tandur
-
కొడుకు రాసిన మరణశాసనం
తాండూర్: ఆన్లైన్ ట్రేడింగ్ ఆ ఇంటిల్లిపాది పాలిట మృత్యుపాశమైంది. అనతికాలంలోనే డబ్బు సంపాదించాలనే కుమారుడి అత్యాశ.. కుటుంబం బలవన్మరణానికి కారణమైంది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని కాసిపేట గ్రామానికి చెందిన సముద్రాల శివప్రసాద్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి నష్టపోవడం, అప్పులు అధికం కావడం, అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం శీతల పానీయంలో గడ్డి మందు కలుపుకొని తాగిన విషయం తెలిసిందే. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంలో శివప్రసాద్(26)తోపాటు తల్లిదండ్రులు మొండయ్య(58), శ్రీదేవి(52), అక్క చైతన్య అలియాస్ చిట్టి(30) ఒక్కొక్కరుగా గంటల వ్యవధిలో నలుగురూ బుధవారం మృతిచెందారు.యూట్యూబ్‌కు ఆకర్శితుడై..శివప్రసాద్ బెల్లంపల్లిలో కొంతకాలం ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేశాడు. గత ఏడాదిన్నర కాలంగా యూట్యూబ్ ద్వారా ఆన్లైన్ ట్రేడింగ్ వైపు ఆకర్శితుడయ్యాడు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు. తొలుత కాస్త లాభాలు ఆర్జించాడు. ఆ తర్వాత వరుసగా నష్టాలు రావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడు. తెలిసిన వారి వద్ద అప్పులు చేయడంతో వడ్డీలు పెరిగి భారమయ్యాయి.రూ.50 లక్షలకు పైగా..అప్పులు పెరిగిపోవడంతో ఏడాది క్రితం కొంతకాలం శివప్రసాద్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆన్లైన్లో గేమ్స్ ఆడడం, స్టాక్మార్కెట్లో పెట్టుబడి పెట్టడంతో అప్పులు రూ.50లక్షలకు పైగా పెరిగిపోయాయి. బ్యాంకు రుణాల పేరుతో మరికొంత అప్పు చేయడంతో మోయలేని భారమైంది. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. ఈ క్రమంలో అప్పులు తీర్చే దారిలేక కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది.వైకల్యం నుంచి శాశ్వత నిద్రలోకి..చైతన్య పుట్టుకతోనే దివ్యాంగురాలు కావడంతో తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచారు. మరొకరి సాయం ఉంటే గానీ జీవనం సాగించలేని పరిస్థితి కావడంతో దగ్గరుండి చూసుకునేవారు. తామందరం లేకుండా కూతురు ఎలా జీవిస్తుందోనని, చివరికి ఆమె ఎవరికి భారం కాకూడదని ఆలోచించిన తల్లిదండ్రులు తమతోపాటే గడ్డిమందు తాగించి పేగుబంధాన్ని వెంట తీసుకెళ్లారు.గ్రామంలో విషాదఛాయలుమొండయ్య కుటుంబమంతా మృతిచెందడంతో కాసిపేట గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎవరిని కదిలించినా కన్నీళ్లే దర్శనమిచ్చాయి. మొండయ్య చిరు వ్యాపారంతోపాటు ఇంటింటికీ తిరిగి పాల ప్యాకెట్లు విక్రయించడంతో అందరికీ సుపరిచితుడయ్యాడు. అందరితో కలిసిమెలిసి ఉండడంతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగింది. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం నేరుగా కాసిపేట శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు చేయాలని బంధువులు నిర్ణయించారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మృతదేహాలకు తాండూర్ సీఐ కుమారస్వామి, ఎస్సై కిరణ్‌కుమార్ పంచనామా నిర్వహించారు. కాగా, మృతుడు శివ ప్రసాద్ మేనమామ కోలేటి రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
తాండూరు–జహీరాబాద్ రైల్వేలైన్ ‘సర్వే’ షురూ
సాక్షి, హైదరాబాద్: సిమెంటు పరిశ్రమల క్లస్టర్‌గా ఉన్న తాండూరు నుంచి జహీరాబాద్ వరకు 70 కి.మీ నిడివితో కొత్త రైల్వే లైన్ నిర్మించేందుకు ప్రతిపాదించిన దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు దాని సాధ్యాసాధ్యాలను తేల్చేందుకు ఫైనల్ లొకేషన్ సర్వే ప్రారంభించింది. సికింద్రాబాద్– వాడి మార్గంలో ఉన్న తాండూరు, సికింద్రాబాద్ నుంచి బీదర్ మార్గంలో ఉన్న జహీరాబాద్ మధ్య రైల్వే లైన్ నిర్మించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. సిమెంటు, నాపరాయి, వ్యవసాయ ఉత్పత్తుల తరలింపు కూడా భారీగానే ఉంటుంది. వెరసి ఇటు ప్రయాణికులకు, అటు సరుకు రవాణాకు ఈ కొత్త మార్గం అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం రైల్లో రెట్టింపు దూరం.. తాండూరు–జహీరాబాద్ మధ్య దూరం (రోడ్డు మార్గం) 54 కి.మీ మాత్రమే. అదే రైలులో వెళ్లాలంటే 104 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. వికారాబాద్ మీదుగా వెళ్లాల్సి రావటమే దీనికి కారణం. జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంతాలకు తాండూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నిత్యం చాలామంది వస్తుంటారు. రైలులో చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉండటంతో ఎక్కువగా రోడ్డు మార్గానే వెళ్తారు. ఇక ముంబై వైపు వెళ్లేవారు ముంబై జాతీయ రహదారి మీద ఉన్న జహీరాబాద్‌కు వెళ్లి రోడ్డు మార్గాన వెళ్లే వాహనాలను ఆశ్రయిస్తారు. దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణికుల రద్దీ బాగానే ఉంటోంది.ఇక తాండూరు చుట్టుపక్కల ఉన్న సిమెంటు పరిశ్రమలు, నాపరాయి పరిశ్రమల నుంచి రైళ్ల ద్వారా సరుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతుంటుంది. బీదర్ మార్గంలో సరుకు వెళ్లాలంటే వికారాబాద్ మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రూ.1,400 కోట్ల అంచనా వ్యయంతో తాండూరు నుంచి నేరుగా జహీరాబాద్‌కు కొత్త రైల్వే లైన్‌ను గతంలో రైల్వే శాఖ ప్రతిపాదించింది. గతేడాది చివరలో ఫైనల్ లొకేషన్ సర్వే మంజూరైంది. దీంతో మూడు రోజుల క్రితం ఆ పనులు మొదలయ్యాయి. ఈ లైన్ పూర్తయింతే గంట సేపట్లో రైళ్లు గమ్యం చేరతాయి. జహీరాబాద్ నుంచి వాడీకి ఇది దగ్గరి దారిగా మారుతుంది. అటు వాడీ మార్గంలో, ఇటు సికింద్రాబాద్ మార్గంలో ఒకేసారి రైళ్లు ప్రయాణించేందుకు ఇది ప్రత్యామ్నాయ మార్గం అవుతుంది. -
Ranga Reddy: కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?
అధికారంలోకి వచ్చినప్పటికీ.. కాంగ్రెస్ క్యాడర్లో అయోమయం కనిపిస్తోంది. హస్తం శ్రేణుల్లో కనిపించని ఆందోళనకు కారణమేంటీ ? కొత్త, పాత నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోందా? గ్రూపు తగాదాలు ఇబ్బందికరంగా మారాయా ? కొత్తవారు చేరడంతో పాత నేతలు సైలెంట్ అయ్యారా ? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ... కాంగ్రెస్ లోకి జంప్ అవుతారనే ప్రచారం క్యాడర్‌ను కునుకుపట్టనివ్వడం లేదు. హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పటికీ కాంగ్రెస్‌లోకి వెళ్లడం లేదని తాత్కాలికంగా ప్రకటించారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి... కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్‌ను కలిసి వచ్చారు. కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీగా ఉప్పప్పటికీ... పార్టీ రాష్ట్ర నేతలు మాత్రం ఒప్పుకోవడం లేదట. ఒకవేళ్ల రాష్ట్ర నేతలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏ క్షణంలోనైనా మామ అల్లుళ్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ క్యాడర్లో కన్య్ఫూజన్ క్రియేట్ చేస్తున్నాయి.ఇక బీఆర్ఎస్ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి.. అనుకోని పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని రెండో సారి ఎంపీగా పోటీ చేశారు. అటు కాంగ్రెస్ క్యాడర్ సహకరించకపోవడం.. ఇటు బీఆర్ఎస్ క్యాడర్ తన వెంట రాకపోవడంతో రంజిత్ రెడ్డి చేవెళ్లలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో అక్కడ ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి సైలెంట్ అయిపోయారు. చేవెళ్లలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు అన్ని రకాలుగా సిద్ధమై బీఆర్ఎస్ నుంచి వచ్చిన పట్నం సునీతారెడ్డి... రంజిత్ రెడ్డి కారణంగా మల్కాజిగిరి కాంగ్రెస్ లోక్ సభ స్థానానికి షిఫ్ట్ అయ్యారు. స్థానిక క్యాడర్ సహకారం లేకపోవడంతో పట్నం సునీతా మహేందర్ రెడ్డి చాలా ఇబ్బంది పడ్డారు.తాండూరు కాంగ్రెస్‌లో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజులు ముందు కాంగ్రెస్‌లో చేరి మనోహర్ రెడ్డి... ఎమ్మెల్యేగా గెలిచారు. మనోహర్ రెడ్డి సోదరుడు శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. అంతలోనే సోదరుడు మనోహర్ రెడ్డి రావడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు సోదరుల మధ్య ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరింది.ఎవరికి వారు అన్నదమ్ముళ్లు గ్రూపులుగా విడిపోయారు. ఇంతలోనే పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి... తాండూరును వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రకటించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్ వార్ ఇప్పుడిప్పుడే ముదురుతోంది. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా కప్పుకున్న కండువా రంగులు మారుతున్నాయి తప్పా.. నేతలు మారడం లేదనే టాక్ వినిపిస్తోంది. పీసీసీ చీఫ్, సీఎం రేవంత్.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పాలిటిక్స్ ను ఎలా సెట్ చేస్తారనేది చూడాలి. -
వికారాబాద్: ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. ప్రయాణికులకు గాయాలు
వికారాబాద్, సాక్షి: అనంతగిరి అడవుల్లో శనివారం మధ్యాహ్నాం ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్న ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి.. అడవుల్లోని పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. మరో 20 మందికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. తాండూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ప్రయాణికులను వికారాబాద్ నుంచి తాండూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అనంతగిరి గుట్ట దిగుతుండగా కెరెల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పొదల్లోకి వెళ్లింది. ఆ సమయంలో బస్సులో వంద మంది ఉన్నట్లు తెలుస్తోంది. స్వల్ప గాయాలైన వారిని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్సలు నిర్వహిస్తున్నారు. -
సైకో కిల్లర్.. మహిళలే టార్గెట్.. పోలీసులే విస్తుపోయే నిజాలు
సాక్షి, తాండూరు: చిల్లర ఖర్చుల కోసం అతను ఎంతకైనా తెగిస్తాడు. చివరికి సైకోగా మారిపోయాడు. మర్డర్స్ చేయడం హబీగా మార్చుకున్నారు. అందుకు అడ్డా మీద కూలీలనే టార్గెట్ చేసుకున్నాడు. హత్య చేయడం అంటే అతనికి నీళ్లు తాగినంత ఈజీ.. ఇప్పటికే ఆరు హత్యలు చేసి జైలుకు వెళ్లి వచ్చినా తీరు మారలేదు. ఏడో హత్య చేసి పోలీసులకు మళ్లీ చిక్కిపోయాడు. వికారాబాద్ జిల్లాను వణికించిన సైకో కిల్లర్ కిష్లయ్య స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం... అదృశ్యమైన మహిళ గురించి తాండూరు పోలీసులు చేసిన దర్యాప్తు చేస్తుండగా...ఈ సైకో కిల్లర్ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. సర్వబీ.. ఊరు వికారాబాద్ జిల్లా తాండూరు.. నవంబర్ 29న ఉదయం 9 గంటల ప్రాంతం.. కూలీ పనుల కోసం సర్వబీ అడ్డా మీదికి వెళ్లింది. అప్పటి నుంచి కనిపించకుండా పోయింది. డిసెంబర్ ఒకటిన ఆమె భర్త మహమూద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. స్వరాబీ అదృశ్యమైన రోజున ధారూర్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన మాల కిష్టప్ప వెంట వెల్లినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు చిన్ని క్లూ దొరికింది. కిష్టప్పపై ఫోకస్ పెట్టారు. సైకో కిల్లర్ కిష్టప్ప బ్యాక్ గ్రౌండ్ అంతా చెక్ చేస్తే పోలీసులే విస్తుపోయారు. కిష్టప్పను అదుపులో తీసుకుని పోలీసులు తమ స్టైల్లో విచారణ మొదలుపెట్టారు. తాండూరులోని కూలీల అడ్డా మీద సర్వాబీని గ్రామంలో పని ఉందని చెప్పి వెంట తీసుకువెళ్లాడు. తాండూరు నుంచి జహీరాబాద్ వెళ్లే బస్సులో ఎక్కారు. మధ్యలో తట్టెపల్లి అటవీ ప్రాంతంలో బస్సు దిగి... లోపలికి తీసుకువెళ్లాడు. ఆమెను చీర కొంగుతోనే గొంతు నులిమి హత్య చేశాడు. ఆమె వద్ద నుంచి బంగారు గొలుసు, మోబైల్ ఫోన్, వెయ్యి రూపాయల నగదును తీసుకుని కిష్టప్ప సొంత ఊరు అల్లీపూర్ వెళ్లిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులో తీసుకుని విచారించగా.. డిసెంబర్ 7న అదృశ్యమైన మహిళ సర్వాబీ మృతదేహం పోలీసులు గుర్తించారు. వికారాబాద్ జిల్లాలో కిష్టప్పపై ఆరు హత్య కేసులుండగా... ఐదు కేసుల్లో ఆధారాలు దొరకనివ్వలేదంటే అతని క్రిమినల్ మెంటాలిటీ ఎంటో అర్థం చేసుకోవచ్చు. మరో కేసు విచారణలో రెండేళ్ల పాటు జైల్లోనే ఉన్నారు. ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చిన సైకో కిల్లర్ కిష్టప్ప ఏడో హత్యకు తెగబడ్డాడు. పని ఇప్పిస్తానని చెప్పి ప్రాణాలు తీసే ఇలాంటి క్రిమినల్స్‌తో బీ కేర్ ఫుల్.. బీ అలర్ట్. ఇదీ చదవండి: చికెన్ ముక్క లేకుండా బిర్యానీ వడ్డించిన హోటల్.. రూ.30 వేలు పరిహారం! -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు
-
కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి ఆగం కావొద్దు: కేసీఆర్
సాక్షి, వికారాబాద్ : కాంగ్రెస్ పాలనలో మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. మూడు గంటల కరెంటు సరిపోతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటున్నారని.. అలాంటి కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి ఓటు వేసి ఆగం కావొద్దని ప్రజలకు సూచించారు. కర్ణాటక ప్రజలు, రైతులు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే.. ఐదు గంటల కరెంటే ఇస్తున్నారని సీఎం కేసీఆర్.. తెలంగాణలో కూడా కాంగ్రెస్‌కు ఓటేస్తే మన గతి కూడా అంతే అవుతుందని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, పైలట్ రోహిత్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు. ధాన్యం కొనుగోలు కోసం 7500 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతులకు 2 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. రూ.200 ఉన్న పింఛను రూ. 2వేలు చేశామని, రైతుల బాగోగుల కోసం రైతు బంధు ప్రవేశపెట్టామని చెప్పారు. మరోసారి అధికారంలోకి వస్తే రూ.16వేలు రైతుబంధు ఇస్తామన్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు, రైతు బీమా డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ‘ధరణి తీసేస్తే మళ్లీ దళారి రాజ్యం వస్తుంది. కాంగ్రెస్ భూమాతను ప్రవదిశపెడతామని చెబుతోందని.. అది భూమేతే అవుతుంది. ఒకప్పుడు ప్రభుత్వం చేతిలో రైతుల బతుకు ఉండే. ఇప్పుడు మీ బొటనవేలు పెడితేనే భూ యజమాన్యం మారుతది. ముఖ్యమంత్రికి కూడా ఆ అధికారం లేదు. ప్రభుత్వం మీకు ధారపోసిన ఆ అధికారాన్ని పొడగొట్టుకుంటారా..? కాపాడుకుంటారా..? అనేది మీరే నిర్ణయించుకోవాలి. చదవండి: TSRTC: ఉద్యోగుల జీతాలు కట్.. ఈసీని కలిసిన టీఎస్ఆర్టీసీ జేఏసీ కరవు, వలసలతో గత కాంగ్రెస్ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అలాంటి పరిస్థితులు నేడు తెలంగాణలో లేవు. నీటిపన్ను రద్దు చేశాం. కత్తి ఒకరికి ఇచ్చియుద్ధం ఇంకొకరిని చేయమంటే ధర్మం కాదు కదా..? రైతుల పక్షాన, ప్రజల పక్షాన ఉండే వారి చేతిలో కత్తి పెడితేనే వాళ్లు మిమ్మల్ని కాపాడుతారు. 24 గంటల కరెంట్ ఉంటది రోహిత్ రెడ్డి గెలిస్తేనే లేదంటే కరెంట్ ఆగమైపోతది. కాబట్టి మీరు రోహిత్‌కు ఓటేయాలి. బీజేపీ నాయకులు నాయకులు వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూశారు. వారిని పైలట్ రోహిత్‌రెడ్డి పట్టించారు. అందుకే ఆయన ఏ పనులు అడిగినా వెంటనే నిధులు మంజూరు చేశాను. 3500 తండాలను గ్రామ పంచాయతీలు చేయడంతో లంబాడీ బిడ్డలే సర్పంచులుగా రాజ్యమేలుతున్నారు. దాని వల్ల తాండూరు పరిధిలోని ప్రజలు చాలా మంది లబ్ధి పొందుతున్నారు. బంజారా గౌరవానికి చిహ్నంగా బంజారాహిల్స్‌లో బంజారా భవన్ నిర్మించాంజ’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. -
Tandur: ఓ పార్టీ నుంచి అడ్వాన్స్ తీసుకుని.. మరో పార్టీలోకి జంప్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరులో ఓ ప్రధాన పార్టీ తమ సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు దసరా పండుగ సందర్భంగా రూ.3 లక్షల చొప్పున ఇస్తామని చెప్పింది. పండుగకు ముందుగానే రూ. 50 వేల చొప్పున ముట్టజెప్పింది. మిగిలిన డబ్బులు ఎన్నికలు ముగిసేలోపు రెండు దశల్లో ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే అడ్వాన్స్ (రూ. 50వేలు) పుచ్చుకున్న కొందరు ప్రజాప్రతినిధులు, నాయకులు.. తీరా ఆ తర్వాత ప్రత్యర్థి పార్టీలో చేరారు. అక్కడ కూడా రూ.3 లక్షల ఆఫర్, కొందరికి అంతకంటే ఎక్కువ ఆఫర్ రావడంతో కండువా మార్చేశారు. అయితే ఇప్పుడు మొదట అడ్వాన్స్ డబ్బులిచ్చిన పార్టీ వారు సీన్లోకి వచ్చేశారు. తమ వద్ద డబ్బులు తీసుకొని పార్టీ మారడంతో ఫైరయ్యారు. సదరు సర్పంచ్‌లు, నాయకుల ఇళ్లకు వెళ్లి తమ డబ్బులు వాపస్ ఇవ్వాలని హెచ్చరించారు. అయితే అవతలి పార్టీ నుంచి తమకు ఇంకా డబ్బులు అందలేదని, రాగానే తిరిగి ఇచ్చేస్తామని సదరు సర్పంచ్‌లు, నేతలు చెప్పుకొస్తున్నారు. మొత్తంగా స్థానిక ప్రజాప్రతినిధులకు రేటు కట్టి కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల అధికారులకు ఈ తతంగం తెలిసినా సరే.. ఫిర్యాదు అందితేనే చర్యలు తీసుకుంటామని అంటున్నారు. చదవండి: గజ్వేల్ జేజేల కోసం.. -
రాహుల్ సిప్లిగంజ్‌తో లవ్.. రతికా పేరేంట్స్ ఏమన్నారంటే?
రతికా రోజ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో రీ ఎంట్రీ ఇచ్చి అలరిస్తోంది. అయితే బిగ్ బాస్‌తో ఎంత ఫేమ్ తెచ్చుకుందో.. ఆమె వ్యక్తిగత విషయాలతోనూ అంతేస్థాయిలో వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో ప్రేమ వ్యవహారంతో ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఆమెది వికారాబాద్ జిల్లా జనగామ గ్రామం కాగా.. ప్రస్తుతం వీరు తాండూరులో నివాసముంటున్నారు. రతికా రోజ్.. రాములు, అనితలకు రెండో సంతానం కాగా.. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రతికా రోజ్ తల్లిదండ్రులు ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. (ఇది చదవండి: బోరున ఏడ్చేసిన రతిక తల్లిదండ్రులు.. అందరినీ కదిలిస్తున్న వ్యాఖ్యలు) రతికా నాన్న రాములు మట్లాడుతూ.. 'మాది చాలా చిన్న ఊరు. కేవలం 2 వేల జనాభా ఉంది. మొదట మా అమ్మాయికి పటాస్ షో అవకాశం వచ్చింది. అందులో ఏదో నాలుగు ఉంటుందని అనుకున్నా. ఇంతవరకు వస్తుందని అనుకోలేదు. ఒకసారి రతికా ఇంటర్ సెకండియర్‌లో విజయ నిర్మలమ్మ తీసిన ఈ జన్మ నీకే అనే సినిమాలో సెకండ్ హీరోయిన్గా కావాలని ఫోన్ వచ్చింది. కానీ సినిమాల గురించి మాకు పెద్దగా తెలియదు. మహేశ్ బాబు వాళ్ల అమ్మనే ఫోన్ చేసి అడిగింది. మా అమ్మాయి నాకు సినిమా ఛాన్స్ వచ్చింది.. నేను పోతా పట్టు పట్టింది. అయితే ఆ సినిమా రిలీజ్ కాలేదు. మాకు ముగ్గురు కుమార్తెలు సంతానం. రతిక రెండో అమ్మాయి. మిగిలిన ఇద్దరికీ పెళ్లి చేశాం. ఇప్పుడు మాకు కొడుకు రూపంలో ఉన్నది రతికనే.' అంటూ చెప్పుకొచ్చారు. (ఇది చదవండి: బిగ్ బాస్ విన్నర్‌కు బిగ్ షాక్!) రతికా నాన్న మాట్లాడుతూ..' రాహుల్ సిప్లిగంజ్ వాళ్ల ఇంటికి కూడా పోయినా. మా అమ్మాయితో రెండు, మూడు పాటలు చేసిండు. యూట్యూబ్‌లో పెడితే పైసలు వస్తాయి కదా అని అనుకున్నాం. మా చిన్నపాప పెళ్లికి కూడా రాహుల్ వచ్చిండు. మా వరకైతే పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు. అయితే మా పాపకు పెళ్లి కావాలే.. మా అమ్మాయితో ఇలా సినిమా పాటలు తీస్తే ఎలా? అని ఒకసారి రాహుల్‌ను బెదిరించా. మా ఊర్లో వాళ్లయితే వాడితోనే డ్యాన్స్ చేసి.. వాడితోనే పోతుంది అనేవారు. మేం వాటిని పట్టించుకోలేదు. రాహుల్ కూడా అందరిలాగే పెళ్లికి వచ్చిండు.. కానీ ఇలా జరుతుందని మేం కూడా అనుకోలేదు. రతికా అందరినీ ఫ్రెండ్‌లాగే భావిస్తుంది. బిగ్ బాస్‌లో పల్లవి ప్రశాంత్‌తో ఒక స్నేహితుడిలాగే మాట్లాడింది. బయట కావాలనే కొందరు రూమర్స్ తెచ్చారు.' అని అన్నారు. అనంతరం రతికా తల్లి అనితా మాట్లాడుతూ..' రతికా నాతో కలిసి ఇంట్లో వంటలు కూడా చేస్తుంది. మటన్, పాయసం అంటే ఇష్టం. నాకు ఎప్పుడు సపోర్ట్‌గా ఉంటుంది.' అని చెప్పుకొచ్చింది. -
TS Election 2023: ఎనిమిది మంది దరఖాస్తు..! పరిశీలనలో ముగ్గురి పేర్లు?
వికారాబాద్: తాండూరు హస్తం టికెట్‌పై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. తాండూరు టికెట్ కోసం 8 మంది దరఖాస్తు చేయగా, అధిష్టానం ముగ్గురి పేర్లు పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే టికెట్ ఆశిస్తున్న వారు పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఆశావహుల్లో రమేష్ మహరాజ్, రఘువీర్‌రెడ్డి, కేఎల్ఆర్, సునితా సంపత్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వీరిలో కేఎల్ఆర్ ఎంపీ టికెట్ పైనే ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. ఈ కారణంగానే అసెంబ్లీ టికెట్ కోసం పెద్దగా ప్రయత్నం చేయడం లేదనేది సమాచారం. రమేష్ మహరాజ్, రఘువీర్‌రెడ్డి మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి తాండూరు సీటు కేటాయిస్తే రమేష్ మహరాజ్ టికెట్ దక్కే అవకాశం లేకపోలేదు. జనరల్ అయితే రఘువీర్‌రెడ్డిని టికెట్ వరించనుంది. అలాగే మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సునితా సంపత్‌కు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోదంది. కర్ణాటక వైద్య విద్య శాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ ద్వారా మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఇటీవల ఆయన్ను తాండూరుకు పిలిపించి టికెట్‌పై చర్చించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా తాండూరు అసెంబ్లీ అంటేనే మహరాజుల పేరు టక్కున గుర్తుకు వస్తుంది. ఈ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 13సార్లు ఎన్నికలు జరగ్గా 7 సార్లు మహరాజుల కుటుంబ సభ్యులే కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధిస్తూ వచ్చారు. 1994 ఎన్నికల్లో ఆ కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున నారాయణరావు, రెబల్ అభ్యర్థిగా ఆయన సోదరుడు మాణిక్‌రావు బరిలో దిగడంతో టీడీపీ తరఫున పట్నం మహేందర్‌రెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం మహరాజుల కుటుంబం టికెట్ కోసం తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నట్లు సమాచారం. మాజీ మంత్రి మాణిక్‌రావు తనయుడు ఏఐసీసీ సభ్యుడు రమేష్ మహరాజ్‌కు టికెట్ దక్కుతుందో లేదో మరి కొన్ని రోజుల్లో తేలనుంది. ఇదిలా ఉండగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న 12 మందిని ప్రస్తుత ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ జాబితాలో తాండూరు కూడా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన పైలెట్ రోహిత్‌రెడ్డి ఆరు నెలల్లోనే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రోహిత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎలాగైనా ఆయన్ను ఓడించి తీరుతామని అంటున్నారు. మరోవైపు బీసీలకే టికెట్ కేటాయించాలని ఆ సామాజిక వర్గం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నిన్నటి వరకు మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తాండూరు అసెంబ్లీ బరిలో దిగుతారంటూ ప్రచారం సాగింది. బుధవారం పార్టీ పెద్దలతో భేటీ అయినట్లు సమాచారం. మేడ్చల్ లేదా రాజేంద్రనగర్ నుంచి పోటీ చేయాలని కేఎల్ఆర్కు పార్టీ సూచించినట్లు సమాచారం. దీంతో రమేష్ మహరాజ్, రఘువీర్‌రెడ్డిల మధ్యే పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. -
మంత్రివర్గంలోకి ‘పట్నం’.. రేపు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ టికెట్ కేటాయింపులో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ సయోధ్య కుదిర్చారు. తాండూరు టికెట్‌పై రాజీఫార్ములాలో భాగంగా శాసనమండలి సభ్యుడిగాఉన్న పట్నం మహేందర్‌రెడ్డి ఈ నెల 23న బుధవారం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉదయం 11.30కు రాజ్‌భవన్‌లో పట్నం రాష్ట్ర మంత్రివర్గంలో చేరతారు. 2014 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో చేరిన మహేందర్‌రెడ్డి తాండూరు నుంచి గెలిచి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రోహిత్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరారు. రోహిత్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరిన నాటి నుంచి ఇద్దరు నేతల నడుమ విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకుని పలుమార్లు బహిరంగంగా విమర్శలకు పూనుకున్నారు. చదవండి: పార్టీ ధిక్కారానికి పాల్పడితే వేటే.. 2023లో తాండూరు అసెంబ్లీ టికెట్ కోసం ఇద్దరు నేతలు తీవ్రంగా పోటీ పడుతున్న నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్యవర్తిత్వం వహించారు. రోహిత్ రెడ్డికి టికెట్ ఇస్తే సహకరించాలని మహేందర్‌రెడ్డిని కోరడంతో పాటు ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న బెర్త్‌లో అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే మండలి నుంచి కేబినెట్లోకి తీసుకుంటామని భరోసా ఇచ్చారు. 2021 మే నెలలో ఈటలను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేసిన నాటి నుంచి కేబినెట్ బెర్త్ ఖాళీగా ఉంది. ప్రస్తుతం కుదిరిన రాజీ ఫార్ములామేర కేబినెట్లో ఖాళీగాఉన్న బెర్త్‌లో పట్నం మంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. మహేందర్‌రెడ్డి సుమారు 3 నెలలపాటు మంత్రిగా అధికారిక హోదాలో పనిచేస్తారు. -
TS Election 2023: ‘పట్నం’ శిబిరంలో అలజడి.. పదవుల కోసం టికెట్ త్యాగం చేస్తారా..?
వికారాబాద్: తాండూరులో టికెట్ పంచాయితీ మరోమారు తెరపైకి వచ్చింది. ఈ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతుండడంతో మళ్లీ రచ్చమొదలైంది. ఇప్పటికే ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎన్నికల సమరం సమీపిస్తుండడంతో పార్టీ అధిష్టానం సైతం బుజ్జగింపుల పర్వం మొదలుపెట్టింది. తాండూరు నియోజకవర్గ టికెట్ కేటాయింపు విషయమై పట్నం మహేందర్‌రెడ్డి శిబిరంలో అలజడి మొదలయింది. నిన్నటి వరకు బీఆర్ఎస్ టికెట్ ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికే వస్తుందంటూ ధీమాతో ఉన్న ఆయన అనుచరుల్లో ఒక్కసారిగా నైరాశ్యం నెలకొంది. శనివారం మంత్రి హరీశ్‌రావు, ఎంపీ రంజిత్‌రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డితో చర్చలు జరిపినట్లు సమాచారం. తాండూరు అసెంబ్లీ స్థానంలో పోటీ విరమించుకుంటే మంత్రి పదవితోపాటుగా రాజ్యసభకు పంపించేందుకు సీఎం కేసీఆర్ అనుకూలంగా ఉన్నారని నచ్చజెప్పారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆదివారం విషయం తెలుసుకున్న పట్నం వర్గీయులు మండల స్థాయి నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఫోన్లు చే స్తూ ఆందోళన చెందుతున్నారు. అయితే పట్నం ఈ విషయమై ఎలాంటి నిర్ణయానికి రాలేదు. జంబో జాబితా తర్వాతే నిర్ణయం.. బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జంబో జాబితా బయటకు వచ్చాకే పట్నం మహేందర్‌రెడ్డి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని ఆయన అనుచరగణం అంటున్నారు. కాగా తాండూరు నుంచి టికెట్ రాకపోతే తన వెంట నడిచేవారెందరున్నారని ఆయన లెక్కలేసుకుంటున్నారు. ఇప్పటికే కొంత మంది నాయకులు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి అనుకూలంగా ఉంటూ డబుల్ గేమ్ ఆడుతున్నారంటూ ఆయన సన్నిహిత వర్గాలతో అన్నట్లు తెలిసింది. నియోజకవర్గ స్థాయిలో మహేందర్‌రెడ్డికి బలమైన కేడర్ ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన వారికి టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో పైలట్ పేరు తొలి జాబితాలోనే వస్తుందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పదవుల కోసం టికెట్ త్యాగం చేస్తారా..? తాండూరు నియోజకవర్గం నుంచి 1994 నుంచి 2018 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పట్నం మహేందర్‌రెడ్డి ఆరు సార్లు పోటీ చేయగా .. నాలుగు సార్లు విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లోనూ తాండూరు నుంచే పోటీ చేస్తానంటూ ఆయన పలుమార్లు ప్రకటించారు. అయితే శనివారం బీఆర్ఎస్ పెద్దలతో జరిగిన చర్చల్లో పట్నం మహేందర్‌రెడ్డికి మంత్రి పదవితో పాటు సతీమణి జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డిని రాజ్యసభకు పంపిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయమై ఆయన నియోకవర్గ ముఖ్య నాయకుల అభిప్రా యం తీసుకుంటున్నారు. మరో రెండు మూడు రో జుల్లో తాండూరు అసెంబ్లీకి పోటీ చేస్తారా.. లేక పదవులతో సైలెంట్ అయిపోతారా అనేది స్పష్టత రానుంది. ఈ విషయమై పట్నం మహేందర్‌రెడ్డిని వివరణ కోరగా తాను తాండూరు అసెంబ్లీని వదులుకొనే ప్రసక్తే లేదన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పోటీ చేయడం ఖాయమన్నారు. -
కేజీఎఫ్ స్టైల్లో వీడియో: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే
సాక్షి, తాండూరు: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక, ఈ వ్యవహారంలో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ కేసులో పైలట్ రోహిత్ రెడ్డి కీలకంగా మారడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు వై కేటగిరి సెక్యూరిటీని కల్పించింది. అయితే, రోహిత్ రెడ్డి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తనకు కేటాయించిన సెక్యూరిటీతో ఫొటో షూట్ చేయటం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. తన గన్మెన్లు, వై.సెక్యురిటీ సిబ్బందితో రోహిత్ రెడ్డి చేసిన వీడియో షూట్స్ సోషల్ మీడియాలో వైరల్ మారాయి. ఈ వీడియోలో ముందుగా రోహిత్ రెడ్డి కాషాయ వస్త్రాలు ధరించి నడుచుకుంటూ వస్తుండగా.. ఆయన వెనక నుంచి సెక్యూరిటీ సిబ్బంది ఒక్కొక్కరుగా బయటకు వస్తుంటారు. బ్యాగ్రౌండ్లో మ్యూజిక్ ప్లే అవుతుంది. ఈ క్రమంలో రెండు వైపులా సెక్యూరిటీ సిబ్బంది నడుస్తుండగా.. మధ్యలో రోహిత్ రెడ్డి నడుచుంటూ వస్తుంటారు. ఇక, ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కూడా చదవండి: అక్కడ వందల కోట్ల స్కాం జరిగింది: ఎంపీ అరవింద్ సంచలన కామెంట్స్ -
పేపర్ లీక్.. టెన్త్ పరీక్షలు వాయిదా?.. పాఠశాల విద్యాశాఖ క్లారిటీ
సాక్షి, వికారాబాద్: తాండూర్‌లో పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. సోమవారం ఉదయం 9 గంటలకు టెన్త్ క్లాస్ పరీక్షలు ప్రారంభం అవ్వగానే నిమిషాల వ్యవధిలో తెలుగు పేపర్ వాట్సాప్‌లో ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. దీంతో ప్రశ్నాపత్రం లీకైందంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో మిగతా పరీక్షల నిర్వహణపై సందిగ్దం నెలకొంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన క్లారిటీ ఇచ్చారు. రేపటి పదో తరగతి పరీక్ష యథాతథంగా జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని తెలిపారు. టెన్త్ క్లాస్ పరీక్ష పేపర్ బహిర్గతం కావడంపై జిల్లా కలెక్టర్, వికారాబాద్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న నలుగురు వ్యక్తులను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. చట్టం 25/1997, CrPC సంబంధిత సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. ‘సెంటర్ నెం. 24033, గవర్నమెంట్, హైస్కూల్ నెం.1, తాండూరు, వికారాబాద్ జిల్లాలోని ఇన్విజిలేటర్ బందెప్ప పరీక్ష ప్రారంభమైన తర్వాత ప్రశ్న పత్రాన్ని ఫోటో తీసి మరో ఉపాధ్యాయుడు సమ్మప్పకు ఉదయం 9.37 గంటలకు పంపినట్లు గుర్తించాం. పరీక్ష ప్రారంభమైనప్పటి నుంచి ఉదయం 9.30 తర్వాత బయటి వ్యక్తిని కేంద్రంలోకి రాలేదు. కేంద్రం నుంచి బయటకు ఎవరూ వెళ్లలేదు. పరీక్షా నిర్వహణ విషయంలో రాజీపడలేదు. విచారణ తర్వాత ఇది కేవలం ఇన్విజిలేటర్ బందెప్ప దుర్వినియోగమేనని నిర్ధారించాం’ అని చెప్పారు.. సస్పెండ్ అయ్యింది వీళ్లే.. 1. శివ కుమార్, GHM, ZPHS, ముద్దాయిపేట, యాలాల్(M) (చీఫ్ సూపరింటెండెంట్) 2. K. గోపాల్, SA, Govt., No.1 ఉన్నత పాఠశాల, తాండూరు (డిపార్ట్మెంట్ అధికారి) 3. S. బండప్ప, SA(BS), Govt., No. 1 ఉన్నత పాఠశాల, తాండూరు. (ఇన్విజిలేటర్) 4. సమ్మప్ప, SA(PS), ZPHS, చెంగోలు, తాండూరు మండలం (ఇన్విజిలేటర్) చదవండి: టెన్త్ పేపర్ లీకేజ్ ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్.. -
టెన్త్ పేపర్ లీకేజ్ ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్.. వారిపై వేటు
సాక్షి, వికారాబాద్: తాండూర్‌లో పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయ్యింది. సెల్‌ఫోన్‌ను లోపలికి అనుమతించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్వశ్చన్ పేపర్ లీకేజ్‌పై నివేదిక ఇవ్వాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు సస్పెండ్ పేపర్ లీక్ ఘటనలో ముగ్గురిపై సస్పెన్షన్ వేటు పడింది. ఎగ్జామ్ సెంటర్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్ బందప్ప, మరొకరిపై వేటు వేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. కాగా పేపర్‌ను వాట్సాప్ గ్రూప్‌లో లీక్ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బందప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. 2017లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. పాఠశాల గదిలో ఒక విద్యార్థినిని వేధించడంతో కేసు నమోదు చేశారు. బందప్ప భార్య అదే పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తుంది. కేసు నమోదు టెన్త్ పేపర్ బయటకు పంపిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అయితే పేపర్ ఎక్కడా లీక్ కాలేదని పోలీసులు చెబుతున్నారు. పరీక్ష మొదలైన తర్వాతే పేపర్ బయటకు వచ్చిందని పేర్కొన్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత పేపర్‌ను మీడియా గ్రూప్‌లో పెట్టిన్నట్లు గుర్తించారు. ఉదయం 9:30 గంటలకు పదో తరగతి పరీక్ష ప్రారంభమవ్వగా.. 9:37 గంటలకు పేపర్‌ను వాట్సాప్ గ్రూప్‌లో షేర్‌చేశారని పోలీసులు తెలిపారు. ఎగ్జామ్ హాల్‌నుంచి పేపర్ పంపినందుకు ఇన్విజిలేటర్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. టెన్త్ పేపర్ లీక్ కలకలం ఆదివారం ఉదయం వాట్సాప్ గ్రూపుల్లో పదో తరగతి క్వశ్చన్ పేపర్ చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. పరీక్ష ప్రారంభమైన ఏడు నిమిషాలకే తెలుగు పేపర్ తాండూరులో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. పేపర్ బయటకు లీక్ కావడం, వాట్సప్‌లో వైరల్ కావడంపై తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జరిగిన ఘటనపై పోలీసు శాఖతోపాటు విద్యాశాఖ విచారణ ప్రారంభించింది. -
బీఆర్ఎస్ టికెట్ నాకే.. గెలిచేది నేనే: పట్నం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, వికారాబాద్: ‘బీఆర్ఎస్ పార్టీ టికెట్ నాకే.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది నేనే’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దేముల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పార్టీ టికెట్‌పై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారన్నారు. 1994 నుంచి నాయకులు, కార్యకర్తలు తన వెంటే నడుస్తున్నారన్నారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి పార్టీ కార్యక్రమాలలో ముందుండి నడిచానన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా ఓటర్లకు దూరం కాలేదన్నారు. తాండూరు అభివృద్ధి కోసం జిల్లా పరిషత్ నిధులతో పాటు ఎమ్మెల్సీ గ్రాంటు నిధులను స్థానిక ప్రజా ప్రతినిధులకు కేటాయించామన్నారు. పార్టీలోకి కొందరు వస్తుంటారు.. పోతుంటారు. వారి గురించి దిగులు పడాల్సిన అవసరం లేదన్నారు. మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్లిపోయారని అలాంటి వారి గురించి పట్టించుకొనే అవసరం లేదన్నారు. తాండూరు రాజకీయాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నారు. ప్రజల మద్దతు తనకే ఉందన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి రూ.2వేల కోట్ల నిధులను తీసుకువచ్చానన్నారు. ఇప్పటికీ ఆ నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ప్రజా రవాణాకు ఇబ్బందులు కలగకుండా తాండూరు–వికారాబాద్ రోడ్డుకు రూ.60 కోట్లు, తాండూరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రించేందుకు ఔటర్ రోడ్డుకు రూ.100 కోట్లు మంజూరు చేయించానని అన్నారు. ప్రస్తుతం ఔటర్ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మరోవైపు కాగ్నా బ్రిడ్జి, బుద్దారం, గాజిపూర్, మన్సన్పల్లి, కందనెల్లి, జీవన్గిలలో బ్రిడ్జీల నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. ఇటీవల నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేశారని వాటితో గ్రామాల అభివృద్ధికి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ముందుండి పనులు పూర్తి చేయాలన్నారు. -
అమెరికాలో విషాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
సాక్షి, వరంగల్: అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మిస్సోరిలోని ఓజార్క్ సరస్సులో ఈతకు వెళ్లిన నలుగురు తెలుగు విద్యార్థులు.. ప్రమాదవశాత్తు అందులో గల్లంతయ్యారు. వీరిలో వికారాబాద్‌కు చెందిన శివదత్తు, హనుమకొండకు చెందిన ఉత్తేజ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరికోసం గాలిస్తున్నారు. నలుగురు తెలుగు విధ్యార్థులు మిస్సోరి రాష్ట్రం సెయింట్ లూయిస్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. హనుమకొండకు చెందిన ఉత్తేజ్ మరణ వార్త తెలియడంతో అతని తల్లిదండ్రులు జనార్థన్, ఝాన్సీ లక్ష్మీ బోరున విలపిస్తున్నారు. కాగా గతేడాది ఆగస్టులో అమెరికా వెళ్లిన ఉత్తేజ్ హెల్త్ సైన్స్ డేటాలో మాస్టర్స్ చేస్తున్నాడు. ఈ ప్రమాదంలో వికారాబాద్ జిల్లాతాండూరుకు చెందిన అపెక్స్ ఆస్పత్రి యజమాని వెంకటేశం, జ్యోతి దంపతుల రెండో కుమారుడు శివదత్తు (25) కూడా మరణించారు. వైద్య విద్యను అభ్యసించేందుకు ఈ ఏడాది జనవరిలో అమెరికా వెళ్లాడు శివదత్తు. సెయింట్ లూయిస్ వర్సిటీలో డెంటల్ ఎంఎస్ విద్య అభ్యసిస్తున్నాడు. శనివారం దత్తు స్నేహితులతొ కలిసి ఓజార్క్ లేక్‌కు వెళ్లాడు. సరస్సులో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు ఇద్దరూ మునిగిపోయారు. విషయం తెలిసి మృతుని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. చదవండి: రాత్రి ఇంటికి రానని చెప్పి.. ఫ్రెండ్‌ను బస్టాప్‌లో దింపేందుకు వెళ్తుండగా.. -
రూ.100 కోట్లు తీసుకుని హ్యాపీగా ఉండేవాణ్ణి.. కానీ.. తాండూరు కోసమే..
బషీరాబాద్: నియోజకవర్గం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ‘ఎమ్మెల్యేల ఎర కేసు’లో తాను పెద్ద రిస్క్ తీసుకున్నానని వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. బషీరాబాద్ మండలం మల్కన్‌గిరి గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ప్రకటించాలని కోరుతూ గ్రామ యువకులు కొందరు వారం రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దీక్ష చేస్తున్న బాలకృష్ణ అనే యువకుడితో ఆదివారం ఫోన్లో మాట్లాడారు. ‘తాండూరు అభివృద్ధి కోసం ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నా. లేకుంటే వాళ్లు ఇచ్చే వంద కోట్ల రూపాయలు తీసుకొని నేను హ్యాపీగా ఉంటాను కదా. కానీ నేను మన కోసం రిస్క్ తీసుకున్నా. మీ గ్రామం అభివృద్ధికి ఏమేమి కావాలో నాకు లెటర్ రాయండి. మీ గ్రామం డెవలప్మెంట్ నేను చూసుకుంటా. సమస్యను నా దృష్టిలో పెట్టుకుంటా. ప్రభుత్వం ముందు ప్రపోజల్ చేస్తా..’అని తెలిపారు. నా కోసం దీక్ష విరమించాలని కోరారు. కాగా వారం రోజుల్లో మల్కన్‌గిరి గ్రామానికి రూ.25 లక్షల నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు దీక్ష చేస్తున్న యువకులు చెప్పారు. రిలే దీక్షలు విరమిస్తున్నట్లు తెలిపారు. చదవండి: అసెంబ్లీ సెగ్మెంట్లపై నజర్.. ఎన్నికలకు సమాయత్తంపై కేసీఆర్ ఫోకస్ -
‘ఎర’ రాజకీయంపై జోరుగా చర్చ.. వీడని చిక్కు.. ఎవరికి లక్కు!
సాక్షి, వికారాబాద్: తాజా రాజకీయాలు తాండూరు చుట్టే తిరుగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఎవరికి అనుకూలమో.. ఎవరికి ప్రతికూలమో అంతుపట్టని విధంగా మారాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఇంకా స్పష్టత రాకపోవడమే ఇందుకు కారణం. ఇదిలా ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు టికెట్ ఎవరికనే చర్చ అధికార పార్టీలో జోరుగా జరుగుతోంది. గతంలో తాండూరు స్థానం నాదంటే.. నాది అంటూ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి బాహాటంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ‘ఎర’ అంశం ఎవరికి అనుకూలంగా మారుతుందనేది స్థానికంగా చర్చనీయాంశమైంది. మరోవైపు ఘటన జరిగిన నాలుగు రోజులు గడుస్తున్నా ఇంకా స్పష్టత రావడంలేదు. ప్రస్తుతం వారి రాజకీయ భవిష్యత్‌పై స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇద్దరి మధ్య పోటీ తీవ్రం తాండూరులో జరిగిన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రోహిత్‌రెడ్డిల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. స్వల్ప ఆధిక్యతతో రోహిత్‌రెడ్డి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా విజయం సాధించాక కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. తన అనుచరులను సైతం వెంట తెచ్చుకొన్నారు. పదవుల విషయంలోనూ.. తాండూరు అసెంబ్లీ స్థానం కోసం పట్నం మహేందర్‌రెడ్డితో పాటు పైలెట్ రోహిత్‌రెడ్డి ఆశిస్తున్నారు. రోహిత్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరినా మహేందర్‌రెడ్డి వర్గానికి చెందిన నాయకులు మాత్రం ఎమ్మెల్యేకు దూరంగా ఉంటూ వచ్చారు. మరోవైపు పార్టీ, నామినేట్ పదవుల విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి. తాండూరు అసెంబ్లీ టికెట్ సీఎం కేసీఆర్ తమకే ఇస్తారని ఇద్దరు నేతలు ప్రకటిస్తూ వచ్చారు. మరోవైపు రాజకీయంగా, అధికారికంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పైచేయిగా నిలిచారు. కలిసొచ్చేది ఎవరికో.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తుందనేది తాజాగా చర్చ జరుగుతోంది. పార్టీ ఫిరాయింపునకు బీజేపీ నాలుగురు ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగడం.. కథ అడ్డం తిరిగి మధ్య వర్తులు జైలు పాలవడం నాలుగు రోజుల వ్యవధిలో చకచక జరిగిపోయాయి. అయితే ఇందులో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారని స్వయంగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కాగా ఈ వ్యవహారం తాండూరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇద్దరి రాజకీయ భవిషత్ను నిర్ణయించనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చదవండి: మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు కన్ఫర్మ్: మంత్రి హరీష్‌రావు -
మంజీర నదిపై భారీ వంతెన నిర్మాణం.. కానీ..
