాలేం ఇసుక రీచ్‌లో జరుగుతున్న తవ్వకాల మీద గ్రీన్ ట్రిబ్యునల్‌కి వెళ్తున్నాం. నీరు చెట్టులో జరిగిన అవినీతి మీద విచారణకి అదేశిస్తే అధికారుల ఉద్యోగాలు పోతాయని మానవత్వంతో వెనక్కి తగ్గాను. మైనింగ్ కాంట్రాక్టర్లతో చంద్రబాబు వద్దకు సోమిరెడ్డి వెళ్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు.సోమిరెడ్డి అవినీతి మీద విచారణ వేయాలి.ఆయన చేసిన అవినీతి బయటడుతుంది’అని కాకాణి అన్నారు. ఇదీ చదవండి: సిగ్గూ ఎగ్గూ లేకుండా కోర్టు తీర్పు వక్రీకరణ -
ఐఎంజీ భూములపై సీబీఐ విచారణకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ
హైదరాబాద్, సాక్షి: ఐఎంజీ అకాడెమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంజీబీపీఎల్)కు భూముల అక్రమ కేటాయింపుపై విచారణకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఐఎంజీకి కేటాయించిన భూములపై సీబీఐ విచారణ జరిపించాలన్న పిటిషన్లను బుధవారం హైకోర్టు కొట్టివేసింది. అక్రమాలు జరిగినట్లు సరైన అధారాలు లేవని హైకోర్టు తేల్చింది. 2004కు ముందే ఐఎంజీకి 850 ఎకరాలు భూమి కేటాయించినట్లు తెలిపింది.సెప్టెంబర్ 5వ తేదీన జరిగిన విచారణలో.. ఐఎంజీ భూముల ఆక్రమ కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సిద్ధంగా ఉన్నప్పుడు అనధికారిక ప్రతివాదులు (బిల్లీరావు, మాజీ మంత్రి పి.రాములు)కు అభ్యంతరమెందుకని హైకోర్టులో పిటిషనర్లు ప్రశ్నించారు. భూముల కేటాయింపు అక్రమమని ఇదే హైకోర్టు తేల్చిందని, అయితే ఆ అక్రమాలకు, అవినీతికి పాల్పడిన వారెవరో నిగ్గు తేల్చాల్సిన అవసరం కూడా ఉందని నొక్కి చెప్పారు. సీబీఐ విచారణ చేపడితే నిందితులుగా మారబోయే వారికి విచారణ వద్దు అని వాదించే హక్కు లేదని తేల్చిచెప్పారు. 12 ఏళ్ల క్రితం దాఖలైన ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాల్లో వాదనలు పూర్తి కావడంతో సీజే ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. తాజాగా తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్లను కొట్టివేసిట్లు రిజర్వు చేసిన తీర్పును వెల్లడించింది.‘హైదరాబాద్ పరిధిలో రూ.వేల కోట్ల విలువైన (ప్రస్తుత విలువ రూ.లక్ష కోట్లు) 850 ఎకరాల ప్రభుత్వ భూములను ఓ బోగస్ కంపెనీకి నాటి చంద్రబాబు ప్రభుత్వం కారుచౌకగా కేటాయించింది. ఆ కంపెనీకి రూ.వందల కోట్ల రాయితీలు ఇవ్వడమే కాకుండా హైదరాబాద్‌లోని క్రీడా స్టేడియంలు కూడా అప్పగించింది. దీని వెనుక చంద్రబాబు సర్కార్ పెద్దలు ఉన్నారు. బోగస్ కంపెనీకి ఇన్ని వందల ఎకరాలు, రూ.వందల కోట్లు ఎందుకు కేటాయించారు.. దీని వెనకున్న వారెవరో తేలాలంటే సీబీఐ విచారణకు ఆదేశించాలి..’అని కోరుతూ సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్, న్యాయవాది శ్రీరంగారావు తదితరుల తరఫు న్యాయవాదులు రఘునాథ్‌రావు, గాడిపల్లి మల్లారెడ్డి 2012లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
సందేశ్‌ఖాలీ కేసు: మమత సర్కారుకు సుప్రీంలో చుక్కెదురు
కోల్‌కతా: సందేశ్‌ఖాలీ లైంగిక వేధింపుల కేసులో పశ్చిమబెంగాల్లోని మమతాబెనర్జీ సర్కారుకు ఎదురు దెబ్బ తగిలింది. కేసు దర్యాప్తును హైకోర్టు సీబీఐకి ఇవ్వడాన్ని తప్పుపడుతూ మమత సర్కారు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం(జులై 8) కొట్టివేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘ఎవరినో కాపాడటానికి ప్రభుత్వానికి ఆసక్తి ఎందుకు. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం’అని బీఆర్ గవాయి, కేవీ విశ్వనాథన్ బెంచ్ వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పు రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని మొత్తం నిరుత్సాహపరిచిందని పేర్కొంటూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ స్థానిక మహిళలను లైంగిక వేధింపులకు గురిచేయడమే కాకుండా వారి భూములు కబ్జా చేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలతో అక్కడి మహిళలు ఒక ఉద్యమాన్నే నడిపారు. దీంతో షాజహాన్‌ను సీబీఐ, ఈడీ అరెస్టు చేశాయి. -
ముగిసిన కేజ్రీవాల్ సీబీఐ విచారణ.. ‘లిక్కర్ స్కామ్ అనేదే లేదు’
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సీబీఐ ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో కేజ్రీవాల్‌ను సుదీర్ఘంగా సీబీఐ అధికారులు విచారించారు. అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ సుమారు 9గంటల పాటు విచారించింది. అనంతరం, కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘సీబీఐ దాదాపు 9 గంటల పాటు నన్ను ప్రశ్నించింది. సీబీఐ అడిగిన 56 ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను. మద్యం కుంభకోణంలో అన్ని తప్పుడు ఆరోపణలతో రాజకీయం చేస్తున్నారు. ఆప్ 'కత్తర్ ఇమాందార్ పార్టీ'. ఆప్‌ని అంతం చేయాలనుకుంటున్నారు. కానీ, దేశ ప్రజలు మాతోనే ఉన్నారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు లిక్కర్ స్కామ్ అనేది లేదన్నారు కేజ్రీవాల్. కావాలనే ఇదంతా చేస్తున్నారని కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈ స్కామ్ అనేది కేవలం కల్పితం మాత్రమేనని కేజ్రీవాల్ అన్నారు. అయితే, లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి సమాచారాన్ని సేకరించే క్రమంలో కేజ్రీవాల్‌పై సీబీఐ అధికారులు ప్రశ్నలు వర్షం కురిపించారు. సాక్షిగానే కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సీసీ కెమెరా పర్యవేక్షణలో సీఆర్పీసీ 161 కింద కేజ్రీవాల్ స్టేట్మెంట్ను సైతం రికార్డు చేశారు. లిఖితపూర్వకంగా కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు సీబీఐ అధికారులు. కాగా, విచారణ సందర్బంగా మద్యం పాలసీ రూపకల్పన, సౌత్‌గేట్‌కు ప్రయోజనంపై ఆరా తీసినట్టు సమాచారం. Delhi | CBI questioning was conducted for 9.5 hours. I answered all the questions. The entire alleged liquor scam is false and bad politics. AAP is 'kattar imaandaar party'. They want to finish AAP but the country's people are with us: Delhi CM Arvind Kejriwal pic.twitter.com/dMG5C1TMGb — ANI (@ANI) April 16, 2023 అంతకుముందు.. కేజ్రీవాల్ విచారణ నేపథ్యంలో సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 1,000 మంది పోలీసులను మోహరించారు. ఆ ప్రాంతంవైపు ఎవరూ రాకుండా 144 సెక్షన్ విధించారు. సీబీఐ కార్యాలయం వద్దకు వెళ్లిన ఆప్ నేతలు రాఘవ్ చద్దా, సంజయ్ సింగ్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు నిరసనకు దిగారు. Delhi CM Arvind Kejriwal arrives at his residence from CBI office after nine hours of questioning in the liquor policy case. pic.twitter.com/Y8Plv570IQ — ANI (@ANI) April 16, 2023 -
వివేకా హత్య వెనక వారసత్వం పోరు ఉందనే ప్రచారం: అవినాష్ రెడ్డి
-
ఈ నెల 10న సీబీఐ విచారణకు హాజరవుతా : ఎంపీ అవినాష్ రెడ్డి
-
Custom Milling Rice: సీఎంఆర్‌పై సీబీ'ఐ'
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు, కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) అప్పగింతల్లో జరిగిన అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దృష్టి పెట్టింది. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అధికారుల సహకారంతో చాలా రాష్ట్రాల్లో రైస్ మిల్లర్లు, వ్యాపారులు, రాష్ట్ర అధికారులు కలిసి వ్యవస్థీకృత సిండికేట్ నడుపుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో సీబీఐ విచారణ చేపట్టి తనిఖీలు నిర్వహిస్తోంది. ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడటం, నాసిరకం బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించడం, నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలిచ్చి బియ్యం సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై ఇప్పటికే ఢిల్లీ, హరియాణా, పంజాబ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది. 74 మందిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసింది. ఇదే క్రమంలో త్వరలోనే తెలంగాణలోనూ ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు, సీఎంఆర్ అప్పగింతల్లో అవకతవకలపై దర్యాప్తుకు సీబీఐ రంగంలోకి దిగనున్నట్లు కేంద్రప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలోని అధికార బీఆర్ఎస్ నేతల అండతో మిల్లర్లు సీఎంఆర్ కేటాయింపుల విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నట్లుగా ఢిల్లీకి ఉప్పందినట్లు తెలిసింది. మిల్లర్లకు పౌరసరఫరాల శాఖ అధికారుల సంపూర్ణ సహకారం కూడా ఉందని భావిస్తున్న సీబీఐ ఆ దిశగా దర్యాప్తుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 4 రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో తనిఖీలు.. విశ్వసనీయ సమాచారం మేరకు.. ధాన్యం ఉత్పత్తి అధికంగా ఉండే పంజాబ్, హరియాణా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగినట్లు సీబీఐ గుర్తించింది. దీనితో పాటు సకాలంలో కేంద్రానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ ఇవ్వకుండా మిల్లర్లు ప్రైవేటుకు అమ్ముకోవడం, దీనికి కొందరు ఎఫ్‌సీఐ అధికారులతో పాటు ఆయా రాష్ట్రాల ఆహార, పౌరసరఫరాల శాఖల అధికారులు సహకరిస్తుండటాన్ని కూడా గుర్తించింది. సెంట్రల్ పూల్‌కు ఇచ్చే బియ్యంలో నాణ్యత లోపిస్తున్నా, ఎఫ్‌సీఐ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో వినియోగదారులకు నాణ్యత లేని బియ్యం సరఫరా అవుతున్నట్లు నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే మూడ్రోజుల కిందట ఢిల్లీ, పంజాబ్, హరియాణా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో సీబీఐ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఎఫ్‌సీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ రాజీవ్‌కుమార్ మిశ్రా సహా 74 మందిని అరెస్ట్ చేసింది. ఇందులో 37 మంది ఎఫ్‌సీఐ అధికారులు కాగా మిగతావారిలో మిల్లర్లు, దళారులు, గోదాముల నిర్వాహకులు ఉన్నారు. ఉత్పత్తి సామర్థ్యానికి మించి కొనుగోళ్లు మిశ్రా ఎఫ్‌సీఐ ప్రధాన కార్యాలయంలో పనిచేసిన సమయంలోనే తెలంగాణ, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో ఉత్పత్తి సామరŠాధ్యనికి మించి ధాన్యం కొనుగోళ్లు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. మిశ్రా చాలా రాష్ట్రాల మిల్లర్లతో కుమ్మక్కై, కేంద్రానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ కోటా గడువు పెంపునకు ఆదేశాలు ఇచ్చారని, ఈ క్రమంలో కోట్ల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు రాగా విచారణ జరుగుతోంది. తెలంగాణకు సంబంధించి ఎఫ్‌సీఐలో గతంలో పనిచేసిన ఓ అధికారి హయాంలో కూడా సీఎంఆర్ కోటా సేకరణ విషయంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే గత సంవత్సరం వానాకాలం, యాసంగి సీజన్ల సీఎంఆర్ గడువు దాటినా ఎఫ్‌సీఐకి అందకపోవడం, లెక్కల్లో తేడాలుండటం వంటి అంశాలు సీబీఐ దృష్టిలో ఉన్నట్లు చెబుతున్నారు. సీఎంఆర్ అప్పగింతలో అవకతవకలు రాష్ట్రంలో వానాకాలం, యాసంగి సీజన్లలో రైతులు పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తుంటుంది. సుమారు 3 వేల మిల్లుల ద్వారా ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, కేంద్ర ప్రభుత్వం సెంట్రల్‌పూల్ కింద ఇచ్చిన టార్గెట్‌కు అనుగుణంగా సీఎంఆర్‌ను ఎఫ్‌సీఐ గోడౌన్లకు పంపిస్తుంటుంది. అయితే మిల్లర్లు వ్యాపారమే లక్ష్యంగా రాజకీయ అండదండలతో అవకతవకలకు పాల్పడుతున్నారు. వచ్చిన ధాన్యాన్ని ఆరునెలల్లోగా మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి అప్పగించాల్సిన మిల్లర్లు ఆ తర్వాత రెండు, మూడు సీజన్లు గడిచినా అప్పగించడం లేదు. మిల్లుల్లోని నాణ్యమైన సర్కారు ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, ప్రైవేటు వ్యాపారులకు విక్రయించుకుంటున్నారని, ప్రజా పంపిణీ బియం కొని, రీసైక్లింగ్ చేసి లోటును భర్తీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆధారాలు సేకరించిన దర్యాప్తు సంస్థ! రాష్ట్రంలో ఉన్న సుమారు 3 వేల రైస్ మిల్లులకు గత మూడేళ్లుగా ప్రతి సీజన్లో సుమారు రూ.15 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని ప్రభుత్వం అప్పగించి, సీఎంఆర్ తీసుకుంటోంది. ధాన్యాన్ని మిల్లింగ్ చేసినందుకు లేబర్ ఖర్చుతో సహా ప్రతి పైసా మిల్లర్లకు చెల్లిస్తోంది. అయినా.. 33 జిల్లాల్లోని పలువురు పౌరసరఫరాల శాఖ అధికారుల అండతో మిల్లర్లు సర్కారు ధాన్యాన్ని సొంత వ్యాపారానికి వినియోగించుకుంటున్నట్టుగాసీబీఐ ఆధారాలు సేకరించినట్లు సమాచారం. 2019–20లో 118 మంది మిల్లర్లు రూ.230 కోట్ల విలువైన 1,00,427 మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి బకాయి పడగా, వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా సదరు మిల్లులకు మరోసారి సీఎంఆర్ గడువు పెంచడం అనుమానాలకు తావిచ్చింది. 2020–21లో కూడా వందల సంఖ్యలో మిల్లర్లు బకాయిలు పడగా వారిని డిఫాల్టర్లుగా ప్రకటించి, 2021–22 సీజన్లలో ధాన్యం కేటాయింపును నిలిపివేశారు. అయితే ఆ తర్వాత రాజకీయ జోక్యంతో సదరు మిల్లులకు కూడా యధాతథంగా ధాన్యం సరఫరా అయింది. గత మూడేళ్లుగా రాష్ట్రంలో ధాన్యం దిగుబడి గణనీయంగా పెరగ్గా.. పౌరసరఫరాల శాఖ అధికారుల అండతో సాగుతున్న అడ్డగోలు వ్యవహారాలన్నింటిపై సీబీఐ ప్రాథమికంగా సమాచారం సేకరించినట్లు తెలిసింది. ఇప్పటికీ పెండింగ్‌లో 2021–22 వానాకాలం బియ్యం రాష్ట్రంలో ప్రస్తుతం 2022–23 వానకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు సాగుతుండగా, మరో నెలలో కస్టమ్ మిల్లింగ్ ప్రారంభం కావలసి ఉంది. కానీ ఇప్పటికీ 2021–22 వానాకాలం సీజన్‌కు సంబంధించిన బియ్యం 8.65 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటీ) ఎఫ్‌సీఐకి రావలసి ఉండటం గమనార్హం. ఆ సీజన్లో 70.21 ఎల్ఎంటీల ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించగా, 47.04 ఎల్ఎంటీల బియ్యాన్ని సీఎంఆర్ కింద ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటికి పలుమార్లు గడువు పెంచినా ఎఫ్‌సీఐకి ఇచ్చిన బియ్యం 38.39 ఎల్‌ఎంటీలే. ఇక గత యాసంగి సీజన్‌కి సంబంధించి 50.39 ఎల్ఎంటీ ధాన్యం మిల్లులకు పంపించి, 34.07 ఎల్ఎంటీ సీఎంఆర్ తీసుకోవలసి ఉండగా, ఇప్పటివరకు కేవలం 16 ఎల్ఎంటీల బియ్యం మాత్రమే ఎఫ్‌సీఐకి అందింది. 2020–21 యాసంగి సీజన్‌కు సంబంధించి మిర్యాలగూడలోని వజ్ర పారాబాయిల్డ్ రైస్‌మిల్లు రూ.5.90 కోట్ల విలువైన బియ్యాన్ని ఎగవేయడంతో ఈ నెల 9న ఆ రైస్‌మిల్లు యజమానులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి కేసులు ప్రతి జిల్లాలో ఉన్నప్పటికీ అధికారుల అండతో అక్రమాలు యధేచ్చగా కొనసాగుతూనే ఉన్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. -
తెలంగాణ ఉద్యమంలో జాగృతి విశేషంగా కృషి చేసింది: కవిత
-
సీబీఐ విచారణ తర్వాత తొలిసారి స్పందించిన కవిత
సాక్షి, హైదరాబాద్: ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను అడ్డదారిలో బీజేపీ కూల్చేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. బీజేపీ అరాచకాల్ని అడిగేటోళ్లు ఎవరూ లేరని ఆమె మండిపడ్డారు. దీనిపై యువతలో చైతన్యం తీసుకు రావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబై విచారణ తర్వాత తొలిసారి కవిత స్పందించారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి విస్తృతస్థాయి సమావేశంలో సోమవారం మాట్లాడుతూ.. సిస్టమ్‌ను మనం కాపాడుకుంటే.. ఆ సిస్టమ్ మనల్ని కాపాడుతుందన్నారు. బీజేపీ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న వాళ్లను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. ‘తెలంగాణ ఆడబిడ్డ కళ్లల్లోంచి నీళ్లు రావు నిప్పులు వస్తాయి. ఎవరు మాట్లాడితే వాళ్లపై సీబీఐ వస్తోంది. దేశ వ్యాప్తంగా సీబీఐ దాడులు జరుతున్నాయి. నాపై కూడా జరుగుతున్నాయి. సీబీఐ దాడులకు భయపడేది లేదు’ అని కవిత మరోసారి స్పష్టం చేశారు. చదవండి: బీఆర్ఎస్ టికెట్ నాకే.. గెలిచేది నేనే: పట్నం సంచలన వ్యాఖ్యలు -
ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు.. విచారణకు రాను!: కవిత
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తన పేరు ఎక్కడా లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ‘సీబీఐ తన వెబ్సైట్లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ని క్షుణ్ణంగా పరిశీలించాను, అందులో పేర్కొన్న నిందితుల జాబితాను కూడా చూశాను. దానిలో నా పేరు ఎక్కడా లేని విషయాన్ని తెలియజేస్తున్నాను.’ అని పేర్కొన్నారు కవిత. సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత సీబీఐకి లేఖ రాసిన విషయం తెలిసిందే. దానికి స్పందించిన సీబీఐ అధికారులు ఈ-మెయిల్ ద్వారా సమాధానం ఇస్తూ ఎఫ్ఐఆర్ కాపీ వెబ్సైట్లో ఉందని సమాధానమిచ్చారు. దాంతో తాను ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నిందితుల పేర్లతో సహా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించానని, కానీ అందులో తన పేరు ఎక్కడా లేదని కల్వకుంట్ల కవిత సోమవారం ఉదయం సీబీఐ అధికారి రాఘవేంద్ర వస్తకు లేఖ రాశారు. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల ఈ నెల 6వ తేదీనా తాను సీబీఐ అధికారులను కలుసుకోలేనని సమాచారం ఇచ్చారు. ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో మీకు అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని తెలిపారు. తేదీని ఖరారు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తునకు సహకరిస్తానని ఎమ్మెల్సీ కవిత పునరుద్ఘాటించారు. దర్యాప్తునకు సహకరించడానికిగానూ పైన పేర్కొన్న తేదీల్లో ఒక రోజు సమావేశం అవుతానని లేఖలో తెలిపారు. ఇదీ చదవండి: సీబీఐ స్పందన తర్వాతే..! -
ఢిల్లీ లిక్కర్ స్కాం: కదులుతున్న డొంక
సాక్షి, ఢిల్లీ: సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో అరెస్టయిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్ విచారణ కొనసాగుతోంది. అభిషేక్ Abhishek Boinpally ఇచ్చిన సమాచారంతో.. ఈ కేసులో ఏ9 నిందితుడు, ఢిల్లీ వ్యాపారి అమిత్ అరోరాను సీబీఐ ప్రశ్నిస్తోంది. వాహలా రూపంలో నగదు బదిలీ జరిగినట్లు దర్యాప్తులో గుర్తించింది సీబీఐ. ఈ క్రమంలో.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సంకేతాలు అందుతున్నాయి. లిక్కర్ కుంభకోణంలో సీబీఐ ఇప్పటికే డాక్యుమెంటరీ ఆధారాలు సేకరించింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అనుచరుడిగా భావిస్తున్న అర్జున్ పాండేకు విజయ్ నాయర్ తరపున సమీర్ మహేంద్రు(సహ నిందితుడు) ముడుపులు అందించినట్టు సీబీఐ భావిస్తోంది. ఇందులో అభిషేక్ పాత్రను బ్యాంకు లావాదేవీలు, నిందితులతో జరిగిన సమావేశాల ద్వారా గుర్తించారు. కాగా అభిషేక్‌కు రాష్ట్రంలోని ప్రముఖ నేతలతో వాణిజ్యపరమైన లావాదేవీలున్నాయని సీబీఐ ప్రాథమిక విచారణలో గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. పెద్ద మొత్తంలో చేతులు మారిన ముడుపులు ఏ రాజకీయ ప్రముఖుడి నుంచి ఎవరికి వెళ్లాయనే అనే అంశంపై సీబీఐ దృష్టి పెట్టినట్లు తెలిసింది. అదే సమయంలో.. ఈ కుంభకోణంలో రాజకీయ ప్రముఖుల హస్తం ఉందనేది ఆరోపణలు వినవస్తున్నాయి. -
ఆప్ సర్కార్‌పై మరో దర్యాప్తు.. ‘బస్సుల’పై సీబీ‘ఐ’
న్యూఢిల్లీ: ఆప్ సర్కారుపై మరో దర్యాప్తుకు తెర లేచింది. ఢిల్లీలో 1,000 లో–ఫ్లోర్ బస్సుల కొనుగోలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారు. టెండరింగ్, బస్సుల కొనుగోలుకు ఢిల్లీ రవాణా కార్పొరేషన్(డీటీసీ) ఆధ్వర్యంలో వేసిన కమిటీకి రవాణా మంత్రిని చైర్మన్‌గా నియమించారు. ఇది ముందస్తు ఒప్పందంలో భాగంగానే జరిగిందని ఎల్జేకు ఫిర్యాదు అందింది. ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారిందని అందులో ఆరోపించారు. దీనిపై ఎల్జే వివరణ కోరగా అక్రమాలు నిజమేనని ఢిల్లీ చీఫ్ సెక్రెటరీ నివేదిక సమర్పించారు. ఎల్జే ఆదేశాల మేరకు సీబీఐ ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు చేపట్టింది. రెండు ఫిర్యాదులను కలిపి సీబీఐ విచారించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అంగీకరించారు. బస్సుల కొనుగోలులో అవినీతి జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. కేజ్రీవాల్, అవినీతి.. పర్యాయపదాలు: బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అవినీతి అనేవి పర్యాయపదాలుగా మారిపోయాయని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. సీఎం పదవిలో ఇంకా కొనసాగే అర్హత కేజ్రీవాల్‌కు ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పారు. భాటియా ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో ప్రతి విభాగం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. కేజ్రీవాల్ మిత్రులకు లబ్ధి చేకూరేలా కాంట్రాక్టులు, టెండర్లు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. నిన్న ఎక్సైజ్ పాలసీలో, ఇప్పుడు బస్సుల కొనుగోలులో అవినీతి బయటపడిందని చెప్పారు. కేజ్రీవాల్ కరడుగట్టిన నిజాయతీపరుడు కాదు, కరడుగట్టిన అవినీతిపరుడని ప్రజలు భావిస్తున్నారని భాటియా వ్యాఖ్యానించారు. బస్సుల కొనుగోలు విషయంలో ‘ఆప్’ సర్కారు కేవలం కొన్ని కంపెనీలకు లాభం కలిగేలా టెండర్ నిబంధనలను, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను ఉల్లంఘించిందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా విమర్శించారు. ఇదీ చదవండి: డిగ్రీ పరీక్షలు రాయనున్న ప్రధాని మోదీ, ఎంఎస్ ధోని! -
‘చిత్తశుద్ధితో అత్యాచార నిందితుల్ని పట్టుకోండి’
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసును సీబీఐకి అప్పగించాలని.. నిందితులు ఏ మూల దాగి ఉన్నా అరెస్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీజేపీ ఎంపీ సోయం బాపూరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, మజ్లిస్ నేతల అరాచకాలు, అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతోందని పేర్కొన్నారు. కొంత కాలంగా రాష్ట్రంలో ఎక్కడ హత్యలు, అఘాయిత్యాలు జరిగినా అందులో టీఆర్ఎస్ నేతల హస్తం ఉంటోందని ఆరోపించారు. మంథనిలో లాయర్ వామన్ రావు హత్య, కొత్తగూడెంలో వనమా రాఘవేంద్ర ఆగడాలకు పిల్లలతో సహా కుటుంబం ఆత్మహత్య, ఖమ్మంలో టీఆర్ఎస్ నేతల వేధింపులు తాళలేక బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య, సూర్యాపేట జిల్లా కోదాడలో పేదింటి ఆడబిడ్డపై టీఆర్ఎస్ నేతల గ్యాంగ్ రేప్, రామాయంపేటలో టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ వేధింపులు తాళలేక తల్లీ కొడుకు లాడ్జిలో ఆత్మహత్య, నిర్మల్‌లో బాలికపై టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ అత్యాచారం వంటి సంఘటనలు కోకొల్లలని పేర్కొన్నారు. -
న్యాయపరంగా పోరాటం
సాక్షి, హైదరాబాద్: బాలికపై సామూహిక అత్యాచారం ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ముందుకు రాకుంటే.. బాధితులకు న్యాయం జరిగేదాకా న్యాయపరంగా బీజేపీ పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖలో కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య, డ్రగ్స్ సహా ఎనిమిదేళ్లుగా సాగుతున్న అనేక ఘటనలపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలన్నారు. పబ్బులను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. అత్యాచారం ఘటనపై ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు నిందితులకు అండగా నిలబడుతున్నట్లు స్పష్టమౌతుందని చెప్పారు. ఇందులో రాష్ట్ర హోంమంత్రి మనవడు, ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్‌బోర్డు చైర్మన్ కుమారుడు, టీఆర్ఎస్ నాయకుల కుటుంబసభ్యుల ప్రమేయం ఉందని వెల్లడించారు. దీంతో పోలీసులు నిష్పాక్షిక విచారణ జరుపుతారనే నమ్మకం ప్రజలకు లేదన్నారు. అధికార పార్టీ పెద్దలు, ఎంఐఎం నేతల కుటుంబసభ్యులను కేసు నుంచి తప్పించడానికి సీసీ ఫుటేజీను, ఇతర ఆధారాలను తారుమారు చేసి కేసును పక్కదారి పట్టించేందుకు పోలీస్‌శాఖ శతవిధాలా ప్రయత్నిస్తోందని బండి ఆరోపించారు. -
సీబీఐ విచారణ చేయాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో బాలికపై అత్యాచార ఘటన దారుణమని, రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పా యని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని, పూర్తిస్థాయి విచారణను సీబీఐకి అప్పగిం చాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అను బంధ ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిం చేందుకు ప్రయత్నించారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు నిష్పక్షపాతంగా లేదని మండిపడ్డారు. బాధితురాలికి న్యాయం జరిగేవరకు పోరాడుతామని ప్రకటించారు. సర్కారు తీరుతో డ్రగ్, పబ్ కల్చర్ టీఆర్ఎస్కు భజన చేసే వారికి పబ్‌ల అను మతి ఇస్తున్నారని.. పబ్ లైసెన్సులను ని యంత్రించకపోవడం వల్లనే రాష్ట్రంలో దారు ణ ఘటనలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన మీడియా తో మాట్లాడారు. పబ్‌లోకి మైనర్లను ఎలా అనుమతించారని నిలదీశారు. డ్రగ్స్‌ను నియంత్రించలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఈ ఘటనకు బాధ్యత వహించాలన్నారు. ‘మద్యాన్ని ఆదాయవనరుగా ప్రభుత్వం చూడటం వల్లనే రాష్ట్రంలో నేరాల రేటు పెరుగుతోంది. బాలిక తల్లిదండ్రులు ధైర్యం గా ఫిర్యాదు చేసినా.. పోలీసుశాఖ ఎందుకు భయపడుతుందో అర్థం కావడం లేదు’ అని పేర్కొన్నారు. కాగా.. నేరాల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని శ్రీధర్‌బాబు మండిపడ్డారు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించడం ద్వారా ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కలిగేలా చూడాలని పేర్కొన్నారు. డీజీపీ కార్యాలయ ముట్టడికి యత్నం రొమేనియా బాలికపై రేప్ ఘటనను నిర సిస్తూ, దోషులను కఠినంగా శిక్షించాలంటూ కాంగ్రెస్ అనుబంధ సంఘాలు ఎన్ఎస్ యూఐ, యూత్, మహిళా కాంగ్రెస్‌ల ఆధ్వ ర్యంలో శనివారం డీజీపీ కార్యాలయ ముట్ట డి చేపట్టారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్య క్షుడు బల్మూరి వెంకట్, హైదరాబాద్ యువ జన కాంగ్రెస్ కమిటీ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుల నేతృత్వంలో నేతలు, కార్యకర్తలు డీజీపీ కార్యాలయం వైపు దూసుకువచ్చారు. పోలీసులు ఆందోళ నకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు అనంతరం వెంకట్, సునీతారావు మీడియా తో మాట్లాడారు. బాలికపై అత్యాచారం విష యంలో రాజకీయ డ్రామా నడుస్తోందని వెంకట్ మండిపడ్డారు. రాష్ట్రంలో షీటీమ్స్ ఏం చేస్తున్నాయని సునీతారావు ప్రశ్నించా రు. పోలీసులకు గాజులు, చీరలు పంపిస్తా మని, వాటిని వేసుకుని ఇంట్లో కూర్చోవాల న్నారు. మరోవైపు యూత్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు శనివారం రాత్రి అమ్నీషియా పబ్ వద్ద ధర్నాకు దిగారు. పబ్‌ను సీజ్ చేయాలంటూ ఆందోళన చేశారు. -
‘మెడికల్ పీజీ సీట్ల దందాపై సీబీఐ విచారణకు చర్యలు తీసుకోండి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న మెడికల్ పీజీ సీట్ల బ్లాక్ దందాపై సీబీఐతో విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసైని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోరారు. ఈ కుంభకోణంలో టీఆర్ఎస్ మంత్రుల ప్రమేయం ఉన్నందున సాధారణ పోలీసులకు ఫిర్యాదు చేసి ఆషామాషీ విచారణ చేస్తే నిగ్గు తేలదని, ఆలస్యం చేయకుండా సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. ఈ మేరకు గవర్నర్‌కు రేవంత్ శనివారం బహిరంగ లేఖ రాశారు. ‘పీజీ వైద్య విద్య సీట్ల బ్లాక్ దందాపై పేద, మధ్య తరగతి విద్యార్థులు వారం రోజులుగా రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి లాంటి నేతలు ప్రైవేటు కళాశాలలు, వర్సిటీలను నిర్వహిస్తూ ఈ బ్లాక్ దందాలకు పాల్పడుతున్నట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఉత్తరాదికి చెందిన వారిని మెరిట్ కోటాలో ప్రైవేటు కళాశాలల్లో మెడికల్ పీజీ సీట్ల కోసం దరఖాస్తు చేయించి, తర్వాత ఆ సీటును బ్లాక్‌లో రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్లకు అమ్ముకుంటున్నారని తెలుస్తోంది. స్వయంగా మంత్రులకు చెందిన కాలేజీలే దందా చేస్తుంటే సాధారణ పోలీసు విచారణతో న్యాయం జరుగుతుందని విశ్వసించగలమా? ఈ దందాపై కఠిన వైఖరి ప్రదర్శించాలి’అని రేవంత్ కోరారు. -
రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారంపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అది అంత ముఖ్యమైన విషయమా? అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. అరెస్ట్‌పై సీబీఐతో విచారణ చేయించాలంటూ దాఖలైన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం ఇలా స్పందించింది. ఇదంతా ముఖ్యమైన విషయమా ? అని ప్రశ్నించిన సుప్రీం కోర్టు.. ముఖ్యమైన విషయం ఉంటే రాత్రి 8 గంటలకు కూడా విచారణ చేపడతాం కదా అని నొక్కి చెప్పింది. ఇప్పటికే 11 నెలలు గడిచింది కదా అని పిటిషనర్ తరపు న్యాయవాదికి గుర్తు చేసింది ధర్మాసనం. ఇదిలా ఉండగా.. రఘురామకృష్ణరాజు అరెస్ట్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలంటూ ఆయన తనయుడు భరత్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై రెండు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు పంపింది. దానికి మరో రెండు వారాల్లో దానికి సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది సుప్రీం కోర్టు. -
బత్రాపై సీబీఐ దర్యాప్తు.. కారణమేంటి?
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్ఐ)లో నరీందర్ బత్రా నిధుల దుర్వినియోగానికి సంబంధించి కేంద్రీయ దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రాథమిక విచారణ చేపట్టింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ), అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) అధ్యక్షుడైన నరీందర్ బత్రా.. హెచ్‌ఐకి చెందిన రూ. 35 లక్షలను వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐకి హెచ్ఐ ఫిర్యాదు చేయడంతో ప్రాథమిక విచారణ నిమిత్తం కేసు రిజిస్టర్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల నరీందర్ బత్రాకు హాకీ ఇండియాకు మధ్య విబేధాలు పొడసూపాయి. భారత పురుషుల హాకీ జట్టు ప్రదర్శనపై పదేపదే బత్రా విమర్శించడం, ప్రశ్నించడం మింగుడుపడని హెచ్ఐ తమ నిధులు, విధుల్లో జోక్యం చేసుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది. 1975 ప్రపంచకప్ హాకీ విజేత జట్టు సభ్యుడైన అస్లామ్ షేర్‌ఖాన్... బత్రా మితిమీరిన జోక్యంపై ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. చదవండి: IPL 2022: కమిన్స్ కమాల్.. ముంబై ఢమాల్.. తిలక్ కొట్టిన సిక్సర్ మాత్రం హైలైట్! -
‘రఘురామకృష్ణంరాజుపై సీబీఐ విచారణ చేయొచ్చు’
సాక్షి, హైదరాబాద్: ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వైఎస్సార్సీపీ ఎంపీ, ఇండ్–భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ డైరెక్టర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, ఆయన భార్య రమాదేవి, కుమార్తె కె.ఇందిరా ప్రియదర్శినిపై బ్యాంకులను మోసం చేశారంటూ వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. రుణాలు చెల్లించని కంపెనీల బ్యాంకు ఖాతాలను మోసపూరితంగా ప్రకటించాలన్న ఆర్బీఐ సర్క్యులర్ నేపథ్యంలో తమ కంపెనీల ఖాతాలను మోసపూరితంగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఇండ్–భారత్‌తోపాటు, రాజు, ఆయన భార్య, కుమార్తె దాఖలు చేసుకున్న పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం శుక్రవారం విచారించింది. సదరు కంపెనీలకు నోటీసు ఇవ్వకుండా, వారి వివరణ తీసుకోకుం డా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ ఉత్తర్వులను నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పొడిగించింది. ఈ ఉత్తర్వులు సీబీఐ దర్యాప్తునకు అడ్డుకావని స్పష్టం చేసింది. రుణంగా తీసుకున్న రూ.30.94 కోట్లు చెల్లించకపోవడంతో ఎస్బీఎస్, ఐఓబీ, యాక్సిస్, సిండికేట్, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, బరోడా బ్యాంక్.. ఇండ్–భారత్ కంపెనీ బ్యాం కు ఖాతాలను మోసపూరితంగా ప్రకటించాయి. మరో కేసులో ఆర్బీఐ సర్క్యులర్‌ను తప్పుబడుతూ ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైందని తెలిపారు. వాదనల అనంతరం తదుపరి విచారణను జూలై 16 కి వాయిదా వేసింది. -
అర్నబ్ కేసు: సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో అరెస్టయిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి సుప్రీం తలుపు తట్టారు. అక్రమంగా అరెస్టు చేసి తనను వేధిస్తున్నారని, అవసరమనుకుంటే ఈ కేసును సీబీఐతో విచారణ చేయించేందుకు ఆదేశించాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. బాంబే హైకోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరణనూ ఆయన సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. అర్నబ్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తూ.. ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసు దర్యాప్తు చట్ట విరుద్ధంగా సాగుతోందని అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్, ఇందిరా బెనర్జీల బెంచ్ స్పందిస్తూ.. ‘టీవీ చానెల్స్ అరుపులను ప్రభుత్వాలు పట్టించుకుంటే ఎలా? రిపబ్లిక్ టీవీలో అతని అరుపులపై మీ ఎన్నికల భవిష్యత్ ఆధారపడిందా? మేం ఆ టీవీ చూడం.. కానీ, మహారాష్ట్ర సర్కార్ చేసింది సరైనదిగా అనిపించడం లేదు. వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వాలు కత్తి దూస్తే మేమున్నామని గుర్తుంచుకోండి’అని సుప్రీం బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే, సదరు జర్నలిస్టుపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మాత్రమే పరిశీలిస్తామని స్పష్టం చేసింది. అర్నబ్ తరపు న్యాయవాది సాల్వే మాట్లాడుతూ.. తమ కేసు ఎఫ్ఐఆర్ దశ దాటిపోయిందని, దర్వాప్తు జరిగిన తర్వాతే మే, 2018లో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలిపారు. ఇక ఈ కేసు పునర్ దర్వాప్తు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారం దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. కాగా, ఈ కేసులో గత బుధవారం అరెస్టై జైలులో ఉన్న అర్నబ్‌కు నవంబర్ 18 వరకు రాయిగఢ్ జిల్లా కోర్టు జ్యుడిషియల్ కస్టడి విధించింది. ఇక మధ్యంతర బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. 2018లో మూసివేసిన ఆత్మహత్య కేసును మళ్లీ తవ్వారనేది అర్నాబ్ గోస్వామి వాదన. -
'అమరావతి కుంభకోణం దేశంలోనే అతిపెద్దది'
-
'అమరావతి కుంభకోణం దేశంలోనే అతిపెద్దది'
సాక్షి, తాడేపల్లి: అమరావతి కుంభకోణం దేశంలోనే అతిపెద్దది అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 'అమరావతి పెద్ద స్కామ్ అని మేము ముందునుంచి చెప్తున్నాం. బినామీ పేర్లతో 4 వేల 69 ఎకరాలు కొనుగోలు చేశారు. ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. త్వరలోనే ఈ భారీ కుంభకోణంలో ఆశ్చర్యకర విషయాలు బయటకి రాబోతున్నాయి. చట్టాలను, బౌండరీలను మార్చి అక్రమాలకు పాల్పడ్డారు. (టీడీపీ బాత్రూంలను కూడా వదల్లేదు: సోము వీర్రాజు) ఈ స్కామ్‌పై సీబీఐ విచారణ వెయ్యమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. మీరు తప్పు చెయ్యకపోతే సీబీఐ వెయ్యమని కేంద్రాన్ని కోరండి. తప్పు చేశారు కనుకే చంద్రబాబు సీబీఐ విచారణ కోరడం లేదు. ఫైబర్ గ్రిడ్ పేరుతో లోకేష్ బినామీలకు టెండర్లు ఇచ్చి 2 వేల కోట్ల స్కామ్‌కు పాల్పడ్డారు. ఈ రెండు అంశాలపై బీజేపీ కూడా సీబీఐ విచారణ కోరాలి. 24 గంటల్లో సీబీఐ విచారణ కోరకపోతే తప్పు చేసినట్టే. డీజీపీపై హైకోర్ట్ వ్యాఖ్యలు దురదృష్టకరం. న్యాయస్థానలపై మాకు గౌరవం ఉంది. హైకోర్టులో కామెంట్స్‌పై సమాధానం చెప్పలేము. ఆర్డర్‌పై మాత్రమే సమాధానం చెప్పగలం' అని అంబటి పేర్కొన్నారు. (రాజధాని అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి) -
కీసర ఎమ్మార్వో కేసులో కలెక్టర్ హస్తం..!
-
అప్పుడే అందరికీ ప్రశాంతత: సుశాంత్ సోదరి
పట్నా: తన సోదరుడి మృతి కేసులో నిష్పాక్షిక విచారణ జరిపించాలని బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి శ్వేతాసింగ్ కీర్తి గురువారం డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. జాతి మొత్తం ఏకతాటిపైకి వచ్చి సుశాంత్ మృతి కేసులో సీబీఐ ఎంక్వైరీ కోసం డిమాండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషాదకర ఘటనకు సంబంధించి వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రతీ ఒక్కరికి హక్కు ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం శ్వేతా సింగ్ ట్విటర్లో ఓ వీడియో షేర్ చేశారు. సుశాంత్ మరణానికి సంబంధించి నిజాలు తెలుసుకోవడానికే తప్ప మరేదో ఆశించి తాము సీబీఐ విచారణ కోరలేదని స్పష్టం చేశారు. ఈ విషయం గురించి వాస్తవాలు బయటపడినపుడే సుశాంత్ అభిమానులు, శ్రేయోలాభిలాషులు ప్రశాంత జీవితం గడిపే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు.(ముంబై పోలీసులపై పూర్తి నమ్మకం: పవార్) కాగా జూన్ 14న సుశాంత్ సింగ్ ముంబైలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అనేక మలుపుల అనంతరం అతడి ప్రేయసిగా ప్రచారంలో ఉన్న నటి రియా చక్రవర్తిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆమెపై సుశాంత్ కుటుంబ సభ్యులు బిహార్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రియా డబ్బు తీసుకుని సుశాంత్‌ను మోసం చేసిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సుశాంత్ మృతి కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించాల్సిందిగా బిహార్ సర్కారు కేంద్రాన్ని కోరడంతో సానుకూల స్పందన వచ్చింది.(మా కుటుంబ ప్రతిష్టను దెబ్బతీశారు) అయితే ఈ విషయంపై మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరు రాష్ట్రాల మధ్య కోల్డ్‌వార్ మొదలైంది. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విచారణ కొనసాగుతుండగా.. ఇప్పటికే పలుమార్లు ఈడీ ఎదుట హాజరైన రియా చక్రవర్తి సుశాంత్ కుటుంబ సభ్యులపై పలు ఆరోపణలు చేస్తూ.. కొన్ని వాట్సాప్ చాట్ల స్క్రీన్షాట్లు బహిర్గతం చేయడంతో ఇరు వర్గాల మధ్య వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో శ్వేత ఈ మేరకు వీడియో విడుదల చేయడం గమనార్హం. ఇక తాను దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉండగా సీబీఐ విచారణ ప్రారంభించడం సరికాదంటూ రియా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.(‘సుశాంత్ సోదరి నన్ను వేధించారు’) -
సుశాంత్ కేసులో కీలక మలుపు : రియాకు షాక్
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసుపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తునకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ కోరుతూ బిహార్ ప్రభుత్వం చేసిన సిఫారసును కేంద్రం అంగీకరించిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ కేసును పట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలంటూ రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంలో విచారణ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. (సుశాంత్ మరణం : షాకింగ్ వీడియో ) ఈ సంఘటన మొత్తం ముంబైలో జరిగిందని, సుశాంత్ మరణించిన వెంటనే, ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించి 56 మందిని ప్రశ్నించారని రియా న్యాయవాది శ్యామ్ దివాన్ వాదించారు. కాబట్టి దర్యాప్తు బాధ్యత ముంబై పోలీసులదేనని సుప్రీంకు తెలిపారు. అయితే ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినప్పటికీ చాలా సాక్ష్యాలు మాయమయ్యాయని సుశాంత్ తండ్రి న్యాయవాది వికాస్ సింగ్ అన్నారు. దర్యాప్తులో ముంబై పోలీసులు బిహార్ పోలీసులకు సహకరించడం లేదని వాదించారు. (వాళ్లతో స్నేహం చేయడం నేరమా: ఆదిత్య ఠాక్రే) ఈ వాదనలపై స్పందించిన సుప్రీంకోర్టు ఇది హై ఫ్రొఫైల్ కేసు...ప్రతిభావంతుడైన కళాకారుడు (సుశాంత్) అనుమానాస్పద పరిస్థితిలో మరణించారు. ఈ కేసులో నిజానిజాలు బయటికి రావాలని వ్యాఖ్యానించింది. అంతేకాదు బిహార్ పోలీసు అధికారిని క్వారంటైన్ చేయడం మంచి సంకేతం కాదని పేర్కొంది. దీనిపై ఇప్పటివరకు జరిపిన దర్యాప్తుపై స్టేటస్ రిపోర్ట్ మూడు రోజుల్లో సమర్పించాలని ముంబై పోలీసులను ఆదేశించింది. సుశాంత్ తండ్రి తరఫున బిహార్ ప్రభుత్వ మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వికాస్ సింగ్ హాజరయ్యారు. (సుశాంత్ కేసు : మరో వివాదం) కాగా సుశాంత్ ఆత్మహత్యకు మాజీ ప్రియురాలు రియా కారణమంటూ సుశాంత్ తండ్రి కృష్ణకిషోర్ సింగ్ ఆరోపించారు. ఆయన ఫిర్యాదు మేరకు పట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్లో రియాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై సీబీఐ దర్యాప్తు కావాలని కూడా ఆయన కోరారు. అటు సుశాంత్ తండ్రి అభ్యర్థన మేరకు ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ కేంద్రానికి బిహార్ సీఎం నితీశ్ కుమార్ సిఫారసు చేశారు. దీనికి తోడు సీబీఐ దర్యాప్తు కోరుతూ బీజేపీ నేత, ప్రముఖ న్యాయవాది అజయ్ అగర్వాల్, ముంబైకి చెందిన న్యాయశాస్త్ర విద్యార్ధి ద్వివేంద్ర దేవ్‌తాదీన్ దూబే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
డాక్టర్ సుధాకర్ వ్యవహార శైలిపై సీపీ ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: అనస్థీషియా డాక్టర్ సుధాకర్ వ్యవహార శైలిపై విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హైకోర్టులో విచారణలో ఉన్న కేసును సీబీఐకు అప్పగించామన్నారు. డాక్టర్ సుధాకర్ కేసుకు సంబంధించి ఫైల్, స్వాధీనం చేసుకున్న ప్రొపర్టీ మొత్తాన్ని సీబీఐకు అప్పగించామన్నారు. సుధాకర్‌కు స్థానిక పోలీసు స్టేషన్‌కు ఎలాంటి సంబంధం లేదని, హైకోర్ట్ ఆదేశాలను తాము పాటిస్తున్నామన్నారు. హైకోర్టు తీర్పుపై సుధాకర్‌కు గౌరవం లేదా అని, సీబీఐ విచారణ మీద నమ్మకం లేదా అని ఆర్కే మీనా ప్రశ్నించారు. (డాక్టర్ సుధాకర్‌పై 3 సెక్షన్ల కింద సీబీఐ కేసు) సీబీఐ విచారణ జరుగుతున్నప్పుడు స్థానిక పోలీసు స్టేషన్ ముందు సుధాకర్ మీడియా సమావేశం పెట్టడమేంటని వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడే ముందు సుధాకర్ రాజకీయ నాయకులను సంప్రదించి వస్తున్నారని, స్థానిక పోలీసులపై లేనిపోని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ఇది పోలీసులకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలా ఉందని, సుధాకర్ తీరుపై సీబీఐకు ఫాక్స్ ద్వారా తెలియజేస్తామన్నారు. సీబీఐ కూడా సుధాకర్ ఎవరెవరిని సంప్రదిస్తూన్నారో, అతని వెనక ఉన్న వారెవరో ధృవీకరించాలన్నారు. (ఎన్ఐఆర్ఎఫ్-2020; టాప్‌లో ఐఐటీ మద్రాస్) -
యరపతినేని అక్రమ మైనింగ్‌పై సీబీఐ విచారణ
-
సీబీఐకి పచ్చజెండా
సాక్షి, అమరావతి: పారదర్శక పాలన అందించే దిశగా అడుగులు వేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. తప్పు చేయనప్పుడు ఎవరికైనా ఎందుకు భయపడాలన్న ధీమాతో రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస (ఏసీబీ) ప్రవేశానికి అనుమతించింది. ఇప్పటికే కాంట్రాక్టుల్లో అక్రమాలకు చెల్లుచీటి రాసేలా సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్‌కమిషన్ ఏర్పాటుకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌ను కలిసి విన్నవించిన సంగతి తెలిసిందే. టెండర్లలో సంస్కరణలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేకుండా న్యాయ వ్యవస్థ చేతికే టెండరింగ్ విధానం అప్పగించాలనే నిర్ణయించారు. అవకతవకలు జరిగిన కాంట్రాక్టులను రద్దు చేసి, రివర్స్ టెండరింగ్ ద్వారా సరికొత్త ఒరవడికి తెరలేపారు. నీతివంతమైన పాలన అందించడమే లక్ష్యంగా అమలు చేస్తున్న నిర్ణయాల్లో భాగంగా రాష్ట్రంలోకి సీబీఐ రావడానికి ఉన్న అడ్డంకులను తొలగించారు. జగన్ నిర్ణయం పట్ల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) పునరాగమనానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సీబీఐకి సాధారణ సమ్మతిని(జనరల్ కన్సెంట్) పునరుద్ధరిస్తూ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ సోదాలు చేపట్టే అధికారాన్ని నిరాకరిస్తూ 2018 నవంబర్ 8న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. తన అవినీతి, అక్రమాలు బయట పడతాయన్న భయంతోనే సీబీఐకి చంద్రబాబు అనుమతి నిరాకరించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతకు ముందు ఇచ్చిన సమ్మతి నోటిఫికేషన్‌ను చంద్రబాబు ప్రభుత్వం విత్ డ్రా చేసుకుంటూ జీవో 176ను జారీ చేసింది. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా చంద్రబాబు వెనక్కి తగ్గలేదు. ఇక సీబీఐ విచారణకు మార్గం సుగమం ఢిల్లీ మినహా ఇతర రాష్ట్రాల్లో సీబీఐ తన అధికారాలను వినియోగించుకోవాలంటే ఆయా రాష్ట్రాలు సాధారణ సమ్మతి తెలపాల్సి ఉంటుంది. జనరల్ కన్సెంట్ లేకుంటే రాష్ట్రంలో పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను విచారించడానికి కూడా సీబీఐకి అధికారం ఉండదు. దాంతో రాష్ట్రంలో పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై కూడా రాష్ట్ర అవినీతి నిరోధక శాఖనే(ఏసీబీ) దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రామేశ్వర్‌పై రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఏసీబీ దాడి చేసి, కేసు నమోదు చేసింది. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టకుండా అడ్డుకుంటూ చంద్రబాబు సర్కారు జారీ చేసిన జీవో నం.176ను రద్దు చేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం గురువారం జీవో నం.81ని జారీ చేసింది. దీంతో ఏపీలో అవినీతికి సంబంధించిన కేసుల విచారణకు సీబీఐకి మార్గం సుగమమైంది. పారదర్శక పాలన దిశగా బలమైన సంకేతాలు ఇచ్చినట్టు అయ్యింది. జగన్‌పై హత్యాయత్నం కుట్ర బయటపడకుండా పన్నాగం వైఎస్ జగన్‌పై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం వెనుక ఉన్న కుట్ర కోణం వెలుగు చూడకుండా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. రాష్ట్ర పోలీసులతోనే తూతూమంత్రంగా దర్యాప్తు చేయించి, కేసును మూసివేసేందుకు తాపత్రయపడింది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తే అసలు కుట్రదారులు బయటపడే అవకాశం ఉన్నా టీడీపీ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఈ హత్యాయత్నంలో ప్రభుత్వ పెద్దల కుట్ర ఉందని, కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. దీంతో కంగారు పడిన చంద్రబాబు సర్కారు ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రంలోకి సీబీఐకి నో ఎంట్రీ అంటూ నవంబర్ 8న జీవో జారీ చేసింది. సీబీఐ అంటే బాబుకు వణుకు కేంద్ర హోంశాఖ పరిధిలోని సీబీఐకి ఏ రాష్ట్రంలోనైనా కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేసే హక్కు ఉంటుంది. రాష్ట్రంలోని సంస్థలు అయితే తన చెప్పుచేతల్లో ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదని, అదే కేంద్ర దర్యాప్తు సంస్థలైతే తనకు కష్టాలు తప్పవని గ్రహించిన చంద్రబాబు ప్రభుత్వం సీబీఐకి ఎర్రజెండా చూపింది. గత ఐదేళ్లలో చంద్రబాబు, ఆయన కోటరీలోని టీడీపీ నేతలు అధికారమే అండగా సాగించిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అక్రమాలు జరిగాయని, పట్టిసీమ పేరుతో నిధుల ఎత్తిపోతలపైనా విచారణ జరిగితే చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్, అప్పటి జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దొరికిపోయే ప్రమాదం ఉందన్న భయంతోనే సీబీఐ రాకుండా అడ్డుకట్ట వేశారన్న విమర్శలు వచ్చాయి. రాజధాని నిర్మాణం పేరుతో అక్రమాలు, సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి ప్రవాహం, విశాఖపట్నంలో భూ కుంభకోణాలు, ఓటుకు కోట్లు కేసు, ఇసుక మాఫియా, నీరు–మట్టి కుంభకోణం వంటి వ్యవహారాల్లో సీబీఐ జోక్యం చేసుకుంటే టీడీపీ పెద్దల మెడకు ఉచ్చు బిగుసుకుంటుందనే భయంతోనే జీవో 176 జారీకి అప్పటి చంద్రబాబు సర్కారు సాహసించిందనే విమర్శలు ఉన్నాయి. -
వివేకా మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సిట్‌తో కాకుం డా సీబీఐతో విచారణ చేయించాలని కోరారు. మాలలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి పార్లమెంట్ సీట్ల కేటాయింపుల్లో మాల సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మాలమహానాడు డిమాండ్ చేసింది. -
సీబీఐ విచారణ ద్వారానే న్యాయం జరుగుతుంది
-
హత్య చేస్తుంటే ఎవరైనా లెటర్ రాస్తారా?
