
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి వంటశాల(పోటు) గురించి తాను చేసిన ఆరోపణలపై కట్టుబడి ఉన్నానని ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపిస్తే అన్నీ నిజాలు బయటకొస్తాయని, వాటిని నిరూపించడానికి సిద్ధమని ఆయన తెలిపారు.
ఆగమశాస్త్రానికి విరుద్ధంగా శ్రీవారి పోటును మూసివేసి, తవ్వకాలు జరిపారని పునరుద్ఘాటించారు. పింక్ డైమండ్ విషయంలో ఆలయ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ నిజాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అసలు పింక్ డైమండే లేదని, అది పింక్ రూబీ మాత్రమేనని ఈవో చెప్తుతున్నారని మండిపడ్డారు.