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి, మెదక్ జిల్లాల మధ్యన దూరభారాన్ని తగ్గించేందుకు రూ.33 కోట్ల వ్యయంతో చేపట్టిన మంజీర నదిపై భారీ వంతెన, కామారెడ్డి జిల్లాలో రెండు వరుసల రహదారి నిర్మాణం పనులు దాదాపు పూర్తయ్యాయి. కానీ మెదక్ జిల్లా పరిధిలో (వంతెన అవతల) రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. ఈ రోడ్డు అందుబాటులోకి కానీ 40 కిలోమీటర్ల మేర దూరభారం తగ్గుతుంది. ఇరు జిల్లాల మధ్య వ్యాపార సంబంధాలు పెరుగుతాయి. 2015లో వంతెన నిర్మాణానికి రూ.12 కోట్లు, కామారెడ్డి జిల్లాలోని తాండూర్ గేట్ నుంచి తాండూరు, వెంకంపల్లి మీదుగా వంతెన వరకు రెండు వరుసల రహదారి నిర్మాణం కోసం రూ.21 కోట్లు మంజూరు చేశారు. రోడ్డు నిర్మాణం కోసం విలువైన భూములు కోల్పోతున్నామని రైతులు కోర్టుకు వెళ్లడంతో కొంత కాలం పనులు జరగలేదు. పరిహారం ఇచ్చిన తరువాత పనులు చేపట్టారు. అటవీ వివాదంతో కొద్దిమేర పనులు ఆగిపోయినా మిగతా పనులు దాదాపు పూర్తయ్యాయి. మంజీర మీద భారీ వంతెన అందుబాటులోకి వచ్చింది. కానీ వంతెన అవతల రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల దుర్గమ్మ దర్శనానికి కామారెడ్డి జిల్లా నుంచి ప్రతి నిత్యం ఎంతో మంది వెళుతుంటారు. రోడ్డు అందుబాటులోకి వస్తే రాకపోకలు సులువవుతాయి. తగ్గే దూరం 40 కిలోమీటర్లు.. కామారెడ్డి జిల్లా వాసులు ముఖ్యంగా ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట తదితర మండలాల ప్రజలు మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలానికి వెళ్లాలంటే మెదక్ మీదుగా దాదాపు 50 కిలోమీటర్లు ప్రయాణించాలి. అయితే తాండూర్ గేట్ నుంచి తాండూర్, వెంకంపల్లి మీదుగా మంజీరపై నిర్మించిన వంతెన ద్వారా మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని మగ్దుంపూర్ మీదుగా పాపన్నపేటకు వెళ్లడానికి కేవలం 10 కిలోమీటర్లే ఉంటుంది. అంటే దాదాపు 40 కిలోమీటర్ల మేర దూరభారం తగ్గుతుంది. మంజీర మీద వంతెన లేక ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులుపడ్డారు. ఇప్పుడు వంతెన పూర్తయ్యింది. కానీ మెదక్ జిల్లాలో రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో ఆశలు అడియాసలయ్యాయి. (క్లిక్: హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. స్టాప్ లైన్ దాటితే ఇక అంతే!) నిధులు మంజూరైతేనే... మంజీర వంతెన నుంచి మగ్దుంపూర్ మీదుగా పాపన్నపేట వరకు దాదాపు 4 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఫార్మేషన్ రోడ్డు కూడా లేదు. పొలాల మధ్య నుంచి బండ్లబాట ఉంది. రోడ్డు నిర్మాణానికి ముందుగా రైతుల నుంచి భూసేకరణ జరపాలి. ఆ తర్వాత రోడ్డు పనులు చేపట్టాల్సి ఉంటుంది. రోడ్డు నిర్మాణం కోసం మెదక్ జిల్లా రోడ్లు, భవనాల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దానికి నిధులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు. (క్లిక్: ఆర్టీసీ బస్సులకు కొత్త పేర్లు.. ఏదైతే బాగుంటుంది?) రూ.33 కోట్లు ఖర్చు చేసినా ప్రయోజనం శూన్యం.... కామారెడ్డి, మెదక్ జిల్లాల మధ్య దూరం మధ్య దూరం తగ్గించే రహదారిని పూర్తి చేయాలని జెడ్పీ మీటింగుల్లో ప్రతిసారీ అడుగుతున్నాం. ప్రభుత్వ పెద్దలను కలిసి విన్నవించాం. అయినా ప్రయోజనం లేదు. రూ.33 కోట్లతో వంతెన, రోడ్డు నిర్మాణం పూర్తయినా, మెదక్ జిల్లాలో పనులు చేపట్టకపోవడంతో ప్రయోజనం లేకుండాపోయింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తే ఏడుపాయల, మెదక్ చర్చి, పోచారం ప్రాజెక్టు, పోచారం అభయారణ్యానికి పర్యాటకులు పెరుగుతారు. – యు.మనోహర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు, నాగిరెడ్డిపేట -
నగరంలో చోరీ.. తాండూరులో అమ్మకం
తాండూరు: బైక్‌ల చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను వికారాబాద్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం తాండూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. యాలాల మండలం, కమాల్‌పూర్ గ్రామానికి చెందిన బోయిని శ్రీకాంత్, మ్యాతరి భాస్కర్, మ్యాతరి శివ హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నారు. జల్సాలకు అలవాటుపడిన వీరు ముఠాగా ఏర్పడి వాహనాల చోరీకి పాల్పడుతున్నారు. నాలుగు నెలలుగా వాహనాలు అపహరిస్తూ.. మధ్యవర్తుల సాయంతో తక్కువ ధరకు తాండూరులో విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు 20 ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలు దొంగిలించారు. మాదాపూర్ పరిధిలో ఐదు బైకులు, కూకట్‌పల్లిలో రెండు బైకులు, ఒక ఆటో, మియాపూర్‌లో రెండు బైకులు, బంజారాహిల్స్ ప్రాంతంలో మూడు బైకులు, సనత్‌నగర్‌లో రెండు బైకులు, బాచుపల్లి ప్రాంతంలో ఒక ఆటో, చందానగర్‌లో మూడు, యూసుఫ్‌గూడలో ఒక బైక్ చోరీ చేశారు. యాలాల మండలంలోనూ రెండు బైకులను దొంగిలించారు. ఇందులో 9 ద్విచక్రవాహనాలను పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన బోయిని ఆనంద్‌కు విక్రయించారు. మరో నాలుగు ద్విచక్రవాహనాలను యాలాల మండలం అక్కంపల్లి గ్రామానికి చెందిన తుప్పలి మహిపాల్‌కు విక్రయించారు. మిగతా వాటిలో బోయిని శ్రీకాంత్ వద్ద 3 బైకులు ఒక ఆటో, మ్యాతరి భాస్కర్ ఇంటి వద్ద 2 బైకులు, మ్యాతరి శివ ఇంటి వద్ద 2 బైకులు, ఒక ఆటోను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వాహనాలను కొనుగోలు చేసిన ఆనంద్, మహిపాల్‌లపై కేసు నమోదు చేశామన్నారు. దొరికారిలా.. యాలాల పీఎస్ పరిధిలో 2 ద్విచక్రవాహనాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదులు అందడంతో ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 18న యాలాలలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా బైక్‌పై వస్తున్న ఇద్దరు యువకులను ఆపి పత్రాలు అడిగారు. వీరు పారిపోయేందుకు ప్రయత్నించడంతో అదుపులోకి తీసుకుని, విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. కేసును ఛేదించిన రూరల్ సీఐ రాంబాబు, యాలాల ఎస్ఐతో పాటు బృందాన్ని అభినందించారు. సమావేశంలో డీఎస్పీ శేఖర్‌గౌడ్, పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. (చదవండి: అదృశ్యమైన బాలిక సెల్లార్ గుంతలో అదృశ్యమైంది) -
వీఆర్వో పాడుబుద్ది.. భార్యకు సంతానం కలగడం లేదని యువతికి గాలంవేసి
సాక్షి, తాండూరు(వికారాబాద్): తన భార్యకు పిల్లలు పుట్టడంలేదని, రెండో పెళ్లి చేసుకుంటానని యువతికి మాయమాటలు చెప్పి లొంగదీసుకుని మోసం చేసిన వీఆర్వోపై తాండూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. బషీరాబాద్ మండలం దామర్చేడ్ గ్రామానికి చెందిన బోయ కార్తీక్ పెద్దేముల్ మండలంలో వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు ఇంతకుముందే వివాహం కాగా, సంతానం లేదు. దీంతో రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతికి మాయమాటలు చెప్పి ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. అయితే ఇటీవల తన భార్యకు సంతానం కలగడంతో, సదరు యువతితో మాట్లాడటం మానేశాడు. పెళ్లి చేసుకునేది లేదని ఆమెకు తేల్చి చెప్పాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు కార్తీక్, అతనికి సహకరించిన కుటుంబ సభ్యులపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు సీఐ కార్తీక్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు మరో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. చదవండి: బయటపడ్డ బండారం: అత్యాశకు పోయి.. ఆస్తి మొత్తం పోగొట్టుకుని.. -
పుట్టింటికి వెళ్తున్నానని భర్తకి చెప్పి..
సాక్షి,తాండూరు: తల్లి, కూతుళ్లు అదృశ్యమైన ఘటన కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్లాపూర్‌లో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం కొత్లాపూర్‌కు చెందిన అతియ పర్వీన్, ఎండీ పాషా దంపతులు. వీరికి కూతుళ్లు అఫియానాజ్, జోయ తసి ఖాన్లు ఉన్నారు. కూలీ పనులు చేస్తూ జీవిస్తుంటారు. ఏప్రిల్ 24న పర్వీన్ తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని తల్లిగారి ఊరైన కర్ణాటక రాష్ట్రం పెద్ద ఐనెల్లి గ్రామానికి వెళ్తున్నానని భర్తకు చెప్పి బస్సులో వెళ్లింది. పర్వీన్ తన తల్లిగారి ఇంటికి వెళ్లలేదు. దీంతో పర్వీన్ కోసం బంధువుల వద్ద వెతికినా ఆచూకి లభించలేదు. భర్త పాషా ఆదివారం కరన్ కోట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: Fake Police: చిన్న పని వుంది... ఒక్కసారి బైక్ ఇస్తే వెళ్లి వచ్చేస్తా.. -
తాండూరులో ‘కారు’చిచ్చు.. దుమారం రేపిన వాయిస్ రికార్డింగ్
తాండూరు ‘కారు’లో చిచ్చురేగింది. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఆధిపత్య పోరు చినికిచినికి గాలివానలా మారింది. అధికార పార్టీలో ఉన్న ఇద్దరు నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు తార స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇరువర్గాలుగా విడిపోయిన నాయకులు ఒకరిపై ఒకరు మాటల కత్తులు దూసుకుంటున్నారు. చదవండి: కేసీఆర్ క్లారిటీకి వచ్చారా? తాండూరు(వికారాబాద్ జిల్లా): ఇద్దరు బలమైన నేతల నడుమ.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు నలిగిపోతున్నారు. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గాల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న వర్గపోరు తీవ్రస్థాయికి చేరింది. ప్రస్తుతం ఈ గొడవ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ విషయం పలుమార్లు అధిష్టానం దృష్టికి వెళ్లినా రాజీ కుదరలేదు. దీంతో సదరు నాయకులిద్దరూ ఎవరికివారే తెరవెనుక గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ వచ్చారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టికెట్ తనకేనని ఇరువురూ బాహాటంగా ప్రకటిస్తున్నారు. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి తాండూరు పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డిని ఫోన్లో దూషించారనే ఆడియో వైరల్‌గా మారింది. తివాచీతో ముదిరిన వివాదం జిల్లాలో తాండూరు రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. అసెంబ్లీకి ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చనే సంకేతాల నేపథ్యంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఇదే సమయంలో ఇరు వర్గాలకు చెందిన నాయకులు పైచేయి కోసం ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న ఈ వ్యవహారం ఇటీవల జరిగిన భద్రేశ్వర రథోత్సవం నేపథ్యంలో మరోసారి బయటపడింది. ప్రొటోకాల్ ప్రకారం అధికారులు, నిర్వాహకులు నేతలకు సరైన ప్రాధాన్యం ఇవ్వాలి. రథోత్సవానికి ముందుగా హాజరైన ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి వెళ్లి కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన వేదికపై కూర్చున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వచ్చారు. ఆయన ఎమ్మెల్సీ పక్కన కూర్చోకుండా.. వారి ముందు మరో తివాచీ వేయించుకుని తన వర్గీయులతో కూర్చున్నారు. దీంతో ఎమ్మెల్సీ వర్గం వారు వెనుక వరుసలోకి వెళ్లారు. దీనిపై లోలోపల మండిపడిన మహేందర్‌రెడ్డి వర్గీయులు వేడుకలకు ఆటంకం కలిగించవద్దనే ఉద్దేశంతో మిన్నకుండిపోయారు. ఈ విషయంలో తమకు అవమానం జరిగిందని భావించిన ఎమ్మెల్సీ మరునాడు సీఐ రాజేందర్‌రెడ్డికి ఫోన్ చేసి మండిపడ్డారు. ఈ సందర్భంగా సీఐని దుర్భాషలాడినట్లు ఉన్న ఆడియోలను ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గీయులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. తోఫాల పంపిణీలో రగడ రంజాన్ సందర్భంగా గత మంగళవారం యాలాల, బషీరాబాద్, తాండూరులో తోఫాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సమయంలో ప్రొటోకాల్ పాటించలేదని ఎమ్మెల్సీ వర్గీయులు అధికారులపై మండిపడ్డారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ అరవింద్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండున్నరేళ్లుగా వార్.. తాండూరు టీఆర్ఎస్లో రెండున్నరేళ్లుగా రచ్చ సాగుతోంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి పోటీ చేసిన మహేందర్‌రెడ్డిపై కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రోహిత్‌రెడ్డి విజయం సాధించారు. ఆరు నెలల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తర్వాత రోహిత్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. ఆరోజు నుంచి ఇరువర్గాల మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంపై పట్టుసాధించేందుకు నేతలిద్దరూ సిద్ధమయ్యారు. పోటాపోటీగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సర్వాత్ర విమర్శలు.. తాండూరులో టీఆర్ఎస్ పార్టీ నేతల తీరుపై సర్వ త్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఇక్కడ టీఆర్ఎస్ బలంగా ఉంది. ఇద్దరు బలమైన నేతలు ఒకే పార్టీలో ఉండటం, ఇరువురికి పొసగక తరచూ గొడవలు జరగడంపై అధికార పార్టీ అభిమానులు, ప్రజలు విమర్శలు చేస్తున్నారు. -
పొరపాటున నోరు జారా.. క్షమాపణలు కోరుతున్నా: ఎమ్మెల్సీ పట్నం
సాక్షి, హైదరాబాద్: తాండూరు సీఐను దూషించింనందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. పొరపాటున నోరు జారానని అన్నారు. ఆడియో క్లిప్పులతో పోలీసుల మనసు నొప్పిస్తే అది తనకు బాధకరంగా ఉంటుందని అన్నారు.తన వ్యాఖ్యల వల్ల పోలీసులు బాధపడితే క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. కాసేపట్లో సీఐను కలవనున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు. ‘పోలీసు సోదరులంతా నా కుటుంబ సభ్యులతో సమానం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి, అభివృద్ధి, శాంతిభద్రతలలో వారి కృషి అభినందనీయమన్నారు. నిన్నటి నుంచి విస్తృతంగా ప్రచారం అవుతున్న ఆడియో క్లాప్‌లు ఆవేశంగా మాట్లాడిన నేపథ్యంలో పొరపాటున నోరుజారి కొంత మంది మిత్రులు, పోలీసులు భాధపడితే తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నాను.రు. పోలీసులంటే నాకు ఎనలేని గౌరవం’ అని గురువారం ఓప్రకటనలో తెలిపారు. కాగా ‘రౌడీషీటర్లకు కార్పెట్ వేస్తావా..? ఎంత ధైర్యం? నీ అంతు చూస్తా!’ అంటూ తాండూరు సీఐపై ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన భావిగి భద్రేశ్వర జాతరకు ముందుగా మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. అరగంట తర్వాత ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వచ్చారు. దాంతో మరో కార్పెట్ వేసి ఎమ్మెల్యేను కూర్చోబెట్టారు. ఇదే మహేందర్‌రెడ్డి ఆగ్రహానికి కారణమైంది. ప్రొటోకాల్ ఎందుకు పాటించలేదని సీఐ రాజేందర్ రెడ్డికి ఫోన్ చేసి మహేందర్‌రెడ్డి బూతులు తిట్టారు. ‘నా ముందే రౌడీషీటర్లకు కార్పెట్ ఎలా వేస్తావు’ అని సీఐని నిలదీశారు. ‘రౌడీషీటర్లు ఎవరు ?’ అని సీఐ ప్రశ్నించగా.. ఎమ్మెల్యే పక్కన ఉన్నవారంతా వారేనంటూ దుర్భాషలాడారు. ఎమ్మెల్యే రౌడీషీటరా అంటూ సీఐ ప్రశ్నించగా.. ఎమ్మెల్సీ మళ్లీ తీవ్ర పదజాలం ఉపయోగించారు. మంచిగా మాట్లాడాలని సీఐ ఎమ్మెల్సీని కోరగా.. ‘నువ్వు ఇసుక అమ్ముకొంటలేవా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ అమ్ముకొంటున్నానని సీఐ ప్రశ్నించగా.. త్వరలో పట్టిస్తానని ఫోన్ కట్ చేశారు. సీఐని దూషించిన కేసులో మహేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్టు వికారాబాద్ ఎస్పీ తెలిపారు. . ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మరడంతో ఆయన వివాదంలో చిక్కుకున్నారు. చదవండి👉వారసులొస్తున్నారు.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ అంటూ.. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిపై మరో కేసు నమోదైంది. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో యాలాల ఎస్సైపై మహేందర్ రెడ్డిపై నోరు జారినందుకు ఈ కేసుపెట్టారు. సీఐని దూషిస్తూ. ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టారు. కాగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తనతో అనుచితంగా వ్యవహరించారని ఎస్సై అరవింద్ ఆరోపించారు. తీవ్ర పరుష పదజాలాన్ని వాడారని, తనకు నచ్చని వాళ్లను స్టేజి పైనుంచి కిందకు దించాలంటూ బూతులు తిట్టారని అన్నారు. అరేయ్ ఎస్సై.. తమాషాలు చేస్తున్నావా అని తిట్టాడని. పబ్లిక్‌లో తిట్టడం అవమానకరంగా ఉందన్నారు. మహేందర్‌రెడ్డిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
పాఠశాలలో సెల్‌ఫోన్ లొల్లి.. విద్యార్థినిపై నింద.. చివరికి!
సాక్షి, వికారాబాద్: పాఠశాలలో సెల్‌ఫోన్ వినియోగించొద్దనే నిబంధనలు ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కొందరు ఉపాధ్యాయులు యథేచ్ఛగా వినియోగిస్తుండగా విద్యార్థులు సైతం బడికి తీసుకొస్తున్నారు. సెల్‌ఫోన్ తెచ్చిన వివాదంతో ఓ విద్యార్థిని కనిపించకుండా పోయింది. బాలిక ఫోన్ ఆపహరించిందని ఉపాధ్యాయులు నిందించడంతో మనోవేదనకు గురై అదృశ్యమైంది. ఆమె ఇల్లు విడిచి వెళ్లి నాలుగు రోజులు అవుతున్నా ఇప్పటి వరకు జాడ లేకుండా పోయింది. ఈ విషయమై బాధితురాలి తల్లిదండ్రులు తాండూరు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరు మున్సిపల్ పరిధిలోని 7వ వార్డులో నివాసం ఉంటున్న రమేష్ కూతురు సాయిపూర్ ప్రాంతంలోని నెంబర్–1 ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. పాఠశాలలో సెల్‌ఫోన్ వినియోగించొద్దనే నిబంధనలు ఉన్నా ఉపాధ్యాయులు, కొందరు విద్యార్థులు సైతం కొంతకాలంగా సెల్ఫోన్లు బడికి తీసుకొస్తున్నారు. ఈక్రమంలో గత నెల 25న ప్రభుత్వ నెంబర్– 1 పాఠశాలలో ఓ విద్యార్థి సెల్‌ఫోన్ తీసుకొచ్చింది. అది పోయింది. ఈ విషయమై బాలిక ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఉపాధ్యాయులు 9వ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో విచారించారు. ఫోన్ ఎవరు తీసుకున్నా వెంటనే తిరిగి ఇచ్చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులు గాలించగా సెల్‌ఫోన్ బాత్రూంలో లభించింది. అంతటితో ఆగకుండా సెల్‌ఫోన్‌ను ఓ బాలిక దొంగిలించిందని ఆమెపై చోరీ నింద వేశారు. విద్యార్థుల ఎదుటే ఆమెకు చివాట్లు పెట్టారు. అనంతరం సదరు బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి చోరీ విషయం చెప్పారు. అనంతరం ఇంటికెళ్లిన బాలికను తల్లిదండ్రులు దండించారు. తాను దొంగతనం చేయలేదని బాలిక చెప్పినా వినిపించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఆమె కోసం రెండు రోజుల పాటు కుటుంబసభ్యులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు.. ప్రభుత్వ నంబర్– 1 పాఠశాలలో జరిగిన సెల్‌ఫోన్ చోరీ వివాదం బాలిక కనిపించకుండా పోయేందుకు కారణమైంది. బాలిక తండ్రి రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు. తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ బాలిక మిస్సింగ్ కేసును త్వరగా ఛేదించాలని పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డిని ఆదేశించారు. బాలిక ఎవరైనా తమ బంధువుల ఇంట్లో తలదాచుకుందా.. లేదా ఇతర ప్రాంతాలకు రైలులో ఏమైనా వెళ్లిందా అనే కోణాల్లోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
కమలంలో ముసలం.. పార్టీలో గ్రూపు రాజకీయాలు
సాక్షి, వికారాబాద్: బీజేపీలో గ్రూపు రాజకీయాలకు తెరలేచింది. జిల్లా నాయకత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ నేతల నుంచి తరచూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. సదానంద్‌రెడ్డి పార్టీ జిల్లా పగ్గాలు చేపట్టి ఏడాదిన్నర పూర్తయినా.. ఇప్పటికీ క్యాడర్‌పై పట్టు సాధించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్య సఖ్యత కొరవడింది. ఈక్రమంలో జిల్లా అధ్యక్షుడినే మార్చాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈ విషయాన్ని కొంతమంది నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. బీజేపీకి వెన్నెముక అయిన సంఘ్ పరివార్.. ప్రస్తుత అధ్యక్షుడి పనితీరుపై అసంతృప్తిగా తెలుస్తోంది. ఆయన స్థానంలో తాండూరుకు చెందిన ఓ నాయకుడికి అవకాశం ఇస్తారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. చదవండి: సీఎం భగవంత్ మాన్ మరొకటి.. చండీగఢ్ పంజాబ్‌కే సొంతం కార్యకర్తల్లో అసంతృప్తి బీజేపీ జిల్లా నేతల పనితీరుపై కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్నట్లు కనిపిస్తోంది. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో యువ నాయకత్వం, ఏబీవీపీ, కిందిస్థాయి నాయకులు చురుగ్గా పాల్గొంటుండగా, ముఖ్య నేతలుగా చెప్పుకొంటున్న వారు మాత్రం ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వికారాబాద్ మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా ఉన్న సదానంద్‌రెడ్డి సతీమణి.. ఇప్పటి వరకు అధికార పార్టీ పనితీరును ఎండగడుతూ బీజేపీ పక్షాన వాయిస్ వినిపించలేకపోతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇటీవలి కాలంలో జరుగుతున్న పార్టీ కార్యకర్తల సమావేశాలకు జిల్లా ముఖ్య నేతలు మొహం చాటేయటం కూడా విమర్శలకు తావిస్తోంది. పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి జనార్దన్‌రెడ్డి సైతం కొంత కాలంగా జిల్లాలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అతనికి జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేతతో పొసగకపోవటమే ఇందుకు కారణమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. చదవండి: హైడ్రామా.. కాంగ్రెస్ కొంప ముంచిన ఎమ్మెల్యేలు జిల్లా నేతలు విఫలం ఇటీవలే నాలుగు రాష్ట్రాల్లో అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ మంచి ఊపుమీద కనిపిస్తోంది. రాష్ట్ర నాయకత్వం కూడా ఈ స్పీడ్‌ను కొనసాగించాలని భావిస్తోంది. దక్షణాదిలో సైతం పట్టుసాధించాలంటే తెలంగాణపై ఫోకస్ పెట్టాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. ఇందుకోసం క్షేత్రస్థాయి నుంచి బీజేపీ బలోపేతానికి కంకణం కట్టుకుంది. దుబ్బాక ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్పై బీజేపీ గెలుపు.. ఆ వెంటనే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నలభైకిపైగా కార్పొరేట్ స్థానాల కైవసం, ఆ తర్వాత కొద్ది రోజులకే హుజూరాబాద్‌లో ఈటల విజయం, ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలను రాబట్టిన పార్టీ మంచి ఊపుమీదుంది. మంత్రిగా, సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన ఎ.చంద్రశేఖర్ బీజేపీలో కొనసాగుతుండటం స్థానిక నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ఆయన పార్టీకి పెద్ద దిక్కుగా మారుతారని అంతా భావించారు. కానీ పార్టీ కార్యక్రమాల్లో ఏసీఆర్ పెద్దగా పాల్గొనకపోవడం కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. -
పంతం నీదా.. నాదా!.. ‘మీకు ఓటేసి సిగ్గుపడుతున్నా’
నేతల మధ్య నెలకొన్న వైరం.. అభివృద్ధికి ఆటంకంగా మారుతోంది. తాండూరులో ప్రజా సమస్యలను గాలికొదిలేసిన పాలకులు వ్యక్తిగత ఎజెండాల అమలుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో పరస్పర ఆరోపణలు చేసుకుంటూ వర్గపోరును ప్రోత్సహిస్తున్నారు. రెండేళ్లకుగా పైగా ఈ తతంగాలను గమనిస్తున్న నియోజకవర్గ ప్రజలు వీరి తీరును ఈసడించుకుంటున్నారు. సాక్షి, వికారాబాద్: అధికార పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వ్యవహార శైలిపై ప్రజలు మండిపడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని రోడ్లెక్కి ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. సాధారణ ప్రజలతో పాటు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు సైతం వినూత్న నిరసనలతో వీరి తీరును ఎండగడుతున్నారు. జిల్లాలోని మిగతా నియోజకవర్గల్లోనూ అధికార పార్టీలో గ్రూపు తగాదాలు కనిపిస్తున్నా తాండూరులో ఇవి తార స్థాయికి చేరాయి. శుక్రవారం పట్టణంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి సమక్షంలోనే ఇరువురు నేతలు వాగ్వాదానికి దిగడం పరిస్థితికి అద్దం పట్టింది. తాండూరులో రోడ్ల దుస్థితిపై చెప్పుల దండ వేసుకుని నిరసన మీకు ఓటేసి సిగ్గుపడుతున్నా.. ‘జనం బాధలు పట్టించుకోని ఈ నేతలకు ఓటేసినందుకు సిగ్గుపడుతున్నా’ అంటూ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి చెప్పుల దండ మెడలో వేసుకుని ఇటీవల నిరసన తెలిపాడు. ‘తాండూరు మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలోని రోడ్ల ను చూసి.. ఈ నాయకుల్లో చలనం రాకపోవడం తమ దౌర్భాగ్యం’ అని పట్టణ ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి ప్రత్యామ్నాయంగా రాజకీయాలు, అభివృద్ధిలో నూతన ఒరవడి సృష్టిస్తానని చెప్పిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సైతం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమయ్యారనే వాదన వినిపిస్తోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పర్యటనల్లో ఆందోళన చేస్తున్న ప్రజలను అరెస్టులు, గదమాయింపులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సమస్యలను పరిష్కరించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైలెట్ చేరికతో సీన్ రివర్స్ టీఆర్ఎస్ తరఫున జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతల్లో కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. మొదటినుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా తమవంతు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో హరీశ్వర్‌రెడ్డి వయసు పైబడటం, ఆరోగ్యం సహకరించని కారణంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో మహేందర్‌రెడ్డి పార్టీకి పెద్దదిక్కుగా మారారు. టీఆర్ఎస్ మొదటిసారి అధికారంలో ఉన్న ఐదేళ్లలో మంత్రిగా పనిచేసిన ఆయన జిల్లా రాజకీయాలను శాసించారు. అనూహ్యరీతిలో 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలవగా.. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రోహిత్‌రెడ్డి విజయం సాధించారు. ఆతర్వాత కొద్ది రోజులకే రోహిత్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో పార్టీలో గ్రూపు తగాదాలకు తెరలేచింది. మంత్రి సబితారెడ్డి సమక్షంలో వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయులు, మహేందర్‌రెడ్డి, సునీతారెడ్డి, రోహిత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తాండూరు నియోజకవర్గంలో నెలకొన్న వర్గపోరుతో జనం అవస్థలు పడుతున్నారు. అభివృద్ధి పనుల నిర్వహణ, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సమయంలో నూ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వీరి మధ్య అధికారులు సైతం నలిగిపోతున్నారనే వాదన వినిపిస్తోంది. ఇటీవల పెద్దేముల్ మండలంలో జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ప్రారంభించాల్సిన పలు అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేయడం నేతల మధ్య అంతరాన్ని మరింత పెంచింది. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదర్చాల్సిన మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి సైతం సొంత కేడర్‌ను బలోపేతం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారనే చర్చ సాగుతోంది. -
ఢీ– 13 విన్నర్‌గా లారీ డ్రైవర్ కూతురు.. మనమ్మాయే!..