సాక్షి, హైదరాబాద్ : తన చిన్నాన్న, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి డిమాండ్ చేశారు. ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమేయం లేకుంటే ఎందుకు సీబీఐ విచారణకు భయపడుతున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. వైఎస్ జగన్ శనివారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో పాటు, రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల అంశంపై గవర్నర్ నరసింహన్‌కు వైఎస్ జగన్ ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘నిన్న అత్యంత దారుణంగా జరిగిన చిన్నాన్న హత్య అంశం మీద న్యాయం జరగాలంటే, అది సీబీఐ విచారణ ద్వారానే జరుగుతుంది. చంద్రబాబు నాయుడుకు రిపోర్టు చేసే అధికారుల చేత విచారణ చేయిస్తే మాకు ఏ రకంగా న్యాయం జరుగుతుందని గవర్నర్‌కు వివరించడం జరిగింది. నిన్న పులివెందులలో మేము ఎస్పీతో మాట్లాడుతూ ఉండగానే, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ ఏబీ వెంకటేశ్వరరావు ఫోన్ చేశారు. దీన్ని బట్టి చూస్తే ఈ కేసును ఆయన ఎంత లోతుగామానిటర్ చేస్తున్నారనే దానికి నిదర్శం. ఈ హత్య కేసులో అడిషనల్ డీజీ పాత్ర ఉంది. పోలీస్ వ్యవస్థ ప్రభుత్వానికి తొత్తుగా మారింది. చంద్రబాబు మా ఎమ్మెల్యేలను 20, 30 కోట్లతో ప్రలోభాలకు గురిచేస్తే... అంతకు ముందు వాళ్లతో... ఇదే వెంకటేశ్వరరావు, ఏబీఎన్ రాధాకృష్ణ మాట్లాడి డబ్బులిచ్చి, టీడీపీ కండువాలు కప్పారు. టీడీపీకి వాచ్మెన్ డిపార్ట్మెంట్గా.. ఇదే వెంకటేశ్వరరావుగారు టీడీపీకి వాచ్మెన్ డిపార్ట్మెంట్గా మార్చేశారు. అటువంటి వెంకటేశ్వరరావు గారు... మా పార్టీ నుంచి వెళ్లిన 23 ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలోనూ ఉన్నారు. గ్రామాల్లో వైఎస్సార్ సీపీకి ఎవరు అనుకూలంగా ఉన్నారు, ఎవరికి ఓటు వేస్తారనే దానిపై ఇంటెలిజెన్స్ నివేదికను చంద్రబాబుకు ఇస్తారు.ఇంటెలిజెన్స్ వ్యవస్థే ఇలా ఉంటే మాకు ఎలా న్యాయం జరుగుతుంది. సీబీఐ విచారణకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు. జమ్మలమడుగు ఇన్‌ఛార్జ్‌గా ఉండటమే చిన్నాన్న చేసిన తప్పా?. ఆయనకు సెక్యూరిటీ కూడా తీసివేశారు. చంద్రబాబు మాటలు దొంగే దొంగా..దొంగా అన్నట్టుగా ఉన్నాయి. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉంది. వాళ్లే హత్య చేస్తారు...వాళ్లే హంతకుడు అంటున్నారు. మళ్లీ మాపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పైన దేవుడు ఉన్నాడు... చనిపోయిన వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. దివంగత ముఖ్యమంత్రి సోదరుడు, ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేశారు. మా దగ్గర ఎమ్మెల్యే...పార్టీ ఫిరాయించి మళ్లీ మా మీద దాడులు చేస్తారు. మా అభ్యర్థి సుధీర్ రెడ్డికి మద్దతుగా చిన్నాన్న ప్రచారం చేస్తున్నారు. చిన్నాన్న సౌమ్యుడు, సెక్యూరిటీ కూడా లేదు. ఎక్కడికైనా ఒక్కడే వెళతాడు. అలాంటి మంచి వ్యక్తిని ...ఇంత దారుణంగా హతమార్చారు. పైన దేవుడు ఉన్నాడు... ఎప్పుడైనా కూడా రాక్షసత్వం పెరిగిపోయినప్పుడు పైవాడు చూసుకుంటాడు. ఇక మా నాన్నకు కట్టడి చేయడం కోసం మా తాతను చంపారు. తాతను చంపిన సమయంలో చంద్రబాబే సీఎంగా ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తావని చంద్రబాబు సవాల్ చేశారు. ఆ తర్వాత రెండు రోజులకు వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యారు. నన్ను కూడా ఎయిర్‌పోర్టులో చంపాలని చూశారు. మా కుటుంబంపై జరిగిన అన్ని దాడుల సమయంలోనూ చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు. న్యాయం జరక్కపోతే కోర్టుకు వెళతాం.. చంద్రబాబు తప్పు చేయకపోతే ఈ కేసును సీబీఐ విచారణకు ఎందుకు వెనకాడుతున్నారు. ఓట్లను తొలగించడంతో పాటు, మనుషుల్ని కూడా తొలగిస్తున్నారు. చంద్రబాబుకు సన్నిహితులుగా ఉన్న డీజీపీ, ఇంటెలిజెన్స్, ఏడీజీని ఎన్నికల విధుల నుంచి తప్పించాలి. ఇలాంటి అధికారులు ఉంటే ఎన్నికలు సజావుగా జరగవు. ఆ అధికారులను తప్పిస్తేనే న్యాయం జరుగుతుందని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ చిన్నాన్న హత్యకేసును సీబీఐ విచారణకు ఒప్పుకోకపోతే మేము కోర్టుకు కూడా వెళతాం. కచ్చితంగా సీబీఐ విచారణ జరగాలి. ఎస్పీని ఎందుకు మార్చాల్సి వచ్చింది.. ఎన్నికల జరగడానికి 40 రోజుల ముందు జిల్లా ఎస్పీని ఎందుకు మార్చాల్సి వచ్చింది. ఘటనా స్థలంలో దొరికిందంటూ నిన్న ఎస్పీ ఒక లెటర్ చూపించారు. చిన్నాన్న లెటర్ రాశారంట...నా డ్రైవర్ నన్ను కొట్టి చంపారని... అసలు ఆ లెటర్‌ను ఎలా సృష్టించారు. చిన్నాన్నను బెడ్రూమ్లో కొట్టి ఆ తర్వాత...బాత్రూంలోకి తీసుకెళ్లి అక్కడ కూడా కొట్టారు. దుండగులు చంపుతూ ఉంటే...చిన్నాన్న ఎలా లెటర్ రాసారు. ఇదంతా కుట్రను తెలపడం కాదా?. వాస్తవాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. చిన్నాన్న హత్య ఉదంతంపై కొత్త కొత్త కథలు అల్లుతున్నారు. ఎన్ని కథలు చెప్పినా...నేను ఒకటే అడుగుతున్నాను. చిన్నాన్న ఎలా చనిపోయారు. నా ప్రశ్నకు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. ఈ హత్యకేసులో ఆయన ప్రమేయం లేకుంటే సీబీఐ విచారణకు ఒప్పుకోవాలి. అని ప్రశ్నలు సంధించారు. -
గుట్టుగా నా ఖాతాలో రూ.30 లక్షలు టీటీడీ జమ
సాక్షి, అమరావతి: తనకు ఎలాంటి ముందస్తుగా సమాచారం లేకుండా, తాను ఎటువంటి దరఖాస్తు చేయకుండానే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వారు తన పేరిట రూ.30 లక్షలు బ్యాంకు ఖాతాలో జమచేశారని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఆరోపించారు. టీటీడీలో జరుగుతున్న అక్రమాలను, అన్యాయాలను, ఆగమ విరుద్ధ అనాచారాలను బయటపెట్టినందుకు తనను కక్షపూరితంగా ఆలయంలో బాధ్యతల నుంచి తొలగించిన టీటీడీ.. ఇప్పుడు మరో ఏకపక్ష నిర్ణయంతో తన బ్యాంకు ఖాతాలో డబ్బులు జమచేశారని విమర్శించారు. డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత అవి తన రిటైర్మెంట్ బెనిఫిట్ డబ్బులని అధికారులు చెబుతున్నారని ఆయన మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తన అర్చక నియామకమే సర్వీసు రూల్స్ ప్రకారం జరగలేదని, వంశపారంపర్య హక్కుల ప్రకారం తాను అర్చక బాధ్యతల్లో పనిచేశానని రమణదీక్షితులు వివరించారు. ఈ కారణంగానే 20–30 ఏళ్ల పాటు తాను ఆ బాధ్యతల్లో కొనసాగినప్పటికీ, తనకు ఎటువంటి అలవెన్స్‌లు, సర్వీసు ఉత్త ర్వులు లేవని అందులో తెలిపారు. పదవీ విరమణ తన సమ్మతితో జరగలేదని.. అలాగే రిటైర్మెంట్ సెటిల్మెంట్ అని చెబుతున్న నగదు కూడా తన సమ్మతితో జమ చేయలేదని ఆయన పేర్కొన్నారు. తనతో పాటు బలవంతంగా తొలగించిన వారి ఖాతాల్లో కూడా ఇంతే మొత్తంలో డబ్బులు జమచేశారన్నారు. అధికారులు ఇంకెంత తరలించారో!? ఎలాంటి వోచర్, రశీదు లేకుండా, ఎవరూ దరఖాస్తు చేసుకోకుండా టీటీడీ యాజమాన్యం ఇష్టమొచ్చినట్లు శ్రీవారి ఖజానాలోని దాదాపు కోటి రూపాయలు తమ ఖాతాల్లో జమ చేసినట్లు వారు మిగిలిన విషయాల్లో ఇంకెన్ని కోట్లు తరలించారో అని రమణదీక్షితులు అనుమానం వ్యక్తంచేశారు. టీటీడీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఇన్నాళ్లూ తాను చెబుతున్న మాటలు వాస్తవమేనని దీంతో స్పష్టమైందని తన ప్రకటనలో రమణదీక్షితులు వివరించారు. టీటీడీలో జరుగుతున్న వ్యవహారాలపై సీబీఐ విచారణ తప్పకుండా జరిపించాలని ప్రజలందరూ కోరాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. టీటీడీ చట్టవ్యతిరేక నిర్ణయాలను, తన పదవీ విరమణ వ్యవహారాలను కోర్టు ద్వారానే పరిష్కరించుకుంటానన్నారు. -
గుంటూరు అక్రమ మైనింగ్‌పై సీబీఐ విచారణ..!
సాక్షి, హైదరాబాద్ : గుంటూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కాసు మహేశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి అయిన టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును తప్పించేందుకే అమాయకులపై కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. అక్రమ గనులను పరిశీలించేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటీని పోలీసులు ప్రయోగించి అడ్డుకున్నారని తెలిపారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి 10 రోజులు గడువిచ్చామని, అప్పటికీ అనుమతి ఇవ్వకపోతే కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అక్రమ గనుల వ్యవహారంలో సీఐడీ విచారణ వల్ల ఏమీ జరగదని, సీబీఐ విచారణ జరిపిస్తేనే నిజాలు వెలుగులోకి వస్తాయని, సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ జరుగుతున్న భూములను ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకోవాలన్నారు. ఇంత పెద్ద కుంభకోణం జరిగితే.. బీజేపీ, కాంగ్రెస్, జనసేన పార్టీలు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. -
కేంబ్రిడ్జ్ అనలిటికాపై సీబీఐ విచారణ
న్యూఢిల్లీ: బ్రిటిష్ రాజకీయ కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా(సీఏ) ఫేస్బుక్లో భారతీయుల వివరాలు తస్కరించిందన్న ఆరోపణలపై సీబీఐ బుధవారం ప్రాథమిక విచారణను ప్రారంభించింది. గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ అనే సంస్థ నుంచి కేంబ్రిడ్జ్ అనలిటికా ఫేస్బుక్ యూజర్ల వివరాలను తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో కేంద్రం ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ ప్రాథమిక విచారణను ప్రారంభించింది. సీఏ అనుబంధ సంస్థ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ ల్యాబొరేటరీస్ భారత్‌లోనూ పనిచేసింది. -
ఇందిరమ్మ ఇళ్ల విచారణ ఏమైంది?: చాడ
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల అవినీతిపై వేసిన సీఐడీ విచారణ ఏమైందని, అసలు సీఐడీ ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చిందా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. అవినీతికి పాల్పడిన దొంగలెవరనేది ప్రజలకు తెలపాలని ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. ఎంసెట్ లీక్ వెనక శ్రీ చైత న్య, నారాయణ కాలేజీలున్నట్లు వార్తలు వస్తున్నందున, ఈ గుట్టూ బయట పెట్టాలన్నారు. -
ఇక సీబీఐ చేతికి..
చీపురుపల్లి విజయనగరం : గ్రామీణ విద్యుత్ సహకార సంఘం (ఆర్ఈసీఎస్)లో వినియోగదారుల డబ్బు రూ.1.71 కోట్లు పక్కదోవ పట్టిన వ్యవహారం సీబీఐ చేతికి చేరింది. నిధులు గల్లంతైన విషయమై ఇంతవరకు ఆంధ్రాబ్యాంకులో ఉన్నత స్థాయి విజిలెన్స్ విచారణ పూర్తి చేసుకున్న అనంతరం కేసు సీబీకి అప్పగించారు. స్థానిక ఆంధ్రాబ్యాంకులో 2015 జూలై నుంచి 2017 జూలై వరకు క్యాషియర్‌గా పని చేసిన వి.సంతోషిరాము ఆ నిధుల గల్లంతుకు ప్రధాన కారకుడిగా గుర్తించి సీబీఐ కేసు నమోదు చేసినట్లు తెలిసింది. దీంతో సీబీఐ అధికారులు సంతోషిరాము నివాసం, ఆర్ఈసీఎస్ ప్రధాన కార్యాలయానికి వచ్చి విచారణ ప్రారంభించినట్లు సమాచారం. అంతేకాకుండా ప్రస్తుతం పర్లాకిమిడిలో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న సంతోషిరాము నివాసంలో పలు పత్రాలను సీబీఐ అధికారులు సీజ్ చేసినట్లు తెలిసింది. అలాగే ఆర్ఈసీఎస్ ప్రధాన కార్యాలయానికి వచ్చి పలు ఓచర్లు తీసుకెళ్లారు. ఆర్ఈసీఎస్ పరిధిలో గల చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాల్లో వినియోగదారులు నుంచి విద్యుత్ బిల్లుల రూపంలో వసూలు చేసి ఆ డబ్బును ప్రతిరోజూ ఆంధ్రాబ్యాంకులో ఉన్న ఆర్ఈసీఎస్ ఖాతాలో జమ చేస్తుంటారు. అలా జమ చేసిన డబ్బులో 133 ఓచర్లకు సంబంధించిన రూ.1.71 కోట్లు డబ్బు ఆంధ్రాబ్యాంకులో ఉన్న క్యాషియర్ సంతోషి రాము జమ చేయకుండా పక్కదారి పట్టించాడు. 2017 ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలో జరిగిన నిధుల గల్లంతు విషయాన్ని ఆర్ఈసీఎస్ అధికారులు అత్యంత ఆలస్యంగా 2018 మార్చిలో గుర్తించారు. దీంతో ఆర్ఈసీఎస్ అధికారుల ఫిర్యాదు మేరకు ఆంద్రాబ్యాంక్ అధికారులు విచారణ చేపట్టి డబ్బులు గల్లంతైన విషయాన్ని రెండు నెలలు తరువాత గుర్తించి సీబీఐకి కేసు అప్పగించారు. ఆర్ఈసీఎస్ అధికారులను విచారించనున్న సీబీఐ.... వినియోగదారుల నుంచి వసూలు చేసే డబ్బు ప్రతిరోజూ బ్యాంకుకు జమ చేసిన వ్యవహారానికి సంబంధించి ఆర్ఈసీఎస్ ఉద్యోగులను సీబీఐ విచారించనున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే నలుగురు ఆర్ఈసీఎస్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఇదిలా ఉంటే సీబీఐ అధికారులు పట్టణానికి వచ్చి విచారణ చేపట్టడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అధికారులు వచ్చారు.... సీబీఐ అధికారులు ఆర్ఈసీఎస్కు వచ్చారు. తమ సిబ్బంది ఆంధ్రాబ్యాంకులో జమ చేసిన డబ్బుకు సంబంధించిన ఓచర్లు అడిగారు. ఆంధ్రాబ్యాంకు ఉద్యోగి నివాసానికి కూడా వెళ్లినట్లు తెలిసింది. తమకు తెలిసిన పూర్తి సమాచారం ఇచ్చాం. – పి.రమేష్, ఎండీ, ఆర్ఈసీఎస్ -
కుబేర తాళం చెవి పోవడం ఏమిటి!
భువనేశ్వర్ : శ్రీజగన్నాథుని దేవస్థానం శ్రీమందిరం రత్న భాండాగారం తాళం చెవి గల్లంతయింది. ఈ తాళం అత్యంత ప్రాచీన ప్రాధాన్యం సంతరించుకుంది. శ్రీ జగన్నాథ సంస్కృతిలో ఈ తాళం చెవిని కుబేర తాళం చెవిగా పేర్కొంటారు. అమూల్యమైన రత్న సంపద రత్న భాండాగారం రక్షణ కోసం వినియోగించే తాళం చెవి కావడంతో దీనికి ఆ ప్రాధాన్యం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీజగన్నాథుని కోషాగారంలో కుబేర తాళం చెవి భద్రపరుస్తారు. పకడ్బందీ అధికార బందోబస్తు మధ్య దీనిని వినియోగిస్తారు. వినియోగం తర్వాత అదే క్రమంలో ఆలయ సంప్రదాయాలతో చట్టపరమైన మార్గదర్శకాల ఆచరణతో దీనిని పదిలపరచడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కుబేర తాళం చెవి కనిపించక పోవడం సందిగ్ధతని ప్రేరేపిస్తుంది. ఈ తాళం చెవి గల్లంతు విషయం తెలిసిన రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘ కాలం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. శ్రీజగన్నాథుని భక్త హృదయాలు స్పందించి వీధికి ఎక్కిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి న్యాయ కమిషన్ విచారణకు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఇదంతా కంటి తుడుపు వ్యవహారంగా శ్రీజగన్నాథ సేన విమర్శించింది. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఎంత మాత్రం నమ్మశక్యంగా లేవని వివరిస్తు శ్రీజగన్నాథ సేన ప్రముఖుడు ప్రియదర్శి పట్నాయక్ స్థానిక సీబీఐ కార్యాలయానికి విచ్చేసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు దాఖలు చేశారు. ప్రాచీనమైన కుబేర తాళం చెవి సాధారణమైనది కాదు. 3 అంచెల కొనతో ఒకటిన్నర అడుగుల పొడవైన తాళం చెవి అదృశ్యం కావడం అంటే ఆలోచించాల్సిన విషయంగా సీబీఐ గుర్తించి విచారణకు రంగంలోకి దిగాలని ఆయన సీబీఐ వర్గాలకు అభ్యర్థించారు. ఈ సందర్భంగా సీబీఐ కార్యాలయం ఎదురుగా సోమవారం శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించారు. -
ఆరోపణలు చేసే వారు సీబీఐ విచారణకు సిద్ధమేనా?
-
ఆత్మను అమ్ముకొని బతికే నీచుడు చంద్రబాబు
-
చంద్రబాబు నరహంతకుడు
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై ఆ పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు వరుసగా రెండోరోజు మాటల తూటాలు పేల్చారు. చంద్రబాబు నరహంతకుడని, ఆయన అంతటి నీతిమాలిన రాజకీయ నాయకుడు ప్రపంచంలో లేడని మండిపడ్డారు. తనను పార్టీ నుంచి బహిష్కరించడంపై మంగళవారం బేగంపేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుపై కోర్టుల్లో స్టే ఉన్న కేసులను మళ్లీ తెరవాలని, ఆయనపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం విచారణ జరిపిస్తే సత్యహరిశ్చంద్రుడి తమ్ముడినని చెప్పుకునే బాబు బండారం బయటపడుతుందని వ్యాఖ్యానించారు. నీ జీవితం కుట్రల నిలయం ‘నిన్న నా గొంతు కోసేశారు. ఎన్టీఆర్ గొంతు కోసినట్టే ఆయన శిష్యుడినయిన నా గొంతు కూడా చంద్రబాబు కోసేశాడు. కనీసం ఉరితీసే ముందయినా చివరి కోరిక అడుగుతారు. ఆ అవకాశం కూడా నాకు చంద్రబాబు ఇవ్వలేదు’’అని మోత్కుపల్లి అన్నారు. ‘‘నువ్వు ఎన్టీఆర్‌పై కుట్ర చేసి గద్దె దింపావ్... నరహంతకుడివి నువ్వు. రాజకీయాల్లో నీ అంత నీతిమాలిన వ్యక్తి ఈ దునియాలో లేడు. నీ జీవితమే కుట్రలకు, మోసాలకు నిలయం. ఎన్టీఆర్ మనుషులు 20 మంది నీ బాధకు చనిపోయారు. చంద్రబాబు వేధించడం వల్లే ముద్దుకృష్ణమ నాయుడు చనిపోయాడు. నేనాయన్ని పదవి అడిగిన్నా.. ప్రమాణం చేయి. నా మాటలు బంద్ చేస్తా. అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటా. నిన్ను నేను ఏ పదవి అడిగిన? నీ దగ్గర నేను ఆశించింది ఏంటి? గవర్నర్ పదవి ఇవ్వమని నేనడిగానా? నువ్వేమైనా ప్రధానివా? రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి బంధువైన గరికపాటి మోహన్‌రావుకు అమ్ముకున్నవ్. ఆత్మను అమ్ముకుని బతికే నీచుడు చంద్రబాబు అని ఎన్టీఆర్ చెప్పారు. గవర్నర్ ఎలాగూ రాదు కాబట్టి ఆ పదవి ఇస్తానని చెప్పాడు. నేను లేకపోతే ఇంట్లోంచి బయటకు రాని పిరికిపందవు నువ్వు. పనికిమాలిన నాయకులతో నన్ను తిట్టిస్తున్నవ్. మగాడివైతే నాతో నువ్వు మాట్లాడు. మోదీ దగ్గరికెళ్లి అరుణ్‌జైట్లీ, కేసీఆర్ కాళ్లు పట్టుకోలేదా? కేసీఆర్ గురించి మాట్లాడాలంటే గజగజ వణుకుతున్నవ్. పదేళ్లు ఇక్కడే ఉండి పార్టీని కాపాడతానని చెప్పిన నువ్వు అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా సర్దుకుని పోయినవ్. నువ్వు పోయింది అమరావతి కోసం కాదు. కేసీఆర్ ఒక్క లాత్ కొడితే అక్కడ పడ్డవ్. తెలంగాణలో పార్టీని సర్వనాశం చేసినవ్. నా మీద ఏమైనా మాట్లాడితే పురుగులు పడి చస్తవ్. నేనెవరికీ అన్యాయం చేయలే. నువ్వు నాకు అన్యాయం చేసినవ్. సిగ్గు లేదా నీకు. నువ్వు కులగజ్జి ఉన్నోడివి. రేవంత్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదు నేను మాదిగ వ్యక్తినని నా మీద చర్యలు తీసుకుంటవా?’’అని మోత్కుపల్లి ప్రశ్నించారు. నువ్వు నన్ను సస్పెండ్ చేసేదేంది? ‘దుర్మార్గుడివి, పాపాత్ముడివి, దుష్టుడివి అయినా నీతోనే ఉండాలనుకున్నా. ఎన్టీఆర్‌ని చంపినా ఆయన పెట్టిన జెండా కోసం నీతోనే ఉండాలనుకున్నా. నీ కోసం నన్ను వాడుకుని ప్రపంచమంతా నన్ను చెడ్డోడిని చేసిండు. నువ్వు నన్ను సస్పెండ్ చేసేదేంది? తెలంగాణ ప్రజలు ఎప్పుడో నిన్ను సస్పెండ్ చేశారు’’అని బాబును మోత్కుపల్లి దుయ్యబట్టారు. ‘‘ఆంధ్ర ప్రజలు కూడా ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. నిన్ను పాతాళంలో బొంద పెట్టేందుకు సిద్ధంగా ఉన్నరు. నువ్వొక చవటవి. నువ్వొక దిగజారిన నాయకుడివి. బ్రోతల్ హౌజ్ నడిపినట్టు నడుపుతున్న రాజకీయ విధానం నీది. నేను పార్టీని విలీనం చేయమన్ననా? నువ్వే పార్టీని ఓటుకు కోట్లు కేసప్పుడే టీఆర్ఎస్లో విలీనం చేసినవ్. నీ మనస్సాక్షే నీకు ఏదో ఒకరోజు గుణపాఠం చెపుతుంది’’అని అన్నారు. నీ వల్లే రాజకీయ వ్యవస్థ దెబ్బతింది ‘‘చంద్రబాబూ.. నీకు స్నేహానికి విలువే తెలియదు. నువ్వు లేకపోయినా జగన్ ప్రత్యేక హోదా తెస్తాడు. వేరే పార్టీ వాళ్లు తెస్తరు. నాలుగేళ్లు నువ్వు ఏం పొడిచినవని నీకు 25 సీట్లు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు’’అని మోత్కుపల్లి ప్రశ్నించారు. ‘‘ఇప్పటికే ఎన్నికల కోసం నియోజకవర్గానికి రూ.25 కోట్లు పంపినవ్. నీ వల్లనే డబ్బు ప్రభావం వచ్చింది. రాజకీయ వ్యవస్థ దెబ్బతిన్నది నీ వల్లే. ఎన్నికలలో చంద్రబాబు నాయకత్వంలో పెట్టినంత ఖర్చు ఏ నాయకుడి ఆధ్వర్యంలో పెట్టలేదు. వాజ్‌పేయిని ప్రధాని నేనే చేసిన అంటడు. మోదీని నేనే చేసిన అంటడు. అబ్దుల్‌కలాంను రాష్ట్రపతిని నేనే చేసినా అంటడు. సిగ్గు లేదా నీకు? ఇన్ని చేసినోడివి ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు తీసుకురాలేదు’’అని నిలదీశారు. సింగపూర్, దుబాయ్‌లో దాస్తున్నవ్ ‘నువ్వు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నవో తెలియదా? సింగపూర్, దుబాయ్‌లో, అమెరికాలో దాస్తున్నావ్’అని మోత్కుపల్లి అన్నారు. ‘‘కాపులు, బీసీలు, దళితులు, బ్రాహ్మణులు, ఎన్టీఆర్ కుటుంబంలో పంచాయతీలు పెట్టినవ్. అన్ని కులాల్లో పంచాయతీలు పెట్టినవ్. కొద్దిరోజుల్లోనే నేను వెంకటేశ్వరస్వామి మెట్లెక్కుతా. బాబును ఓడించి వస్తా. నేనెన్నడూ నా గురించి అడగలేదు. ఈ దొంగ చంద్రబాబును రాజకీయంగా బొందపెట్టమని ప్రార్థిస్తున్నా.. నాకు మోకాళ్ల నొప్పులున్నా ఏడుకొండల మెట్లెక్కి వస్తా. ఒక్క మెట్టు మీద నేను చచ్చినా ఫర్వాలేదు. వెంకటేశ్వరస్వామీ.. అతడిని ఓడించు. నీ భక్తుడయిన ఎన్టీఆర్ ఆత్మకు శాంతి కలిగించు’’అని వ్యాఖ్యానించారు. కమ్మ కులస్తులారా.. బాబును ఓడించండి! ‘‘కమ్మ కులస్తులారా.. ఒక్కసారి చంద్రబాబును ఓడించండి. మరోసారి నందమూరి కుటుంబీకులను గెలిపిద్దాం. దళితులు, ఎన్టీఆర్ అభిమానులు ఎవరూ చంద్రబాబుకు ఓటేయొద్దు. ఎన్టీరామారావు అల్లుడు కావడంతోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన అదృష్టం. ఆ రోజు సంబంధం కుదిరించింది ఎవరో. వాడి బొంద కాలా. ఆ పెళ్లి కుదిర్చి మమ్మల్ని, ప్రజల్ని చంపారు. నన్ను ఏ రాత్రి ఏం చేస్తాడోనని భయముంది. చంద్రబాబుతో నాకు భయముంది. కేంద్రం ఈ మొనగాడిపై సీబీఐ విచారణ చేయాలె. మోదీకి విజ్ఞప్తి చేస్తున్నా. జగన్ ఏమన్నా మంత్రా, ముఖ్యమంత్రా? ఆయన తీసుకునేటప్పుడు నువ్వు ఏమైనా చూశావా? నీ కొడుకు చేసేది ఎవరైనా చూస్తున్నారా. మీ ఇద్దరు కలిసి అమెరికా, సింగపూర్, దుబాయ్ పోతుంటే ఎవరైనా పట్టుకున్నారా? అందుకే కేంద్రాన్ని అడుగుతున్నా. చంద్రబాబుపై సీబీఐ ఎంక్వైరీ వేయండి. స్టేలున్న 29 కేసులను రీఓపెన్ చేయండి. ఈయన బండారం బయటపడుతుంది. నా జీవితమంతా ధారపోసినా ఈ భ్రష్టుడి కోసం. ఈ వెధవ కోసం. నీకు దిక్కు లేకపోతే దిక్కు నిలబడ్డా. సిగ్గుమాలినోడా. విశ్వాస ఘాతకుడా? నీతిమంతుల ముందు ఈ పాపాల భైరవుడు నిలబడలేడు’’అని మోత్కుపల్లి అన్నారు. -
తూత్తుకుడి: సీబీఐతో విచారణ జరిపించాలి
సాక్షి, చెన్నై: తూత్తుకుడిలో స్టెరిలైట్ కర్మాగారం విస్తరణను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది మరణించిన విషయం తెలిసిందే. కాల్పులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నేడు తమిళనాడు వ్యాప్తంగా బంద్‌కి పిలుపునిచ్చాయి. బంద్‌లో ప్రధాన ప్రతిపక్షం డీఎంకేతో సహా కాంగ్రెస్, వామపక్షలు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. బంద్‌లో పాల్గొన్న డీఎంకే నేత కనిమొళితో సహా, ఇతర ప్రధాన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా తుత్తుకుడి ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని న్యాయవాది జీఎస్ మణి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ వచ్చే వారం విచారణకు అవకాశం ఉంది. కాగా పిటిషన్లో పూర్తి వివరాలను పొందుపరిచి సోమవారం మరో పిటిషన్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు న్యాయవాదిని ఆదేశించింది. -
తిరుమలలో అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు
సాక్షి,అమరావతి: తిరుమల వెంకటేశ్వర్లు స్వామి ఆస్తుల అక్రమాలపై విచారణ జరిపించాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. తిరుమలలో జరుతున్న అక్రమాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోంమంత్రి, గవర్నర్ కలుగచేసుకోవాలని లేఖ ద్వారా తెలియజేశారు. కైన్ ద్వారా వజ్రం పగిలిందని అనడంలో నిజంలేదని న్యాయవాది లేఖలో పేర్కొన్నారు. స్వామివారి భూములు, నిధులు, నగలు, బ్యాంక్ డిపాజిట్ల లెక్కలు బహిర్గతం చేయ్యాలని లేఖలో పేర్కొన్నారు. -
నా ఆరోపణలకు కట్టుబడి ఉన్నా: రమణదీక్షితులు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి వంటశాల(పోటు) గురించి తాను చేసిన ఆరోపణలపై కట్టుబడి ఉన్నానని ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపిస్తే అన్నీ నిజాలు బయటకొస్తాయని, వాటిని నిరూపించడానికి సిద్ధమని ఆయన తెలిపారు. ఆగమశాస్త్రానికి విరుద్ధంగా శ్రీవారి పోటును మూసివేసి, తవ్వకాలు జరిపారని పునరుద్ఘాటించారు. పింక్ డైమండ్ విషయంలో ఆలయ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ నిజాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అసలు పింక్ డైమండే లేదని, అది పింక్ రూబీ మాత్రమేనని ఈవో చెప్తుతున్నారని మండిపడ్డారు. -
ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబే ముద్దాయి
-
‘అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు’
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే ముద్దాయి అని దేశమంతా నమ్ముతోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. ఫోన్లో మాట్లాడిన వాయిస్ టేపు రికార్డులో ఉన్న గొంతు చంద్రబాబుదే అన్నది స్పష్టమైందని తెలిపారు. చంద్రబాబును అప్పుడే అరెస్ట్ చేయాల్సి ఉండే, కానీ ఇలా తప్పుడు పనులు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోక పోవడం వల్ల చట్టాలపై ప్రజలకు నమ్మకం పోతుందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు లాంటి వ్యక్తులు ఉండటం వల్లే ప్రజాస్వామ్యంపై విశ్వాసం సన్నగిల్లుతోందని మండిపడ్డారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ విచారణకు తెలంగాన పోలీసులు చేపట్టిన విచారణ అడ్డుకారాదని పేర్కొన్నారు. ఓటు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు అని, ఛార్జిషీటులో ఆయన పేరు ఇంతవరకూ ఎందుకు చేర్చలేదని భూమన ప్రశ్నించారు. ఇందులో తెలంగాణ సీఎం కేసీఆర్ నిబద్ధతను ప్రశ్నించాల్సి వస్తుందన్నారు. చంద్రబాబు పేరు చేర్చకుంటే వారు కూడా చట్ట వ్యతిరేకులే అన్నారు. సామాన్యుడైనా, సీఎం అయినా చట్టాలు ఒకే తీరుగా ఉంటాయని, దీన్ని అందరూ సమ్మతిస్తారని చెప్పారు. అయినా ఏళ్లు గడుస్తున్నా కోట్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్యేల ఓట్లు కొనేందుకు చూసి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన చంద్రబాబును విచారణకు పిలవకపోవడం దారుణమన్నారు. కేసుకు భయపడ్డ చంద్రబాబు.. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ వద్ద సాగిలపడ్డారో.. లేక తెలంగాణలో కేసీఆర్ వద్ద సాగిల పడ్డారోనని, అందుకే ఇన్నాళ్లు ఈ కేసులో నిర్లిప్తత కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. ఒక ఎమ్మెల్యేకి రూ.50 లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిన కేసులు పెట్టరా అని ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసు గురించి భయపడే చంద్రబాబు విజయవాడకు పారిపోయారని ఆరోపించారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు అకస్మాత్తుగా అమరావతికి మకాం మార్చడం వెనక అసలు ఉద్దేశం ఓటుకు కోట్లు కేసు భయమేనని భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. -
మీ పాలనలో ఒక్క బీసీకైనా న్యాయం జరిగిందా?
-
చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధమా?
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అన్యాయంపై అందరూ రగిలిపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి ప్రశ్నించారు. బీసీలపై జస్టిస్ ఈశ్వరయ్య లేవనెత్తిన అంశాలపై చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్యాలపై బీసీలు ఆధారపడరని, చంద్రబాబు బీసీలను వ్యతిరేకంగా రిపోర్టు ఇచ్చింది వాస్తవంకాదా? అని ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రిపై సీబీఐ విచారణ జరిపించాలి. చంద్రబాబు పాలనలో ఒక్క బీసీకైనా న్యాయం జరిగిందా? బలహీన వర్గాల ప్రజలు చంద్రబాబుకు తగ్గిన బుద్ధి చెబుతారు. ఒకవేళ నిజం అయితే చంద్రబాబుని వెంటనే బర్తరఫ్ చేయాలి’ అని పార్థసారథి డిమాండ్ చేశారు. -
మట్టి దోపిడీపై సీబీఐ విచారణకు సిద్ధమా?
గన్నవరం: గుడిని, గుడిలోని లింగాన్ని మింగేసినట్లుగా బ్రహ్మయ్య లింగం చెరువులో మట్టి తవ్వకాల పేరుతో అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ నిధులను స్వాహా చేశారని, తవ్విన మట్టిని అమ్ముకుని రూ.కోట్లు దండుకున్నారని వైఎస్సార్సీపీ మచిలీపట్నం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. మట్టి దందాపై సీబీఐ విచారణకు సిద్ధమంటూ టీడీపీ ఎమ్మెల్యే వంశీమోహన్ చేసిన సవాల్‌కు తమ పార్టీ తరుపున ప్రతి సవాల్ చేస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే ప్రెస్‌మీట్‌ను ఆధారంగా చేసుకుని మట్టి దోపిడీపై విచారణ కోరుతూ సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాస్తామని చెప్పారు. శుక్రవారం కృష్ణా జిల్లా గన్నవరంలో వైఎస్సార్సీపీ రాజకీయ సలహా కమిటీ సభ్యులు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి పార్థసారథి విలేకరులతో మాట్లాడారు. బ్రహ్మయ్య లింగయ్య చెరువులో ఇప్పటివరకు ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వారో స్పష్టంగా చెప్పాలని అన్నారు. తవ్విన మట్టిని ఏయే వ్యవసాయ క్షేత్రాలకు పంపారో ఎమ్మెల్యే గానీ, ఆయన అనుచరులు గానీ వస్తే పరిశీలనకు వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. మట్టి దోపిడీ విషయంలో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామన్నారు. టీడీపీ నేతల ఇసుక, మట్టి దోపిడీ గురించి ప్రజలకు అర్థమైందన్నారు. తప్పు చేయలేదని నిరూపించుకునేందుకు సీబీఐ విచారణకు సిద్ధపడాలని వంశీమోహన్‌కు సవాల్ విసిరారు. -
ఎస్ఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల కోసం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) పరీక్షల కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు సీబీఐ విచారణకు ఆదేశించింది. పలువురు అభ్యర్ధులు విజ్ఞప్తి మేరకు సీబీఐ విచారణను ఆదేశించామని, ఇక నిరసనలు ఆపాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూచించారు. కాగా సుమారు 9,372 ఖాళీల భర్తీ కోసం ఫిబ్రవరిలో నిర్వహించిన ఎస్ఎస్సీ పరీక్షల్లో ప్రశ్నాపత్రం ముందుగానే లీకైందని అభ్యర్ధులు ఆరోపిస్తూ ఆందోళనలు, నిరసనలు చేసిన విషయం తెలిసిందే. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగడంతో పాటు, సమాధానాలతో సహా ప్రశ్నాపత్రాలు సోషల్ మీడియాలో షేర్ అవడంతో ఫిబ్రవరి 21న జరిగిన పరీక్షను ఎస్ఎస్సి రద్దు చేసింది. ఈ స్కాంపై సీబీఐతో విచారణ జరపాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేసిన విషయం విదితమే. -
టీఆర్ఎస్ను ఎండగట్టేందుకు పాదయాత్ర
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకు, ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇన్‌పీసీసీ తరఫున పాదయాత్ర చేయాలని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల చార్జి కుంతియాకు చెప్పానని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో లబ్ధిపొందాలంటే మార్చికల్లా 50 శాతం మంది అభ్యర్థులను ప్రకటించాలని సూచించానని తెలిపారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించానన్నారు. తనకు బాధ్యతలిస్తే తెలంగాణ అంతా తిరుగుతానని, లేదంటే నల్లగొండలో అన్ని స్థానాలు గెలిపించే ప్రయత్నం చేస్తానని చెప్పారు. టీఆర్ఎస్లోకి వెళ్లనందుకే బొడ్డుపల్లి శ్రీనివాస్‌ను హత్య చేశారని, ఇది రాజకీయ హత్యేనని ఆయన అభిప్రాయపడ్డారు. సీబీఐ విచారణ కోసమే కోర్టును ఆశ్రయించామని, కాల్‌డేటా ఇవ్వబోమని సీఎం చెంచాలు చెబుతున్నారని, ఆ మాట హోంమంత్రి లేదా డీజీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ హత్యారాజకీయాలకు ప్రణాళికలు రచించుకుంటున్నారని ఆరోపించారు. -
ఆ ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు చేయండి
సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం జిల్లా టేకు పల్లి మండలం మేళ్లమడుగు పరిధిలో ఈ నెల 14న జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది సీపీఐ(ఎంఎల్) చండ్ర పుల్లారెడ్డి బాట దళ సభ్యులు మృతి చెందిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లేదా సీబీఐతో విచారణ జరిపించాలని, ఆ దర్యాప్తును పర్యవేక్షించాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ పౌర హక్కుల కమిటీ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. మృతదేహాలకు ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టం చేయించి, వాటిని భద్రపరిచేలా కూడా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంౖ పె అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం లోని ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. అయితే మధ్యాహ్నం నుంచి ఏసీజే నేతృత్వంలో మరో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు కావడంతో ఈ కేసు విచారణకు నోచుకోలేదు. సోమవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపే అవకాశం ఉంది. నేలమడుగు ఎన్కౌంటర్ బూటకపు ఎన్కౌంటర్ అని పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఎన్కౌంటర్ మృతులంతా సీపీఐ (ఎంఎల్) చండ్రపుల్లారెడ్డి బాట దళ సభ్యులని, వీరందరినీ పోలీసులు పట్టుకొచ్చి కాల్చి చంపారన్నారు. మృతదేహాలకు రాత్రివేళ పోస్టుమార్టం నిర్వహించవద్దని మృతుల బంధువులు.. కలెక్టర్, డీఎస్పీని కోరారని, అయితే వారు స్పందించలేదన్నారు. మృతదేహాలను ఉస్మానియా లేదా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. -
గుర్మీత్ పీఏను చూసి సీబీఐ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : అత్యాచార కేసులో శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రాం రహీమ్ సింగ్ పై నమోదయిన మరికొన్ని కేసుల్లో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో 400 మందిని నంపుసకులుగా మార్చారన్న కేసు ఒకటి. డేరాబాబా మాజీ అనుచరుడు హంసరాజ్ చౌహాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అది ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ప్రత్యేక కోర్టు అనుమతితో బుధవారం రోహ్తక్ జైల్లో ఉన్న గుర్మీత్ నుంచి సీబీఐ స్టేట్మెంట్ను నిన్న రికార్డు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు త్వరలో పూర్తి నివేదికను పంజాబ్ హర్యానా హైకోర్టుకు అందిస్తామని సీబీఐ తెలిపింది. అందులోని సమాచారం ప్రకారం... భగవంతుడిని చేరాలంటే మగతానాన్ని పరిత్యజించి తనను పూజించాలని గుర్మీత్ చెప్పేవాడని.. 2000 సంవత్సరంలో తనతోపాటు మరో 400 మంది వృషణాలను తొలగించి నపుంసకులుగా మార్చాడని హంసరాజ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాదు తనకు నష్టపరిహారం ఇప్పించాలని 2012లో హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశాడు కూడా. దీంతో సీబీఐ దర్యాప్తునకు కోర్టు ఆదేశించగా.. 2015లో కేసు కూడా నమోదు అయ్యింది. డేరాలోని డాక్టర్లే ఈ శస్త్రచికిత్సలు చేశారని దర్యాప్తులో సీబీఐ అధికారులు గుర్తించారు. స్త్రీలను శృంగారానికి వాడుకున్న డేరా బాబా, అనుచరులను మాత్రం నపుంసకులుగా మార్చిన సంగతి తెలిసిందే. చివరకు డేరాబాబా తన వ్యక్తిగత సలహాదారు రాకేష్‌ను కూడా వదల్లేదు. తాను వద్దని వేడుకుంటున్నా తనకు కూడా ఆపరేషన్ చేయించాడని రాకేష్ తెలిపాడు. రాకేష్‌తోపాటు, న్యాయసలహాదారు దాస్‌లకు వైద్య పరీక్షలు నిర్వహించగా వారిద్దరికీ కూడా వృషణాలు లేవని తేలింది. దీంతో షాక్ తిన్న అధికారులు మరికొందరు ప్రధాన అనుచరుల్ని పరీక్షించి చివరకు డేరా బాబా స్టేట్మెంట్ నమోదు చేశారు. గుర్మీత్ దగ్గర పైసల్లేవ్... అత్యాచార కేసులో బాధిత మహిళలకు 30 లక్షలు చెల్లించాలన్న పంచకుల కోర్టు ఆదేశాలపై గుర్మీత్ అభ్యంతరం పిటిషన్ దాఖలు చేశాడు. డేరా ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసినందున బాధితులకు చెల్లించేందుకు తన దగ్గర డబ్బు లేదని పిటిషన్లో గుర్మీత్ పేర్కొన్నాడు. దీంతో కోర్టు గుర్మీత్‌కు రెండు నెలల గడువు విధించింది. అల్లర్ల అనంతరం జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు డేరా సచ్ఛా సౌధా ఆస్తులను జప్తు చేయాలని హర్యానా ప్రభుత్వాన్ని పంచకుల ప్రత్యేక కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. -
లాలూపై సీబీఐ ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: రైల్వేశాఖలో భాగమైన రెండు ఐఆర్సీటీసీ హోటళ్ల కాంట్రాక్టు అక్రమాల కేసులో నిందితుడైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గురువారం ఏకంగా ఏడు గంటలపాటు విచారించింది. గురువారం కూతురు మీసా భారతితో కలసి లాలూ ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. భారతిని లాబీలో వేచి ఉండమని చెప్పి లాలూను అధికారులు సుదీర్ఘంగా విచారించారని సీబీఐ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా 2006నాటి రెండు ఐఆర్సీటీసీ హోటళ్ల కాంట్రాక్టు ఒప్పందంలో లొసుగులు, కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ యజమానులతో సత్సంబంధాలు, లావాదేవీలపైనే ఎక్కువగా ప్రశ్నించినట్లు సమాచారం. లాలూ కొడుకు తేజస్విని సీబీఐ అధికారులు శుక్రవారం ప్రశ్నించనున్నారు. -
సదావర్తి భూములను సందర్శించిన సీపీఐ నారయణ
-
‘సిట్ పై మాకు నమ్మకం లేదు’
విశాఖపట్నం: విశాఖ భూకబ్జాలపై సీబీఐ విచారణ జరపాల్సిందేనని వైఎస్సార్ సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. సిట్ పై తమకు నమ్మకం లేదని, ముమ్మాటికి సీబీఐ దర్యాప్తు జరగాల్సిందేనన్నారు. భూకబ్జాలతో సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ కు సంబంధం ఉందన్నారు. పోలీసులతో విచారణ చేయిస్తే ఏం న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. కలెక్టర్ రోజుకో తీరుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. -
సీబీఐతో విచారణ చేయించాల్సిందే!
