
సాక్షి,అమరావతి: తిరుమల వెంకటేశ్వర్లు స్వామి ఆస్తుల అక్రమాలపై విచారణ జరిపించాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. తిరుమలలో జరుతున్న అక్రమాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోంమంత్రి, గవర్నర్ కలుగచేసుకోవాలని లేఖ ద్వారా తెలియజేశారు. కైన్ ద్వారా వజ్రం పగిలిందని అనడంలో నిజంలేదని న్యాయవాది లేఖలో పేర్కొన్నారు. స్వామివారి భూములు, నిధులు, నగలు, బ్యాంక్ డిపాజిట్ల లెక్కలు బహిర్గతం చేయ్యాలని లేఖలో పేర్కొన్నారు.