సాక్షి, తాండూరు టౌన్(వికారాబాద్): తాండూరు పట్టణానికి చెందిన కావ్యశ్రీ ఓ టీవీ ఛానల్లో ప్రసారమైన ఢీ– 13 డ్యాన్స్ పోటీల్లో టైటిల్ విన్నర్‌గా నిలిచింది. బుధవారం రాత్రి జరిగిన ఫైనల్ పోటీల్లో కార్తీక్‌ను ఓడించి టైటిల్ దక్కించుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సినీ హీరో అల్లు అర్జున్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకుంది. పట్టణంలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన లారీ డ్రైవర్ మహేశ్, పద్మావతి దంపతుల కూతురు దువచర్ల కావ్యశ్రీ, స్థానిక భాష్యం జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతోంది. చిన్ననాటి నుంచి డ్యాన్స్‌పై మక్కువ పెంచుకున్న ఆమెకు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా ఢీ– 13లోఅవకాశం దక్కింది. ప్రతీ రౌండ్లో సత్తా చాటుతూ పోటీదారులకు సవాలు విసిరింది. ఫైనల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన ద్వారా విజేతగా నిలిచింది. కావ్యశ్రీ విజయంపై భాష్యం కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ, అధ్యాపకులు, తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, పట్టణ వాసులు ఆనందం వ్యక్తంచేశారు. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మంచి కొరియోగ్రాఫర్‌గా ఎదగాలనేదే తన లక్ష్యమని కావ్యశ్రీ తెలిపింది. చదవండి: కపిల్ దేవ్ బయోపిక్కు షాక్, నిర్మాతలపై చీటింగ్ కేసు చదవండి: బిగ్‌బాస్‌పై యాంకర్ రవి తల్లి షాకింగ్ కామెంట్స్ -
ఇక్కడ డీజిల్ లీటర్ రూ.95, కర్ణాటకలో రూ. 85
సాక్షి,తాండూరు(వికారాబాద్): ఇంధన ధరలు ఆకాశాన్ని అంటాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ లీటర్ రేటు సుమారు రూ. 100 ఉంది. ఇటీవల కేంద్ర సర్కారు పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ తగ్గించింది. దీంతో లీటర్ డీజిల్‌పై రూ. 10, పెట్రోల్‌పై రూ.5 తగ్గింది. ఈనేపథ్యంలో వాహనదారులకు కొంత ఊరట కలిగింది. కేంద్ర సర్కారు పిలుపు మేరకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ వ్యాట్ తగ్గించారు. ఈక్రమంలో కర్ణాటకలో డీజిల్‌పై మరో రూ.10 తగ్గడంతో మన జిల్లాకు పొరుగున ఉన్న ఆ రాష్ట్రానికి వాహనదారులు క్యూ కట్టారు. తాండూరు ప్రాంతంలో భారీగా నాపరాతి గనులు ఉన్నాయి. అదేవిధంగా నాపరాతిని లారీల్లో ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తుంటారు. పొరుగున ఉన్న కర్ణాటకలో పెట్రో ఉత్పత్తులపై ధరలు తగ్గడంతో మన రాష్ట్ర సరిహద్దులో ఉన్న పెట్రోల్ బంకుల్లో వ్యాపారం తగ్గి వెలవెలబోతున్నాయి. చదవండి: ప్లాస్టిక్ నుంచి పెట్రోల్..అందుబాటులో ఎప్పుడంటే ? 8 మండలాలు చేరువలో.. జిల్లాలో 19 మండలాలు ఉండగా అందులో 8 మండలాలు కర్ణాటక సరిహద్దుకు దగ్గరగా ఉన్నాయి. ప్రధానంగా తాండూరు, కొడంగల్ నియోజకవర్గాలు రాష్ట్ర, జిల్లా సరిహద్దులో ఉన్న విషయం తెలిసిందే. కేంద్రం వ్యాట్ తగ్గించడంతో గతంలో లీటర్ పెట్రోల్ రూ.115 ఉండగా ప్రస్తుతం రూ.109.50 లభిస్తోంది. డీజిల్ ధర గతంలో రూ.108 ఉంటే తగ్గిన ధర ప్రకారం ఇప్పుడు రూ.95.91 దొరుకుతోంది. కర్ణాటకలో పెట్రో ధరలు మరింత తగ్గాయి. అక్కడ డీజిల్ రూ. 85, పెట్రోల్ లీటర్ రూ. 100కు లభిస్తోంది. దీంతో సరిహద్దు మండలాల వాహనదారులతో పాటు తాండూరు ప్రాంతంలోని నాపరాతి గనుల లారీలు మన జిల్లాకు చేరువలో ఉన్న కర్ణాటకకు వెళ్లి ట్యాంక్ ఫుల్ చేసుకొని వస్తున్నారు. నాపరాతి గనులపై తగ్గిన భారం తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, బషీరాబాద్ మండలాల్లో వందల సంఖ్యలో నాపరాతి గనులు ఉన్నాయి. ప్రతిరోజు గనుల నుంచి యంత్రాల ద్వారా నాపరాతిని వెలికి తీస్తారు. అనంతరం నాపరాతి బండలను వివిధ ప్రాంతాలకు తరలిస్తుంటారు. ఈనేపథ్యంలో ప్రతిరోజు యంత్రాలకు వేల లీటర్ల మేరకు డీజిల్ అవసరం. తాండూరు ప్రాంతంలో ఉన్న పెట్రోల్ బంకుల్లో డీజిల్ ధర కర్ణాటకతో పోలిస్తే అధికంగా ఉండటంతో సరిహద్దు దాటి వెళ్లి డీజిల్‌ను తీసుకొస్తున్నారు. 100 లీటర్ల డీజిల్ అక్కడ కొనుగోలు చేస్తే సుమారు రూ.1000 కలిసి వస్తోంది. దీంతో అక్కడికే వెళ్లేందుకు వ్యాపారులు, వాహనదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. వెలవెలబోతున్న జిల్లా బంకులు జిల్లా సరిహద్దులో ఉన్న పెట్రోల్ బంకులు పక్షం రోజులుగా వ్యాపారం లేక వెలవెలబోతున్నాయి. తాండూరు మండలం జిన్గుర్తి వద్ద ఉన్న ఓ పెట్రోల్ బంకులో పక్షం రోజుల క్రితం వరకు రోజుకు 4 వేల లీటర్ల డీజిల్ విక్రయించేవారు. ప్రస్తుతం 1000 లీటర్లు మాత్రమే సేల్ అవుతున్నట్లు బంకు నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారం జరగడం లేదు.. నెల రోజుల క్రితం వరకు మా పెట్రోల్ బంకులో రోజుకు వేల లీటర్ల ఇంధనం విక్రయించే వాళ్లం. కేంద్రం వ్యాట్ తగ్గించింది. కర్ణాటకలో ఆ రాష్ట్ర సర్కారు మరింత తగ్గించడంతో వాహనదారులు, నాప రాతి గనుల వ్యాపారులు అక్కడికే వెళ్తున్నారు. గతంలో మేము రోజు 5 వేల లీటర్ల డిజిల్ అమ్మితే ఇప్పుడు 1000 లీటర్ల లోపే విక్రయాలు జరుగుతున్నాయి. నష్టాలు వస్తున్నాయి. – రామకృష్ణారెడ్డి, పెట్రోల్ బంకు నిర్వాహకుడు జిల్లా సరిహద్దులోని ఓ పెట్రోల్ బంకు -
కారుతో ఢీకొట్టి పరార్.. ప్రమాదమా? హత్యాయత్నమా?
సాక్షి, వికారాబాద్(యాలాల): బైకును వెనుక నుంచి వచ్చిన ఓ కారు ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. పాతకక్షల నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే బైకును కారుతో ఢీకొట్టి హత్య చేశారని క్షతగాత్రుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కలకలం సృష్టించిన ఈ ఘటన తాండూరు పట్టణంలో యాలాల ఠాణా పరిధిలోకి వచ్చే రాజీవ్ కాలనీ వద్ద శనివారం రాత్రి జరిగింది. ఎస్ఐ సురేష్ కథనం ప్రకారం.. రాజీవ్ కాలనీకి చెందిన జబ్బార్(35)ఆటో డ్రైవర్. శనివారం రాత్రి 11 గంటలకు అతడు అదే కాలనీకి చెందిన సూఫియాన్, సోహైల్‌తో కలిసి బైక్‌పై తాండూరు నుంచి కాలనీ వైపు వస్తున్నాడు. చదండి: కజిన్‌తో గొడవ.. అతని భార్యని టార్గెట్‌గా చేసుకుని ఎనిమిది నెలలుగా.. ఈక్రమంలో కాలనీ సమీపంలో వెనుక నుంచి వచ్చిన ఓ కారు వీరి బైక్‌ను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో జబ్బార్ తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సూఫియాన్, సొహైల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సూఫియాన్ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు కుటుంబీకులు హైదరాబాద్ తీసుకెళ్లారు. చదవండి: ఒడిశా: రాత్రి బహిర్భూమికి వెళ్లిన వివాహితపై సామూహిక అత్యాచారం కారుతో ఢీకొట్టి చంపే ప్రయత్నం! ఈ ఘటనను మొదట స్థానికులు ప్రమాదంగా భావించారు. కారు ఢీకొన్న తర్వాత అందులోని వ్యక్తులు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన సూఫియాన్.. పాతకక్షల నేపథ్యంలో ఇస్మాయిల్, మోహిన్ అనే వ్యక్తులు కారుతో ఢీకొట్టి చంపేందుకు యత్నించారని ఆరోపించారు. అనంతరం యాలాల పోలీసులకు వారిపై ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, రూరల్‌సీఐ జలంధర్‌రెడ్డి వివరాలు సేకరించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రమాదానికి కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. మృతుడు జబ్బార్‌కు భార్యతో పాటు నలుగురు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఇద్దరూ ఇష్టపడ్డారు.. ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారని..
సాక్షి, తాండూరు రూరల్: ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారనే మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తాండూరు మండలం గుంతబాసుపల్లిలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ ఏడుకొండలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంతబాసుపల్లికి చెందిన కుర్వ సందప్ప, దస్తమ్మ మొదటి కుమారుడు కుర్వ శాంతుకుమార్ (23) హైదరాబాద్‌లోని ఓ హోటల్లో మాస్టర్‌గా పని చేస్తున్నాడు. తాండూరులో ఉంటున్న వరుసకు మేనత్త అయిన దేవమ్మ కూతురును మూడేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ ఇష్టపడ్డారు. చదవండి: Chanda Nagar: యువతి ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. శాంతుకుమార్ కుటుంబ సభ్యులు సైతం మీ కూతురును మా అబ్బాయికి ఇవ్వాలని తల్లి దేవమ్మను కోరారు. ఇందుకు దేవమ్మ ఒప్పుకోలేదు. దీంతో గత శనివారం హైదరాబాద్‌లోని ఓ దేవాలయంలో శాంతుకుమార్, సంధ్యలు వివాహం చేసుకున్నారు. అమ్మాయి మైనర్ కావడంతో తల్లి దేవమ్మ తన కూతురు కనిపించడంలేదని, శాంతుకుమార్ కిడ్నాప్ చేశాడని తాండూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆదివారం వారిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అమ్మాయిని తన తల్లి ఇంటికి తీసుకెళ్లారు. మళ్లీ తన కూతురు కనిపించడంలేదని తల్లి, ఆమె సోదరులు శేఖర్, సిద్దు, మహేశ్‌లు సోమవారం ఉదయం శాంతుకుమార్‌ను ఇంటికి వెళ్లి బెదిరించారు. అమ్మాయి ఎటు వెళ్లిందో తనకు తెలియదని ఎంత చెప్పినా వారు వినలేదు. శాంతుకుమార్ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు చదవండి: డెలివరీ బాయ్ నిర్వాకం.. ప్రేమించడం లేదని ఇంట్లో ఎవరూ లేని టైంలో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు మంగళవారం తెల్లవారుజామున చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంతకుముందు అమ్మాయి తల్లితోపాటు ఆమె సోదరులు తనను వేధిస్తున్నారంటూ వీడియో తీశాడు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని రోదించారు. మృతుని తండ్రి సందప్ప ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అయితే తన కుమారుడి మృతికి కారణమైన దేవమ్మ, ఆమె సోదరులు శేఖర్, సిద్దు, మహేష్‌లపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి పార్టీ మారుతారని ప్రచారం!
తాండూరు రాజకీయాలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి. కొంతకాలంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. వీరిద్దరు టీఆర్ఎస్ పార్టీనే అయినా వైరం నడుస్తోంది. ఈనేపథ్యంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి గులాబీ పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని ఆయన ఖండించారు. వైరి వర్గం కావాలనే ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తాండూరు: టీఆర్ఎస్లో పుకార్లు షికార్లు చేస్తున్నా యి.మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి తో పాటు మరికొందరు టీఆర్ఎస్ ముఖ్య నాయకులు త్వరలో ‘కారు’దిగి ‘చేయి’ అందుకుంటారని ఆయన వైరివర్గం జోరుగా ప్రచారం చేస్తోంది. పొమ్మన లేక పొగపెడుతున్నట్లు అనే చందంగా వ్య వహరిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్‌రెడ్డి బలమైన నేతగా ఎదిగారు. కొంతకా లంగా జరుగుతున్న ప్రచారంతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నా రు. మహేందర్‌రెడ్డి పార్టీ మారితే పట్నం కుటుంబసభ్యులంతా కారు దిగే అవకాశాలు లేకపోలేవు. అంతటా ఇదే చర్చ.. జిల్లాలోని తాండూరు నియోజకవర్గ రాజకీయాలు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. పక్షం రోజులుగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి కారు దిగుతున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ముఖ్యనేతలు ఒకచోట కలిసినప్పుడు ఇదే విషయాన్ని చర్చించుకుంటూ కనిపిస్తున్నారు. మహేందర్‌రెడ్డి 2014లో టీడీపీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పట్లో రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ బలహీనంగా ఉంది. అలాంటి సమయంలో మహేందర్‌రెడ్డి పార్టీని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ సైతం పలు బహిరంగ సభలో ప్రశంసించారు. తాండూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగిన నాలుగున్నరేళ్ల వ్యవధిలోనే రూ.2 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం 2018 ఎన్నికల్లో ఆయన స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. పైలెట్ పార్టీ మారడంతో.. తాండూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన పైలెట్ రోహిత్‌రెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. అయితే ఆయన జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ, మండల పరిషత్ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో వెనుకబడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన రాజకీయ గురువు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. కొన్నిరోజులకు రోహిత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి కారెక్కారు. అనంతరం మహేందర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి కొన్నాళ్ల పాటు సన్నిహితంగా మెలిగారు. తర్వాత రోహిత్‌రెడ్డి కాంగ్రెస్ శ్రేణులను టీఆర్ఎస్లో చేర్చుకొని ఓ సొంత కేడర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. కొంతకాలంగా ఇదరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమంటున్నాయి. కొన్నిసార్లు వీరిద్దరు పాల్గొన్న సమావేశాల్లో అనుచరులు గొడవపడి కొట్టుకున్నారు. పట్నం పార్టీ మారితే .. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి కారు దిగితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్కు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఆయన సోదరుడు, కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి సతీమ ణి సునీతారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్గొ కొనసాగుతున్నారు. ఉమ్మడి జిల్లాలో వీరి హవా ఉంది. ఒకవేళ వీరంతా పార్టీ మారితే గులాబీదళానికి నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పట్నం పోటీలో లేకుండా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు అసెంబ్లీ ని యోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఇద్దరు టీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉన్నారు. అయితే ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి టీఆర్ఎస్ అధిష్టానం వద్ద ప్రాభవం కోల్పోయారని వైరి వర్గం ప్రచారం చేస్తోంది. రోహిత్‌రెడ్డికే టికెట్ కేటాయిస్తారని అంటున్నారు. మహేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ప్రచారం సాగిస్తోంది. నాపై విష ప్రచారం.. నేను టీఆర్ఎస్ను వీడి వెళుతున్నానని వైరివ ర్గం చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. కొందరు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి విష ప్రచారానికి తెరతీశారు. నేను టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను. తప్పుడు ప్రచారం చేస్తున్న వారి విజ్ఞతకే ఈ విషయాన్ని వదిలేద్దాం. – పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ -
ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మోసం చేశారు: మల్కూడ్ రమేష్
తాండూరు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్కూడ్ రమేష్ మహరాజ్ స్పష్టం చేశారు. శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తనకు పీసీసీ ఉపాధ్యక్షుడిగా పదవి కట్టబెట్టడంపై సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో పాటు పార్టీ ముఖ్యనేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబం పార్టీకి చేసిన సేవలను గుర్తించి పదవి ఇచ్చారన్నారు. పీసీసీ రేవంత్‌రెడ్డికి ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వచ్చిందని తెలిపారు. రేవంత్ బాధ్యతలు అప్పగించాక తెలంగాణ సర్కారులో వణుకు ప్రారంభమైందని, దీంతోనే సీఎం కేసీఆర్ 50 వేల ఉద్యోగాల భర్తీకి పూనుకున్నారని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వవైభవం తీసుకొస్తామని పేర్కొన్నారు. బెంజి కారులో బౌన్సర్లతో.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రోహిత్‌రెడ్డి పార్టీతోపాటు నాయకులను మోసం చేసి టీఆర్ఎస్లో చేరారని మల్కూడ్ రమేష్ మహరాజ్ విమర్శించారు. తాండూరు అభివృద్ధిని విస్మరించి బెంజి కారులో బౌన్సర్లను వేసుకొని తిరిగితే ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని ఎమ్మెల్యేకు హితవు పలికారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గపోరుతో అభివృద్ధి ఆగిపోయిందని ధ్వజమెత్తారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాని స్పష్టం చేశారు. గతంలో పార్టీ వీడిన నాయకుల్లో క్రమశిక్షణ కలిగిన వారినే తిరిగి చేర్చుకొంటామన్నారు. రేపు సైకిల్ ర్యాలీ పెరిగిన ఇంధన ధరలపై సోమవారం సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు రమేష్ మహరాజ్ తెలిపారు. కేంద్రం మధ్య తరగతి ప్రజలపై పెనుభారం మోపుతూ పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచిందన్నారు. ఈనేపథ్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. 16న రాజ్‌భవన్ ముట్టడి నిర్వహిస్తామని చెప్పారు.కార్యక్రమంలో పెద్దేముల్ జెడ్పీటీసీ ధారాసింగ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎంఏ అలీం, పార్టీ బీ బ్లాక్ అధ్యక్షుడు సత్యమూర్తి, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బంటు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
షాకింగ్: కరోనా సోకిందని సూటిపోటి మాటలు.. ఆత్మహత్య
తాండూరు: కరోనా వైరస్ సోకిందని స్థానికులు సూటిపోటి మాటలతో వేధించడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి రైలు కింద పడి ప్రాణం తీసుకున్నాడు. అంత్యక్రియలు చేసేందుకు కుటుంబీకులు, బంధువులు ముందుకు రాకపోవడంతో తాండూరు యూత్ అసోసియేషన్ సభ్యులు మానవత్వం చాటుకున్నారు. అందరి హృదయాలను కలచివేసే ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగింది. వివరాలు.. తాండూరులోని సీతారాంపేట్‌కు చెందిన హన్మంత్ (31)కు ఈశ్వరితో పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చెరుకు బండి నడిపిస్తూ హన్మంత్ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడిన ఆయన ఈనెల 11వ తేదీన కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దీంతో హన్మంత్ హోం క్వారంటైన్లోకి వెళ్లాడు. స్థానికుల సూటిపోటి మాటలతో హన్మంత్‌ను వేధించసాగారు. తన నుంచి కరోనా కుటుంబానికి కూడా సోకుతుందేమో అనే భయంతో శుక్రవారం అర్ధరాత్రి హన్మంత్ ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. అనంతరం తాండూరు- కొడంగల్ రోడ్డు మార్గంలోని రైల్వే బ్రిడ్జి వద్దకు వెళ్లి రైలు వస్తోండగా ఎదురుగా వెళ్లాడు. దీంతో రైలు ఢీకొని మృతదేహాన్ని 200 మీటర్ల వరకు లాకెళ్లడంతో పూర్తిగా ఛిద్రమైంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ కృష్ణయ్య హన్మంత్ మృతదేహాన్ని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ముందుకు రాకపోవడంతో కరోనా వైరస్ సోకి ఆత్మహత్య చేసుకున్న హన్మంత్ మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు కుటుంబీకులు, బంధువులు ముందుకురాలేదు. కుటుంబీకుల సమాచారంతో తాండూరు యువజన సంఘం సభ్యులు మానవత్వంతో ముందుకు వచ్చారు. అంబులెన్స్‌లో మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. చదవండి: ఘోరం నలుగురు కరోనా రోగులు సజీవ దహనం -
అత్తారింటికి వచ్చి.. బావిలో పడి ఇద్దరు అల్లుళ్ల మృతి
తాండూరు రూరల్: అత్తారింటికి వచ్చిన ఇద్దరు అల్లుళ్లు బావి లో ఈతకు వెళ్లి మృ త్యువాత పడ్డారు. ఓ వ్యక్తి నీట మునిగిపో తుండగా అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన మరొకరు కూడా మృత్యువాతపడ్డాడు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కొత్లాపూర్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసులు, మృతుల కుటుంబీకుల కథనం ప్రకారం.. కొత్లాపూర్‌కు చెందిన వడ్డె వెంకటప్ప, శ్యామప్ప అన్నదమ్ములు. వెంకటప్ప కూతురు మాధవిని తాండూరు మండలం సిరిగిరిపేట్‌కు చెందిన కృష్ణ(31)కు ఇచ్చి వివాహం చేశారు. శ్యామప్ప కూతురు రేణుకను యాలాల మండలం గిరిజాపూర్‌కు చెందిన మహిపాల్(25) వివాహం చేసుకున్నాడు. కృష్ణ, మహిపాల్ కోత్లాపూర్ సమీపంలోని ఓ పాలిషింగ్ యూనిట్లో పనిచేస్తూ అక్కడే ఉండే వారు. కొన్నిరోజులుగా పనులు లేక ఖాళీగా ఉన్నారు. ఉగాది పండుగ కోసం కృష్ణ, మహిపాల్ కుటుంబాలు 2 రోజుల క్రితం కొత్లాపూర్‌కు వచ్చాయి. ఆదివారం ఉదయం మల్కాపూర్ గ్రామంలో ఓ పాలిషింగ్ యూనిట్ యజ మాని వద్ద పని మాట్లాడేందుకు కుటుంబీకులతో కలసి వెళ్లారు. సోమవారం నుంచి పనికి వస్తామని యజమానికి చెప్పారు. అనంతరం కృష్ణ, మహిపాల్ ఇద్దరూ కల్లు తాగారు. తర్వాత బావమరిది నర్సింహులుతో కలసి కొత్లాపూర్ సమీపంలో రైతు పెంటయ్య బావిలోకి ఈతకు వెళ్లారు. మహిపాల్‌కు ఈత రాకపోవడంతో నడుముకు డబ్బా కట్టుకొని బావిలో దూకాడు. ప్రమాదవశాత్తు అతడు నీటిలో మునిగిపోతుండగా గమనించిన కృష్ణ వెంటనే అతడిని కాపాడేందుకు నీటిలోకి దూకాడు. ఇద్దరూ కల్లు మత్తులో ఉండటంతో ఊపిరి ఆడక నీటమునిగి మృతి చెందారు. నర్సింహులు ఇది గమనించి గ్రామంలోకి వెళ్లి కుటుంబీకులకు విషయం తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మోటార్లతో నీటిని తోడి మహిపాల్, కృష్ణ మృతదేహాలను బయటకు తీశారు. బతుకుదెరువు కోసం వచ్చిన కృష్ణ, మహిపాల్ మృతిచెందడంపై కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. కృష్ణకు భార్య మాధవి, పిల్లలు అరవింద్ (7), భాగ్యశ్రీ (4) ఉన్నారు. మహిపాల్‌కు భార్య రేణుక, కూతురు అశ్విని (2) ఉన్నారు. -
బండరాళ్లతో మోది భర్తను చంపిన భార్య
సాక్షి, తాండూరు రూరల్ (వికారాబాద్): జల్సాలకు అలవాటుపడిన భర్త చోరీలు చేస్తూ తమను మానసిక క్షోభకు గురిచేస్తుండటంతో ఓ భార్య కుమారుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండల పరిధిలోని గౌతపూర్‌లో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన కుర్వ బాలమణికి కొన్నేళ్ల క్రితం కొడంగల్ పట్టణానికి చెందిన కుర్వ మల్లేశం (42)తో వివాహం జరిగింది. పెళ్లి అనంతరం మల్లేశం స్వగ్రామంలో ఉన్న ఆస్తులను విక్రయించి అత్తగారిల్లు గౌతపూర్‌కు వచ్చాడు. స్థానికంగా డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కొంతకాలంగా మల్లేశం జల్సాలకు అలవాటుపడి కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. అదేవిధంగా పలుచోట్ల చోరీలు చేయడంతో కరన్‌కోట్, కొడంగల్ ఠాణాల పరిధిలో అతడిపై కేసులు కూడా నమోదయ్యాయి. సోమవారం ఉదయం ఇంటికి వచ్చిన మల్లేశం భార్యను బంగారం ఇవ్వాలని కోరాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తిరిగి మధ్యాహ్నం మల్లేశం భార్యను కొట్టడంతో పెనుగులాట జరిగింది. ఈ క్రమంలోనే మల్లేశం ఇంట్లోంచి బయటకువస్తూ అకస్మాత్తుగా కిందపడ్డాడు. దీంతో భార్య, కుమారుడు (15) కలిసి బండరాళ్లతో ఆయన తలపై తీవ్రంగా మోదడంతో చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ వివరాలు సేకరించారు. మల్లేశంతో వేగలేకే హత్య చేసినట్లు భార్య, కొడుకు పోలీసుల ఎదుట అంగీకరించారు. మృతదేహానికి తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. చదవండి: భార్యతో గొడవ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్మ వయసు ఎక్కువని హేళన.. విద్యార్థి ఆత్మహత్య -
తల్లి నిస్సహాయత.. కుమారుడి మృత్యువాత
యాలాల: ఇద్దరు కొడుకులతో కలసి సరదాగా చెక్‌డ్యాం ప్రదేశాన్ని చూసొద్దామని వెళ్లిన ఓ తల్లికి తీరని విషాదం మిగిలింది. కళ్లెదుటే కొడుకు నీట మునుగుతుంటే తల్లి మనసు తల్లడిల్లింది. నిస్సహాయ స్థితిలో ఆ బాలుడు మృత్యువాతపడ్డాడు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్‌కి చెందిన హారూన్ హుస్సేన్, సైదా బేగం దంపతులకు షేక్ రిహాన్ (11), సోఫియాన్ సంతానం. హారూన్ హుస్సేన్ సౌదీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పాత తాండూరులో నివాసముంటున్న తన సోదరి ఇంట్లో శుక్రవారం జరిగిన విందుకు సైదాబేగం తన ఇద్దరు కొడుకులతో కలసి వెళ్లింది. సోమవారం మధ్యాహ్నం పాత తాండూరు శివారులో ఉన్న చెక్‌డ్యాం వద్ద సరదాగా కాసేపు గడిపి వద్దామని ఇద్దరు కొడుకులు, సోదరితో కలసి వెళ్లింది. చెక్‌డ్యాం సమీపంలో అక్కాచెల్లెళ్లు కబుర్లు చెప్పుకుంటుండగా రిహాన్ నీళ్లలోకి దిగాడు. మోకాలి లోతు వరకు దిగిన రిహాన్ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయాడు. సైదా బేగం గమనించి సహాయం కోసం కేకలు పెట్టిం ది. అక్కాచెల్లెళ్లకు ఈత రాకపోవడం, సహాయం చేసేందుకు సమీపంలో ఎవరూ అందుబాటులో లేకపోవడంతో బాలుడిని రక్షించలేకపోయారు. కొద్ది సేపటి అనంతరం బాలుడి మృతదేహాన్ని స్థానికులు నీటి నుంచి బయటికి తీశారు. కొడుకు మృత్యువాత పడటంతో తల్లి రోదనలు మిన్నంటాయి. ఇసుక కోసం తోడిన గుంతలతోనే ప్రమాదం! చెక్‌డ్యాం ప్రదేశంలో ఇసుక కో సం అక్రమార్కులు ఇష్టారాజ్యంగా తోడిన గుంతలే బాలుడిని మింగేశాయి. ప్రతి వేసవిలో చెక్‌డ్యాం నుంచి పాత తాండూరు మీదుగా ఇసుక అక్రమ రవాణా అవుతోంది. ఇసుక కోసం తవ్వడంతో ఆ ప్రదేశంలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. గత అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు చెక్‌డ్యాంలో నీళ్లు నిలిచాయి. అవగాహన లేనివారు నీళ్లలో అడుగుపెట్టి ప్రమాదవశాత్తు అందులోకి జారిపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. చిన్నారి రిహా న్ విషయంలో ఇదే జరిగిందని పోలీసులు పేర్కొంటున్నారు. -
టీఆర్ఎస్లో రచ్చ: నువ్వెంతంటే.. నువ్వెంత!
సాక్షి, తాండూరు: ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎమ్మెల్సీ. సమావేశంలో ఆవేశకావేశాలకు లోనయ్యారు. నువ్వెంత అంటే.. నువ్వెంత అంటూ మాటలయుద్ధానికి దిగారు. ఫలితం గా సమావేశం రసాభాసగా మారింది. తాండూరు మున్సిపల్ సమవేశం సోమవారం చైర్పర్సన్ తాటికొండ స్వప్నపరిమళ్ అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి హాజరయ్యారు. చదవండి: (ఒకే గొడుకు కిందకు నీటి పారుదల శాఖలు) తాను సూచించిన మూడు అంశాలను తొలగించారని, మున్సిపల్ అభివృద్ధికి తగినట్లుగా ఎజెండాలేదని, దానిని చెత్తబుట్టలో వేయాలని ఎమ్మెల్యే మండిపడ్డారు. అదేసమయంలో కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ ఫ్లోర్ లీడర్లు ఎజెం డా ప్రతులను చించివేశారు. కౌన్సిలర్ల మధ్య కూడా వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిలు నువ్వెంత.. అంటే నువ్వెంత అంటూ గొడవకు దిగారు. ఈ పరిణామాల మధ్యే ఎమ్మెల్సీ సూచన మేరకు మెజార్టీ కౌన్సిలర్లు ఎజెండాను ఆమోదించారు. కాగా, ఇరువర్గాలకు చెందిన ఇద్దరు నేతలు సమావేశం ముగిసిన తర్వాత కౌన్సిల్ ఎదుట ఘర్షణకు దిగారు. -
తాండూరులో ‘టిక్‌టాక్’ దుర్గారావు సందడి
సాక్షి, తాండూరు టౌన్: టిక్‌టాక్ ఫేమ్ దుర్గారావు–గంగారత్నం దంపతులు ఆదివారం వికారాబాద్ జిల్లా తాండూరులో సందడి చేశారు. ఓ ఆల్బమ్ షూటింగ్ కోసం తాండూరుకు వచ్చిన వారితో పలువురు ఫొటోలు, సెల్ఫీలు దిగారు. డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఉమాశంకర్ నేతృత్వంలో ‘దొంగచూపు చూడకే కొండముచ్చి’ అనే ఆల్బమ్‌లో పాట చిత్రీకరణకు తాండూరు పరిధిలోని నారాయణపూర్ బ్రిడ్జి వద్దకు వచ్చినట్లు దుర్గారావు తెలిపారు. కాగా టిక్ టాక్ యాప్ ద్వారా దుర్గారావు తన భార్యతో కలిసి ఫేమస్ అయిన విషయం తెలిసిందే. హావభావాలతో పాటుగా, తనదైన శైలిలో నటులను అనుకరిస్తూ చేసే వీడియోలకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అంతేకాకుండా సినిమా పాటలకి, డైలాగ్స్‌ను తన భార్యతో కలిసి దుర్గారావు వీడియోలు చేయడం విశేషం. -
నాపరాతి పరిశ్రమ: రూ.600 కోట్ల వరకు నష్టాలు
కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తాండూరు నాపరాతి పరిశ్రమ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. అన్‌లాక్ ప్రక్రియతో కాస్త ఊరట లభిస్తున్న తరుణంలో భారీ వర్షాలతో పరిస్థితి మొదటికొచ్చింది. క్వారీల్లో చేరిన నీటితో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. క్వారీ నుంచి ముడి సరుకు బయటకు రాకపోవడంతో దానికి అనుబంధంగా ఉన్న పాలిషింగ్ యూనిట్లు సైతం దిక్కులు చూస్తున్నాయి. ఇప్పట్లో పనులు ప్రారంభమయ్యే పరిస్థితి లేకపోవడంతో క్వారీల యజమానులు డోలాయమానంలో పడ్డారు.ఇక పరిశ్రమపై ఆధారపడ్డ 25వేల మంది కార్మికులకు పూటగడవడమే కష్టమైంది. ‘ఉపాధి’ని ముంచేసిన వానలు వికారాబాద్ జిల్లా తాండూరు పరిధిలో దాదాపు 300 నాపరాతి క్వారీలున్నాయి. వీటికి అనుబంధంగా 1,250 పాలిషింగ్ యూనిట్లు, ఇతర మార్కెటింగ్ స్టోర్లు కొనసాగుతున్నాయి. వీటిల్లో పనిచేసే వారిలో ఎక్కువ మంది బిహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందినవారే. ఉమ్మడి మహబూబ్‌నగర్, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కూలీలు సైతం వలస వచ్చి పనిచేస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో నాపరాతి పరిశ్రమ మూతపడటంతో 95 శాతం కూలీలు సొంతూళ్లకు వెళ్లిపోయారు. అన్‌లాక్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆగస్టు చివరి నుంచి క్రమంగా యూనిట్లను తెరిచేందుకు యాజమాన్యాలు ఉపక్రమించగా.. సెప్టెంబర్ నెలాఖరు నుంచి కార్మికులు, కూలీలు తిరిగి వచ్చారు. పనులు మొదలవుతున్న తరుణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, కాగ్నా నది ఉప్పొంగడంతో క్వారీలన్నీ నీటితో నిండిపోయాయి. ఇప్పటికీ క్వారీల్లోకి నీళ్లు వస్తున్నాయి. తొలుత కురిసిన వానలు కాస్త తెరపివ్వడంతో భారీ ఖర్చుతో క్వారీ యజమానులు పెద్ద మోటార్లను బిగించి నీటిని బయటకు తోడారు. అంతలోనే మళ్లీ వానల తీవ్రత పెరగడంతో క్వారీలు నిండా మునిగాయి. భూమిలోతులోకి క్వారీలు ఉండడంతో ఇప్పటికీ పలుచోట్ల ఊటగా నీరు వస్తోంది. ఈ నీటిని తోడాలంటే లక్షల్లో వెచ్చించాల్సి రావడంతో క్వారీల యజమానులు ఆ పనులను విరమించారు. దీంతో ఇప్పటికే నెలల తరబడి మూతబడ్డ క్వారీలు.. ఇప్పట్లో గాడినపడేలా లేవు. మరోవైపు క్వారీల నుంచి రాయి ఉత్పత్తి లేకపోవడంతో పాలిషింగ్ యూనిట్లకూ పనిలేకుండా పోయింది. తక్కువ విస్తీర్ణంలో ఉన్న మినీ క్వారీలను ఇప్పుడిప్పుడే తెరుస్తున్నా.. ఆశించిన స్థాయిలో పనిలేదు. ముడిసరుకు సిద్ధంగా ఉన్న పాలిషింగ్ యూనిట్లలో ఒకరిద్దరికే పని దొరుకుతోంది. దిక్కుతోచని స్థితిలో కార్మికులు క్వారీలు, పాలిషింగ్ యూనిట్లలో ఉపాధి పొందుతున్న వేలాది మంది కార్మికులకు ఇప్పుడు దిక్కుతోచట్లేదు. లాక్డౌన్ సమయంలో సొంతూళ్లకు వెళ్తే అక్కడ తగిన ఉపాధి దొరకలేదు. అన్‌లాక్ సమయంలో గంపెడాశతో తిరిగొస్తే.. క్వారీలను వానలు నిండా ముంచేశాయి. రోజువారీ కూలీపై ఆధారపడ్డ వారందరికీ ప్రస్తుతం బతుకు గగనమైంది. చేతిలో డబ్బుల్లేక, అప్పు దొరక్క పస్తులుంటున్నారు. దీనిపై కార్మిక సంఘాల నేతలు యాజమాన్యాలతో చర్చించినా ఫలితం లేదు. అడ్వాన్స్ రూపంలో కొంత మేర డబ్బులు తీసుకున్నప్పటికీ నెలల తరబడి పనిలేకపోవడంతో ఉన్న డబ్బులు పూర్తిగా ఖర్చు కావడంతో మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోంది. తాండూరు, షాబాద్ బండలంటే దక్షిణ భారతమంతా పేరు దక్షిణ భారతదేశంలో తాండూరు నాపరాతికి మంచి పేరుంది. క్వారీల నుంచి రాయిని బయటకు తీయడం.. దానిని పాలిషింగ్ చేసి మార్కెట్లో విక్రయించడం ఇక్కడ ప్రధానంగా జరిగే పని. నాపరాతిని నిర్ణీత రూపంలో కటింగ్ చేసిన తర్వాత నేరుగా వాడుకోవచ్చు. పాలిష్ చేసిన రాక్షీట్లకైతే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తెలంగాణలో తాండూర్ బండలు, షాబాద్ బండల పేరుతో వీటిని విక్రయిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు ఇక్కడి నుంచి భారీగా ఎగుమతులు చేస్తారు. నాపరాతి పరిశ్రమ వల్ల ప్రభుత్వానికి రాయల్టీ, ఇతర పన్నుల రూపంలో ఏటా రూ.150 కోట్ల మేర ఆదాయం వస్తోంది. ఇక్కడ ఏటా దాదాపు రూ.2,500 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతాయి. లాక్‌డౌన్‌తో పాటు, ఇటీవలి వర్షాల కారణంగా నాపరాతి పరిశ్రమ దాదాపు రూ.600 కోట్ల వరకు నష్టపోయి ఉంటుందని అంచనా. ఈ క్వారీలు, పాలిషింగ్ యూనిట్లలో వివిధ కేటగిరీల్లో పనిచేసే కార్మికులు, కూలీలు 25 వేలకు పైమాటే. నెల వరకు కష్టమే.. క్వారీల్లో భారీగా చేరిన నీటిని తోడాలంటే రూ.లక్షలు ఖర్చు చేయాలి. పెద్ద మోటార్లతో రోజుల తరబడి పంపింగ్ చేయాలి. మోటార్లకు కిరాయి భారీ మొత్తంలోనే ఉంటుంది. ప్రస్తుతం తాండూరు పరిధిలోని 70 శాతం క్వారీలు నీటితో నిండిపోయాయి. వీటన్నింటి నుంచి నీళ్లు తొలగించి మళ్లీ గాడిన పడటానికి కనీసం నెల పట్టొచ్చు. మమ్మల్ని నమ్ముకున్న కూలీలు, కార్మికులకు కొంత నగదు అడ్వాన్స్ ఇచ్చి పోషిస్తున్నాం. – వెంకటరామిరెడ్డి, క్వారీ యజమాని, తాండూరు 2 నెలలుగా పనిలేదు క్వారీలో పనిచేస్తే రోజుకు రూ.500 కూలి వచ్చేది. ప్రస్తుతం రెండు నెలలుగా పని లేదు. నా దగ్గరున్న డబ్బులు పూర్తిగా ఖర్చయిపోవడంతో భార్య, పిల్లల పోషణ కష్టంగా మారింది. గతనెల అప్పుచేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చా. ఇప్పుడిక వేరే పని దొరికినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా. – వడ్డే నగేశ్, కార్మికుడు -
మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
సాక్షి, వికారాబాద్: తెలంగాణలో మరో ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి శనివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే కరోనా బారినపడిన పలువురు కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కోలుకున్నారు. ఇక కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే.10 రోజుల క్రితం కరోనా బారినపడిన నంది ఎల్లయ్య నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 10.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. (సిద్దిపేట ముద్దుబిడ్డ, ఐదుసార్లు అక్కడి నుంచే) -
ఒక్క వార్డుకే టీజే‘ఎస్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని ఏర్పాటైన తెలంగాణ జన సమితి (టీజేఎస్) మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రభావం చూపలేకపోయింది. ఇప్పటివరకు జరిగిన జిల్లా పరిషత్, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించని ఆ పార్టీ తాజాగా జరిగిన మున్సి‘పోల్స్’లోనూ పెద్దగా సీట్లు గెలుచుకోలేకపోయింది. తాండూరు మున్సిపాలిటీలో ఒకే ఒక్క వార్డును టీజేఎస్ గెలుచుకుంది. అక్కడి 34వ వార్డు నుంచి పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థి సోమశేఖర్ గెలుపొందారు. -
కారులో వృద్ధుడి సజీవదహనం
తాండూరు టౌన్: పాడైపోయిన ఓ కారుకు ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో అందులో నిద్రిస్తున్న ఓ వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సోమవారం ఈ ఘటన జరిగింది. పట్టణంలోని వాల్మీకినగర్‌కు చెందిన పత్తర్‌షెడ్ వీరన్న (70) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నప్పటికీ వేరుగా ఉంటున్నాడు. కొన్నేళ్లుగా స్థానిక మర్రిచెట్టు కూడలి సమీపంలోని గల్లీలో పాడైపోయిన ఓ కారులో రాత్రిళ్లు నిద్రిస్తున్నాడు. ఈక్రమంలో ఆదివారం మర్రిచెట్టు కూడలి వద్ద ఉన్న రక్తమైసమ్మ జాతర సందర్భంగా కారు నిలిపి ఉంచిన సమీపంలో టెంటు వేసి కొందరు వంటలు చేశారు. వీరన్న ఎప్పటిమాదిరిగానే అర్ధరాత్రి కారులో నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తు టెంటుకు నిప్పంటుకుని కారుపై పడిపోవడంతో దానికి నిప్పంటుకుంది. దీంతో కారులో నిద్రిస్తున్న వీరన్న సజీవ దహనమై గుర్తు పట్టలేని స్థితిలో బూడిదగా మారాడు. మద్యం మత్తులో ఉండటం వల్ల వీరన్న తప్పించుకోలేక మంటల్లో చిక్కుకుని మృతిచెంది ఉంటాడని డీఎస్పీ అనుమానం వ్యక్తంచేశారు. మృతుడి కుమారులు రఘు, చిన్నా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఒకే ఇంటి నుంచి ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల పోటీ..
సాక్షి, తాండూరు టౌన్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ చివరి రోజు సందర్భంగా శుక్రవారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, వేర్వేరు వార్డుల నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా కౌన్సిలర్ స్థానానికి నామినేషన్లు వేశారు. తాండూరు పట్టణం ఇందిరా నగర్‌కు చెందిన అవిటి శ్రీశైలం స్థానిక ఇందిరాచౌక్‌లో చాయ్ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అవిటి శ్రీశైలం 26వ వార్డు నుంచి, భార్య రాజకుమారి 28 వార్డు నుంచి, తల్లి వీరమణి 27 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. గతంలో శ్రీశైలం 2019 ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేగా కూడా నామినేషన్ వేసి బరిలో నిలిచారు. ఎమ్మెల్సీగా కూడా నామినేషన్ వేసినప్పటికీ తిరస్కరణ గురి కావడం జరిగింది. తాజాగా తనొక్కడే కాకుండా ఇంట్లోని మరో ఇద్దరితో నామినేషన్ వేయించడం చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయంలో సకలజనుల సమ్మె సందర్భంగా సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపిన శ్రీశైలంకు రాజకీయాలన్నా, ప్రజాసేవ అన్నా ఎంతో ఇష్టంగా భావిస్తారు. తాను ప్రజలకు సేవ చేసేందుకే కౌన్సిలర్‌గా బరిలో దిగానని, అలాగే తన భార్య, తల్లితో కూడా నామినేషన్ వేయించానన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో తన భార్య లేదా తల్లిని చైర్‌పర్సన్‌గా చూడాలనేది తన కోరిక అని శ్రీశైలం చెప్పడం విశేషం. -
అవిశ్వాసం ఎరుగను.. అభిమానం మరువను
సాక్షి, తాండూరు: “మున్సిపల్ చరిత్రలో అవిశ్వాస పరీక్ష ఎదుర్కొననిది నేను ఒక్కడినే. ప్రత్యక్ష చైర్మన్లు కాకుండా మిగతా వారంతా చైర్మన్ పదవీకాలం మొత్తం కొనసాగకుండా అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్నారు. మున్సిపల్ పరిధిలోని ప్రజల తాగు నీటికి ఇబ్బందులు తొలగించేందుకు ఒకేసారి రూ.4వేల నల్లా కనెక్షన్లు మంజూరు చేశాను. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ చలువతో నిధులు భారీగా తీసుకువచ్చి అభివృద్ధికి కృషి చేశాను. రూ.16.20 కోట్ల నిధులతో రోడ్లు వేయించడం మరిచిపోని అనుభూతి’ అని మున్సిపల్ మాజీ చైర్మన్ పి.లక్ష్మారెడ్డి (2005– 2010) అన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా లక్ష్మారెడ్డి ‘సాక్షితో మాట్లాడారు. అనాటి విషయాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. మాది పెద్దేముల్ మండలం రుద్రారం గ్రామం. నాలుగు దశాబ్దాల క్రితం గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేదు. ప్రతి రోజు ఆరు కిలో మీటర్లు నడిచి పెద్దేముల్‌కు వచ్చి చదువుకున్నాను. ఇంటర్ విద్యను అభ్యసించేందుకు మండలంలో ఇంటర్ విద్య లేక పోవడంతో తాండూరుకు వచ్చి చదువుకున్నాను. దుద్రారం గ్రామ సర్పంచ్‌గా 14 ఏళ్ల పాటు సేవలు అందించాను. సర్పంచ్‌గా పని చేసిన కాలంలో పెద్దేముల్ నుంచి రుద్రారం, గోపాల్పూర్, నర్సాపూర్ గ్రామాలకు రోడ్లు వేయించాను. నాటి మంత్రి చందు మహరాజ్ ప్రోత్సాహంలో ఆర్టీసీ బస్సు సేవలు అందేలా చేశాను. ఎన్నికలకు ముందే పార్టీ చైర్మన్ అభ్యర్థిని ప్రకటించింది. 2005లో జరిగిన మున్సిపల్ ఎన్నికలు పరోక్ష పద్ధతిన జరిగాయి. అంతకు ముందు కొనసాగిన వారు ప్రత్యక్ష ఎన్నికలలో చైర్మన్లుగా గెలిచారు. తానకు మాత్రం కౌన్సిలర్లే చైర్మన్‌ను ఎన్నుకొనే విధానం వచ్చింది. అవిశ్వాస పరీక్ష ఎదురుకాలేదు.. మున్సిపాలిటీకి ప్రత్యక్ష ఎన్నికలను మినహయిస్తే పరోక్ష పద్ధతిలో చైర్మన్లు అయిన వారిలో 1953లో ముదేళి నారాయణరావు, తర్వాత తానేనని చెప్పారు. మిగతా వారంతా చైర్మన్ పదవిలో అవిశ్వాస తీర్మానంతో పదవులను కోల్పోయిన వారు అధికంగా ఉన్నారు. తనపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు పలువురు కౌన్సిలర్లు ప్రయత్నించిన కూడ సభ్యుల మద్దతు లభించలేదు. పదవీ కాలంలో రూ.80 కోట్ల అభివృద్ధి పనలు.. మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన ఐదేళ్ల పదవీకాలంలో సుమారు రూ.80 కోట్ల నిధులతో అభివృద్ధి పనలు జరిగాయి. మున్సిపల్ పరిధిలో తాగునీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం కోసం కొత్తగా రూ.6.20 కోట్ల నిధులతో వాటర్ సప్లయి పథకం మంజూరు చేసి పనులను పూర్తి చేశాను. మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి సహకారంతో రూ.16.50కోట్ల నిధులతో పట్టణంలోని వాడ వాడలో సీసీ రోడ్లను వేశాను. రాజీవ్‌గృహకల్ప, ఇందిరమ్మ కాలనీలలో అర్హులైన పేదలకు గుర్తించి 1500 ఇళ్లను మంజూరు చేయించి నిర్మించి ఇవ్వడం జరిగింది. డిగ్రీ కళాశాల మంజూరు అప్పట్లో జిల్లాలో చేవెళ్లకు మాత్రమే డిగ్రీ కళాశాల మంజూరు అయింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అప్పటి మంత్రిగా ఉన్న సబితారెడ్డి వద్దకు వెళ్లి కలిశాను. తాండూరు పట్టణంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరాను. అయితే సీఎం వైఎస్సార్ వద్దకు తనను తీసుకెళ్లారు. అప్పటికప్పుడే వైఎస్సార్ తాండూరుకు డిగ్రీ కళాశాల మంజూరు చేశారు. ఊహ తెలిసిన నాటి నుంచి నాకుటుంబం అంతా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాం. మా నాన్న పెద్ద బాల్‌రెడ్డి పార్టీలో ఉంటూనే సర్పంచ్‌గా పని చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ బాధ్యతలు చేపట్టాక పార్టీకి బలం పెరిగింది. ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సమయంలో వైఎస్సార్ మణించారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. పార్టీ కోసం పని చేసిన సీనియర్లకు కాదని ఇతరులకు అవకాశాలు కట్టబెడుతూ వచ్చారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తాండూరు టికెట్ తనకే అవకాశం వచ్చింది. అయితే ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కారణంగానే తనకు టికెట్ చేజారీ పోయింది, అందుకోసమే ఎంపీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడాను. అయితే తాను పార్టీ మారినా కొన్నాళ్లకే స్థానిక ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. పార్టీ మారుతున్నట్లు తెలిస్తే కాంగ్రెస్ పార్టీని వీడే వాణ్ణి కాదు. -
నిలబడితేనే..సెలైన్
తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో కనీస వసతులు లేక రోగులు, బాధిత కుటుంబసభ్యులు అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రిలో గ్లూకోజ్ బాటిళ్లు పెట్టేందుకు స్టాండ్లు లేకపోవడంతో రోగులకు సాయంగా వచ్చిన వారు..నిలబడి సెలైన్ బాటిళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెం ట్ మల్లికార్జునస్వామిని వివరణ కోరగా..ఆస్పత్రిలో స్టాండ్ల కొరత ఉందని తెలిపారు. -
'అమ్మ పేరుతో అవకాశం రావడం నా అదృష్టం'
బుల్లితెరపై పటాస్ ప్రియగా ఆదరగొట్టింది.. ఖయ్యూంబాయ్ సినిమాలో నందమూరి తారకరత్నకు జోడీగా వెండితెర ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా విడుదలైన ‘తుపాకిరాముడు’తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది ప్రియాయాదవ్.. తన అందం, అభినయంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీగా ఎదుగుతోంది. ఈ నేపథ్యంలో నవతరం కథానాయికగా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. పెద్దేముల్ మండలంలోని మారుమూల పల్లె జనగాం గ్రామానికి చెందిన ప్రియాయాదవ్ తనదైన నటనతో ఉమ్మడి రాష్ట్రాల ప్రేక్షకులను మెప్పిస్తోంది. తాండూరు డివిజన్ పెద్దేముల్ మండలం జనగాం గ్రామానికి చెందిన పుల్లమొల్ల అనిత, రాములు దంపతులకు ప్రియదర్శిని, ప్రియ, ప్రవళిక ముగ్గురు కుమార్తెలు. డిగ్రీ పూర్తయ్యాక పెద్ద కూతురు ప్రియదర్శిని, చిన్నకూతురు ప్రవళికకు వివాహం చేశారు. రెండో కూతురు ప్రియ మాత్రం తాను జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకుంటానని, మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్లేది లేదని తల్లిదండ్రులను ఒప్పించింది. పెళ్లి చేసుకొని వెళితే చుట్టపు చూపుగా వచ్చి వెళ్లడం తనతో కాదని భావించి వివాహానికి దూరంగా ఉంది. ప్రియ పుట్టిన తర్వాత తండ్రి రాములుకు రాజకీయంగా కలిసొచ్చింది. ఆయన జనగాం గ్రామ సర్పంచ్‌గా, ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లో జెడ్పీటీసీగా పోటీచేసిన ప్రియ తల్లి అనిత స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. విద్యాభ్యాసం... ప్రియను 3వ తరగతి వరకు హైదరాబాద్‌లోని గీతాంజలి పబ్లిక్ స్కూల్ హాస్టల్ చదివించారు. ఆతర్వాత కూతురును విడిచి ఉండలేక తాండూరులోని గంగోత్రి విద్యాలయంలో 4వ తరగతిలో చేర్పించారు. 9వ తరగతిలో నవోదయ ప్రవేశ పరీక్షకు ఎంపికైన ప్రియ జవహర్ నవోదయలో ఇంటర్ పూర్తిచేసింది. ఆ తర్వాత ఇంజినీరింగ్ కోసం హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కళాశాలలో చేర్పించారు. బీటెక్ ముగిసిన తర్వాత హైటెక్ సిటీలోని టాటాకు చెందిన ఓ కార్పొరేట్ సంస్థలో ప్రియకు ఉద్యోగం వచ్చింది. డ్యూటీలో చేరిన తర్వాత డే, నైట్ షిఫ్టులు ఉండటంతో కొద్ది రోజులకే జాబ్‌కు గుడ్‌బై చెప్పింది. క్లాసికల్ డాన్స్‌లో శిక్షణ.. ప్రియకు చిన్ననాటి నుంచి డాన్స్ అంటే ఇష్టం. ఇది గుర్తించిన తల్లిదండ్రులు ఆమెను తాం డూరులోని క్లాసికల్ డాన్స్ అకాడమీలో చేర్చించారు. డాన్స్ మాస్టర్ అశోక్ బృందంతో కలిసి దేవాలయ ఉత్సవాలు, వినాయక మండపాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చిన ప్రియ అందరి దృష్టిని ఆకర్షించింది. అనంతరం బుల్లితెర ఆర్టిస్ట్‌గా పటాస్ షోలో అలరించింది. ‘పల్లెటూరి అమ్మాయిగా అలరిస్తా’ మాది వ్యవసాయ కుటుంబం.. చిన్న పల్లెటూరు.. తాతల కాలం నాటి ఇల్లు.. వర్షం పడితే పైనుంచి కురుస్తుంది. మా ఊరికి రోజుకు ఒక బస్సు మాత్రమే వస్తుంది. అమ్మా నాన్నకు ముగ్గురం ఆడపిల్లలమే.. అక్క, చెల్లికి పెళ్లి చేశాం. మా తల్లిదండ్రులకు పెద్దకొడుకుగా ఉండాలనే వివాహం చేసుకోలేదు. హైదరాబాద్‌లో నేను ఎక్కడకు వెళ్లినా నార్త్ ఇండియన్ అమ్మాయి అనుకునే వారు. నాతో హిందీలో మాట్లాడేవారు. నేను పక్కా తెలుగులో మాట్లాడితే అవాక్కయ్యేవారు. సినీ పరిశ్రమకు రావాలని ఏనాడూ అనుకోలేదు. ఒక చిన్న సంఘటన నన్ను ఇటువైపు తీసుకువచ్చింది. బీటెక్ తర్వాత సివిల్స్ కోసం సిద్ధమవుతున్న సమయంలో ఫణీంద్రానాగిశెట్టి మూవీకి సంబంధించి ఆడిషన్స్ జరుగుతున్నాయని స్నేహితులు చెప్పారు. నన్ను ట్రై చేయమని ప్రోత్సహించారు. అందులో సెలెక్ట్ కాలేదు. ఆతర్వాత ‘నీ జన్మ నీకే’ సినిమాలో సెకండ్ హీరోయిన్గా చేశా.. అనంతరం ఖయ్యూంబాయ్లో నందమూరి తారకరత్న సరసన నటించే చాన్స్ వచ్చింది. ఇందులో రేడియో జాకీ పాత్ర నన్ను వెండితెరకు పరిచయం చేసింది. మా నాన్న నన్ను పెద్ద కొడుకులా చూసుకుంటారు. ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. తుపాకిరాముడు సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు అనిత. అమ్మ పేరుతో హీరోయిన్గా అవకాశం రావడం మరచిపోలేని అనుభూతి. ఇప్పటివరకు మూడు సినిమాల్లో నటించా. రెండు సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా చేశా. తుపాకిరాముడుకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. మూవీ మొత్తం పల్లెటూరు వాతావరణంలో ఉంటుంది. అందుకోసం డీగ్లామర్ రోల్లోనే కనిపించా. హీరో విజయ్‌తో చేసిన ‘తమిళ్ తంబి.. తెలుగమ్మాయి’ సినిమా సైతం రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. తెలుగింటి పల్లెటూరు అమ్మాయిగా ప్రేక్షకులను అలరిస్తా’. -
150 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
సాక్షి, తాండూరు: వందల క్వింటాళ్లు రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారనే పక్కా సమాచారంతో సోమవారం సాయంత్రం విజిలెన్స్, సివిల్‌సప్లయ్, పోలీస్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ ఇన్స్పెక్టర్ చంద్రమౌలి, సివిల్ సప్లయి తహసీల్దార్లు నందిని, పద్మ, రూరల్ సీఐ జలేంధర్‌రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. తాండూరు మండలం చెంగోల్ గ్రామానికి చెందిన వడ్డె వెంకటేశం గత కొంతకాలంగా రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించి అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని గౌతంపూర్ శివారులో ఉన్న రిలయన్స్ పెట్రోల్ బంక్ వెనకాల ఓ గదిలో 150 క్వింటాళ్ల (15టన్నుల) రేషన్ బియ్యంను అక్రమంగా నిల్వ ఉంచారు. పక్కా సమాచారంతో విజిలెన్స్, సివిల్ సప్లయ్ అధికారులు ఆ ఇంటిపై ఆదివారం దాడులు చేశారు. కాగా ఆ గదిలో 450 బస్తాల రేషన్ బియ్యం ఉన్నాయి. ఇందులో 300 బస్తాల దొడ్డు బియ్యం, 150 బస్తాల నూకలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన రేషన్ బియ్యాన్ని తాండూరులోని స్టాక్‌పాయింట్‌కు తరలించారు. సంబంధిత వ్యాపారులు రేషన్ బియ్యం సేకరించి కొడంగల్, జహీరాబాద్ మీదుగా కర్ణాటకకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని సంత్సరాలుగా ఇలా సేకరిస్తున్న రేషన్‌బియ్యాన్ని ఇక్కడ నిల్వ ఉంచి.. వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. తాండూరులో ఈ అక్రమ దందా కొనాసాగుతున్న ఈ దాడులు నిర్వహించినవారిలో కరన్‌కోట్ ఎస్ఐ సంతోష్‌కుమార్ ఉన్నారు. కేసు నమోదు చేశాం గౌతపూర్లోని రిలయన్స్ పెట్రోల్‌బంక్ వెనకాల ఓ గదిలో 15 టన్నులు అక్రమంగా రేషన్‌బియ్యం ఉన్నట్లు గుర్తించాం. రేషన్‌బియ్యం అక్రమంగా నిల్వ ఉంచిన సంబంధిత వ్యక్తి (వెంకటేశ్)పై క్రిమినల్ కేసుతో పాటు 6ఏ కేసు నమోదు చేశాం. కేసు నమోదు తర్వాత జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ ఉంటుంది. – నందిని, తహసీల్దార్, సివిల్‌సప్లయ్, వికారాబాద్ -
రైతుబంధు సహాయం మరొకరి ఖాతాలోకి..
సాక్షి, తాండూరు: వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యంతో ఓ మహిళ రైతుబంధు డబ్బులు మరొకరి బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. సంబంధిత రైతు ఖాతాలో పడాల్సిన డబ్బులు హైదరాబాద్‌లోని ఓ వ్యక్తి ఖాతాలో పడ్డాయి. తాండూరు మండలం గౌతపూర్ గ్రామానికి చెందిన జెన్నె ఎల్లమ్మకు అల్లాపూర్ గ్రామ సమీపంలో సర్వే నంబర్ 200, 201లో 4.35 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయం చేస్తూ ఆమె జీవిస్తోంది. అయితే ఆమెకు అందించాల్సిన రైతుబంధు పెట్టుబడి సహాయం ఆమె ఖాతాలో జమ కాలేదు. తనకు డబ్బులు పడలేదని ఆమె వ్యవసాయ అధికారులు, ఆంధ్రాబ్యాంక్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతోంది. అయితే ఆమెకు రావాల్సిన 2018, 2019 కు సంబంధించిన రైతుబంధు డబ్బులు ఆమె ఖాతాలో కాకుండా ఇతరుల ఖాతాల్లో పడ్డాయని సమాచారం తెలిసింది. హైదరాబాద్‌లోని ప్రగతినగర్‌కు సంబంధించిన సిండికేట్ బ్యాంక్ ఖాతా ఉన్న ఓ వ్యక్తి ఖాతాలో జమ అయినట్లు అధికారులు చెప్పారు. దీంతో ఎల్లమ్మ కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు వెళ్లి సిండికేట్ బ్యాంకులో వెళ్లి నగదు విషయమై బ్యాంక్ అధికారులను అడగ్గా తిరస్కరించారు. దీంతో ఎల్లమ్మ తాండూరులోని వ్యవసాయ కార్యాలయం చుట్టూ రైతుబంధు డబ్బుల కోసం తిరుగుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత వ్యవసాయ ఉన్నతాధికారులు స్పందించి రైతుబంధు డబ్బులు ఎల్లమ్మ ఖాతాలో జమ చేయాలని కోరుతున్నారు. -
చిచ్చురేపిన సభ్యత్వ నమోదు
సాక్షి, తాండూరు: పట్టణంతో పాటు పలు మండలాల్లో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గీయులు టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు చేపట్టడం వివాదాస్పదంగా మారింది. గడువు ముగిసిన తర్వాత, స్థానిక ఇన్‌చార్జ్‌లకు కనీస సమాచారం ఇవ్వకుండా మెంబర్‌షిప్‌లు ఇవ్వడంపై పలువురు నాయకులు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ప్రజలు ఈ సారి టీఆర్ఎస్ సభ్యత్వాలు తీసుకున్నారని మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రకటించారు. పార్టీ సభ్యత్వం ముగిసిందని అధికారికంగా స్పష్టంచేశారు. అయితే రెండు రోజులుగా తాండూరులో కొనసాగుతున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నేతల మధ్య చిచ్చు రేపింది. ఇప్పటికే సభ్యత్వ నమోదు పూర్తి చేసి.. వివరాలను పార్టీ ఇన్‌చార్జ్‌లకు అందించారు. ఇదిలా ఉండగా ఆయా మండలాలు, మున్సిపల్ అధ్యక్షులకు సమాచారం ఇవ్వకుండా మళ్లీ సభ్యత్వ నమోదు చేపట్టడం వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గీయులు చేపట్టిన ఈ కార్యక్రమంపై పలువురు నాయకులు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. నియోజకవర్గంలోని మండలాల పార్టీ అధ్యక్షులు, తాండూరు పట్టణ అధ్యక్షుడు గత నెలలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. సభ్యత్వం పూర్తి చేసి సభ్యత్వ రశీదు బుక్కులతో పాటు సమకూరిన నగదును పార్టీకి చెల్లించారు. తమకు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేశామని నాయకులంతా ఊపిరి పీల్చుకున్నారు. గ్రామ కమిటీల నియామకం.. మండలాల్లో, పట్టణంలో గ్రామ కమిటీలతో పాటు, వార్డు కమిటీల ఏర్పాటు సైతం తుది దశకు చేరుకొంది. ఇప్పటికే గ్రామ కమిటీల అధ్యక్షులతో పాటు కార్యవర్గ సభ్యుల పేర్లను ప్రకటించారు. అయితే రెండు రోజులుగా కొంత మంది కార్యకర్తలు పార్టీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహిస్తూ కనిపిస్తున్నారు. ఇది చూసిన స్థానిక నాయకులు విషయాన్ని తాండూరు పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రవూఫ్‌తో పాటు మండలాల అధ్యక్షులకు చెప్పారు. సభ్యత్వ నమోదు చేస్తున్నది తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గీయులుగా గుర్తించారు. మరోసారి వర్గపోరు.. తాండూరు నియోజకవర్గంలో వర్గపోరు మరోసారి తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. స్థానికంగా పట్టు సాధించేందుకు ఇద్దరు నేతలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మహేందర్‌రెడ్డి వర్గీయులను రెచ్చగొట్టే విధంగా.. ఎమ్మెల్యే వర్గీయులు.. గడువు ముసిగిన తర్వాత సభ్యత్వం చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదు చేశాం టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసి బుక్కులు, నగదును ఇన్‌చార్జ్‌లకు అందించాం. సభ్యత్వం గడువు ముగిసిన తర్వాత ఎమ్మెల్యే వర్గీయులు మెంబర్షిప్ చేస్తున్నారు. పార్టీ స్థానిక ఇన్‌చార్జ్‌లకు సైతం ఈ విషయాన్ని చెప్పడం లేదు. దీనిపై పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ గట్టు రామచందర్‌రావుతో పాటు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశాం. – అబ్దుల్ రవూఫ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు -
సంతకం పెడతారు.. వెళ్లిపోతారు!
సాక్షి, తాండూరు: తాండూరు మున్సిపాలిటీలో పురపాలన గాడి తప్పింది. మున్సిపల్ కార్యాలయ పాలకమండలి ముగియడంతో పురపాలన అధికారాలన్నీ అధికారుల చేతికి వచ్చాయి. దీంతో కార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బంది ఆడిందే ఆట..పాడిందే పాట అనే చందంగా మారింది. రెండు నెలలుగా కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. మున్సిపల్ కమిషనర్, మేనేజర్ పోస్టులు ఖాలీగా ఉండటంతో భాద్యతలన్నీ స్థానిక ఆర్డీఓకు అప్పగించారు. అయితే రెవెన్యూ పరమైన సమస్యల పరిష్కారంలో నిమగ్నమయ్యే ఆర్డీఓ మున్సిపల్ పాలనపై పెద్దగా దృష్టి సారించడం లేదు. దీంతో మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది బయోమెట్రిక్ ద్వారా హాజరుశాతం తీసుకోకపోవడంతో ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తుననాయి. కొన్నాళ్లపాటు సాఫీగానే.. తాండూర మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం రెండేళ్ల క్రితం బయోమెట్రిక్ హాజరు నమోదును అమలులోకి తీసుకువచ్చారు. అయితే ఈ విధానం కొన్నాళ్ల పాటు సాఫీగానే సాగినప్పటికీ తరువాత బయోమెట్రిక్ మిషన్ మరమ్మతులకు గురైంది. దీంతో అప్పటి నుంచి ఎవరూ కూడా బయోమెట్రిక్ యంత్రంలో హాజరు నమోదుకాని పరిస్థితి. మాన్యువల్ పద్ధతిలో రిజిస్టర్లలో ఉద్యోగులు, కార్మికుల హాజరుశాతం నమోదు చేస్తున్నారు. విధులకు రానప్పటికీ కొంత మందికి హాజరువేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పనిచేసిన వారికి మాత్రం వేతనాలు సరిగా ఇవ్వడం లేదని గతంలో కొందరు సిబ్బంది మున్సిపల్ కార్యాలయంలో ఆందోళన చేపట్టిన సంఘటనలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు మాత్రం బయోమెట్రిక్ యంత్రానికి మరమ్మతులు చేయించేందుకు శ్రద్ధ తీసుకోవడంలేదు. కార్యాలయానికి రాకపోయినా రిజస్టర్‌లో సంతకాలు పెట్టి వేతనాలు పొందుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులూ ఉపయోగించని బయోమెట్రిక్.. మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ అధికారులు, ఉద్యోగులకు కూడా హాజరు నమోదుకు ప్రత్యేకంగా బయోమెట్రిక్ మిషన్ ఏర్పాటు చేశారు. అయితే యంత్రం పనిచేస్తున్నప్పటికీ మాన్యువల్ పద్ధతి ప్రకారమే ఎస్టీఓకు వేతనాల కోసం హాజరు రికార్డులను పంపిస్తున్నారని స్థానిక ప్రజా ప్రతినిధులు అంటున్నారు. దీంతో పురపాలన వ్యవస్థ గాడితప్పుతోందని వారు ఆరోపిస్తున్నారు. వెంటనే బయోమెట్రిక్ యంత్రాలలో హాజరును సేకరించి అక్రమాలకు చెక్ పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
ప్రత్యర్థులు మిత్రులయ్యారు!
సాక్షి, తాండూరు: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరనే దానికి ఈ ఇద్దరు నేతలకు సరితూగుతోంది. నెల క్రితం వరకు ఒకరిపై ఒకరు ఘాటైన విమర్శలు చేసుకొన్న వారు మూడు రోజుల నుంచి ఒకే వాహనంలో కలిసి తిరుగుతున్నారు. దీంతో కొందరు సొంత పార్టీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇద్దరు నేతల కోసం గొడవలు, ఘర్షణలు పడి జీవితాలను ఫణంగా పెట్టిన నాయకులు ఉన్నారు. రెండు మూడు రోజులుగా ఇద్దరు నేతల ఒకే వాహనంలో వెళ్తూ అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేయడం గమనార్హం. తాండూరు నియోజకవర్గంలో.. తాండూరు నియోజకవర్గంలో రాజకీయాలు రోజురోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసిన పట్నం మహేందర్‌రెడ్డి, పంజుగుల రోహిత్‌రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఏడాది క్రితం మంత్రిగా ఉన్న పట్నం మహేందర్‌రెడ్డిని ఓడించేందుకు రోహిత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహేందర్‌రెడ్డిని టార్గెట్ చేసుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహేందర్‌రెడ్డిని తాండూరులో ఓడించి షాబాద్‌కు తరిమి కొట్టాలని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీంతో అసెంబ్లీ ఎన్నికలలో మహేందర్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. రోహిత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. వరుసగా జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవడంలో మహేందర్‌రెడ్డి పైచేయి సాధించారు. ఎన్నికల తర్వాత కూడా ఆ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయిలో కొనసాగింది. అయితే అనూహ్యంగా రోహిత్‌రెడ్డి రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. నాటి నుంచి ఒకే పార్టీలో ఇద్దరు కొనసాగుతున్నారు. ఎన్నికలకు ముందు.. తర్వాత.. తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడి ఎన్నికలకు ముందు వరకు మహేందర్‌రెడ్డిని టార్గెట్ చేసి ఓటర్లను ఆకర్షించారు. తర్వాత టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన తర్వాత వచ్చిన విమర్శలను అనుకూలంగా మార్చుకునేందుకు కొత్త వ్యూహం రచించారు. మహేందర్‌రెడ్డిని విమర్శించిన రోహిత్‌రెడ్డి ప్రశంసల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. మూడు రోజులుగా ఒకే వాహనంలో.. ఇద్దరు నేతలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో గతంలో చేసుకున్న విమర్శలను ప్రతి విమర్శలను పక్కన పెట్టారు. తాండూరులో ఏ కార్యక్రమం జరిగిన ఇద్దరు నేతలు ఒకే వాహనంలో వెళ్లి హాజరవుతున్నారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి తాండూరులోని తన నివాసంలో ఉన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆయన నివాసానికి చేరుకొని ఒకే వాహనంలో ఇద్దరు పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. అయితే ఇద్దరు నేతల మధ్య సఖ్యత కుదిరిందా లేకా పార్టీ అధిష్టాన నేతల ఒత్తిడితో కలిశారా పర్యటిస్తున్నారా అనేది స్థానికంగా చర్చనీయాంశమైంది. సొంత పార్టీ నాయకుల నుంచి విమర్శలు టీఆర్ఎస్లో కొనసాగుతున్న సీనియర్ నేతలు ఇద్దరు నేతల వ్యవహార శైలిని తప్పు పడు తున్నారు. నిన్న మొన్నటి వరకు ఇద్దరు నేతల కోసం ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు గొడవలు, ఘర్షణలు పడ్డారని, ఈ విషయంలో పలు పోలీసు కేసులు నమోదు కావడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు ఏ పార్టీలో ఉన్న విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని అవకాశవాద రాజకీయాలను సహించబోమని సొంత పార్టీ నాయకుల నుంచి విమర్శలు వస్తున్నాయి. -
అడ్డంగా దొరికిపోయిన భగీరథ అధికారులు
సాక్షి, వికారాబాద్: మిషన్ భగీరథ పథకంలో అందినకాడికి దోచుకుంటున్నారు కొందరు అధికారులు. తాజాగా బిల్లులు చెల్లించేందుకు డబ్బులు డిమాండ్ చేసిన మిషన్ భగీరథ అధికారులు అడ్డంగా దొరికిపోయారు. జిల్లాలోని తాండూరులో మంగళవారం ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం గురువయ్య మిషన్ భగీరథ కాంట్రాక్టర్. అతనికి రూ.20 లక్షలు బిల్లులు రావాల్సి ఉంది. అందుకోసం నెలరోజులుగా డబ్ల్యూఎస్‌డీఈ శ్రీనివాస్ చుట్టూ తిరుగుతున్నాడు. బిల్లులు చెల్లించడానికి ముందు తమ జేబులు తడపాలని శ్రీనివాస్ కోరాడు. రూ.30 వేలు ముట్టచెపితేనే బిల్లులు చేస్తానని చెప్పడంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. వారి సూచన మేరకు కాంట్రాక్టర్ డీఈ శ్రీనివాస్‌కు రూ.30 వేలు డబ్బులు ఇవ్వబోయాడు. అతను వారించి వర్కింగ్ ఇన్స్పెక్టర్ మహేందర్‌కు ఇవ్వాలని సూచించడంతో అతనికి డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ ఇద్దరి అధికారులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. శ్రీనివాస్ ఇంటిపై కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. -
అతిథి బాధలు.. కాంట్రాక్ట్ వెతలు!
సాక్షి, తాండూరు: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధన అగమ్యగోచరంగా మారింది. పాఠశాల, ఉన్నత విద్యకు నిచ్చెన లాంటి ఇంటర్ ఎడ్యుకేషన్ ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురువుతోంది. తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు ఫర్నిచర్ వంటి మౌలిక సదుపాయాల సంగతి పక్కన పెడితే కనీసం పాఠాలు బోధించేందుకు కాలేజీల్లో రెగ్యులర్ అధ్యాపకులు లేరు. దీంతో చదువులు సవ్యంగా సాగడం లేదు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలోని 9 కాలేజీల్లో రెగ్యులర్ అధ్యాపకులు లేరు. దీంతో కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్లతో కాలం వెల్లదీస్తున్నారు. 9 మండలాల్లోనే కాలేజీలు.. జిల్లాలో 18 మండలాలు ఉండగా.. కేవలం 9 మండలాల్లోనే మాత్రమే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. మిగతా ఒకటి రెండు చోట్ల ప్రైవేటు కాలేజీలే దిక్కవుతున్నాయి. మర్పల్లి, కొడంగల్, దోమ, పెద్దేముల్, మోమిన్‌పేట, నవాబ్‌పేట మండలాలతో పాటు తాండూరు, పరిగి, వికారాబాద్ పట్టణాల్లో ప్రభుత్వ కాలేజీలున్నాయి. వీటిలో 3వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 9 కాలేజీలకు సంబంధించి సుమారు 150 మంది రెగ్యులర్ అధ్యాపకులు అవసరం. వీరిలో కేవలం 5గురు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. 81 మంది కాంట్రాక్ట్ విధానంలో, 48 మంది గెస్ట్ ఫ్యాకల్టీ పద్ధతిన సేవలు అందిస్తున్నారు. 5 నెలలుగా అందని వేతనాలు.. జిల్లాలోని ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో 81 మంది అధ్యాపకులు కాంట్రాక్ట్ విధానంలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి గత విద్యాసంవత్సరానికి సంబంధించిన 5 నెలల వేతనాలు ఇప్పటికీ చెల్లించలేదు. దీంతో వీరు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు ఆందోళనలు సైతం నిర్వహించారు. రెగ్యులరైజ్ చేయాలి పదేళ్లకుపైగా కాంట్రాక్ట్ విధానంలో విధులు నిర్వర్తిస్తున్నాం. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మా ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలి. నెలనెల వేతనాలు చెల్లించాలి. ప్రభుత్వ కళాశాలలు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. అయినా కూడా మాకు సమస్యలు తప్పడం లేదు. – మహేందర్, కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. వికారాబాద్, తాండూరులో తరగతి గదుల కొరత ఉంది. వసతుల కల్పనకు మావంతు కృషి చేస్తున్నాం. కాంట్రాక్ట్ అధ్యాపకుల బకాయి వేతనాలు చెల్లింపు మా పరిధిలో లేదు. – శంకర్‌నాయక్, జిల్లా నోడల్ అధికారి రెగ్యులరైజ్ చేయాలి పదేళ్లకుపైగా కాంట్రాక్ట్ విధానంలో విధులు నిర్వర్తిస్తున్నాం. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మా ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలి. నెలనెల వేతనాలు చెల్లించాలి. ప్రభుత్వ కళాశాలలు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. అయినా కూడా మాకు సమస్యలు తప్పడం లేదు. – మహేందర్, కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు -
16 ఎంపీ స్థానాలు టీఆర్ఎస్వే
సాక్షి, అనంతగిరి: లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 ఎంపీ స్థానాలను సాధిస్తుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ జోస్యం చెప్పారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని చిగుళ్లపల్లి గ్రౌండ్లో గురువారం రాత్రి నిర్వహించిన పార్టీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అందరి ఆశీర్వాదంతో తమ పార్టీ 7 స్థానాల్లో గెలిచిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్‌గాంధీ మూడుసార్లు హైదరాబాద్ వచ్చారని, ఆయన సభలకు జనం పెద్దగా రాలేదని గుర్తుచేశారు. ఈ ప్రాంత ప్రజలు తన తండ్రిని 6సార్లు ఎంపీగా గెలిపించారని, తనను కూడా గెలిపించి ఆదరించిన విషయం ఎప్పటికే మరిచిపోలేనని చెప్పారు. హైదరాబాద్‌లో ఈసారి విజయం మనదేనని స్పష్టంచేశారు. మిగిలిన 16 స్థానాల్లో కేసీఆర్‌కు మద్దతిచ్చి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈసారి ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఉండవన్నారు. ప్రస్తుతం దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయని వెల్లడించారు. వీరంతా కలిస్తే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని స్పష్టంచేశారు.ఈ దశలో 16 ఎంపీ సీట్లు అత్యంత కీలకంగా మారుతాయని ధీమా వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ చేస్తున్న రాజకీయం దేశంలో సెక్యులరిజాన్ని బలహీనం చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని తెలిపారు. ఇందుకు కేవలం సీఎం కేసీఆర్ పాలనే కారణమన్నారు. కానీ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అరాచకాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటివి సహించలేమన్నారు. నరేంద్రమోదీ, కేసీఆర్‌లు ఇద్దరూ హిందువులే అయినప్పటికీ వీరి హిందుత్వం మధ్య జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందన్నారు. వైఎస్ మరణాంతం కాంగ్రెస్ పాలనలో తనను, తన తమ్మున్ని ఎన్నో ఏళ్ల కిందటి కేసు పేరుతో జైలుకు పంపి అవస్థలు పెట్టారని తెలిపారు. అయినా తామెక్కడా జంకలేదని, ప్రస్తుతం తాము కాంగ్రెస్ వెంటపడ్డామని చెప్పారు. గత కాంగ్రెస్ పాలనలో ముస్లింలు, దళితులు చాలా వెనుకబడి పోయారన్నారు. చేవెళ్ల ఎంపీగా బరిలో ఉన్న రంజిత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. 2014లో టీఆర్ఎస్ ఎంపీగా గెలిచిన విశ్వేశ్వర్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారన్నారు. కోట్‌పల్లిలో బోటింగ్ షురూ చేసిన ఎంపీ తమ చేపలను నాశనం చేస్తున్నారని ఎంతో మంది బాధితులు తన వద్ద మొరపెట్టుకున్నారని తెలిపారు. తాండూరు: ఏపీలో జగన్ సీఎం అవుతాడని.. బాబు ఇంటికి వెళ్లడం ఖాయమని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.గురువారం రాత్రి తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఎంఐఎం తాండూరు అధ్యక్షుడు ఎంఏ హదీ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో అసద్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 16 స్థానాలు వస్తాయన్నారు. హైదరాబాద్‌లో ఎంఐఎం విజయం సాధిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌కు 20 ఎంపీ స్థానాలు వస్తాయని చెప్పారు. తనకు మంత్రి కావాలి, బుగ్గ కారులో ఎక్కి తిరగాలని అనే ఆలోచన ఎప్పుడూ లేదన్నారు. ప్రజల మధ్య ఉంటూ సేవ చేయడమే తమ లక్ష్యమని స్పష్టంచేశారు. హిందువులకు తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని, బీజేపీ, ఆర్ఎస్ఎస్కు మాత్రమే తాము వ్యతిరేకులమని తెలిపారు. దేశంలోని ప్రధాని నరేంద్రమోదికన్నా, రాహుల్‌గాంధీ కన్నా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి వారని కొనియాడారు. చెవెళ్లలో రంజిత్‌రెడ్డి 70వేల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. సభకు 8వేల మందికి ముస్లిం నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సాజిద్, నాయకులు యూసూఫ్‌ఖాన్, ఖుర్షీద్హుస్సేన్, భగవాన్కరీం తదితరులు ఉన్నారు. బహిరంగ సభకు తరలిరండి వికారాబాద్‌లో 8న నిర్వహించే సీఎం కేసీఆర్ సభకు భారీగా తరలిరావాలని అసద్ పిలుపునిచ్చారు. ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలతో తరలివెళ్లాలని తెలిపారు. వికారాబాద్‌లోని సమస్యల పరిష్కారంపై తాను సీఎంతో మట్లాడుతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం సీనియర్ నాయకులు హక్నజీర్, ఎండీ అలీం, మహ్మద్ అలీం, మజీద్, ఎజాస్, అలీమొద్దీన్, మోయిస్ ఖురేషి, కలీం, అఫ్జల్ షరీఫ్ తదితరులు ఉన్నారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి అవమానం
సాక్షి, వికారాబాద్: తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి అవమానం ఎదురైంది. ఆయన మంగళవారం తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కాగా.. ఆయన రాకపై టీఆర్ఎస్ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా ప్రమాణం చేయకుండా రోహిత్ రెడ్డి మున్సిపల్ సమావేశానికి ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. ఆయన తీరును తప్పుబడుతూ.. టీఆర్ఎస్ కౌన్సిలర్లు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా నోరుజారిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.. ఏ పిచ్చి నా కొడుకులు చెప్పారంటూ దురుసుగా వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ కమిషనర్‌కు సైతం ఆయన క్లాస్ తీసుకున్నారు. టీఆర్ఎస్ కౌన్సిలర్లు నాన్సెన్స్ క్రియేట్ చేశారంటూ మండిపడ్డారు. అంతకుముందు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి కౌన్సిలర్లు సన్మానం చేశారు. ఇంతవరకు బాగానే ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాతే కౌన్సిల్ సమావేశాలకు రావాలంటూ టీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. -
మంత్రుల సీటు..
వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ హేమాహేమీలైన నేతలు బరిలో నిలిచి గెలుపొందడమే కాకుండా...మంత్రి పదవులు చేపట్టారు. అందుకే దీన్ని మంత్రుల సీటుగా చెప్పొచ్చు. 20014లో ఇక్కడి నుంచి టీఆర్ఎస్ తరపున గెలిచిన పట్నం మహేందర్‌రెడ్డి రవాణా శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించగా...అంతకు ముందు ఇక్కడి నుంచి ఎన్నికల్లో గెలిచిన మర్రి చెన్నారెడ్డి, మాణిక్‌రావు, చంద్రశేఖర్‌రావులు కూడా మంత్రులుగా పనిచేశారు. 2004లో గెలిచిన నారాయణరావుకు కూడా మంత్రి పదవి ఛాన్స్ లభించినా..కొన్ని కారణాల వల్ల ఆయనకు చివరి నిమిషంలో పదవి దక్క లేదు. మొత్తమ్మీద తాండూరు నుంచి గెలిచిన ఎక్కువ మంది మంత్రి పదవి చేపడతుండడం గమనార్హం. ఇక వ్యవసాయ, వాణిజ్యపరంగా తాండూరు నియోజకవర్గం మంచి ప్రగతి సాధించింది. ఈ ప్రాంతంలో కంది సాగు ప్రత్యేకత కలిగి ఉంది. నాపరాయి, సుద్ద, లాటరైట్ వంటి ఖనిజాలకూ తాండూరు ప్రసిద్ధి. ఇతర రాష్ట్రాలకు చెందిన కుటుంబాలు ఇక్కడ స్థిరపడ్డాయి. ఈ సారి బరిలో టీఆర్ఎస్ తరుపున మరోసారి పట్నం మహేందర్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన నాలుగున్నరేళ్ల కాలంలో తాండూరు నియోజకవర్గానికి రూ.1800 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు సాధించారని పార్టీ నేతలు చెబుతున్నారు. తనకున్న ప్రాబల్యం, చేపట్టిన పనులు ఈసారి ఎన్నికల్లోనూ గెలిపిస్తాయని మహేందర్‌రెడ్డి ధీమాతో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి బషీరాబాద్ మండలానికి చెందిన పైలట్ రోహిత్‌రెడ్డి ఇక్కడ బరిలో ఉన్నారు. ఈయన మొదటిసారి తాండూరు నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో ఉన్న పరిచయాలతో ముందుకు సాగుతున్నారు. స్థానిక నేతల సహకారంతో ప్రచారం చేపట్టారు. తనకు ఈ సారి అవకాశం ఇవ్వాలంటూ ప్రజలను కోరుతున్నారు. మొత్తానికి తాండూరు నియోజకవర్గంలో ఈసారి రసవత్తరమైన పోటీ నెలకొంది. టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. సిట్టింగ్ ప్రొఫైల్.. పట్నం మహేందర్‌రెడ్డి 1994లో తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక్కడ మూడు దశాబ్దాల పాటు గెలుస్తూ వస్తున్న మహరాజుల కుటుంబ సభ్యులను ఓడించి తాండూరు అసెంబ్లీ స్థానాన్ని ఆయన కైవసం చేసుకున్నారు. గతంలో స్థానికేతరుడని ముద్ర ఉంది. అయితే తరచు తాండూరు ప్రజలకు అందుబాటులో ఉండి చేరువయ్యారు. తిరిగి 1999, 2009లలో టీడీపీ తరపునే విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం 2014లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ తరుపునా ఆయన తిరిగి విజయం సాధించి రాష్ట్ర రవాణశాఖ మంత్రిగా కొనసాగారు. 2004లో మాత్రమే ఒకసారి ఓటమి చవిచూశారు. ప్రస్తుతం ఇదే స్థానం నుంచి 6వ సారి పోటీకి దిగుతున్నారు. ప్రధాన సమస్యలు - తాండూరులో నిరుద్యోగ యువతకు స్థానికంగా ఉన్న పరిశ్రమలలో ఉపాధి లభించడం లేదు. దీనిపై ఇక్కడి యువత కొంత అసంతృప్తిగా ఉన్నారు. - తాండూరు పట్టణంలో ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు కలగానే మిగిలింది. ఇవి ఏర్పాటైతే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతగానో మేలు జరుగుతుంది. - తాండూరులో కంది బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. - గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు కొన్నిచోట్ల అధ్వానంగా ఉన్నాయి. ప్రత్యేకతలు - తాండూరులో గురుకుల పాఠశాలల ఏర్పాటు, ఐటీఐ కళాశాల మంజూరు నిరుపేద విద్యార్థులకు ఎంతో మేలు చేసింది. - రైతు బజార్ , సోలార్ విద్యుత్ కేంద్రం నిర్మాణం - తాండూరు మున్సిపల్ పరిధిలో రోడ్ల విస్తరణ వంటి ముఖ్యమైన అభివృద్ధి పనులు మహేందర్‌రెడ్డి హయాంలో పూర్తయ్యాయి. - కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా 4448 మంది లబ్ధిదారులకు రూ.14 కోట్ల నిధులు అందించారు. - సీఎం సహాయ నిధి ద్వారా వివిధ చికిత్సల కోసం 1,113 మందికి రూ.6.60 కోట్ల వరకు ఆర్థిక సాయం చేశారు. - మిషన్ కాకతీయ పథకం ద్వారా 198 చెరువులను బాగు చేసేందుకు రూ.74 కోట్ల మంజూరు. - తాండూరు బైపాస్ రోడ్డుకు రూ.78కోట్ల నిధులు మంజూరు. - పంచాయతీరాజ్ నిధుల ద్వారా 1987 అభివృద్ధి పనులకు గాను రూ.185 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, మౌలిక సదుపాయాలు మెరుగుపర్చారు. - ఇందర్‌చెడ్, నవాంద్గి ఎత్తిపోతల పథకాల అభివృద్ధికి రూ.1.82 కోట్ల నిధులు మంజూరు. పనులు కొనసాగుతున్నాయి. - మిషన్ భగీరథ ద్వారా 185 గ్రామాలకు రూ.350 కోట్ల నిధులతో 3.24 లక్షల మందికి ఇంటింటికీ తాగునీరు. - రైతు బంధు పథకం ద్వారా 54,115 మంది రైతులకు రూ.65,18 కోట్ల వరకు పెట్టుబడి సాయం .::: ఇన్పుట్స్: కరణం భీంసేన్ రావు, తాండూరు -
‘చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడాలి’
తాండూరు టౌన్: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించాలని బీసీ సంక్షేమం సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆ సంఘం నియోజకవర్గ కన్వీనర్ రాజ్‌కుమార్ అధ్యక్షతన గురువారం తాండూరులో బీసీ యువగర్జన నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ.. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అణగారిన వర్గాలుగా బతుకుతున్న బీసీలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలన్నారు. చట్టసభల్లో బీసీల ఆధిక్యం పెరగాలంటే 50శాతం రిజర్వేషన్లు కేటాయించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంటులో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్లను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో సైతం 119 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 19 మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. 52 శాతం ఉన్న బలహీనవర్గాలు రాజ్యాధికారంలో మాత్రం వెనుకబడిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. అగ్రవర్ణాల కబంధ హస్తాల నుంచి బయటపడి, ఐకమత్యంతో ఎన్నికల్లో ఓటు హక్కును సమర్థవంతంగా వినియోగించుకుని బీసీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కనిపించని వివక్ష కింద బీసీలు బతుకుతున్నారన్నారు. కుల సంఘాలకు అన్ని రాజకీయ పార్టీలు వణుకుతున్నాయని, ఐక్యంగా ఉంటే బలోపేతమవుతామని స్పష్టంచేశారు. వేషం, భాష, నడక, నడత అన్నీ మార్చినట్లయితే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని సూచించారు. గతంలో అగ్రవర్ణాల వారు బీసీలకు రిజర్వేషన్లు ఎత్తేయాలని సుప్రీంకోర్టులో కేసు వేసి ఇంకా అణగదొక్కాలని చూశారని మండిపడ్డారు. సీ విద్యార్థుల సంక్షేమాన్ని మరిచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చుక్కలు చూపించి విద్యార్థులకు కేటాయించాల్సిన స్కాలర్షిప్లు, బాల, బాలికలకు వసతి గృహాలు, ఇతర సౌకర్యాలు మెరుగుపరిచేలా పోరాటం చేశామని తెలిపారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని చెప్పారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ సునీతాసంపత్ మాట్లాడుతూ.. అన్ని బీసీ కులాలు ఏకమై అగ్రవర్ణాల ఎత్తుగడలను తిప్పి కొట్టాలన్నారు. రాజకీయాల్లో బీసీలు ఎదిగేందుకు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల, కుల సంఘాల నాయకులు రవిగౌడ్, వడ్డే శ్రీనివాస్, పట్లోళ్ల నర్సింలు, పటేల్ రవిశంకర్, రమేష్‌కుమార్, ఇందూరు రాములు, నరేష్ మహరాజ్, మురళీకృష్ణ గౌడ్, పూజారి పాండు, ప్రభాకర్‌గౌడ్, బసయ్య, కమల, భద్రేశ్వర్, సౌజన్య, మాధవి, శ్రీనివాస్, షుకూర్, తారకాచారి, వెంకటేష్‌చారి, దత్తు తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీపీపై అవిశ్వాస ప్రతిపాదన
తాండూరు రూరల్ : రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి సొంత ఇలాఖాలో అధికార పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. తాండూరు ఎంపీపీ లక్ష్మమ్మపై సొంత పార్టీ ఎంపీటీసీలు అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. మండలంలో మొత్తం 15 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. 9 మంది టీఆర్ఎస్, ఆరుగురు ఎంపీటీసీలు కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. అప్పట్లో అంతారం–2 ఎంపీటీసీ సభ్యురాలు కోస్గి లక్ష్మమ్మను ఎంపీపీగా ఎన్నుకున్నారు. టీఆర్ఎస్లో కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాట కారణంగా మంగళవారం అదే పార్టీకి చెందిన నలుగురు ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ లక్ష్మమ్మపై తిరుగుబాటు జెండా ఎగురువేశారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎంపీటీసీ సభ్యులతో కలిసి మంగళవారం తాండూరు ఆర్డీఓ వేణుమాధవ్‌ను కలిసి అవిశ్వాసం లేఖ అందజేశారు. వడ్డె శ్రీనుతో వేగలేకపోతున్నాం.. టీఆర్ఎస్కు చెందిన అసమ్మతి ఎంపీటీసీ సభ్యులు శేఖర్, వసంత్‌కుమార్, శోభ మాట్లాడుతూ.. ఎంపీపీ లక్ష్మమ్మ వర్గీయుడు, తాండూరు మండలంలో నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డె శ్రీను మండలంలో ఏకపక్షంగా, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎంపీపీ వ్యవహారాల్లో అతనే ముందుండి నడిపిస్తున్నారని, తమను లెక్క చేయడం లేదని మండిపడ్డారు. ఆయనతోనే స్థానికంగా టీఆర్ఎస్ భ్రష్ఠుపట్టిందని, గ్రామాల్లో గ్రూపులను ప్రోత్సహిస్తున్నారన్నారు. తమకు మంత్రి మహేందర్‌రెడ్డి అంటే అభిమానమేనని.. కానీ వడ్డె శ్రీను ఒంటెత్తు పొకడతో ఎంపీపీపై అవిశ్వాసం పెట్టాల్సి వస్తోందని తెలిపారు. మంత్రి రంగంలోకి దిగినా ఫలితం శూన్యం.. తాండూరు మండలం ఎంపీపీ కోస్గి లక్ష్మమ్మపై అవిశ్వాస తీర్మానానికి సొంత పార్టీ ఎంపీటీసీ సభ్యులు సిద్ధమయ్యారనే విషయం తెలుసుకున్న మంత్రి మహేందర్‌రెడ్డి అప్రమత్తయ్యారు. సోమవారం మధ్యాహ్నం వైస్ ఎంపీపీ శేఖర్‌తోపాటు ఎంపీటీసీ సభ్యులు వసంత్‌కుమార్, మ్యాతరి శోభతో ఫోన్లో మాట్లాడారు. అంతర్గత సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుందామని.. ఇలా రచ్చకెక్కడంతో పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని సర్దిచెప్పారు. మంత్రి మాటలు లెక్కచేయకుండా అసమ్మతి ఎంపీటీసీలు మంగళవారం ఆర్డీఓను కలిసి ఎంపీపీపై అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు లేఖ ఇచ్చారు. దీంతో మంత్రి మహేందర్‌రెడ్డి అసమ్మతి ఎంపీటీసీలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. -
బస్‌పాస్‌ల పేరిట దోపిడీ
తాండూరు : పెద్దేముల్ మండలానికి చెందిన భవాని తాండూరులో 8వ తరగతి చదువుతోంది. పేద కుటుంబం కావడంతో ప్రభుత్వం బస్‌పాస్‌ను ఉచితంగా అందించింది. బస్‌పాస్ తీసుకునేందుకు బస్‌స్టేషన్‌లో ఉన్న కౌంటర్ వద్దకు వెళితే రూ.60 చెల్లించాలని డిమాండ్ చేశారు. చేసేది లేక ఆ విద్యార్థి ఆరోజు పాస్ తీసుకోకుండానే గ్రామానికి వెళ్లిపోయింది. మరుసటి రోజు రూ.60 చెల్లించి బస్ పాస్ పొందింది. బస్‌పాస్‌ల పేరిట ఆర్టీసీ ఉద్యోగులు దోపిడీకి పాల్పడుతున్నా సంబంధిత అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా బస్‌పాస్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. జూన్‌లో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కాగానే విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రావాణాశాఖ అధికారులు గ్రామాల్లోనే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత బస్ పాస్‌లు అందించేందుకు నియమించింది. ఇదే అదునుగా భావించిన సదరు అధికారులు విద్యార్థుల నుంచి పాస్ ఫీజు రూ.30లకు బదులుగా, నిబంధనలకు విరుద్ధంగా రూ.60 వసూలు చేస్తూ అధిక డబ్బు వసూలు చేస్తున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా కొనసాగుతున్న జిల్లాలలోనే ఇలా అక్రమ వసూళ్లకు ఆర్టీసీ ఉద్యోగులు పాల్పడడం గమనార్హం. వికారాబాద్ జిల్లాలో మొత్తం తాం డూరు, పరిగి, వికారాబాద్ పట్టణాల్లో ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఆర్టీసీ డిపోల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఉచితంగా బస్‌పాస్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి, అమలుచేస్తోంది. విద్యార్థులు బస్‌పాస్‌ల విషయంలోఇబ్బందులు పడవద్దన్న ఉద్దేశంతో రెండు మూడేళ్లుగా మండలాల్లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు వెళ్లి ఆర్టీసీ ఉద్యోగులు బస్ పాస్లనుపంపిణీ చేస్తారు. గతేడాది జిల్లాలోని 18 మండలాల విద్యార్థులకు మూడు ఆర్టీసీ డిపోల నుంచి33వేల మంది విద్యార్థులకు ఉచిత బస్ పాస్లనుఅందించారు. అయితే బస్ పాస్‌లను జారీ చేసేందుకు ఆన్లైన్ ఫీజు పేరిట గతేడాది రూ.30లుతీసుకుంటే ఈ ఏడాధి అనందనంగామరోరూ.30 వసూలు చేసినట్లుతెలిపారు. నిబంధనలకు విరుద్దంగా వసూళ్లు జిల్లాలోని 18 మండలాల్లో ప్రతిఏటా దాదాపు 33 వేల మందికి బస్ పాస్‌లు జారీ చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు తాండూరు పరిగి వికారాబాద్ ఆర్టీసీ డిపోల పరిధిలో బస్ పాస్‌లను జారీ చేసేందుకు వికారాబాద్ డిపో పరిధిలో 9 మంది, పరిగిలో 9మంది, తాండూరులో 7 గురు ఆర్టీసీ ఉద్యోగులను నియమించారు. పాఠశాలలు ప్రారంభమైన నాటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులుప్రతి రోజు ఒక్కొ మండలానికి వెళ్లి బస్‌పాస్‌ల ప్రక్రియ నిర్వహిస్తున్నారు. జూన్ నెలలో మొత్తం 18 వేల మంది విద్యార్థులకు ఉచిత బస్ పాస్‌లను అందించారు. అయితే ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ నిభందనల ప్రకారం విద్యార్థుల నుంచిరూ.30 తీసుకోకుండా రూ.60 వసూలుచేస్తున్నారని విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయుల నుంచి విమర్శలు వస్తున్నాయి. మంత్రి ఇలాఖాలోనే దోపిడీ ఆర్టీసీ బాస్‌గా వ్యవహరిస్తున్న తాండూరుఎమ్మెల్యే, రాష్ట్ర రావాణాశాఖ మంత్రిపట్నం మహేందర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇలాఖాలోనే ఆర్టీసీ అధికారులు దోపిడికి తెరలేపారు. జిల్లాలోనే అధికంగా తాండూరు ఆర్టీసీ డిపోలో విద్యార్థుల నుంచి అధికంగా డబ్బులను వసూలు చేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 18వేల మంది విద్యార్థులకు బస్ పాస్‌లను అందించి దాదాపు రూ.5లక్షల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికంగా డబ్బులు వసూలు చేయొద్దు.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న ఉచిత బస్ పాస్‌లలో ఆర్టీసీ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. విద్యార్థుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయడం సరికాదని. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొఓక్కారని ఆరోపించారు. ఉప్పల రాజేశ్, ఏబీవీపీ తాండూరు ఇంచార్జ్ ఫిర్యాదు చేస్తే సస్పెండ్ చేస్తాం.. ఆర్టీసీ డిపోల పరిధిలో గ్రామాలలోని విద్యార్థులకు ఉచిత బస్పాస్లలో ఆర్టీసీ ఉద్యోగులు అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని ఫీర్యాదు చేస్తా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. తాండూరు ఆర్టీసీ డిపోలో జరిగిన సంఘటన తమ దృష్టికి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల నుంచి డబ్బులను వసూలు చేసిన విషయమై విచారణ చేస్తాము. భవానీప్రసాద్, డివిజనల్ మెనేజర్,ఆర్టీసీ డిపో -
గోవా బీచ్‌లో తాండూరు వాసి హత్య
తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన వ్యక్తి గోవా బీచ్‌లో హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి అతడిని హతమార్చారు. తాండూరు సీతారాంపేట్‌కు చెందిన సచిన్ దూమాలే(37)కు 14 ఏళ్ల క్రితం సంగీతతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు నూతన్, ఆర్తీలు ఉన్నారు. సచిన్ పాత బట్టలను గోవా, ముంబై నుంచి సేకరించి తాండూరు మార్కెట్లో విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. తన వద్ద స్టాక్ లేకపోవడంతో పాత బట్టలను తీసుకువచ్చేందుకు జూన్ 20న గోవా వెళ్లాడు. గోవాకు వెళ్లిన సచిన్ ఐదు రోజులైన ఫోన్ చేయకపోవడంతో సంగీత ఆందోళనకు గురైంది. శనివారం గోవా పోలీస్‌స్టేషన్ నుంచి సంగీతకు ఫోన్ వచ్చింది. వాట్సాప్‌లో ఫొటో పంపిస్తున్నాం.. గుర్తు పట్టండి అంటూ మృతుడి కాల్‌డేటా ఆధారంగా పోలీసులు ఫోన్ చేశారు. ఫొటోలు చూసిన సంగీత తన భర్త సచిన్ అని గోవా పోలీసులకు చెప్పింది. గోవా బీచ్‌లో మూడ్రోజుల క్రితం హత్యకు గురయ్యాడని తెలిపారు. దీంతో సచిన్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. హత్యకు దారి తీసిన కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు కుటుంబీకులు గోవాకు బయల్దేరారు. వీధినపడిన కుటుంబం.. తాండూరులో పాత బట్టల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే సచిన్ దూమాలే హత్యకు గురికావడంతో ఆ కుటుంబం రోడ్డునపడింది. రెక్కాడితే కానీ డొక్కాడని దయనీయ స్థితి కావడంతో పెద్దదిక్కును కోల్పోయి భార్య, పిల్లలు అనాథలయ్యారు. సచిన్ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని స్థానిక నేతలు కోరుతున్నారు. -
పెళ్లి పీటలపై ఆగిన బాల్యవివాహం
బషీరాబాద్(తాండూరు) వికారాబాద్ : బాల్య వివాహాన్ని పోలీసులు, చైల్డ్‌లైన్ ప్రతినిధులు అడ్డుకున్నారు. ఈ ఘటన బషీరాబాద్ మండలం నవల్గ పంచాయతీ పరిధిలోని బోజ్యానాయక్ తండాలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోజ్యానా యక్ తండాకు చెందిన బాలిక (16) అదే పంచాయతీ పరిధిలోని బాబునాయక్ తండాకు చెందిన రాథోడ్ రమేష్ అనే యువకుడితో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. అయితే 1098కు బాల్యవివాహం జరుగుతుందని సమాచారం వెళ్లడంతో వెంటనే చైల్డ్‌లైన్ ప్రతినిధులు వెంకట్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, వెంకటేష్, పోలీసులు బోజ్యానాయక్ తండాకు చేరుకున్నారు. బాలికకు పెళ్లి వయసు రాలేదని, పెళ్లిని నిలుపుదల చేశారు. దీంతో ఒక్కసారిగా పెళ్లి పందిరిలో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం వధూవరులను, పెళ్లి పెద్దలను బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి ఉంచి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లిన పోలీసులు వారిని తహీసల్దార్ వెంకటయ్య ఎదుట బైండోవర్ చేశారు. బాలికకు పెళ్లీడు వచ్చే వరకు పెళ్లి చేయమని తల్లిదండ్రులు ఒప్పంద పత్రం రాసిచ్చారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఇరుకుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. -
మినరల్ వాటార్ తాగుతున్నారా?