పుట్టపర్తి టౌన్ : పేదల ఆస్తులను అన్యాక్రాంతం చేయడమే లక్ష్యంగా టీడీపీ నేతలు సాగించిన విశాఖ భూకుంభకోణంపై వెంటనే ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని వైఎస్సార్సిపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం పుట్టపర్తికి విచ్చేసిన ఆయన స్థానిక సాయి ఆరామంలో పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. పేదలకు చెందిన లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములను తమ పార్టీ నాయకులకు దోచిపెట్టేందుకు విశాఖలో పక్కాగా ప్రభుత్వమే పథకం రచించినట్లు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఇందులో సీఎం తనయుడు లోకేష్,మంత్రి గంటా,ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తిల హస్తం ఉందన్నారు. సీబీఐ ఎంక్వయిరీ వేస్తే నిజాలు బయటికి వస్తాయనే చంద్రబాబు తన అధీనంలో నడిచే అధికారులతో సిట్ ఎంక్వయిరీ వేసి చేతులు దులిపేసుకునే ప్రయత్నం చేస్తుండటం అక్కడి పేదలను మోసం చేయడమేనన్నారు. ప్రభుత్వం పాతపెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని, 2018లోపు పీఆర్సీ కమిషన్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. పెన్షన్ కోసం రూ.500 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి క్యుములేటివ్ టైం డిపాజిట్ స్కీమును అమలు చేస్తే పెన్షన్లను ఎటువంటి డోకా లేకుండా ఇవ్వవచ్చన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ఈ విధానాన్ని అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను వర్తింపజేసి వెంటనే వారిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఎండుతున్న ఉద్యాన పంటలకు రక్షకతడులు అందిస్తామని వ్యవసాయ మంత్రి చెప్పారని, ఆయన మాటలు నమ్మి రైతులు అప్పులు చేసి నీళ్లు తోలుకుంటే నేటికీ ఒక్కపైసా కూడా బిల్లులు మంజూరు చేయలేదని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి, పుట్టపర్తి పట్టణ, మండల కన్వీనర్లు మాధవరెడ్డి, గంగాద్రి, నాయకులు గోవర్దన్‌రెడ్డి, అవుటాల రమణారెడ్డి, నాగమల్లేశ్వర్‌రెడ్డి, షర్ఫుద్దీన్, మాదినేని చెన్నక్రిష్ణ, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రం మరోసారి విడిపోతుంది: సీపీఐ
విజయవాడ: విశాఖపట్టణం భూకుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. వేల కోట్ల రూపాయల భూకుంభకోణంలో అధికార పార్టీ నేతలూ ఆరోపణలు ఎదుర్కొంటున్నందున దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. రాజధానిలో మరో 14వేల ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని.. గతంలో సేకరించిన భూమిలో ఇంకా నిర్మాణాలు చేపట్టకపోగా.. మళ్లీ భూసేకరణ ఎందుకని ప్రశ్నించారు. అభివృద్ధి అంతా ఒకేచోట జరుగుతుందని అభిప్రాయ పడ్డారు. మిగిలిన ప్రాంతాలను విస్మరిస్తే రాష్ట్రం మరోసారి విడిపోయే ప్రమాదం ముందని ఆందోళన వ్యక్తం చేశారు. -
‘చంద్రబాబు ఛాంబర్ బుల్లెట్, లాంచర్ ప్రూఫ్’
గుంటూరు: ఏపీ అసెంబ్లీలో లీకేజీలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. రాజధానిలోని అన్ని నిర్మాణాలను సీబీఐ విచారణలో చేర్చాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఛాంబర్ బుల్లెట్ ప్రూఫ్.. లాంచర్ ప్రూఫ్ అని చెప్పి.. ప్రతిపక్ష నేత ఛాంబర్ మాత్రం వాటర్ ప్రూఫ్ కూడా లేకుండా చేశారని ధ్వజమెత్తారు. తేలికపాటి వర్షానికే ప్రతిపక్ష నేత ఛాంబర్ జలమయమైందని, సచివాలయంలో కూడా అదే పరిస్థితి ఉందని విమర్శించారు. లీకేజీపై వైఎస్ఆర్సీపీ కుట్ర చేసిందంటూ నీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైఫల్యాలను ఎత్తిచూపిన ప్రతిసారి అలానే చేస్తున్నారని, తుని ఘటన, అరటితోట దహన సమయంలోనూ అలానే మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఆఘటనలకు సంబంధించి ఏ ఒక్కరినీ అరెస్టు చేయలేదని, వైఎస్ జగన్‌పై నెపం నెట్టి అవినీతి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు. అసెంబ్లీ, సచివాలయంలో కారింది నీళ్లు కాదని, టీడీపీ అవినీతి అని దుయ్యబట్టారు. -
రియల్ స్కాంపై సీబీఐ విచారణ జరపాలి
-
ముఖ్యమంత్రికి భారీ షాక్.. సీబీఐ చేతికి కేసు!
నారదా న్యూస్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికేసిన టీఎంసీ నేతల కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు నిర్ణయించింది. దీంతో పశ్చిమబెంగాల్ ఫైర్ బ్రాండ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గట్టి షాక్ తగిలింది. ఈ స్టింగ్ ఆపరేషన్ సీడీలు బీజేపీ కార్యాలయం నుంచి ప్రసారం అయ్యాయన్న విషయం అందరికీ తెలుసని, అయితే ఇప్పుడు తాను దీనిపై వ్యాఖ్యానించేది ఏమీ లేదని, ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేస్తానని మమతా బెనర్జీ అన్నారు. సరిగ్గా 2016 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది ముందు ఈ స్టింగ్ ఆపరేషన్ జరిగింది. దీనిపై సీబీఐ విచారణ జరపాలని, 72 గంటల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిషితా మాత్రే, జస్టిస్ టి. చక్రవర్తి ఆదేశించారు. అవసరమైతే ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయాలన్నారు. ఈ కేసు విచారణను ఒక స్వతంత్ర కేంద్ర సంస్థకు అప్పగించే అవకాశాలున్నాయని కలకత్తా హైకోర్టు జనవరిలోనే చెప్పింది. ఈ కేసులో సాక్ష్యాలను బట్టి చూస్తే సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం కనిపిస్తోందని జస్టిస్ మాత్రే వ్యాఖ్యానించారు. అప్పటికి రాష్ట్ర పోలీసులే కేసును విచారిస్తుండటంతో.. విచారణ సక్రమంగా సాగట్లేదన్న అభిప్రాయంతో కోర్టు ఇలా వ్యాఖ్యానించి ఉంటుందని భావిస్తున్నారు. ఏమిటీ ఆపరేషన్.. గత సంవత్సరం మార్చి నెలలో సరిగ్గా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి కొద్ద ముందు నారదా న్యూస్ చానల్ రెండు సీడీలను బయటపెట్టింది. అందులో పలువురు టీఎంసీ నాయకులు లంచాలు తీసుకుంటున్న వ్యవహారం మొత్తం రికార్డయింది. లోక్‌సభ ఎథిక్స్ కమిటీ దీనిపై వివరణ కోరింది. సీడీలలో ఐదుగురు టీఎంసీ ఎంపీలు కూడా ఉండటంతో వారు వివరణ ఇవ్వాలని తెలిపింది. టీఎంసీ విద్యార్థి విభాగం నాయకుడు కూడా ఇందులో ఉన్నాడు. -
అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలి
అనంతపురం అర్బన్ : జిల్లాలో 2016లో చేపట్టిన ప్రభుత్వ పథకాల్లో పెద్దఎత్తున అవినీతి, అధికార దుర్వినియోగం జరిగిందని, దానిపై సీబీఐతో విచారణ జరిపించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన తన నివాసంలో పార్టీ జిల్లా నాయకులతో కలిసి మాట్లాడారు. గతేడాది జరిగిన నీరు–చెట్టు, హరిత వనం, గాలిమరలు, సోలార్ ప్లాంట్, ఇసుక విక్రయాలు, తదితర పథకాల్లో రూ.వందల కోట్లు అవినీతి జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఫారంపాండ్లు, రెయిన్గన్లు, రక్షక తడుల పేరుతో పెద్ద ఎత్తున ప్రజాధనం లూటీ అయ్యిందన్నారు. దీనిపై జిల్లా యంత్రాగమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతి 80 శాతం ఉన్నట్లు స్వయానా ముఖ్యమంత్రే ప్రకటించారన్నారు. ఇందులో అధికార పార్టీ నాయకులే అవినీతిని అధిక శాతం ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. జన్మభూమి కమిటీల పేరుతో అవినీతిని పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సి.మల్లికార్జున, కార్యవర్గ సభ్యులు కాటమయ్య, ఎస్.నాగరాజు పాల్గొన్నారు. -
నయీం కేసు సీబీఐకి అప్పగించే ప్రసక్తే లేదు
-
జయ మృతిపై సీబీఐ దర్యాప్తు చేయాలి: కేతిరెడ్డి
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. తమిళనాడులోని తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలుచేశారు. జయలలిత మృతిపై తమకు అనుమానాలున్నాయని, ఈ విషయంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆయన తన పిటిషన్లో కోరారు. అనంతరం సీబీఐ దర్యాప్తునకు మద్దతు కోరుతూ అన్ని రాజకీయ పార్టీల నేతలను కలుస్తానని చెప్పిన ఆయన నేడు(బుధవారం) సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డిని కలిశారు. సీబీఐ దర్యాప్తునకు మద్దతివ్వాలని కోరుతూ ఓ వినతిపత్రం ఇచ్చారు. గురువారం న్యూఢిల్లీలో ఇతర రాజకీయ పక్షాలను కలిసి వారికీ వినతిపత్రం సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. అంతకుముందు జయలలిత మరణంపై ఎన్నో అనుమానాలున్నాయని సీబీఐ దర్యాప్తు చేయాలని కేతిరెడ్డి కోరిన విషయం తెలిసిందే. గత సెప్టెంబర్ 22న జ్వరం, డీ హైడ్రెషన్ కారణంగా ఆస్పత్రిలో చేరిన జయలలిత ఆ తర్వాత జబ్బు బారిన పడటం.. ఆపై ఆమె కోలుకున్నారని ప్రకటించారు. డిసెంబర్ 4న హఠాత్తుగా ఆమెకు గుండెపోటు వచ్చిందని చెప్పడం చూస్తుంటే ఆశ్చర్యంతోపాటు పలు అనుమానాలు కలుగుతున్నాయని ఆయన ఆ సమయంలో మీడియాకు ప్రత్యేక లేఖ కూడా విడుదల చేసిన విషయం విదితమే. -
సీబీఐకి ‘అగస్టా’ పరీక్ష!
దాదాపు మూడున్నరేళ్లుగా దర్యాప్తు పేరుతో సాగుతూనే ఉన్న అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణం వైమానిక దళ మాజీ ప్రధానాధికారి ఎస్పీ త్యాగి అరెస్టుతో కొత్త మలుపు తిరిగింది. కుంభకోణాలకు యూపీఏ ప్రభుత్వం కొత్త కాకపోయినా తొలిసారి ఇది బయటపడినప్పుడు మాత్రం అందరూ విస్మయం వ్యక్తం చేశారు. సచ్చీలుడిగా ముద్రపడిన ఏకే ఆంటోనీ రక్షణ మంత్రిగా ఉన్న కాలంలో ఇది జరగడమే అందుకు కారణం. వాస్తవానికి అగస్టా ఒప్పందం ఆద్యంతమూ అనుమానాలు రేకెత్తించేదిగానే ఉంది. ఎయిర్‌బస్ విమానాలకు గగనతలంలోనే ఇంధనం నింపేందుకు అనువైన విమానాలు అవసరమని చెప్పిన వైమానిక దళం హఠాత్తుగా ఆ ఆలోచన విరమిం చుకుని 19,685 అడుగుల ఎత్తులో ఎగరగల వీవీఐపీ హెలికాప్టర్ల కోసం 1999లో ప్రతిపాదనలు పెట్టింది. తీరా టెండర్ రూపొందిన 2005 నాటికి ఆ ఎత్తు కాస్తా 15,000కు తగ్గింది. దీన్ని మార్చిందెవరో, ఏం ఆశించి ఆ మార్పు చేశారో అనూహ్యం. కానీ మిగిలిన పోటీదారులందరినీ అవతలికి నెట్టి అగస్టా వెస్ట్‌లాండ్‌కు ఆ మార్పు ఉపయోగపడింది. దళారులు దీన్నంతా చాలా తెలివిగా చేశారు. తొలుత రూ. 4,860 కోట్లకు హెలికాప్టర్లు అందజేస్తామంటూ అగస్టా సంస్థ నుంచి ప్రతిపాదనలొచ్చాయి. తర్వాత దాన్ని రూ. 3,966 కోట్లకు అమ్ముతానని ప్రతిపాదించి చివరకు ఒప్పందం సమయానికి దాన్ని కాస్తా రూ. 3,660 కోట్లకు తగ్గించేందుకు ఆ సంస్థ అంగీ కరించింది. ఆ విధంగా రూ. 1,200 కోట్లకు పైగా డబ్బు ఆదా చేసినట్టు కనబడిన ఈ వ్యవహారంలో తెరవెనుక చాలా తతంగమే నడిచింది. హెలికాప్టర్ల సామర్ధ్యానికి సంబంధించిన ఎంపిక ప్రమాణాలన్నీ తారుమారయ్యాయి. ఆ పెట్టిన ప్రమాణాలకు తగ్గట్టుగానైనా ఉందో లేదో తేల్చడానికి అసలు అగస్టా హెలికాప్టర్ ఇంకా రూపొందనే లేదు. తామే ఉత్పత్తి చేసిన మరో హెలికాప్టర్‌ను చూపించి, కొత్తగా తయారు చేయబోయేది మరింత మెరుగ్గా ఉంటుందని చెప్పి ఆ సంస్థ చేతులు దులుపుకుంది. ఒక నిర్ణయం టెండర్‌గా మారి చివరకు ఎంపిక దశకు వచ్చినప్పుడు పోటీదారులుగా ఉన్నవారం దరికీ సమాన అవకాశం ఇవ్వడం ధర్మం. కానీ దేశ రక్షణకు సంబంధించిన కీలక అంశమని కూడా చూడకుండా ఒక సంస్థకు అనుకూలంగా ఎందుకు వ్యవహరిం చాల్సివచ్చిందో తెలియదు. ఆంటోనీకి ఇవన్నీ తెలియవనుకోవాలో, ఆయన తెలుసు కోదల్చుకోలేదో ఎవరికీ అర్ధంకాని విషయం. ప్రధాని కార్యాలయం ఆదేశాల మేరకే ఒప్పందంలో మార్పులు జరిగాయని అరెస్టయిన త్యాగి చెబుతున్నారు. త్రివిధ దళాల్లో ఒక విభాగానికి అధిపతిగా పని చేయడం మాత్రమే కాదు... పాకిస్తాన్‌తో జరిగిన రెండు యుద్ధాల్లో స్వయంగా పాల్గొన్న చరిత్ర త్యాగిది. ఆ స్థాయి వ్యక్తి కటకటాల వెనక్కు వెళ్లడం విచారకర మనుకుంటే... ఆ ఒప్పందంలో తాను నిమిత్తమాత్రుణ్ణనడం మరింత విస్మయకరం. వైమానిక దళ చీఫ్ స్థానంలో ఉన్నవారు తమ విభాగానికి కావలసిందేమిటో నిర్ణ యించే స్థితిలో లేకపోవడం కన్నా దౌర్భాగ్యం ఉంటుందా? త్యాగి మాత్రమే కాదు, ఏకే ఆంటోనీ కూడా ఈ నిర్ణయానికి బాధ్యత తీసుకోలేకపోయారు. గగనతలంలో ఇంధనం నింపడానికి విమానాలు కావాలన్న నిర్ణయం చివరకు వీవీఐపీ హెలికాప్టర్లు కొనాలన్న నిర్ణయంగా ఎలా మారిందని 2010లో ఆంటోనీని అడిగి నప్పుడు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ అందుకు కారణమని చెప్పారు. ఇలా ఎవరికి వారు చేతులు దులుపుకుంటే మరి బాధ్యులెవరు? చూడటానికి కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ మొదలుకొని పీఎంఓ, ఆనాటి జాతీయ భద్రతా సలహాదారు ఎంకె నారాయణన్, అప్పటి రక్షణ శాఖ కార్యదర్శి, ప్రస్తుత కాగ్ అధిపతి శశికాంత్ శర్మ వరకూ పలువురి ప్రమేయం ఇందులో ఉన్నట్టు కనబడుతుంది. కానీ ఎవరూ బాధ్యత వహించరు! ఎంత చిత్రం!! నిజానికి ఈ కుంభకోణాన్ని 2012లో ఇటలీ మీడియా వెల్లడించినప్పుడు యూపీఏ ప్రభుత్వం పట్టనట్టు ఉండిపోయింది. అక్కడి ప్రభుత్వం వెనువెంటనే రంగంలోకి దిగి దర్యాప్తునకు ఆదేశించడమే కాదు... ఏడాది తిరక్కుండా అగస్టా వెస్ట్‌లాండ్ మాతృ సంస్థ ఫిన్ మెకానికా చైర్మన్ గిసెప్పీ ఓర్సీని, ఆ సంస్థ సీఈఓ బ్రూనో స్పాగ్నోలినీని అరెస్టు చేసింది. అప్పుడిక తప్పనిసరై యూపీఏ సర్కారు కూడా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఒప్పందాన్ని తాత్కాలికంగా స్తంభింప జేస్తున్నా మని చెప్పింది. ఎవరూ అడగకుండా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం ద్వారా చిత్తశుద్ధిని చాటుకున్నామని గప్పాలు కొట్టుకోవడమే తప్ప అది చురుగ్గా ముందు కెళ్లేలా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని, ఆ సంస్థ నుంచి పరిహారం రాబడుతున్నామని చెప్పేనాటికైనా దాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలన్న ధ్యాస యూపీఏ సర్కారుకు లేకపోయింది. ఈ వ్యవహారంలో సోనియాగాంధీ సలహాదారు అహ్మద్ పటేల్, మన్మోహన్సింగ్, ఆస్కార్ ఫెర్నాండెజ్ తదితరుల్ని ప్రశ్నించాలని ఇటలీకి చెందిన రక్షణ కొనుగోళ్ల దళారీ క్రిస్టియన్ మైఖేల్ ఒక దశలో చెప్పాడు. దానికితోడు ‘ఎ.పి.’కి,‘ఎ.ఎఫ్’ కు ఫలానా మొత్తంలో డబ్బు చెల్లించామని చెప్పే పత్రాలు బయటికొచ్చాయి. ఇవన్నీ గమనిస్తే ఇందులో ఎన్నో అనుమానాలు రేగుతాయి. తమ హయాంలో దర్యాప్తు ఎందుకు మందకొడిగా సాగిందో, తమ సచ్చీల తను నిరూపించుకోవడానికి ఎందుకు సిద్ధపడలేదో యూపీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన పెద్దలు చెప్పాలి. గతంలో నావికాదళ చీఫ్‌గా పనిచేసిన అడ్మిరల్ ఎస్ఎం నందాపై సైతం రిటైరయ్యాక రక్షణ కొనుగోళ్లలో దళారీగా వ్యవహరించి నట్టు ఆరో పణలు వచ్చాయి. కానీ సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో దర్యాప్తు దశలోనే ఆ కేసు మూతబడింది. అది మాత్రమే కాదు... రక్షణ కొనుగోళ్లకు సంబంధించిన ఏ కేసులోనూ ఇంతవరకూ సీబీఐ దోçష నిర్ధారణ చేయలేకపోయింది. ఇప్పుడు అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణం కూడా ఆ దారిలోనే పోతుందా... లేక నిజా నిజాలు నిగ్గుదేలుతాయా అన్నది చూడాల్సి ఉంది. కనీసం రక్షణ కొనుగోళ్లయినా కుంభకోణా లకు అతీతంగా ఉండాలనుకుంటే ఈ కేసు దర్యాప్తు పకడ్బందీగా, చురుగ్గా సాగాలి. నిజమైన దోషులు పట్టుబడాలి. సీబీఐ ఆ పని చేస్తుందా? -
’జయలలిత మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి’
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై పలు అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయంలో ప్రజల అనుమానాల్ని నివృత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు చేయాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఒక లేఖ రాశారు. గత సెప్టెంబర్ 21న జ్వరం, డీ హైడ్రెషన్ కారణంగా ఆస్పత్రిలో చేరిన జయలలిత ఆ తర్వాత జబ్బు బారిన పడటం.. ఆమె కోలుకుంటున్నదని ప్రకటించడం, డిసెంబర్ 4న హఠాత్తుగా ఆమెకు గుండెపోటు వచ్చిందని చెప్పడం చూస్తుంటే ఆశ్చర్యంతోపాటు పలు అనుమానాలు కలుగుతున్నాయని ఆయన మీడియాకు విడుదల చేసిన తన లేఖలో పేర్కొన్నారు. కోలుకొని ఆరోగ్యంగా ఉన్న జయలలితకు హఠాత్తుగా గుండెపోటు ఎందుకు వచ్చిందన్నది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఆస్పత్రిలో ఉండగా చూసేందుకు వచ్చిన కేంద్రమంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్‌ను జయలలిత ఉన్న గదిలోకి అనుమతించకుండా శశికళను మాత్రమే అనుమతించడం పలు అనుమానాలకు తావిస్తున్నదని, గతంలో జయలలిత తనపై విషప్రయోగం జరిపారనే ఆరోపణలతో శశికళతోపాటు 13మందిని పార్టీ నుంచి బహిష్కరించారని, ఈ నేపథ్యంలో జయలలిత మరణం అనుమానాస్పదంగా కనిపిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. -
డీకే రవిది ఆత్మహత్యే!
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డీ.కే రవిది(34) ఆత్మహత్యేనని సీబీఐ తేల్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఒకటి రెండురోజుల్లో నివేదిక అందించనుంది. దాదాపు 20 నెలల క్రితం బెంగళూరులోని అపార్ట్మెంట్లో అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం జాతీయ స్థాయిలో పెద్ద రాద్దాంతమైంది. విపక్షాలు, ప్రజల ఒత్తిడికి తలొగ్గిన సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచర అధికారులను విచారించిన సీబీఐ వ్యక్తిగత కారణాల వల్లే డీ.కే రవి ఆత్మహత్య చేసుకున్నట్లు తేల్చింది. ఒకటి రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన నివేదికను అందజేయనుంది. ఇదిలా ఉండగా డీ.కే రవి తల్లి గౌరమ్మతో పాటు కుటుంబ సభ్యులు డీ.కే రవిది ఆత్మహత్య కాదని ఆరోపిస్తున్నారు. తమకున్న అనుమానాలను సీబీఐ అధికారులకు చెప్పడానికి పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని గౌరమ్మ వాపోయారు. ఇక ఈ విషయమై డీ.కే రవి మామ హనుమంతరాయప్ప మాట్లాడుతూ... నివేదికకు సంబంధించి పూర్తిస్థాయి వివరాలు బయటకు వచ్చేంతవరకూ తాను ఏమీ మాట్లాడనన్నారు. ఒక వేళ ఆత్మహత్యకు మా కుంటుంబ సభ్యులే కారణమని తేలితే ఎటువంటి శిక్ష కైనా సిద్ధమని పేర్కొన్నారు. -
పోస్టాఫీస్‌లలో సీబీఐ తనిఖీలు
-
‘నయీమ్ కేసును సీబీఐకి అప్పగించాలి’
సాక్షి, హైదరాబాద్: నయీమ్ కేసును సీబీఐకి అప్పగించాలని బీసీ సంక్షేమ సంఘం అనుబంధ సంఘాలు డిమాండ్ చేశాయి. నయీమ్‌తో సత్సంబంధాలు నెరిపిన ప్రభుత్వ పెద్దలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. తెలుగుదేశం ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదని సూచించాయి. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగుతున్న ఐదుగురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు, 24 మంది ఐపీఎస్ అధికారులు నయీమ్‌తో సన్నిహితంగా మెలిగి లబ్ధి పొందారని, ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే రుజువులతో సహా ఆ జాబితా బయటపడుతుందని బీసీ అనుబంధ సంఘాల ప్రతినిధులు అరుణ్, గుజ్జ కృష్ణ, నరసింహగౌడ్, నీల వెంకటేశ్ తదితరులు పేర్కొన్నారు. -
వెలుగులోకి ఐటీ రిటర్న్స్
తాండూర్‌లో మహారాష్ట్ర సీబీఐ అధికారుల విచారణ రూ.1.42 కోట్లు దుర్వినియోగం అయినట్లు నిర్ధారణ నలుగురు నిందితులపై కేసు నమోదు ఐటీ కన్సల్టెన్సీ కార్యాలయాన్ని సీజ్ చేసిన సీబీఐ అధికారులు తాండూర్ : మహారాష్ర్ట వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యూసీఎల్)లో పనిచేస్తున్న బొగ్గు గని కార్మికుల ఇన్‌కమ్‌టాక్స్ రిటర్న్స్ కుంభకోణం ఘటన తాండూర్‌లో కలకలం రేపింది. బుధవారం తాండూర్ ఐబీ మండల కేంద్రంలో మహారాష్ట్ర సీబీఐ అధికారులు విచారణ చేపట్టడంతో ఈ ఘటన వెలుగుచూసింది. మహారాష్ట్రకు చెందిన వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ బొగ్గు గని కార్మికులకు సంబంధించి ఇన్‌కమ్‌టాక్స్ రిటర్న్స్ కోసం తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి అక్రమాలకు పాల్పడినకేసులో మహారాష్ట్ర నాగ్‌పూర్‌కు చెందిన సీబీఐ బృందం మాదారంటౌన్‌షిప్, తాండూర్ ఐబీ కేంద్రంలో విచారణ జరిపింది. నాగ్‌పూర్ సీబీఐ ఇన్స్పెక్టర్ హెచ్.ఎస్.జహంగీర్ నేతృత్వంలో నలుగురు సభ్యుల సీబీఐ బృందం తాండూర్ మండల కేంద్రానికి చేరుకొని ఐటీ రిటర్న్స్ ఇప్పించి న ఐటీ కన్సల్టెన్సీ కార్యాలయం వద్ద కు వెళ్లారు. ఆ కార్యాలయం మూసి ఉండటంతో అక్కడి నుంచి మాదారంటౌన్షిప్లోని ఆ కన్సల్టెన్సీ ఏజెంట్ ఇంటికి వెళ్లారు. ఆ ఇంటికి కూడా తాళం వేసి ఉండటంతో కన్సల్టెన్సీలో పని చేసిన జంపాల శ్రీకాం త్ ఇంటికి వెళ్లి అతడిని విచారించా రు. శ్రీకాంత్‌కు సంబంధించిన బ్యాంకు లావాదేవీల పత్రాలను పరిశీలించారు. శ్రీకాంత్ వద్ద నుంచి అతని సెల్‌ఫోన్, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి తాండూర్ ఐబీ కేం ద్రానికి వచ్చి ఐటీ కన్సల్టెన్సీ కార్యాలయాన్ని మాదారం పోలీసుల సమక్షంలో సీబీఐ అధికారులు సీజ్ చేశారు. వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ బొగ్గు గనుల్లో పని చేస్తున్న 201 మంది చంద్రాపూర్, బల్లార్షా తదితర ప్రాంతాల కార్మికులకు చెందిన ఐటీ రిటర్న్స్ పత్రాల దాఖలులో జరిగిన అక్రమాలపై ఎఫ్ఐఆర్ నం.11/2016 కింద కేసు నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ ప్రకారంగా తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి 201 మంది కార్మికులకు సంబంధించి రూ.1.42 కోట్లు ఐటీ రిటర్న్స్ ప్రభుత్వం నుంచి ఇప్పించినట్లు విచారణలో సీబీఐ అధికారులు తేల్చారు. దీంతో ఇన్‌కంటాక్స్ డిపార్ట్మెంట్, ప్రభుత్వాన్ని మోసగించ డం, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ అక్రమ దందా కేసులో బాధ్యులైన వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఆఫీషియల్స్, కన్సల్టెన్సీ పనిచేసిన జంపాల శ్రీకాంత్, రాజేశ్‌తోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు నాగ్‌పూర్ సీబీఐ ఇన్స్పెక్టర్ హెచ్.ఎస్.జహంగీర్ వివరించారు. ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. -
రైల్వేసెక్షన్ ఆఫీసులో సీబీఐ విచారణ
హిందూపురం అర్బన్ : సౌత్ వెస్ట్రన్ రైల్వే హిందూపురం బ్రాంచ్ సెక్షన్ ఆఫీసులో శుక్రవారం సీబీఐ పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. రైల్వే ఉద్యోగుల పిల్లలకు అందించే హాస్టల్ ఫీజు నిధులను రెండేళ్లుగా అక్రమంగా కాజేస్తూ సుమారు రూ.కోటి స్వాహా చేసిన కుంభకోణం బయటపడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన రైల్వే ఉన్నతాధికారులు వ్యవహారాన్ని సీబీఐకు అప్పగించారు. ఆర్నెల్లుగా రెండు డివిజన్ కార్యాలయాల్లో సీబీఐ అధికారులు విచారణలు చేపడుతూ వచ్చారు. ఇందులో భాగంగా శుక్రవారం సీబీఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, మరో ముగ్గురు అధికారులు, పెనుకొండ, హిందూపురం సెక్షన్ ఇంజనీరు కార్యాలయాల్లో రైల్వే ఉద్యోగులను విచారణ చేశారు. వారి వద్ద డ్యూటీ కార్డులు, ఆధార్ కార్డులు, ఇతర పత్రాలను తీసుకున్నారు. సీబీఐ కోర్టుకు హాజరై ఈ కేసులో సాక్షులుగా వివరాలు వెల్లడించాలని చెప్పారు. -
'సింగరేణి అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలి'
హైదరాబాద్ : సింగరేణి అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లో సింగరేణి అవినీతిపై ప్రశ్నించిన కార్మికులపై టీఆర్ఎస్, టీజీబీకేఎస్ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణిలో డిపెండెంట్ కుటుంబాలకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
'అచ్చెన్నాయుడు అబద్ధాలాడుతున్నారు'
హైదరాబాద్: ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తనను ఎప్పుడూ చూడలేదని, అబద్ధాలాడుతున్నారని నట్టికుమార్ ఆరోపించారు. మంత్రిపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. హైదరాబాద్‌లో బుధవారం నట్టికుమార్ మీడియాతో మాట్లాడుతూ...గ్యాంగ్‌స్టర్ నయీం, మంత్రి అచ్చెన్నాయుడు వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపితే అన్ని వాస్తవాలు బయటకొస్తాయని చెప్పారు. మే 17న స్పైస్ జెట్ విమానంలో తామిద్దరం విశాఖ నుంచి హైదరాబాద్‌కు వచ్చామన్నారు. విమాన ప్రయాణ సమయంలో నయీంకు సంబంధించిన వ్యవహారాలపై మంత్రితో మాట్లాడానన్నారు. సీసీ టీవీ ఫుటేజీ బయటకు తీస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన చెప్పారు. టీడీపీ నేత జగ్గిరెడ్డికి ఉత్తరాంధ్రలో నాలుగే క్యాంటీన్లు ఉన్నాయని చెబుతున్నారని...అంతకంటే ఎక్కువ క్యాంటీన్లు ఉంటే ప్రభుత్వానికి స్వాధీనం చేస్తారా ? అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఆయన తనయుడు చైతన్యరెడ్డిపైనా కూడా విచారణ జరపాలని నట్టికుమార్ డిమాండ్ చేశారు. -
'నయీం, మంత్రిపై సీబీఐ విచారణకు డిమాండ్'
శ్రీకాకుళం : గ్యాంగ్‌స్టర్ నయీంతో కార్మిక, క్రీడాల శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి ఉన్న సంబంధాలపై సీబీఐ విచారణ జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...సినీ నిర్మాత నట్టి కుమార్ ఆరోపణలపై టీడీపీ నేతలు స్పందించాలన్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ నేతలు స్పందించడం లేదంటే వారి ప్రమేయం ఉన్నట్లు అనుమానించాల్సి వస్తోందని తమ్మినేని అన్నారు. -
రూ.కోటి స్వాహాపై సీబీఐ ఆరా
హిందూపురం అర్బన్ : హిందూపురం రైల్వేసెక్షన్ ఇంజినీరింగ్ కార్యాలయానికి మంగళవారం సీబీఐ పోలీసులు వచ్చి రూ.కోటి స్వాహా కేసుపై విచారణ చేపట్టారు. పిల్లల స్కాలర్‌షిప్‌ల పేరిట రైల్వే సొమ్ము తీసుకున్న నాల్గోlతరగతి ఉద్యోగులను విచారణ చేశారు. కాగా 2014 ఆగస్టు నుంచి 2016 ఫిబ్రవరి వరకు మూడు సెక్షన్లలో 28 గ్యాంగ్‌మెన్, సెక్షన్‌లోని ఉద్యోగులకు వారి వేతనంతో పాటు స్కాలర్షిప్ పథకం కింద మంజూరైన మొత్తంతో పాటు హాస్టల్ స్కీంలకు ఎలాంటి దరఖాస్తు చేయకపోయినా ఈపథకాన్ని వర్తింపజేసి వారి ఖాతాల్లో రూ.45 వేల నుంచి రూ.90 వేలు వరకు కాజేశారు. ఈ వివరాలను ఈ ఏడాది మార్చిలో ‘సాక్షి’ బయట పెట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఉన్నతస్థాయి విచారణ కొనసాగుతోంది. -
రూ.570 కోట్లపై సీబీఐ విచారణ
చెన్నై : తిరుపూరులో రూ.570 కోట్లు పట్టుబడిన వ్యవహారంలో కోయంబత్తూరు స్టేట్‌బ్యాంకు అధికారులను సీబీఐ విచారించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు తిరుపూర్ సమీపంలో చెంగపల్లిలో మూడు కంటైనర్ లారీలు సరైన ఆధారాలు లేకుండా పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నగదు కోయంబత్తూరు స్టేట్‌బ్యాంక్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణం శ్రీపురం ఎస్బీఐకు తీసుకెళుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నగదును ఆదాయపన్ను శాఖ ఆదేశాల మేరకు కోయంబత్తూరు స్టేట్‌బ్యాంకులో భద్రపరిచారు. అయితే నగదు విషయం తమకు తెలియదని రిజర్వుబ్యాంకు వెల్లడించింది. దీనికి సంబంధించి డీఎంకే దాఖలు చేసిన పిటిషన్ విచారించిన మద్రాసు హైకోర్టు రూ.570 కోట్ల పట్టుబడిన వ్యవహారం పై సీబీఐ విచారణ జరపాలని ఆదేశించింది. దీంతో ప్రాథమిక విచారణ జరిపిన సీబీఐ అధికారులు నగదుతో పట్టుబడిన లారీల రిజిస్ట్రేషన్ నంబర్లు నకిలీవని న్యాయస్థానంలో సమర్పించిన నివేదికలో తెలియచేశారు. శుక్రవారం తిరుపూర్ కలెక్టర్ జయంతిని కలిసి నగదు స్వాధీనానికి సంబంధించిన ఆధారాలను పొందిన సీబీఐ అధికారులు కోయంబత్తూరు స్టేట్‌బ్యాంకు ప్రధాన కార్యాలయంలో విచారణ జరిపారు. వారు ఇచ్చిన సమాధానాలు వీడియోలో నమోదు చేశారు. రిజర్వు బ్యాంక్ తరఫున పంపిన రూ.570 కోట్లకు సరైన ఆధారాలు ఎందుకు పంపలేదు. వాటిని దాచాల్సిన అవసరం ఏమిటి? నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్లతో లారీలతో ఎందుకు నగదు పంపాల్సి వచ్చింది, భద్రత లేకుండా అంత మొత్తాన్ని ఎందుకు పంపారు? వంటి ప్రశ్నలను సీబీఐ అధికారులు అడిగారు. -
'నయీం ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి'
హైదరాబాద్: రాజకీయ పెద్దలు, పోలీసుల సహకారంతో గ్యాంగ్‌స్టర్ నయీం చీకటి సామ్రాజ్యాన్ని స్థాపించి వేల కోట్ల ఆస్తులు కూడబెట్టాడని, దీనిపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దల సహకారంతోనే నయూమ్ తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడన్నారు. కరుడుగట్టిన ఈ నేరగాడిని పోలీసులు ఎన్కౌంటర్ చేయడం అభినందనీయమన్నారు. కరీంనగర్ జిల్లాలోనూ నయీం సెటిల్మెంట్లు, దందాలు చేశాడని, నగునూర్లోనూ వందల ఎకరాల భూములను సంపాదించాడని తెలిపారు. వీటన్నింటిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయించి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని, అతడికి సహకరించిన రాజకీయ నాయకులు, పోలీసులు, ఇతరుల పేర్లను బయటపెట్టాలని కోరారు. 2013 చట్టం అమలుతోనే న్యాయం ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరించే భూములకు 2013 చట్టం అమలు చేస్తేనే భూనిర్వాసితులకు న్యాయం జరుగుతుందని చాడ అన్నారు. జీవో 123పై కోర్టు స్టే ఇవ్వడం ప్రభుత్వ విజయం కాదన్నారు. హైకోర్టు ఇచ్చిన స్టేపై తాము అప్పీల్‌కు వెళ్తామన్నారు. 2013 చట్టం ప్రకారం భూనిర్వాసితులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాడుతామన్నారు. -
'సదావర్తి భూములపై సీబీఐ విచారణ జరపాలి'
హైదరాబాద్ : సదావర్తి సత్రం భూములపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రూ.5 కో్ట్లకు అదనంగా సదావర్తి భూముల కొనుగోలు చేస్తామన్న కంపెనీని నిబంధనల పేరుతో బెదిరించడం ఎంతవరకూ సమంజసమని వేణుగోపాలకృష్ణ ప్రశ్నించారు. బాధ్యతగల పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఇలాగేనా వ్యవహరించేందంటూ ధ్వజమెత్తారు. సదావర్తి భూముల కుంభకోణంలో రూ.వెయ్యి కోట్ల దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. బందరు పోర్టుకు ఎంత భూమి సేకరించాలనుకుంటున్నారో వెల్లడించలేదన్నారు. పోర్టు భూ సమీకరణపై మంత్రులు తలోమాటా మాట్లాడుతున్నారని వేణుగోపాలకృష్ణ అన్నారు. దీని వెనుక ఉన్న రహస్య ఎజెండా ఏంటో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. -
సీబీఐ వస్తుంది జాగ్రత్త!
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి మండిపడ్డారు. కొత్తగా కట్టిన కాలేజి భవనాన్ని ప్రారంభించిన తన ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాను ఉద్దేశించి ట్వీట్ చేస్తూ.. సీబీఐ ఏ నిమిషంలోనైనా రావొచ్చు, జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ప్రధానమంత్రి మోదీ సీబీఐని పంపొచ్చు లేదా ఆ కాలేజి భవనాన్ని కట్టే అధికారం నీకు లేదని చెప్పొచ్చు అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే, మనీష్ సిసోదియా మీడియా సలహాదారు ఇంట్లో దోపిడీ జరిగిందంటూ గురువారం మరో ట్వీట్ చేశారు. అయితే దొంగలు కేవలం కొన్ని అధికారిక పత్రాలను మాత్రమే తీసుకెళ్లి విలువైన వస్తువులున్నింటినీ వదిలేశారని.. దీని వెనకాల ఎవరున్నారని ప్రశ్నార్థకం సంధించారు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న మనీష్ సిసోదియా కొత్తగా నిర్మించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ కాలేజిని బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీడబ్ల్యుడీ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా పాల్గొన్నారు. ఇలాంటి మంచి భవనం కట్టినందుకు జైన్‌ను సిసోదియా అభినందించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తమను ఇబ్బందులు పెట్టినా, తాము పనులు చేస్తూనే ఉన్నామని ఆయన అన్నారు. Robbery at Dy CM's media advisor's home. Burglars stole only official papers, left all valuables. Who's behind it? https://t.co/t5uHXivwnE — Arvind Kejriwal (@ArvindKejriwal) 21 July 2016 Manish, be prepared. Modi ji will either send CBI against u or declare that u did not have power to construct it https://t.co/oOEZBkYBDi — Arvind Kejriwal (@ArvindKejriwal) 20 July 2016 -
న్యాయం జరగకపోతే భర్త దారిలోనే !
డివైఎస్పీ గణపతి భార్య పావన హెచ్చరిక బెంగళూరు: ప్రభుత్వం నుంచి తమకు న్యాయం లభించకపోతే తన భర్త నడిచిన దారిలోనే ఆత్మహత్యకు పాల్పడతానని డీఎస్పీ గణపతి భార్య పావన హెచ్చరించారు. ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్ నేతృత్వంలోని బీజేపీ నేతల బృందం శనివారం మడికేరిలోని రంగసముద్రంలో ఉన్న డీఎస్పీ గణపతి నివాసానికి చేరుకుని గణపతి భార్య పావన, కుమారుడు నిహాల్, తండ్రి కుశాలప్పలతో మాట్లాడారు. ఈ సందర్భంగా గణపతి భార్య పావన తన ఆవేదనను బీజేపీ నేతల బృందానికి వివరించారు. ‘ ఆయన ఎదుర్కొన్న ఒత్తిళ్లు మీడియా ఎదుటే వివరించారు... ఆయన బలవన్మరణానికి పాల్పడినా ఇప్పటి వరకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదు. న్యాయం జరుగుతుందనే నమ్మకం కూడా లేదు... మాకు న్యాయం లభించకపోతే నేను, నా పిల్లలు నా భర్త నడిచిన దారిలోనే నడిచి ఆత్మహత్య చేసుకుంటాం’అని బీజేపీ బృందానికి తెలిపారు. దీంతో వారు ఆమెకు ధైర్యం చెప్పారు. పిల్లలు ఉన్న దృష్ట్యా అలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించారు. అనంతరం ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్ మాట్లాడుతూ...’డీఎస్పీ గణపతి ఆత్మహత్యకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి జార్జ్ రాజీనామా చేసే వరకు అసెంబ్లీలో అహోరాత్రుల్లు ధర్నాను కొనసాగిస్తామని, సోమవారం నుంచి తిరిగి మా ధర్నా ప్రారంభమవుతుందన్నారు. ఐదు రోజులుగా అసెంబ్లీలోనే ఉండి పోరాటం కొనసాగిస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని, జార్జ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బృందంలో ఆర్.అశోక్, కె.జి.బోపయ్య, అప్పచ్చు రంజన్, సోమణ్ణ తదితరులు ఉన్నారు. -
ముద్రగడ.. సీబీఐ విచారణ వద్దంటున్నారు: చినరాజప్ప
తుని ఘటనపై సీబీఐ విచారణకు ముద్రగడ పద్మనాభం అంగీకరించడం లేదని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, చిరంజీవి మాత్రం దీనిపై సీబీఐ విచారణ కోరుతున్నారన్నారు. ఈ విషయాన్ని తాము పోలీసుల ద్వారా ముద్రగడ వద్దకు పంపితే, ఆయన వద్దన్నారని చినరాజప్ప తెలిపారు. ఈ విషయంపై ప్రజలే ఆలోచించాలని ఆయన అన్నారు. ముద్రగడకు వైద్యసేవలు చేసేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారని, అయితే ఆయనే అంగీకరించడం లేదని చెప్పారు. ఆయన చేస్తున్న డిమాండ్లు ఆమోదయోగ్యం కాదని తెలిపారు. తుని ఘటనలో అరెస్టులు ఆపాలని, ఇప్పటికే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని ముద్రగడ డిమాండ్ చేస్తున్నారని.. అయితే ఆ విషయం కోర్టు పరిధిలో ఉన్నందువల్ల తాము ఏమీ చేయలేమని హోం మంత్రి అన్నారు. సీబీఐ విచారణ జరుగుతుందో లేదో త్వరలోనే తేలుతుందని ఆయన చెప్పారు. -
ఎఫ్‌సీఐ కార్యాలయంలో సీబీఐ విచారణ
మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఎఫ్‌సీఐ కార్యాలయంలో శుక్రవారం సీబీఐ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఎఫ్‌సీఐలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న సోమయ్య ఇటీవలి కాలంలో రూ. 10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. దీంతో సీబీఐ అధికారులు ఎఫ్‌సీఐలో విచారణ చేపట్టారు. సీబీఐ డీఎస్పీ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. -
సీబీఐ విచారణకు సిద్ధమా?
బాబూ.. భూదందాలో అసలు నిందితుడివి నువ్వే... విచారణ జరగాల్సింది నీ పైనే.. ♦ రెండేళ్లయినా ఒక్క హామీ అమలు కాలేదు.. చంద్రబాబు అసమర్థత వల్లే రాష్ట్రానికి నష్టం.. ♦ ఇక్కడ ఏడుస్తారు.. ఢిల్లీలో బ్రహ్మాండంగా పొగుడుతారు ♦ ప్రత్యేక హోదా, వృద్ధిరేటుపై గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారు ♦ ముఖ్యమంత్రి చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోంది.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మండిపాటు సాక్షి, హైదరాబాద్: రాజధాని భూ కుంభకోణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అసలు నిందితుడని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. విచారణ జరగాల్సింది చంద్రబాబుపైనేనని అన్నారు. రాజధాని వ్యవహారంలో ‘ఇన్సైడర్ ట్రేడింగ్’కు పాల్పడ్డారని ఆరోపించారు. భూదందాపై సీబీఐ విచారణకు సిద్ధమా? అని అధికార పక్షానికి సవాలు విసిరారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం శాసనసభలో జరిగిన చర్చలో వైఎస్ జగన్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, రైల్వే జోన్, రాజధానిలో భూదందా... వంటి కీలక అంశాలపై ఆధారాలు, గణాంకాలను ప్రస్తావిస్తూ ఆయన ప్రసంగం సాగింది. జగన్ ప్రసంగిస్తున్నంత సేపూ అధికార పక్ష సభ్యులు అడుగడుగునా అడ్డుపడ్డారు. జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... కేంద్రాన్ని నిలదీయలేరా? ఈ రెండేళ్లలో సంతృప్తి కలిగించే ఒక్క ప్రాజెక్టు అయినా తీసుకొచ్చారా? ఎందుకు కేంద్రాన్ని నిలదీయడం లేదు? నెల రోజుల్లోగా హామీలు నెరవేర్చకపోతే కేంద్రంలోని తమ మంత్రులను ఉపసంహరించుకుంటామని ఎందుకు చెప్పలేకపోతున్నారు? చంద్రబాబు వ్యవహార శైలిని గమనిస్తే ఆయన చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోంది. ‘హోదా’ అక్కర్లేదని అనుకోరా? విశాఖపట్నంలో ఇటీవల పెట్టుబడి సదస్సు నిర్వహించారు. అరడజను మంది కేంద్ర మంత్రులను పిలిచారు. రెండు రోజుల్లో రూ.4.67 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని గొప్పలు చెప్పుకున్నారు. 48 గంటల్లో రూ.4.67 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఫర్వాలేదని కేంద్ర మంత్రులు అనుకోరా? ప్రత్యేక హోదా వస్తే రూ.4.67 లక్షల కోట్లు కాదు.. దానికి నాలుగు రెట్లు పెట్టుబడులు, మన యువతకు ఉద్యోగాలు వచ్చేవి. ‘హోదా’ కోసం పోరాడుతున్నాం.. ప్రత్యేక హోదా కోసం మేం పోరాడుతున్నాం. హోదాను రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పెట్టి ఉంటే సమస్య రాకపోయేదంటారు. ఈ చట్టాన్ని గతంలో ఎన్నిసార్లు సవరించలేదు? కేంద్రంలో టీడీపీ మిత్రపక్షమే ఉంది.. అయినా సవరించలేరా? ఇతర రాష్ట్రాలు ఒప్పుకోలేదు కాబట్టి ఇవ్వలేదంటారు. పార్లమెంట్లో రాష్ట్ర విభజన బిల్లుకు ఓట్లు వేసేటప్పుడు ఇతర రాష్ట్రాలు లేవా? కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకొని, ప్రణాళికా సంఘాన్ని ఆదేశించి రెండేళ్లవుతున్నా ఆ దిశగా చర్యల్లేకపోవడం బాధాకరం. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగుతున్నప్పుడు మన రాష్ట్రానికి ఎందుకు రాదు? గతం చూసుకో బాబూ: గతంలో చంద్రబాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పుడు కూడా విదేశాల్లో షికార్లు కొట్టేవారు. పెట్టుబడి సదస్సులు పెట్టారు. ఆ తొమ్మిదేళ్లలో రూ.1,000 కోట్ల పైబడిన పెట్టుబడితో ఎన్ని గ్రీన్‌ఫీల్డ్ పరిశ్రమలు తెచ్చారు? ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు తెచ్చారు? ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు? 10.99 శాతం వృద్ధిరేటు బోగస్ జాతీయ వృద్ధిరేటు 7.3 శాతం అయితే, రాష్ట్రంలో 10.99 శాతం వృద్ధి నమోదైందని గవర్నర్‌తో అబద్ధం చెప్పించారు. కేంద్రం చెబుతున్న 7.3 శాతమే వాస్తవం కాదని, ఎక్కువ చేసి చెబుతున్నారని నిపుణులు అంటున్నారు. రాష్ట్రంలో 10.99 శాతం వృద్ధి నమోదైందని చెప్పుకోవడం సరికాదు. ఏపీకి ఒక్క ఐటీ పరిశ్రమ కూడా రాలేదు. పరిశ్రమలు మూత పడుతున్నాయి. కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో 10.99 శాతం వృద్ధి ఎలా సాధ్యమైంది. ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న లెక్కలు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. వాస్తవ గణాంకాలు రావడానికి నాలుగేళ్లు పడుతుంది. అప్పటికి ఏదో ఒకటి బొంకవచ్చనే అబద్ధాలు చెబుతున్నారు. వృద్ధిరేటుకు, ప్రభుత్వ రాబడికి సంబంధం ఉంటుంది. కేంద్రంలో 7.3 శాతం వృద్ధిరేటు నమోదు చేస్తే, రాబడి 22 శాతం పెరిగింది. మన వృద్ధిరేటు 10.99 శాతం ప్రకారం చూస్తే 30 శాతం రాబడి పెరగాలి. కానీ, పెరిగింది కేవలం 13 శాతమేనని సీఎం డాష్‌బోర్డులో చూపించారు. ప్రభుత్వం చెబుతున్న వృద్ధిరేటను చూసి కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంటుంది? తప్పుడు సంకేతాలు వెళ్లవా? విశాఖకు ఒక్క ఐటీ కంపెనీ అయినా తెచ్చారా? హీరో మోటార్ కార్ప్ ఇక్కడ ఫ్యాక్టరీ పెడతామంటే.. వాళ్లతో చంద్రబాబు ఫొటోలు దిగారు. ఏషియన్ పెయింట్స్ వాళ్లలోనూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ రెండు కంపెనీలు ఏమయ్యాయి? విశాఖ పట్నానికి ఒక్క ఐటీ కంపెనీ అయినా తెచ్చారా? సొంత ఇమేజ్ కోసం భారీగా ఖర్చు చంద్రబాబు సొంత ఇమేజ్ను పెంచుకోవడానికి రాష్ట్రాన్ని తాకట్టుపెట్టడం సబబా? రాజధాని శంకుస్థాపనకు రూ.400 కోట్లు ఖర్చుపెట్టారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా ప్రైవేట్ విమానాల్లోనే తిరుగుతున్నారు. విదేశీ పర్యటనలకు భారీ సైన్యంతో వెళుతున్నారు. వీటన్నింటినీ కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు చూసి ఏమనుకుంటాయి? మన వద్ద చాలా డబ్బులు ఉన్నాయనుకోరా? సొంత ఇమేజ్ పెంచుకోవడం చేస్తున్న ఖర్చు కొంపముంచడం ఖాయం. చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(సీఆర్డీఏ)ని చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీగా మార్చేశారు. సింగపూర్ కంపెనీ రాజధాని మాస్టర్‌ప్లాన్‌ను ఉచితంగా తయారు చేసి ఇచ్చిందని గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారు. మాస్టర్ ప్లాన్ కోసం సింగపూర్‌కు చెందిన సుర్బానా కంపెనీకి ప్రభుత్వం రూ.12 కోట్లు చెల్లించింది. సీబీఐ విచారణ జరిపించండి రాజధాని భూ కుంభకోణంపై ఎంతసేపు మాట్లాడినా.. ముఖ్యమంత్రి సీబీఐ విచారణకు అంగీకరించలేదు. సీబీఐ విచారణ అంటే.. తేలు కుట్టిన దొంగల్లా వెనక్కిపోతున్నారు, ఉలిక్కిపడుతున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో చంద్రబాబు ఆరోపణలు చేసినప్పుడు.