సీబీఐ ఎదుట హాజరైన ధర్మాన | Minister Dharmana speaks to Media After CBI Enquiry | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 21 2013 4:13 PM | Last Updated on Thu, Mar 21 2024 7:50 PM

మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు సీబీఐ విచారణ బుధవారం ముగిసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల కేసులో ఆయన్ని సీబీఐ విచారించింది. దిల్‌కుషా అతిథిగృహంలో ధర్మాన ప్రసాదరావును సీబీఐ అధికారులు సుమారు అయిదు గంటల పాటు విచారణ జరిపారు. సీబీఐ విచారణ అనంతరం ధర్మాన మీడియాతో మాట్లాడారు. లేఫాక్షి భూముల కేటాయింపులపై సీబీఐ విచారించినట్లు తెలిపారు. భూముల కేటాయింపుల విషయంలో తనకు తెలిసిన సమాచారాన్ని సీబీఐ అధికారులు తెలిపినట్లు చెప్పారు. అవసరం అయితే మరోసారి విచారణకు పిలుస్తామన్నారని ధర్మాన తెలిపారు. తనతో పాటు అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా సీబీఐ విచారించినట్లు తెలిపారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో విచారణకు హాజరు కావాలంటూ ధర్మానకు సీఆర్పీపీ సెక్షన్ 160 కింద సీబీఐ నిన్న సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లాలో ఇందూ కంపెనీకి సంబంధించి లేపాక్షి నాలెడ్జి ప్రాజెక్టుకు భూకేటాయింపుల వ్యవహారంలో ఆయనను సీబీఐ విచారించింది. కాగా ఇప్పటికే ధర్మానపై సీబీఐ ఒక ఛార్జిషీట్ దాఖలు చేసింది. మూడోసారి ధర్మాన ప్రసాదరావు సీబీఐ ఎదుట హాజరయ్యారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement