వెలుగులోకి ఐటీ రిటర్న్స్
Published Thu, Oct 6 2016 11:06 AM | Last Updated on Thu, Sep 27 2018 3:54 PM
తాండూర్‌లో మహారాష్ట్ర సీబీఐ అధికారుల విచారణ
రూ.1.42 కోట్లు దుర్వినియోగం అయినట్లు నిర్ధారణ
నలుగురు నిందితులపై కేసు నమోదు
ఐటీ కన్సల్టెన్సీ కార్యాలయాన్ని సీజ్ చేసిన సీబీఐ అధికారులు
తాండూర్ : మహారాష్ర్ట వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యూసీఎల్)లో పనిచేస్తున్న బొగ్గు గని కార్మికుల ఇన్‌కమ్‌టాక్స్ రిటర్న్స్ కుంభకోణం ఘటన తాండూర్‌లో కలకలం రేపింది. బుధవారం తాండూర్ ఐబీ మండల కేంద్రంలో మహారాష్ట్ర సీబీఐ అధికారులు విచారణ చేపట్టడంతో ఈ ఘటన వెలుగుచూసింది. మహారాష్ట్రకు చెందిన వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ బొగ్గు గని కార్మికులకు సంబంధించి ఇన్‌కమ్‌టాక్స్ రిటర్న్స్ కోసం తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి అక్రమాలకు పాల్పడినకేసులో మహారాష్ట్ర నాగ్‌పూర్‌కు చెందిన సీబీఐ బృందం మాదారంటౌన్‌షిప్, తాండూర్ ఐబీ కేంద్రంలో విచారణ జరిపింది. నాగ్‌పూర్ సీబీఐ ఇన్‌స్పెక్టర్ హెచ్.ఎస్.జహంగీర్ నేతృత్వంలో నలుగురు సభ్యుల సీబీఐ బృందం తాండూర్ మండల కేంద్రానికి చేరుకొని ఐటీ రిటర్న్స్ ఇప్పించి న ఐటీ కన్సల్టెన్సీ కార్యాలయం వద్ద కు వెళ్లారు. ఆ కార్యాలయం మూసి ఉండటంతో అక్కడి నుంచి మాదారంటౌన్‌షిప్‌లోని ఆ కన్సల్టెన్సీ ఏజెంట్ ఇంటికి వెళ్లారు. ఆ ఇంటికి కూడా తాళం వేసి ఉండటంతో కన్సల్టెన్సీలో పని చేసిన జంపాల శ్రీకాం త్ ఇంటికి వెళ్లి అతడిని విచారించా రు. శ్రీకాంత్‌కు సంబంధించిన బ్యాంకు లావాదేవీల పత్రాలను పరిశీలించారు. శ్రీకాంత్ వద్ద నుంచి అతని సెల్‌ఫోన్, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి తాండూర్ ఐబీ కేం ద్రానికి వచ్చి ఐటీ కన్సల్టెన్సీ కార్యాలయాన్ని మాదారం పోలీసుల సమక్షంలో సీబీఐ అధికారులు సీజ్ చేశారు.
వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ బొగ్గు గనుల్లో పని చేస్తున్న 201 మంది చంద్రాపూర్, బల్లార్షా తదితర ప్రాంతాల కార్మికులకు చెందిన ఐటీ రిటర్న్స్ పత్రాల దాఖలులో జరిగిన అక్రమాలపై ఎఫ్‌ఐఆర్ నం.11/2016 కింద కేసు నమోదైంది. ఆ ఎఫ్‌ఐఆర్ ప్రకారంగా తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి 201 మంది కార్మికులకు సంబంధించి రూ.1.42 కోట్లు ఐటీ రిటర్న్స్ ప్రభుత్వం నుంచి ఇప్పించినట్లు విచారణలో సీబీఐ అధికారులు తేల్చారు. దీంతో ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్, ప్రభుత్వాన్ని మోసగించ డం, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ అక్రమ దందా కేసులో బాధ్యులైన వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఆఫీషియల్స్, కన్సల్టెన్సీ పనిచేసిన జంపాల శ్రీకాంత్, రాజేశ్‌తోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు నాగ్‌పూర్ సీబీఐ ఇన్‌స్పెక్టర్ హెచ్.ఎస్.జహంగీర్ వివరించారు. ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
Advertisement
Advertisement