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించారు. నిజాయితీ ఉంది కాబట్టే సీబీఐ విచారణకు అంగీకరించారు. రాజధాని భూ కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలి. ప్రభుత్వ రహస్యాలను కాపాడుతామంటూ ప్రమాణం(ఓత్ ఆఫ్ సీక్రసీ) చేసిన ముఖ్యమంత్రి... దాన్ని ఉల్లంఘించారు. రాజధాని భూదందాలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన చంద్రబాబే అసలు నిందితుడు. కమీషన్లపైనే ఎక్కువ శ్రద్ధ... పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఆసక్తి లేదు. కమీషన్ల మీదే ఎక్కువ శ్రద్ధ. పనులు నత్తనడకన సాగుతున్నాయని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) 2015 ఆగస్టులో ప్రభుత్వానికి లేఖ రాసింది. 2015 జనవరి నుంచి జూన్ వరకు 2 శాతం పనులే జరిగాయని పేర్కొంది. పనులు చేసే సత్తా కాంట్రాక్టర్‌కు లేదనీ స్పష్టం చేసింది. 2015 అక్టోబర్ 10న జరిగిన మంత్రివర్గ సమావేశంలో.. ప్రాజెక్టు పనులను సమీక్షించారు. ఇప్పటిదాకా 5.52 శాతం పనులే జరిగాయని మంత్రివర్గం దృష్టికి వచ్చింది. కాంట్రాక్టర్‌కు పనిచేసే సామర్థ్యం లేదని తేల్చింది. కాంట్రాక్టర్‌ను తొలగించి, మళ్లీ టెండర్లు పిలవాలి. కాంట్రాక్టర్‌ను తొలగించాల్సింది పోయి, ధరలు పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సబ్ కాంట్రాక్టర్లను నామినేషన్ మీద తెచ్చుకోవచ్చని నిర్ణయం తీసుకున్నారు. దానిపై సంతకాలు చేయడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు భయపడ్డారు. కాంట్రాక్టర్‌కు ధరలు పెంచి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇంధనం, స్టీలు, అల్యూమినియం రేట్లు తగ్గాయి. ఫలితంగా ధరలు తగ్గాలి. కానీ, విచిత్రంగా పెంచారు. కొత్తగా టెండర్లు పిలిస్తే తక్కువ ఖర్చుతో పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకొస్తారు. పోలవరం కుడికాల్వ 7వ ప్యాకేజీలో మిగిలిపోయిన రూ.23 కోట్ల విలువైన పనులను చంద్రబాబు బినామీ బొల్లినేని శీనయ్య కంపెనీకి రూ.74 కోట్లకు ఇచ్చారు. దీనిపై సంతకాలు చేయడానికి ఇద్దరు సీఎస్‌లు భయపడ్డారంటే.. పాలకులు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. ఈ ప్రశ్నలకు బదులేది..? ► రాజధాని ఎక్కడ వస్తుందో మీకు, మీ బినామీలకు తప్ప ఎవరికీ చెప్పకుండా ఉండటం న్యాయమేనా? ► రాజధానిని ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామంటూ పలు పేర్లు చెప్పడం మోసం కాదా? ► రాజధాని రైతుల దగ్గర మీ బినామీలు ► తక్కువ ధరలకు భూములు కొనలేదా? ► మీ బినామీల భూములకు డిమాండ్ సృష్టించడానికి వాటిని రియల్ జోన్లో పెట్టలేదా? ► అసైన్డ్, లంక భూములను కొనడం నేరమని తెలిసినా కొనలేదా? ► రైతులను భయపెట్టి తక్కువ ధరలకు భూములను లాక్కోలేదా? ► రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షలకు భూములు కొని పేదలను మోసం చేయలేదా? ► టీడీపీ నేతలంతా భూములను కొన్న తర్వాతే రాజధాని ప్రకటన చేయలేదా? ► ఫలానా చోట రాజధాని వస్తుందని తెలిసీ, భూములు కొన్న తర్వాత రాజధానిని ప్రకటించడం ధర్మమేనా? ► అసైన్డ్ భూములకు ల్యాండ్ పూలింగ్ కింద పరిహారానికి సంబంధించిన జీవో 41ను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇవ్వలేదా? ► ఎస్టీ, ఎస్సీలు, బడుగులకు చెందిన అసైన్డ్ భూములను కొనుగోలు చేయవచ్చంటూ చట్టంలో దిక్కుమాలిన మార్పులు చేసేందుకు ప్రయత్నించడం వాస్తవం కాదా? ► రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన రూ.2 వేల కోట్లను మళ్లించి, సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు రాష్ట్రాన్ని తాకట్టుపెట్టడం ధర్మమేనా? ► సింగపూర్ ప్రభుత్వం రాజధానిని నిర్మిస్తుందని మొదట చెప్పి, ఇప్పుడు సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు చేస్తాయని చెప్పడం మోసం కాదా? మిగతా హామీలు... రైల్వే జోన్ మంజూరు చేస్తామని, పెట్రో కెమికల్ కారిడార్, కడపలో స్టీల్‌ప్లాంట్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మూడు బడ్జెట్లు పోయాయి. వాటి ఊసు ఎక్కడా కనిపించలేదు. కానీ, చంద్రబాబు మాత్రం అదిగో జోన్, ఇదిగో కారిడార్, అల్లదిగో స్టీల్‌ప్లాంట్ అంటూ ప్రజలను ఊరిస్తూనే ఉన్నారు. హామీలు ఏమయ్యాయి? హామీ-1 రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత ప్రవేశపెడుతున్న మూడో బడ్జెట్ ఇది. ఇక మిగిలింది రెండు బడ్జెట్లే. పార్లమెంట్లో ఓటేసి మరీ రాష్ట్రాన్ని విడగొట్టినవారిలో అప్పటి అధికార పక్షం కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్షంలో టీడీపీ కూడా ఉంది. విడగొట్టినప్పుడు పార్లమెంట్ సాక్షిగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి హామీలు ఇచ్చాయి. రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, పారిశ్రామికాభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు, హైదరాబాద్ లాంటి నగరాన్ని తీసేసుకుంటున్నారు కాబట్టి నష్టపరిహారంగా ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని 2014 మార్చి 2న కేంద్రంలో అప్పటి ప్రభుత్వం మంత్రివర్గంలో తీర్మానం చేసింది. హోదా కల్పించాలంటూ ప్రణాళికా సంఘాన్ని అప్పటి ప్రధానమంత్రి ఆదేశించారు. ఆదేశాలు ఇచ్చి 24 నెలలు గడిచిపోయాయి. ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ వచ్చి 15 నెలలు దాటింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు ఉండే విధంగా తెస్తామంటూ ఇదే అసెంబ్లీలో గవర్నర్‌తో తొలి ప్రసంగంలో చెప్పించారు. రెండేళ్లు గడిచిపోయాయి. ప్రతీ సందర్భంలో ఏదో ఒకటి చెబుతూ కాలం గడిపేస్తున్నారు. హామీ-2 పోలవరం ప్రాజెక్ట్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం రెండో హామీ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ను 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని గవర్నర్‌తో తొలి ప్రసంగంలో చెప్పించారు. ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి. పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పుడు పోలవరం ఫేజ్-1 పూర్తి చేస్తామని కొత్తగా చెబుతున్నారు. పోలవరంలో ఫేజ్-1 ఉందనే విషయం ఎవరికీ తెలియదు. పోలవరం ప్రాజెక్టులో కట్టినంత వరకు ఫేజ్-1 అంటారో, లేక పట్టిసీమనే ఫేజ్-1 అంటారో తెలియదు. చంద్రబాబు కాలయాపన చేస్తూనే ఉన్నారు. హామీ-3 రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని మరో హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆయా ప్రాంతాలకు వెళ్లినప్పుడు ప్యాకేజీ తెస్తామని ఊదరగొడుతున్నారు. ప్యాకేజీ వస్తుందని, అభివృద్ధి జరుగుతుందని ఆ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తూనే ఉన్నారు. హామీ- 4 రాష్ట్రంలో రిసోర్స్ గ్యాప్ ఉంటే దానికి పరిహారం ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ముఖ్యమంత్రి ఇక్కడ బీద ఏడుపులు ఏడుస్తారు. ఢిల్లీలో మాత్రం బ్రహ్మాండంగా పొగిడి వస్తారు. ఆయన ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారో అర్థం కావడం లేదు. సొంత పనులు చక్కబెట్టుకోవడానికి వెళ్తున్నారో, ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడటానికి వెళుతున్నారో తెలియడం లేదు. రిసోర్స్ గ్యాప్‌కు సంబంధించిన పరిహారం వస్తుందని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. హామీ- 5 రాజధాని నిర్మాణానికి అటవీ భూమిని డీనోటిఫై చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. గుంటూరు జిల్లాలోని వినుకొండలో 20 వేల ఎకరాల అటవీ భూములున్నా చంద్రబాబు వద్దంటారు. తన బినామీల కోసం ల్యాండ్ పూలింగ్ ముద్దంటారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం వనరులిచ్చి చేయమంటే.. వద్దని బాబు అంటున్నారు. రెండేళ్లయినా ఒక్క ఇటుకా పడలేదు. -
సర్కారు పరార్
♦ రాజధాని భూదందాపై విచారణకు వెనుకంజ ♦ భూకుంభకోణంపై దద్దరిల్లిన అసెంబ్లీ సాక్షి, హైదరాబాద్: రాజధాని భూ కుంభకోణంపై బుధవారం రాష్ట్ర శాసనసభ దద్దరిల్లింది. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికార పక్షం పూర్తి ఆత్మరక్షణలో పడింది. గవర్నరు ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రాజధాని భూదందాపై ప్రతిపక్ష నేత చేసిన ఆరోపణలకు అధికారపక్షం నుంచి సరైన సమాధానమే లేకపోయింది. సీఎం, మంత్రులు, అధికార పక్ష సభ్యులు ఒకరి తర్వాత ఒకరు జగన్‌పై ఎదురుదాడికి దిగారు. ‘గుడ్డ కాల్చి మొహాన వేయడం కాదు. తమాషా కాదు. ఇద్దరు మంత్రులపై ఆరోపణలు చేశారు. ఆరోపణలను ఫ్రూవ్ చేయాలి. లేదంటే జగన్‌పై చర్యలు తీసుకోవాలి. అప్పటివరకు సభ ముందుకెళ్లే ప్రశ్నేలేదు....’ అంటూ సీఎం ఆవేశంతో ఊగిపోయారు. పలువురు మంత్రులు, అధికార పక్ష సభ్యులు కూడా జగన్‌పై ఎదురుదాడికి దిగారు. వారికి జగన్ సరైన సమాధానమిచ్చారు. ‘అసలు నిందితుడు మీరే... ఇన్సైడర్ ట్రేడింగ్ చేసింది మీరు. విచారణ జరపాల్సింది మీ మీద. రాజధాని ఎక్కడ వస్తుందో మీ అనుయాయులకు, మంత్రులకు లీకులిచ్చి వారు బినామీ పేర్లతో చౌకగా భూములు కొనుగోలు చేయడానికి వీలు కల్పించారు. పదవీ బాధ్యతల స్వీకారం సందర్భంగా చేసిన ప్రమాణం (ఓత్ ఆఫ్ సీక్రెసీ)కి తిలోదకాలిచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో మీమీదే విచారణ జరగాలి. దమ్ముంటే సీబీఐ విచారణకు ఆదేశించండి.’ అని జగన్ పట్టుబట్టారు. ఔటర్ రింగ్‌రోడ్‌పై నిరాధార ఆరోపణలని తెలిసినా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. దాంతో అధికారపక్షం అయోమయంలో పడిపోయింది. ఊహించని ప్రతిసవాల్‌కు ముఖ్యమంత్రి, మంత్రుల నుంచి సమాధానమే లేకపోయింది. రాజధాని భూ కుంభకోణంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులంతా నినాదాలు చేశారు. విపక్షానిదే పైచేయి అవుతుండటంతో ఇక చర్చ జరిగితే మరింత అభాసుపాలవుతామని నిర్ధారణకు వచ్చిన అధికార పక్షం చర్చ పక్కదోవ పట్టిందనే సాకు చూపించి రూల్ 329 కింద ముగింపు తీర్మానం పెట్టి అర్ధంతరంగా చర్చకు పుల్ స్టాప్ పెట్టింది. గవర్నరు ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపైనే ప్రసంగిస్తానని విపక్ష నేత ప్రకటించి మాట్లాడుతున్నా పట్టించుకోకుండా చర్చ కొనసాగించడానికి వీలు లేదంటూ ఆర్థిక మంత్రి యనమల ఈ తీర్మానం తెరపైకి తెచ్చారు. చివరకు విపక్ష సభ్యులను సభ నుంచి ఒక రోజు సస్పెండ్ చేసి బయటకు పంపించి గవర్నరు ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పారు. సస్పెండ్ చేసి ఊపిరి పీల్చుకున్న అధికారపక్షం చర్చ ముగించే తీర్మానం వద్దని, గవర్నరు ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే అంశంపై మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలంటూ తమ తమ స్థానాల్లో నిలబడి వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు డిమాండు చేశారు. బీజేపీ నేతలు కూడా ఇదే విజ్ఞప్తి చేశారు. అయినా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వీలుకాదని తేటతెల్లం చేయడంతో వైఎస్సార్సీపీ సభ్యులు వెల్‌లోకి వెళ్లి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఏమి చేయాలో పాలుపోక అధికార పక్ష సభ్యులు కొద్దిసేపు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. చివరకు సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నందున విపక్ష సభ్యులను సస్పెండ్ చేయాలంటూ మంత్రి యనమల తీర్మానం ప్రవేశపెట్టారు. వైఎస్సార్సీపీ సభ్యులను బుధవారం ఒక్కరోజు సస్పెండ్ చేసినట్లు ప్రకటించడంతో ఆ పార్టీ సభ్యులు బయటకు వెళ్లారు. విపక్షానిదే పైచేయి... అంతకుముందు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా తెలుగుదేశం పాలనను ఎండగడుతూ ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతి అంశానికి సంబంధించి అన్ని వివరాలు, అధికారిక గణాంకాలతో సోదాహరణంగా వివరిస్తుంటే అధికారపక్షం తీవ్ర గందరగోళంలో పడిపోయింది. సమాధానమిచ్చే నెపంతో అడుగడుగునా ఆటంకాలు కలిగించింది. జగన్ మాట్లాడిన సమయం కంటే ఆయన ప్రసంగానికి ఆటంకాలు కలిగించిన సమయం ఎక్కువ ఉందంటే అధికారపక్షం ఎంత ఆందోళన పడిందో అర్ధమౌతుంది. పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేకహోదా వంటి అంశాలపై జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు అధికారపక్షం సమాధానం చెప్పలేక నీళ్లు నమిలింది. మంత్రులు పొంతనలేని సమాధానాలిచ్చారు. వైస్సార్సీపీ నుంచి జగన్ ఒక్కరే మాట్లాడినా అధికార పక్షం నుంచి సీఎం చంద్రబాబు, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు, కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు, యనమల రామకృష్ణుడు, చీఫ్ విప్ కాలువ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, బోండా ఉమామహేశ్వరరావు, బుచ్చయ్య చౌదరి, గొల్లపల్లి సూర్యారావు తదితరులు ఒకరి వెంట ఒకరు జగన్‌పై ఎదురుదాడికి దిగారు. తప్పు చేయకపోతే సీబీఐ విచారణకు ఆదేశించడానికి ఎందుకు భయపడుతున్నారని విపక్షనేత జగన్ సూటిగా ప్రశ్నించడంతో అధికారపక్షం డైలమాలో పడింది. ఈ దశలో ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్డ సీఎం చంద్రబాబు ‘ సీబీఐ విచారణకు ఆదేశించి.. రాజధాని రాకుండా చేయాలన్నదే మీ ఉద్దేశమా? ఎలాంటి విచారణా జరిపించేది లేదు. మీ చేతనైంది చేసుకోండి..’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఇరుకున పెట్టిన ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ ‘రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసుకుని ‘ఇన్సైడర్ ట్రేడింగ్’తో మోసం చేశారు. అసలు ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కంటే తీవ్రమైనది. మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కారుచౌకగా భూములు కొట్టేసి రైతులను వంచించారు. బాధ్యతల స్వీకారం నాటి ప్రమాణాలకు పాతరేశారు’ అంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడంతో అధికారపక్షం బిత్తరపోయింది. ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ ఏమిటా అని వారు చర్చించుకోవడం కనిపించింది. దీనికి ఏం సమాధానమివ్వాలా అని వారు బుర్రలు బద్దలు కొట్టుకున్నారు. ‘రాజధాని ఎక్కడ వస్తుందో స్పష్టంగా తెలిసినప్పటికీ దాచిపెట్టి నూజివీడు... నాగార్జున విశ్వవిద్యాలయం...గురించి ప్రచారం చేసి, ఆయా ప్రాంతాల్లో భూములు కొన్న వారు దారుణంగా నష్టపోయేలా ప్రభుత్వ పెద్దలు వ్యవహరించారు. వారు మాత్రం రాజధాని ప్రాంతంలోనే కొనుగోలు చేశారు. రాజధాని ప్రకటనకు ముందే ఆ ప్రాంతంలో మంత్రులు బినామీ పేర్లతో భూములు కొనడాన్ని బట్టే వారు మోసపూరితంగా కొనుగోలు చేసినట్లు స్పష్టమవుతోంది. ఇంతకంటే ఏమి ఆధారాలు కావాలి?’ అని జగన్ నిలదీశారు. దీంతో ఇంకా ఆయన్ను మాట్లాడనిస్తే అన్ని విషయాలు బయటపడతాయనే భయంతో ‘ముగింపు తీర్మానం’ పేరుతో ప్రతిపక్షం గొంతు నొక్కేశారు. ఆరోపణలకు దీటైన జవాబులు.. అడుగడుగునా అడ్డుతగులుతూ చర్చకు సంబంధం లేకపోయినా తనపై దాఖలైన కేసుల గురించి, ఆస్తుల గురించి ప్రస్తావిస్తూ ఇరుకున పెట్టడానికి ప్రయత్నించిన అధికార పక్ష సభ్యులకు జగన్మోహన్రెడ్డి దీటైన జవాబిచ్చారు. 1978లో రాజకీయాల్లోకి వచ్చే నాటికి రెండెకరాల భూమి మాత్రమే ఉన్న చంద్రబాబు నాయుడికి ఇప్పుడు రూ. 2లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. ‘‘నాపై సీబీఐ విచారణ జరిపించాలని కోర్టుకెళ్లిందెవరు? వైఎస్ ఉన్నంతకాలం జగన్ మంచివాడే... కాంగ్రెస్‌లో ఉన్నంతవరకూ జగన్‌పై కేసులు లేవు. కాంగ్రెస్‌లోనుంచి బయటకు రాగానే నాపై రాజకీయకక్షపూరితంగా కాంగ్రెస్, టీడీపీ కలిసి కేసులు వేశాయి. అయినా నేను విచారణ జరపవద్దంటూ బాబు లాగా స్టేల కోసం ప్రయత్నించలేదు. యూపీఏ అధ్యక్షురాలు నేను సోనియాగాంధీపైనే పోరాటం కొనసాగించా’ అని జగన్ గుర్తు చేశారు. -
చంద్రబాబు వితండ వాదన... వింత వైఖరి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్టూ మంత్రులు భూములు కొనుగోలు చేసిన వ్యవహారంపై శాసనసభ అట్టుడికింది. అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో అసెంబ్లీ దద్దరిల్లింది. రాజధాని చుట్టుపక్కల అత్యంత చవకగా మంత్రులు, వారి బినామీలు భూములను కొనుగోలు చేసిన వ్యవహారంపై ప్రతిపక్ష నాయకుడు చేసిన ఆరోపణలపై అసెంబ్లీలో సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వింత వాదనకు దిగారు. అమరావతిలో రాజధాని ఏర్పాటు విషయంలో తన వాళ్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అఫీషియల్ ఓత్ ఆఫ్ సీక్రసీ ఉల్లంఘించారని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ చేయించాలని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అధికార రహస్యాలను కాపాడుతానని ప్రమాణం చేసిన చంద్రబాబు ఆ రహస్యాలను కాపాడకుండా ఉల్లంఘించారని, ఈ వ్యవహారంలో ఆయనే దోషి అయినందున మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏవైనా అక్రమాలు, అవకతవకలు జరిగాయని ప్రతిపక్షం శాసనసభలో ఆరోపణలు చేసినప్పుడు దానిపై ప్రభుత్వం సమగ్రమైన వివరణ ఇస్తుంది. లేదా విచారణకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటిస్తుంది. అయితే బుధవారం అసెంబ్లీలో అందుకు భిన్నమైన పరిస్థితి తలెత్తింది. సభా నాయకుడైన ముఖ్యమంత్రి ప్రతిపక్షం చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వకపోగా మంత్రులు కొనుగోలు చేసినట్టు చెబుతున్న భూముల సర్వే నంబర్లు ఇప్పటికిప్పుడు సభలో ఇవ్వాలి. లేదంటే జగన్ మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి.. అప్పటివరకు సభ జరగడానికి వీలులేదంటూ చంద్రబాబు భీష్మించారు. ఒకటికి నాలుగు సార్లు చంద్రబాబు ఇదే మాట అనడంతో అధికార పార్టీకి చెందిన మంత్రులు, సభ్యులు కూడా అదే వాదన మొదలుపెట్టారు. ఒకదశలో ముఖ్యమంత్రి అసహనంతో ఊగిపోయారు. రాజధాని రాకుండా తగులబెట్టాలనుకుంటున్నారు. తమాషా అనుకుంటున్నారా... ఇలాంటి వాళ్లను ప్రతిపక్షంగా ఎన్నుకుంటే ఏం కావాలి.... అంటూ ఊగిపోయారు. సభ జరగడానికి వీలులేదంటూ పట్టుబట్టారు. ప్రతిపక్ష సభ్యులను సంతృప్తి పరిచి సభను సజావుగా నడిపించే విషయంలో సభా నాయకుడు సహనంతో వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి సభ జరగడానికి వీలులేదంటూ చెప్పడం విశేషం. ప్రభుత్వం నుంచి సంతృప్తికరమైన సమాధానం రానప్పుడు ప్రతిపక్షం తన నిరసన తెలియజేయడం చట్ట సభల్లో సర్వ సాధారణంగా జరుగుతుంది. సందర్భాన్ని బట్టి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తుంది. అంతవరకు ప్రతిపక్షం ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం సాధారణంగా చట్ట సభల్లో జరుగుతుంది. కానీ బుధవారం అందుకు భిన్నమైన పరిస్థితి తలెత్తింది. అది కూడా సభా నాయకుడే కారణం కావడం విశేషం. మంత్రులు ఎలాంటి భూములు కొనుగోలు చేయలేదని గానీ విచారణ జరిపిస్తానని గానీ ఏమీ చెప్పకుండా సభా నాయకుడే సభ ముందుకు జరగొద్దని చొప్పడం శాసనసభ చరిత్రలో ఇదే మొదటిసారి అని సీనియర్ నేతలు చెప్పారు. -
భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాజధానిలో భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీ ఈ అంశంపై స్పందించాలన్నారు. ఇక పార్టీ ఫిరాయింపులపై పరిణామాలు లజ్జాకరంగా ఉన్నాయని ధర్మాన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం లేకుండా చేయడమంటే పౌరులకు గడ్డు కాలమే అని ఆయన అన్నారు. -
'వ్యాపం' కేసులో కొత్త ట్విస్ట్
భోపాల్: వ్యవసాయిక్ పరీక్షా మండల్ (వ్యాపం) కుంభకోణం దర్యాప్తు అంశంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు విచారణను సీబీఐకి అప్పగించేలా ఉత్తర్వులు జారీచేయాలన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వ అభ్యర్ధనతో ఆ రాష్ట్ర హైకోర్టు విభేదించింది. ఈ మేరకు శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ నెల 20 వరకు విచారించబోనని బుధవారం స్పష్టం చేసింది. దీంతో సీబీఐ విచారణ అంశం ఇప్పటికి తెరముగైనట్లే కనిపిస్తోంది. మరోవైపు సీఎం చౌహాన్ రాజీనామాచేసి, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు ఉధృతం చేసింది. అయితే రాజీనామా చేసే ప్రసక్తేలేదని సీఎం చౌహాన్ కుండబద్దలు కొట్టారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పదుల సంఖ్యలో నిందితులు, సాక్షులు అనుమానాస్పదంగా మృతిచెందుతున్న సంగతి తెలిసిందే. -
ఓటుకు కోట్లు కేసుపై పిల్ వేస్తాం
-
'ఓటుకు కోట్లు కేసుపై పిల్ వేస్తాం'
హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ఓటుకు కోట్లు కేసులో ఎమ్మెల్యే కొనుగోలుకు పాల్పడలేదని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడా చెప్పడంలేదని విమర్శించారు. ఓటుకు కోట్లు కేసు పై టీపీసీసీ, ఏపీసీసీలు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)వేస్తాయని తెలిపారు. ఆర్థిక కుంభకోణంలో ఇరుక్కున్న లలిత్ మోడీని కాపాడేందుకు ప్రధాని నరేంద్రమోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సుష్మాస్వరాజ్, వసుంధర రాజే, స్మృతి ఇరానీ, పంకజ్ ముండేల వ్యవహారంపై మోదీ స్పందించాలన్నారు. విభజన చట్టంలో ఉన్న సెక్షన్-8 పై ఎవరికి అనుకూలంగా వారు వ్యాఖ్యానిస్తున్నారన్నారు. సెక్షన్-8 అమలుకు సంబంధించి న్యాయ వ్యవస్థ స్పష్టత ఇవ్వాలన్నారు. -
‘అగ్రిగోల్డ్’ బాధితుల ఆందోళన
రాజంపేట రూరల్ : తమ బాండ్లకు సంబంధించి నగదు చెల్లించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని అగ్రిగోల్డ్ బాధిత ఐక్య సాధన సమితి జిల్లా కార్యదర్శి వి.ప్రసాద్, రాజంపేట అధ్యక్షుడు పీవీ సుబ్బారావు అన్నారు. రాజంపేట బైపాస్ రోడ్డులోని అగ్రిగోల్డ్ కార్యాలయం వద్ద బాధితులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీ వో కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. యజమాన్యానికి వ్యతిరే కంగా నినాదాలు చేశారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ రాజంపేటలో 2011లో అగ్రిగోల్డ్ సంస్థ ప్రత్యేక బ్రాంచి ఏర్పాటు చేసిందన్నారు. ఈ బ్రాంచిలో సుమారు 2 వేల మందికి పైగా ఏజెంట్లు ఉన్నారని తెలిపారు. 50 వేల మందికి పై గా వినియోగదారులు ఉన్నారని పేర్కొన్నారు. ఈ బ్రాంచ్‌లో వారు రూ. 55 కోట్లకు పైగా డిపాజిట్లు చేశారన్నారు. కాల పరిమితి ముగిసిన బాండ్లకు నగదు ఇమ్మని అడిగితే సీబీఐ విచారణ పేరు తో కాలయాపన చేస్తోందన్నారు. బాధితులకు బీజేపీ నేత నాగోతు రమేష్‌నాయుడు మద్దతు పలికారు. ర్యాలీలో పా ల్గొన్న ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులను వెంటనే ఆదుకోవాలన్నారు. అగ్రిగోల్డ్ సంస్థ నుంచి రావాల్సిన మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితులు ఐక్యసాధన సమితి స భ్యులు కృష్ణయ్య, ఆర్.సుబ్బయ్య, పి. రాము, డి.లక్ష్మీవరప్రసాద్, ఎం.పెంచలయ్య, మురళీ, నవనీతమ్మ, గోవిందరా జు, రెడ్డమ్మ, వారధి, ఎ.పెంచలరావు, ఏ బీవీపీ జిల్లా నేత గుణవర్మ పాల్గొన్నారు. -
ఆస్తి ఉందని చూపిస్తే... రాసిచ్చేస్తా
- కుమారస్వామి ఆరోపణలపై మండిపడ్డ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సాక్షి, బెంగళూరు : కెంగేరి ప్రాంతంలో తనకు అక్రమ ఆస్తులు ఉన్నాయని జేడీఎస్ నేత హెచ్.డి.కుమారస్వామి నిరూపించగలిగితే ఆయనకే రాసిచ్చేస్తానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సవాల్ విసిరారు. కెంగేరి ప్రాంతంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అక్రమ ఆస్తులను కూడబెట్టారంటూ జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి మైసూరులో ఆదివారం చేసిన ఆరోపణలపై సిద్ధరామయ్య పైవిధంగా స్పందించారు. సోమవారం బెంగళూరులోని విధానసౌధలో జరిగిన మంత్రివర్గ సమావేశానికి హాజరు కావడానికి ముందు సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రిగా పనిచేసిన కుమారస్వామికి ఎంతమాత్రం తగదని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇకమీదటైనా కాస్తంత బాధ్యతగా వ్యవహరించాలని కుమారస్వామికి సూచించారు. ఇక ఇదే సందర్భంలో సిం గిల్ డిజిట్ లాటరీ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీబీఐకి అప్పగించిందని, అయినా ఇప్పటికీ ఈ వ్యవహారంపై కుమారస్వామి రాద్ధాం తం చేయడంలో ఏమాత్రం అర్థం లేదని సిద్ధరామయ్య మండిపడ్డారు. సీబీఐ విచారణ అనంతరం నిజానిజాలు వెల్లడవుతాయని, అప్పటి వరకు వేచి చూడాలని కుమారస్వామికి సూచించారు. -
మళ్లీ అదే తప్పు!
- రాయచోటిలో ఎర్రకూలీల పట్టివేత ఘటనపై అనుమానాలు సాక్షి, ప్రతినిధి తిరుపతి : శేషాచలం అడవుల్లో ఎర్రకూలీల ఎన్కౌంటర్ వ్యవహారం పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. శేషాచలం ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి *5 లక్షల పరిహారంతో పాటు, కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) శుక్రవారం ఆదేశించడం కలకలం రేపింది. ఈ ఘటనలో వైపల్యాలను కప్పి పుచ్చుకోవడానికి పోలీసులు పడరాని పాట్లు పడుతున్నారు. వైఎస్ఆర్ జిల్లా రాయచోటి సమీపంలో శుక్రవారం ఏకంగా 72 మంది కూలీలను అరెస్ట్ చేయడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. తమిళనాడు నుంచి ఒక ప్రైవేట్ టూరిస్టు బస్సులో వచ్చిన ఎర్ర కూలీలు అటవీ ప్రాంతానికి వెళుతుండగా చిన్నమండెం వద్ద పట్టుకున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇంతవరకు భాగానే ఉన్నా అక్కడ 77 దుంగలను స్వాధీనం చేసుకోవడం పైనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కేసు బలంగా ఉండాలనే కారణంతో పాతదుంగలను తెచ్చి ఇక్కడ చూపించినట్లు విశ్వసనీయ సమాచారం. అడవుల్లోకి చెట్లను నరకడానికి వెళ్లిన వారు డంప్‌ను గురించి సమాచారం ఇచ్చారనడం ఎంతవరకు వాస్తవమనేది చర్చనీయమైంది. ఈ విషయంపై అక్కడ మీడియా ప్రతినిధులు పోలీసులను ప్రశ్నించగా పట్టుబడిన ఎర్ర కూలీలు ఇచ్చిన సమాచారం మేరకు దుంగలు స్వాధీనం చేసుకున్నామని చెప్పడం గమనర్హం. దీనినిబట్టే జరిగిన తప్పును కప్పి పుచ్చుకోవడానికి పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్హెచ్ఆర్సీ తప్పుపట్టడంతో... శేషాచలం ఘటనను ఎన్హెచ్ఆర్సీ తప్పు పట్టడంతో ఎర్రకూలీల రాక ఇంకా పెద్దఎత్తున సాగుతుందని చెప్పే ప్రయత్నమే ఇది అని తెలుస్తోంది. వాస్తవంగా శేషాచలం ఘటన తరువాత అత్యధిక మంది ఎర్రకూలీలు తీవ్రంగా భయపడిపోయి ఈ ఛాయలకు రావడం లేదని సమాచారం. మరోవైపు వైఎస్ఆర్ జిల్లాలో స్మగ్లర్ల కోసం ముమ్మరంగా వేట సాగిస్తున్నారు. ఈ తరుణంలో ఇంత పెద్ద ఎత్తున కూలీలు తరలి వెళ్ళారా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వివిధ కేసుల్లో పట్టుబడిన కూలీలనే మళ్లీ తాజాగా ఆరెస్టు చూపినట్టు జోరుగా చర్చసాగుతోంది. -
సీసీఐ అవినీతిపై సీబీఐ విచారణ
అక్రమార్కుల గుండెల్లో వణుకు తప్పించుకునే మార్గాల కోసం అన్వేషణ ఫోన్ కాల్స్‌కూ స్పందించని వైనం సాక్షి ప్రతినిధి, గుంటూరు : సీసీఐలో చోటు చేసుకున్న భారీ అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టడంతో అవినీతి అధికారులు వణికిపోతున్నారు. గుంటూరులోని సీసీఐ కార్యాలయంలో బుధవారం సీబీఐ అధికారులు నిర్వహించిన విచారణలో కీలక సమాచారాన్ని సేకరించారు. కొన్ని రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు నామ్‌కే వాస్తే దర్యాప్తు కొనసాగుతుందని, విచారణ సమయానికి రికార్డులు తారుమారు చేసి గండం నుంచి బయటపడవచ్చని భావించిన వీరంతా కలవరం చెందుతున్నారు. ఈ అక్రమాల్లో సీసీఐ, మార్కెటింగ్ శాఖలు, దళారులు, బయ్యర్లు, స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లుల యజమానులు భాగస్వాములుగా ఉన్నారు. ప్రజాప్రతినిధుల బంధువులమని, అనుచరులమని పనులు చేయించుకున్న వారంతా సీబీఐ రంగ ప్రవేశంతో సెల్‌ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు. రైతుకు దక్కని మద్దతు ధర.. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 43 సీసీఐ కోనుగోలు కేంద్రాల్లో భారీ అవినీతి చోటు చేసుకుంది. మొత్తం 93 లక్షల క్వింటాళ్లను కొనుగోలు కేంద్రాల ద్వారా సీసీఐ కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. టీడీపీలో సర్పంచ్ నుంచి రాష్ట్ర మంత్రి వరకు భారీగా వ్యాపారం కొనసాగించారు. రైతుల నుంచి క్వింటాలు రూ.3000కు కొనుగోలు చేసి రూ.4000కు సీసీఐ కొనుగోలు కేంద్రానికి విక్రయించి క్వింటాకు వెయ్యి రూపాయల లాభం పొందారు. వీటితోపాటు రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తరలించకుండా నేరుగా జిన్నింగ్ మిల్లులకు తరలించి రవాణా చార్జీలను స్వాహా చేశారు. ఈ రెండు వ్యవహారాల్లో రూ.400 కోట్ల అవినీతి జరగడంతో ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర సామాన్యరైతుకు దక్కకుండా పోయింది. కృష్ణా జిల్లా నందిగామ సీసీఐ కొనుగోలు కేంద్రానికి రాష్ట్రమంత్రి పత్తిపాటి పుల్లారావు అనుచరులు లక్ష క్వింటాళ్లకు పైగా విక్రయించినట్లు విశ్వసనీయ సమాచారం. అక్కడి కొనుగోలు కేంద్రంలో 1.46 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తే, మంత్రి అనుచరులే లక్ష క్వింటాళ్లను అమ్మారు. వీరంతా తెలంగాణ రాష్ట్రం నుంచి క్వింటా రూ. 2700 నుంచి రూ.3000 వరకు కొనుగోలు చేసి నందిగామ సీసీఐ కేంద్రానికి క్వింటా రూ. 4000 చొప్పున అమ్మినట్లు సమాచారం. మంత్రి మిల్లును అద్దెకు తీసుకున్న సీసీఐ.. గణపవరం వేలూరు డొంకలో ఉన్న మంత్రి పుల్లారావుకు చెందిన స్పిన్నింగ్ మిల్లులో జిన్నింగ్, టీఎంసీ యూనిట్లను సీసీఐ అద్దెకు తీసుకొని పెద్ద ఎత్తున పత్తిని జిన్నింగ్ చేశారు. మంత్రి అనుచరులు రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని కొనుగోలు కేంద్రానికి తరలించకుండా ఈ మిల్లుకే తరలించి రవాణా చార్జీలు స్వాహా చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్, సీసీఐ అధికారులు కీలకంగా వ్యవహరించారు. ఈ వ్యవహారంలో మార్కెటింగ్‌శాఖ జేడీ నుంచి యార్డు కార్యదర్శుల వరకు పెద్ద ఎత్తున ముడుపులు అందాయి. మార్కెటింగ్‌శాఖ మంత్రి జిల్లాలో అధికారుల లీలలు మార్కెటింగ్ శాఖ అధికారులు సైతం దోపిడీకి పాల్పడ్డారు. క్వింటా పత్తికి ప్రభుత్వం నిర్ణయించిన సెస్ రూ.10 నుంచి రూ.13 ఉంటే, మార్కెట్ యార్డు అధికారులు నియమించిన వ్యక్తులు క్వింటాకు రూ. 40 నుంచి 50 వరకు వసూలు చేస్తున్నారు. సీసీఐ బయ్యర్లు నేరుగా పత్తిని జిన్నింగ్ మిల్లులకు తరలించినా యార్డు అధికారులకు మామూళ్లు అందజేయాల్సిందే. ఇలా వసూలు చేసిన నగదును రోజూ యార్డు ఉన్నతాధికారి మొదలు కిందస్థాయి అధికారి వరకు పంచుకుంటారు. ఇలా జిల్లాలోని 11 సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో మార్కెటింగ్ శాఖ అధికారులు చక్రం తిప్పుతున్న వ్యవహారంపైనా సీబీఐ అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. -
ట్రైనీ ఐపీఎస్ మృతిపై మొదలైన విచారణ
హైదరాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (ఎన్పీఏ)లో శిక్షణ పొందుతున్న ఐపీఎస్ అధికారి మనూ ముక్త్ మానవ్ అనుమానాస్పద మృతిపై సీబీఐ విచారణ చేపట్టింది. ఇందుకోసం గురువారం రాజేంద్రనగర్ పోలీసులను సీబీఐ విచారిస్తోంది. కేసుకు సంబందించిన అన్ని విషయాలను సీబీఐ అధికారులు సేకరిస్తున్నారు. గత ఏడాది ఆగష్టు లో నేషనల్ పోలీస్ అకాడమీ స్విమ్మింగ్ పూల్‌లో మనూ ముక్త్ మానవ్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తన కొడుకును హత్య చేశారని మానవ్ తండ్రి రామ్ నివాస్ మానవ్ అప్పట్లో ఆరోపించారు. తన కుమారుడి మృతి పట్ల విచారణ జరపాలని మానవ్ తల్లిదండ్రులు కేంద్రాన్ని కోరారు. ఈనెల 6 తేదీన మానవ్ మృతిపై విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వం సీబీఐ ను ఆదేశించింది. హర్యానా రాష్ట్రం హిస్సార్ జిల్లాకు చెందిన మను ముక్త్త్ మానవ్ (30) 2013లో హిమాచల్‌ప్రదేశ్ ఐపీఎస్ క్యాడర్‌గా ఎంపికయ్యారు. ఆకాడమీలో శిక్షణ పొందుతున్న వారంతా ఆఫీసర్స్ క్లబ్లో విందు చేసుకున్నారు. ఈ విందులో మద్యం సేవించిన మానవ్ మరో ఇద్దరు ట్రైనీలతో కలిసి ఎన్పీఏలో ఉన్న స్విమింగ్ పూల్‌లో ఈత కొట్టేందుకు వెళ్లారు. స్విమ్మింగ్‌పూల్‌లో దిగిన కొద్దిసేపటికే మానవ్ నీటిలో మునిగి ప్రమాదవశాత్తు మృతి చెందారు. -
ట్రైనీ ఐపీఎస్ మృతిపై సీబీఐ విచారణ
హైదరాబాద్ : సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (ఎన్పీఏ)లో శిక్షణ పొందుతున్న ఐపీఎస్ అధికారి మనూ ముక్త్ మానవ్ అనుమానాస్పద మృతిపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం సీబీఐ విచారణకు ఆదేశించింది. గత ఏడాది నేషనల్ పోలీస్ అకాడమీ స్విమ్మింగ్ పూల్‌లో మనూ ముక్త్ మానవ్ మృతి చెందిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్ట్‌లో తోటి ట్రైనీల విందులో మద్యం సేవించి, అనంతరం స్విమ్మింగ్ పూల్‌లోకి దిగడంతో మనూ ముక్త్ మానవ్ ప్రమాదవశాత్తు మృతి చెందారు. హర్యానా రాష్ట్రం హిస్సార్ జిల్లాకు చెందిన మను ముక్త్త్ మానవ్ (30) 2013లో హిమాచల్‌ప్రదేశ్ ఐపీఎస్ క్యాడర్‌గా ఎంపికయ్యారు. కాగా శిక్షణ పొందుతున్న వారంతా ఆఫీసర్స్ క్లబ్లో విందు చేసుకున్నారు. ఈ విందులో మద్యం సేవించిన మానవ్ మరో ఇద్దరు ట్రైనీలతో కలిసి ఎన్పీఏలో ఉన్న స్విమింగ్ పూల్‌లో ఈత కొట్టేందుకు వెళ్లారు. స్విమ్మింగ్‌పూల్‌లో దిగిన కొద్దిసేపటికే మానవ్ నీటిలో మునిగి మృతి చెందారు. దాంతో మానవ్ తల్లిదండ్రులు.. తమ కుమారుడి మృతి పట్ల విచారణ జరపాలని కేంద్రాన్ని కోరారు. -
చంద్రబాబుకు రఘువీరా సవాల్
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన మేఘమథనంలో అవినీతి చోటు చేసుకుందంటూ చేసిన ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సవాల్ విసిరారు. ఈ మేరకు చంద్రబాబుకు రఘువీరా లేఖ రాశారు. అనంతపురంలో ప్రముఖుల సమక్షంలో మేఘమథనంలో అవినీతి జరిగిందని చంద్రబాబు చేసిన ఆరోపణల్ని ఆయన ఖండించారు. ఆ వ్యవహారంలో సీబీఐ లేదా హైకోర్టు, సుప్రీం కోర్టు, సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని రఘువీరా డిమాండ్ చేశారు. -
ఇసుక అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి
రాజమండ్రి: రాష్ట్రంలో ఇసుక అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం రాజమండ్రిలో నెహ్రు మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణ యధేచ్చగా సాగుతుందని ఆరోపించారు. శాండ్ మాఫియాను అరికట్టడంలో ప్రభుత్వ ఘోరంగా విఫలమైందని అన్నారు. పోలవరం విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేశారు. అలాగే ఏలేరు ఆధునికీకరణకు కూడా ప్రభుత్వం మొండి చేయి చూపిందని విమర్శించారు. -
సీబీఐతో విచారణ జరిపే దమ్ముందా?
హైదరాబాద్ : ఎన్నికల సందర్భంగా పట్టుబడిన మద్యంపై.. నమోదైన కేసులపై దమ్ముంటే సిబిఐతో దర్యాప్తు జరిపించాలని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ సవాల్ చేసింది. అన్యాయంగా తమపై పదే పదే ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు తమను పరోక్షంగా వేధిస్తున్నారని ఆయన అన్నారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా కాకాని గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ సంబంధం లేని వ్యక్తులపై బురద చల్లటం సరికాదన్నారు. ప్రభుత్వం మీ చేతుల్లో ఉందని, మద్యం కేసుల్లో సంబంధం ఉన్నవారిని ఎవరినీ వదిలి పెట్టవద్దని, దమ్ము, ధైర్యం చిత్తశుద్ది ఉంటే సీబీఐతో ప్రభుత్వం విచారణ జరిపించాలని ఆయన అన్నారు. సీబీసీఐడీ విచారణపై తమకు నమ్మకం లేదన్నారు. -
సీబీఐ విచారణకు పట్టు
సాక్షి, చెన్నై : మౌళి వాకంలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం ఇటీవల కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఉత్తరాంధ్రకు చెందిన వారితో పాటు తమిళనాడు, ఒడిశ్సాలకు చెందిన 61 మంది విగత జీవులయ్యారు. దక్షిణ భారతాన్ని కుదిపేసిన ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక సిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. రిటైర్డ్ న్యాయమూర్తి రఘుపతి నేతృత్వంలో కమిటీని వేశారు. ఓ వైపు సిట్, మరో వైపు రఘుపతి కమిషన్లు తమ విచారణను వేగవంతం చేశాయి. ఈ విచారణలను కంటి తుడుపు చర్యేనని, వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సీబీఐతో విచారణ చేపట్టాల్సిందేనని ప్రతి పక్షాలు పట్టుబడుతూ వస్తున్నాయి. ఈ విషయమై డీఎంకే నేతృత్వంలో రాజ్ భనవ్‌కు భారీ ర్యాలీ చేపట్టారు. మద్రాసు హైకోర్టులో సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి తదితరులు పిటిషన్లు వేశారు. ఈ పరిస్థితుల్లో డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ శనివారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. రఘుపతి కమిటీని రద్దు చేయాలని, సీబీఐతో విచారణ చేపట్టాలని విన్నవించారు. పిటిషన్ : మౌళివాకం ఘటనను తన పిటిషన్లో స్టాలిన్ వివరించారు. ఈ ఘటనపై విచారణ న్యాయబద్ధంగా జరగాల్సి ఉందని సూచించారు. కంటి తడుపు చర్యగా, మొక్కుబడిగా విచారణ సాగుతున్నట్టు అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. రిటైర్డ్ న్యాయమూర్తి రఘుపతి నేతృత్వంలో ప్రత్యేక కమిటీ వేశారని వివరించారు. రఘుపతి ఇప్పటికే పలు బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారని గుర్తుచేశారు. కొత్త సచివాలయ నిర్మాణ కేసు విచారణ గుండా చట్టం నమోదు పరిశీలన కమిటీ, వినియోగదారుల ఫోరంకు ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. మూడు బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న వ్యక్తికి అదనంగా అతి పెద్ద ఘటనకు సంబంధించిన విచారణ బాధ్యతలు అప్పగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆయన ఎలా తన బాధ్యతల్ని పూర్తి స్థాయిలో చేపట్ట గలరని, మౌళి వాకం ఘటన విచారణకు ఎలా..? న్యాయం చేయగలరని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆ కమిటీని రద్దుచేసి, ఈ ఘటనపై సమగ్ర విచారణను సీబీఐకు అప్పగించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేసును ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రత్యేక కమిటీ, పోలీసు బృందంతో విచారణ చేపట్టించాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో వాస్తవాలు వెలుగులోకివచ్చే అవకాశంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. -
నగరం దుర్ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి: నారాయణ
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా మామిడివరం మండంలోని నగరం జరిగిన గ్యాస్ పైప్ లైన్ దుర్ఘటనపై దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐచే విచారణ చేయించాలని సీపీఐ నేత కే.నారాయణ డిమాండ్ చేశారు. కోనసీమలో చమురు సంస్థల కార్యకలాపాలపై జులై 11న అమలాపురంలో మేథావులతో చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నారాయణ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలి పలువురు మరణించగా, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లడం తెలిసిందే. నగరం గ్రామంలో గ్యాస్ పైపులైన్ పేలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య ఆదివారం నాటికి 20కి పెరిగింది. -
ఆనంద్ రీజెన్సీ అధినేత మృతిపై సీబీఐ విచారణ!
యానాం : ఆనంద్ రీజెన్సీ గ్రూప్ సంస్థలు, ఆనంద్ సినీ సర్వీసెస్ అధినేత ఎం.రవిశంకర్ ప్రసాద్ మరణంపై చెన్నైకు చెందిన సీబీఐ అధికారుల బృందం విచారణ చేపట్టినట్లు సమాచారం. సీబీఐ అధికారులు విచారణ నిమిత్తం యానాం వచ్చినట్లు తెలుస్తోంది. గత ఏడాది జూలై 7వ తేదీన రవిశంకర్ ప్రసాద్ స్థానిక బైపాస్ రోడ్లో ఉన్న ఆనంద్ రీజెన్సీ హోటల్‌కు వచ్చి, రాత్రి అక్కడ బస చేశారు. మరుసటి రోజు వేకువజామున యానాం-ఎదుర్లంక వారధిపై గొడుగును పట్టుకుని మార్నింగ్ వాక్కు వెళ్లినట్లు టోల్‌గేట్‌లోని సీసీ కెమెరా పుటేజిలో ఉంది. అప్పుడు అదృశ్యమైన రవిశంకర్ ప్రసాద్ జూలై 13న ఐ.పోలవరం మండలం గుత్తినదీవి శివారు గోగుల్లంక సమీపంలోని రేవులో విగతజీవిగా కనిపించారు. దీనిపై ఐ.పోలవరం పోలీసు స్టేషన్లో అనుమానాస్పద మృతి కేసు నమోదు అయ్యింది. పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ఆదేశాల మేరకు చెన్నైకు చెందిన సీబీఐ అధికారులు ఈ కేసు విచారణ చేపట్టినట్లు సమాచారం. రవిశంకర్ ప్రసాద్ మరణానికి కారణాలపై విచారణ జరుపుతున్నారు. -
నేను చట్టానికి అతీతుడిని కాను: ప్రధాని మన్మోహన్
-
నేను చట్టానికి అతీతుడిని కాను: ప్రధాని మన్మోహన్
న్యూఢిల్లీ: తాను చట్టానికి అతీతుడిని కానని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ బొగ్గు కుంభకోణంలో సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బొగ్గు గనుల కేటాయింపులో దాచవలసింది ఏమీలేదన్నారు. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ వైఖరిపై ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనపై ఆయన వివరణ సంతృప్తికరంగా లేదన్నారు. ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి రక్షణ కల్పిస్తామని ప్రధాని చెప్పారు. బొగ్గు గనుల కేటాయింపులపై ప్రధానిని కూడా ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్న విషయం తెలిసిందే. గనుల కేటాయింపులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్ కూడా ప్రధాని మన్మోహన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గనుల కేటాయింపులో కుట్ర జరిగిందని సీబీఐ భావిస్తే, తుది నిర్ణయం తీసుకున్న ప్రధాని కూడా కుట్ర దారేననని ఆయన అన్నారు. శాఖను నిర్వహించిన మన్మోహన్‌నూ దోషిగా పరిగణించి కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో తాను చట్టానికి అతీతుడేమీకానని, సిబిఐ విచారణకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. -
డీజీపీగా దినేష్ రెడ్డి ను కొనసాగించలేము
-
సీబీఐ ఎదుట హాజరైన ధర్మాన
-
సీబీఐ ఎదుట హాజరైన ధర్మాన
హైదరాబాద్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల కేసులో మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు బుధవారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. దిల్‌కుశ అతిథిగృహంలో సీబీఐ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో విచారణకు హాజరు కావాలంటూ ధర్మానకు సీఆర్పీపీ సెక్షన్ 160 కింద సీబీఐ నిన్న సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లాలో ఇందూ కంపెనీకి సంబంధించి లేపాక్షి నాలెడ్జి ప్రాజెక్టుకు భూకేటాయింపుల వ్యవహారంలో ఆయనను సీబీఐ విచారిస్తోంది. కాగా ఇప్పటికే ధర్మానపై సీబీఐ ఒక ఛార్జిషీట్ దాఖలు చేసింది. మూడోసారి ధర్మాన ప్రసాదరావు సీబీఐ ఎదుట హాజరయ్యారు.