తాండూరు పట్టణంలోని సాయిపూర్‌కు చెందిన నరేష్ నిత్యం స్థానికంగా దొరికే ఫిల్టర్ వాటర్ వినియోగిస్తున్నాడు. ఇటీవల అతడికి జ్వరం వచ్చి ఆస్పత్రికి వెళ్తే డాక్టర్ పరిశీలించి.. వాటర్ ఇన్ఫెక్షన్ అయిందని చెప్పడంతో నోరెళ్లబెట్టాడు. తాను ఫిల్టర్ వాటర్ వాడుతుండగా ఇన్ఫెక్షన్ రావడం ఏంటని ఖంగుతిన్నాడు. దీనిద్వారా మనకు స్థానికంగా వాటర్ ప్లాంట్లలో లభిస్తున్న నీరు ఎంత పరిశుభ్రంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. వాటర్ ఫిల్టర్ నిర్వాహకులు సరైన నాణ్యతాప్రమాణాలు పాటించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు సైతం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాండూరు : ప్రస్తుతం వేసవి కాలం కావడంతో జిల్లా పరిధిలోని పట్టణాలు, గ్రామాల్లో వాటర్ ఫిల్టర్ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. వాటర్ ఫిల్టర్ నిర్వాహకులు నీళ్లను నామమాత్రంగా శుద్ధి చేసి జనానికి అంటగడుతున్నారు. ప్రాంతాన్ని బట్టి ఒక్కో బాటిల్‌కు రూ. 15 నుంచి 20 వరకు వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఈ నేపథ్యం లో ప్రజలు డబ్బులు పెట్టి మరీ రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. తరచూ తనిఖీలు చేయాల్సిన అధికారులు ఎక్కడా కనిపించకపోవడంతో ‘ఫిల్టర్’వ్యాపారులు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నవిధంగా తయారైంది. తాండూరు మున్సిపల్ పరిధిలో దాదాపు 10 వాటర్ ప్లాంట్లు కొనసాగుతున్నాయి. సీజన్ కావడంతో ప్రతిరోజూ రూ.లక్షకు పైగా వ్యాపారం నడుస్తోంది. ప్రభుత్వ నిబంధనలు పాటించి నాణ్యమైన నీటిని జనానికి అందించాల్సిన నిర్వాహకులు లాభార్జనే ధ్యేయంగా వ్యాపారం సాగిస్తున్నా అడిగే నాథుడు లేకుండా పోయాడు. నిబంధనల ప్రకారం లీటర్ నీటిలో 50 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) ఉండాల్సిన చోట వాటర్ ప్లాంట్లలో ఏకంగా 150–200 పీపీఎం ఉంటుంది. మండలాల్లోనూ అదే పరిస్థితి.. జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లోనూ వాటర్ ఫిల్టర్ నిర్వాహకులు సరైన నాణ్యతాప్రమాణాలు పాటించడం లేదు. పలు పట్టణాలు, మండల కేంద్రాల్లో ఏటా వాటర్ ఫిల్టర్ కేంద్రాలు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన వాటర్ ప్లాంట్లు ప్రస్తుతం గ్రామాల్లోనే విరివిగి విస్తరించాయి. రూ.1లక్ష నుంచి 2లక్షల వరకు వెచ్చిస్తే వాటర్ ప్లాంట్ యూనిట్లు మార్కెట్లో లభిస్తున్నాయి. ఈనేపథ్యంలో నిబంధనలు పాటించకకుండానే నిర్వాహకులు దందా కొనసాగిస్తున్నారు. నాణ్యత దేవుడికెరుక.. తాండూరు నియోజకవర్గంలో 30కి పైగా నీటిశుద్ధి కేంద్రాలు కొనసాగుతున్నాయి. అందులో కొన్నింటికి నిర్వాహకులు గతంలో అనుమతులు తీసుకున్నా.. తిరిగి వాటిని రెన్యూవల్ చేసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతోపాటు మున్సిపల్ అనుమతులు లేకుండానే ఎక్కడపడితే అక్కడ ఇష్టానుసారంగా వాటర్ ప్లాంట్లను నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రూ. లక్షల్లో వ్యాపారంజరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. మున్సిపల్ నీటితోనే శుద్ధి.. తాండూరు మున్సిపల్ పరిధిలోని చాలా వాటర్ ప్లాంట్లు మున్సిపల్ నీటినే శుద్ధి చేసి జనానికి విక్రయిస్తున్నారు. లేదంటే బోరునీటిని శుభ్రపరిచి జనానికి అంటగడుతున్నారు. 20 లీటర్ల డబ్బా(క్యాన్)ను ఆటోల్లో తరలించి ఇంటింటికి వెళ్లి విక్రయిస్తున్నారు. నిబంధనల ప్రకారం నిర్వాహకులు నీటి పరీక్షలు నిర్వహించడం లేదు. టీడీఎస్(టోటల్ డిజాల్వ్డ్ సాలీడ్) పరీక్షలు చేసిన అనంతరం ప్రజలకు అందజేయాల్సి ఉన్నా.. ఆ దిశగా ఎవరు పట్టించుకోవడం లేదు. ఫిల్టర్ చేసి నేరుగా విక్రయిస్తున్నారు. పాటించాల్సిన నిబంధనలు ఇవీ.. వాటర్ ప్లాంట్ నిర్వహణ కోసం మున్సిపల్ లేదా పంచాయతీ అనుమతి తీసుకోవాలి. పరిశ్రమల శాఖ నుంచి అనుమతులు పొందాలి. ప్లాంట్ నిర్వహణకు బీఎస్ఐ అనుమతులు తీసుకోవాలి. ప్లాంట్లలో మైక్రోబయాలజి, కెమిస్ట్రీ నిపుణులు తప్పనిసరిగా ఉండాలి. నిత్యం పరీక్షలు చేసిన తర్వాతే ప్రజలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. పీహెచ్ స్థాయి 10 కంటే తగ్గకుండా చూసుకోవాలి. తగ్గితే ఆ నీరు వినియోగించిన ప్రజలు కిడ్నీ సమస్యలతో బాధపడే ప్రమాదం ఉంది. నీటిని సరఫరా చేసే డబ్బాలను నిత్యం పొటా షియం పర్మాంగనేట్‌తో శుభ్రం చేయాలి. నీటిలో పూర్తిగా కరిగిపోయే లవణాలను కూడా పరీక్షించాలి. ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఖాళీ.. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. భర్తీ చేయాలని కలెక్టర్‌కు నివేదించాం. వాటర్ ప్లాంట్ల ఏర్పాటు కోసం మున్సిపల్ నుంచి కొన్నింటికి అనుమతులు ఇచ్చాం. వాటర్ తరచూ అధికారులు పరిశీలించాలి. కాని.. పని ఒత్తిడితో సాధ్యం కావడం లేదు. వెంటనే పరిశీలిస్తున్నాం. –భోగీశ్వర్లు, కమిషనర్, తాండూరు మున్సిపాలిటీ ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయి వాటర్ప్లాంట్లలో నిబంధనలు పాటించడం లేదు. అధికారులు తనిఖీలు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. నిర్వాహకులు నీటిని నామమాత్రంగా శుద్ధి అమ్ముకుంటున్నారు. దీంతో జనానికి మూత్రపిండాల వ్యాధులు, ఇతర రోగాలు వస్తున్నాయి. –సత్యమూర్తి,తాండూరు -
కల్వర్టును ఢీకొన్న బైక్..వ్యక్తి మృతి
కరన్‌కోట్: తాండూరు మండల పరిధిలోని కరన్‌కోట్ గ్రామంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు గ్రామస్తుల కథనం ప్రకారం..మండల పరిధిలోని బెల్కటూర్ గ్రామానికి చెందిన చాకలి వెంకటప్ప(35) కరన్‌కోట్‌లోని సీసీఐ సిమెంటు కర్మాగారంలో గత 13 సంవత్సరాలుగా కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కరన్‌కోట్‌లోని సీసీఐ టౌన్షిప్లో నివాసం ఉంటున్నాడు. బుధవారం రాత్రి స్వగ్రామంలో జరిగిన బంధువుల విందుకు హాజరై తిరిగి బైక్‌పై కరన్‌కోట్‌కు బయలుదేరాడు. ఈ క్రమంలో కరన్‌కోట్ శివారులోని సీసీఐకి వెళ్లే దారి మలుపులో స్పీడ్ బ్రేకర్ పక్కన ఉన్న కల్వర్టును అతివేగంతో ఢీకొన్నాడు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతడిని స్థానికులు గమనించి సీసీఐ అంబులెన్స్‌లో తాండూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే వెంకటప్ప మృతి చెందినట్టు వైద్యులు పేర్కొన్నారు. గురువారం పోస్టుమార్టం అనతరం మృతదేహాన్ని స్వగ్రామనికి తరలించారు. కాగా మద్యం మత్తుతో పాటు అతివేగమే ప్రమాదానికి కారణంగా గ్రామస్తులు తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారని వారిని ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా కార్మిక సంఘం నాయకుడు శరణప్ప డిమాండ్ చేశారు. -
అతి పురాతన విగ్రహం ఇదే సుమా!
► తాండూరులో పురాతన వరాహస్వామి విగ్రహం ► తెలుగు రాష్ట్రాల చరిత్రలో పురాతన విగ్రహంగా నిర్ధారణ సాక్షి, హైదరాబాద్: గర్జిస్తున్న ఉగ్రరూపం.. ఓ చేతిపై శాంతమూర్తిగా కొలువు దీరిన భూదేవి.. విజయ గర్వంతో కటి భాగంపై ఠీవిగా ఉంచిన మరో చేయి.. మరో రెండు చేతులలో శంఖచక్రాలు.. వాహనంగా ఆదిశేషుడు.. హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవికి విముక్తి చేసిన తర్వాత కనిపించే వరాహస్వామి రూపమిది. ఈ రూపాన్ని అత్యంత సుందరంగా చెక్కిన పురాతన కాలం నాటి విగ్రహం తాజాగా వెలుగుచూసింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే అతి పురాతనమైనదిగా పేర్కొంటున్న ఈ విగ్రహం... సుమారు ఐదు, ఆరో శతాబ్దానికి చెందినదిగా పురావస్తు నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే గుప్తులు– వాకాటక రాజవంశాల నాటి కాలంలో ఈ విగ్రహాన్ని రూపొందించి ఉంటారని పేర్కొంటున్నారు. బాదామి చాళుక్యుల హయాంలో రూపొంది, ప్రస్తుతం జోగులాంబ గద్వాల ప్రాంతంలో ఉన్న నవబ్రహ్మ దేవాలయ ప్రాంగణంలోని విగ్రహాలే పురాతన విగ్రహాలుగా పరిగణిస్తున్నారు. అంతకుముందు ఈ ప్రాంతాన్ని పాలించిన రాజవంశాల్లో బౌద్ధానికి సంబంధించిన పురాతన విగ్రహాలు వెలుగు చూసినా... హిందూ దేవతల విగ్రహాలకు సంబంధించి నవబ్రహ్మ ఆలయ విగ్రహాలనే పురాతనమైనవిగా భావిస్తారు. అవి ఏడో శతాబ్దానికి చెందినవి. అంతకు పూర్వంనాటి హిందూ దేవతల విగ్రహం మాత్రం తాజాగా బయటపడిన వరాహమూర్తిదే. తాండూరుకు చేరువలో.. వికారాబాద్ జిల్లాలోని తాండూరుకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాలాల అనుబంధ గ్రామం గోవిందరావుపేట. ఒకప్పుడు చేనేత పరిశ్రమకు కేంద్రంగా భాసిల్లిన ప్రాంతం. తర్వాత రూపు కోల్పోయి శిథిల గ్రామంగా మారింది. కాగ్నా నదికి ఉపనదిగా భావించే కాక్రవేణి వాగు (నది) ఒడ్డున ఉన్న ఈ గ్రామ పొలిమేరలో పూర్తిగా ధ్వంసమైన ఓ ఆలయ శిథిలాలు ఉన్నాయి. ఆ రాళ్లకుప్ప మధ్య రాజఠీవి ఒలకబోస్తూ వరాహస్వామి విగ్రహం కనిపిస్తుంది. 3.25 అడుగుల ఎత్తు, 2.6 అడుగుల వెడల్పున్న ఈ విగ్రహం గుప్తుల కాలం నాటిదిగా భావిస్తున్నారు. అప్పట్లో బౌద్ధ విగ్రహాలను అత్యంత సుందరంగా రూపొందించిన దాఖలాలున్నాయి. గుప్తుల కాలంలో ఐదో శతాబ్దంలో బౌద్ధం నుంచి హైందవ సంప్రదాయం వైపు తిరిగి అడుగులు పడినట్లు చరిత్ర చెబుతోంది. ఆ సమయంలోనే మహావిష్ణువు దశావతారాల విగ్రహాలను విరివిగా రూపొందించి ప్రతిష్టించారు. గుప్తుల ఏలుబడిలో ఉన్న ప్రాంతాల్లో అలాంటి విగ్రహాలు వెలుగు చూశాయి కూడా. అదే సమయంలో దక్కన్ ప్రాంతాన్ని పాలించిన వాకాటక రాజులు గుప్తులతో మంచి సంబంధాలు కలిగి ఉండేవారు. గోవిందరావుపేటలో కనిపించిన వరాహస్వామి విగ్రహం కూడా గుప్తుల ఏలుబడి ప్రాంతం నుంచి వాకాటకుల పరిధిలోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. విగ్రహాన్ని గుర్తించిన ప్రభుత్వ టీచర్ తాండూరుకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వీరేశం తొలుత ఈ పురాతన విగ్రహాన్ని గుర్తించారు. చాలాకాలంగా ఆ ప్రాంతానికి చెందినవారు దీనిని చూస్తున్నా.. దీని ప్రత్యేకతపై అవగాహన లేకపోవటంతో సాధారణ విగ్రహంగానే భావిస్తున్నారు. పురాతనకాలం నాటి విగ్రహాలపై ఉన్న కాస్త అవగాహనతో వీరేశం దానిని గుర్తించి ‘సాక్షి’దృష్టికి తెచ్చారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పురావస్తు శాఖలో పనిచేసిన నైపుణ్యం, పలు పరిశోధనల్లో పాల్గొన్న అనుభవమున్న రిటైర్డ్ అధికారి రంగాచార్యులు దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన ఈ విగ్రహాన్ని పరిశీలించి గుప్తుల కాలానికి చెందినదిగా తేల్చారు. కచ్చితంగా పురాతన విగ్రహమే.. ‘‘ఉదయగిరి, మహాబలిపురం తదితర ప్రాంతాల్లో గుప్తులు, పల్లవుల కాలంలో రూపొందిన వరాహస్వామి విగ్రహాలలో ఉండే లక్షణాలు ఈ విగ్రహంలో ఉన్నాయి. నునుపుగా చెక్కిన తీరు, చిన్నచిన్న అంశాలు కూడా స్పష్టంగా చెక్కిన విధానం, అందంగా మలిచిన రూపు.. ఇవన్నీ గుప్తుల కాలం నాటి ప్రత్యేకతలే. అక్కడి నుంచే వాకాటకుల పరిధిలోకి వచ్చి ఉంటుంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో గుర్తించిన ప్రాచీన విగ్రహాల్లో ఇదే అతి ప్రాచీనమైనదని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో పరిశోధన చేస్తే మరిన్ని శిల్పాలు వెలుగు చూసే అవకాశముంది. అతి ప్రాచీనమైన ఈ విగ్రహాన్ని వెంటనే పరిరక్షించాల్సి ఉంది..’’ – రంగాచార్యులు, పురావస్తుశాఖ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ నా చిన్నప్పుడు ఇక్కడ జాతర సాగేది.. ‘‘నా చిన్నప్పుడు ఈ ప్రాంతంలో జాతర సాగేదన్న విషయం కాస్త అస్పష్టంగా గుర్తుంది. తర్వాత క్రమంగా ఈ ప్రాంతం పాడుబడ్డట్టయింది. ఆలయం ధ్వంసమైంది. ఉపాధి కోసం స్థానికులు వేరే ప్రాంతాలకు వలస వెళ్లటంతో ఆలయం రాతికుప్పగా మారింది. అడపాదడపా నేనే అక్కడ దీపం వెలిగిస్తున్నా..’’ – ఆలయ సమీపంలో ఉండే ఎనభై ఏళ్ల వృద్ధుడు పోగుల కంటప్ప -
తాండూరులో దొంగల బీభత్సం
తాండూరు: రంగారెడ్డి జిల్లా తాండూరు పట్టణంలోని సాయిపూర్, తాతగుడి పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఎవరూ లేని ఇళ్లు చూసి చోరీలకు పాల్పడ్డారు. ఆరు ఇళ్ల తాళాలు పగలగొట్టి బంగారం, వెండి, నగదు దోచుకెళ్లారు. ఎంత మొత్తం చోరీ అయింది అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వెలుగులోకి ఐటీ రిటర్న్స్
తాండూర్‌లో మహారాష్ట్ర సీబీఐ అధికారుల విచారణ రూ.1.42 కోట్లు దుర్వినియోగం అయినట్లు నిర్ధారణ నలుగురు నిందితులపై కేసు నమోదు ఐటీ కన్సల్టెన్సీ కార్యాలయాన్ని సీజ్ చేసిన సీబీఐ అధికారులు తాండూర్ : మహారాష్ర్ట వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యూసీఎల్)లో పనిచేస్తున్న బొగ్గు గని కార్మికుల ఇన్‌కమ్‌టాక్స్ రిటర్న్స్ కుంభకోణం ఘటన తాండూర్‌లో కలకలం రేపింది. బుధవారం తాండూర్ ఐబీ మండల కేంద్రంలో మహారాష్ట్ర సీబీఐ అధికారులు విచారణ చేపట్టడంతో ఈ ఘటన వెలుగుచూసింది. మహారాష్ట్రకు చెందిన వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ బొగ్గు గని కార్మికులకు సంబంధించి ఇన్‌కమ్‌టాక్స్ రిటర్న్స్ కోసం తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి అక్రమాలకు పాల్పడినకేసులో మహారాష్ట్ర నాగ్‌పూర్‌కు చెందిన సీబీఐ బృందం మాదారంటౌన్‌షిప్, తాండూర్ ఐబీ కేంద్రంలో విచారణ జరిపింది. నాగ్‌పూర్ సీబీఐ ఇన్స్పెక్టర్ హెచ్.ఎస్.జహంగీర్ నేతృత్వంలో నలుగురు సభ్యుల సీబీఐ బృందం తాండూర్ మండల కేంద్రానికి చేరుకొని ఐటీ రిటర్న్స్ ఇప్పించి న ఐటీ కన్సల్టెన్సీ కార్యాలయం వద్ద కు వెళ్లారు. ఆ కార్యాలయం మూసి ఉండటంతో అక్కడి నుంచి మాదారంటౌన్షిప్లోని ఆ కన్సల్టెన్సీ ఏజెంట్ ఇంటికి వెళ్లారు. ఆ ఇంటికి కూడా తాళం వేసి ఉండటంతో కన్సల్టెన్సీలో పని చేసిన జంపాల శ్రీకాం త్ ఇంటికి వెళ్లి అతడిని విచారించా రు. శ్రీకాంత్‌కు సంబంధించిన బ్యాంకు లావాదేవీల పత్రాలను పరిశీలించారు. శ్రీకాంత్ వద్ద నుంచి అతని సెల్‌ఫోన్, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి తాండూర్ ఐబీ కేం ద్రానికి వచ్చి ఐటీ కన్సల్టెన్సీ కార్యాలయాన్ని మాదారం పోలీసుల సమక్షంలో సీబీఐ అధికారులు సీజ్ చేశారు. వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ బొగ్గు గనుల్లో పని చేస్తున్న 201 మంది చంద్రాపూర్, బల్లార్షా తదితర ప్రాంతాల కార్మికులకు చెందిన ఐటీ రిటర్న్స్ పత్రాల దాఖలులో జరిగిన అక్రమాలపై ఎఫ్ఐఆర్ నం.11/2016 కింద కేసు నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ ప్రకారంగా తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి 201 మంది కార్మికులకు సంబంధించి రూ.1.42 కోట్లు ఐటీ రిటర్న్స్ ప్రభుత్వం నుంచి ఇప్పించినట్లు విచారణలో సీబీఐ అధికారులు తేల్చారు. దీంతో ఇన్‌కంటాక్స్ డిపార్ట్మెంట్, ప్రభుత్వాన్ని మోసగించ డం, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ అక్రమ దందా కేసులో బాధ్యులైన వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఆఫీషియల్స్, కన్సల్టెన్సీ పనిచేసిన జంపాల శ్రీకాంత్, రాజేశ్‌తోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు నాగ్‌పూర్ సీబీఐ ఇన్స్పెక్టర్ హెచ్.ఎస్.జహంగీర్ వివరించారు. ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. -
మాజీ మంత్రి మల్కోడ్ మాణిక్‌రావు మృతి
♦ నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యే ♦ రెండు సార్లు ఎమ్మెల్సీ గెలుపు ♦ 14 ఏళ్లు వివిధ శాఖల మంత్రి తాండూరు (రంగారెడ్డి జిల్లా) : రంగారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మల్కోడ్ మాణిక్‌రావు (86) అస్తమించారు. కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయనకు భార్య శశిప్రభ, రమేష్, సురేష్, దీనేష్(మృతి చెందారు) ఇద్దరు కూతుళ్లు, ఉన్నారు. పీవీ.నర్సింహ్మారావు, జలగం వెంగళరావు, చెన్నారెడ్డిల ప్రభుత్వంలో దాదాపు 14 ఏళ్లు ఆయన వివిధ శాఖల మంత్రి పని చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో మాణిక్‌రావు చురుకైన పాత్ర పోషించారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన కీలకంగా పని చేశారు. 1964లో ఏకగ్రీవంగా తొలిసారి, 2007లో రెండోసారి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1969లో జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో మాణిక్‌రావు మొదటిసారి రంగారెడ్డి జిల్లా తాండూరు ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి ముఖ్యమంత్రి పీవీ.నర్సింహ్మారావు మంత్రివర్గంలో మున్సిపల్ శాఖ మంత్రి పని చేశారు. 1972లో రెండోసారి ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికై జలగం వెంగళరావు మంత్రివర్గంలో వాణిజ్య,సమాచార శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1978లో మూడోసారి శాసనసభకు ఎన్నికైన మాణిక్‌రావు చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఆర్అండ్బీ, వాణిజ్య శాఖల మంత్రి పని చేశారు. 1983లో నాల్గోసారి తాండూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1994లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. 1999లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆయన అజయం పొందారు. క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ రాష్ట్ర,జాతీయ కాంగ్రెస్ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ తాండూరు నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. గత ఏడాది కాలంగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. సోమాజిగుడలోని నివాసంలో ఇంట్లో భార్య శశిప్రభతో కలిసి ఉంటున్నారు. 8నెలల క్రితం ఆయనకు పక్షపాతం వచ్చింది. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం మరింత క్షిణించింది. రెండు నెలలుగా శ్వాస తీసుకోవడంలో మాణిక్‌రావు ఇబ్బందులు పడుతున్నారు. దాంతో వారం రోజుల క్రితం కుటుంసభ్యులు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మాణిక్‌రావు గురువారం ఉదయం 7గంటలకు మృతి చెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలనే తరుచూ సన్నిహితుల వద్ద ఆయన ప్రస్తావించే వారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో తన కల సాకారం అయ్యిందని మాణిక్‌రావు సంతోషపడ్డారని ఆయన సన్నిహితులు చెప్పారు. ఆయన మృతి కాంగ్రెస్‌కు తీరని లోటని స్థానిక కాంగ్రెస్ నేతలు అన్నారు. తాండూరులో ఆయన అంత్యక్రియలు జరిగాయి. -
తాండూరులో కాంట్రాక్టు ఉద్యోగి ఆత్మహత్య
తాండూరు : రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాండూరుకు చెందిన మహేశ్ అనే వ్యక్తి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్నతాధికారుల వేధింపులే తన మరణానికి కారణమని మహేశ్ సూసైడ్ నోట్లో రాసి ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో అతని బంధువులు మున్సిపల్ కార్యాలయం ముందు మృతదేహంతో ధర్నాకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు మహేశ్ బంధువులతో చర్చిస్తున్నారు. -
రేపు ప్రమాదరహిత వారోత్సవాల ముగింపు
తాండూరు: ప్రమాద రహిత వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తాండూరు ఆర్టీసీ డిపో మేనేజర్ కృష్ణమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డితోపాటు ఆర్టీసీ ఈడీ, ఆర్ఎం, హైదరాబాద్ 1, 2, పికెట్, వికారాబాద్, పరిగి, తాండూరు డిపోలకు చెందిన అధికారులు పాల్గొంటారని ఆయన వివరించారు. -
రుణమాఫీ చేయాలని..
తాండూరు: రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఓ రైతు బ్యాంకు భవనం పై నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. సకాలంలో స్పందించిన తోటివారు చివరి క్షణాల్లో అతన్ని కాపాడటంతో ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా తాండూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రుణమాఫీ చేయాలని మండల కేంద్రంలో రైతులు నిర్వహించిన రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ నలిచిపోయింది. -
అమ్మానాన్న.. క్షమించండి!
రైలు కింద పడి డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య తాండూరు రూరల్: అమ్మానాన్న.. క్షమించండి అంటూ ఓ డిగ్రీ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ మండలం హస్నాబాద్‌కు చెందిన మిర్జాపురం రాములు, రాములమ్మ దంపతుల కుమారుడు రాఘవేందర్(20) తాండూరులోని సింధూ డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. చదువుకుంటూనే హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలంగా రాఘవేందర్ స్వగ్రామంలో ఉంటున్నాడు. ఉద్యోగం మానేసి చదువుకోమని తల్లిదండ్రులు సూచించినా వినకుండా పనిచేసుకుంటూ చదువుకుంటానని చెప్పి గత ఆదివారం ఇంటి నుంచి బయలుదేరాడు. గురువారం ఉదయం తాండూరు రైల్వేస్టేషన్ సమీపంలో రాఘవేందర్ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. చేతికి అందివచ్చిన కుమారుడు బలవన్మరణానికి పాల్పడడంతో రాఘవేందర్ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. -
తాండూరులో రెచ్చిపోయిన దొంగలు
తాండూరు: రంగారెడ్డి జిల్లాలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. తాండూరు తులసీనగర్‌లో శనివారం తెల్లవారు జామున ఐదిళ్లలో చోరీకి పాల్పడ్డారు. స్థానిక సిద్ధివినాయక ఆలయం వీధిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రామయ్య నివాసముంటున్న కింది పోర్షన్‌తో పాటు ఐదు ఇళ్ల తాళాలు పగులగొట్టి బంగారు నగలు, నగదు దోచుకెళ్లారు. దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసుకుని స్వైరవిహారం చేశారు. ఇళ్ల యజమానులు వివిధ పనుల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లిన సమయంలో ఈ చోరీలు జరిగాయి. గమనించిన ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చోరీలు జరిగిన ఇళ్లను పరిశీలించారు. ఇంటి యజమానులు వస్తేకాని చోరీ వివరాలు తెలియవని చెబుతున్నారు. సీఐ ఇంటి సమీపంలో చోరీ జరగడం స్థానికులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. -
‘తాండూర్‌లో పారిశ్రామిక వాడ'
తాండూర్: రంగారెడ్డి జిల్లా తాండూర్‌లో నాపరాత్రి పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తాండూర్‌లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పాలిషింగ్ యూనిట్లన్నిటినీ ఒకే చోటికి తరలించనున్నట్లు వివరించారు. జినుగుర్తి వద్ద పారిశ్రామిక వాడ ఏర్పాటుపై పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పటికే హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. -
తాండూరులో మూడేళ్ల బాలుడి హత్య
తాండూరు: రంగారెడ్డి జిల్లా తాండూరులో విషాదం చోటుచేసుకుంది. సిరిగిరిపేట గ్రామానికి చెందిన హన్మంతు,లక్ష్మి దంపతుల కుమారుడు రాఘవేందర్(3) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ నెల ఐదవ తేదీ నుంచి కుమారుడు కనిపించకపోవడంతో... స్థానిక పోలీస్‌స్టేషన్‌లో చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అనూహ్యంగా ఆదివారం మధ్యాహ్నం గ్రామశివారులో బాలుడి మృతదేహం లభ్యమైంది. తమ కుమారుడిని సమీప బంధువులు బాలప్ప, చంద్రమ్మలే క్షుద్రపూజల కోసం హత్య చేశారని రాఘవేందర్ తల్లిదండ్రులు చెబుతున్నారు. బాలుడి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
బాలికపై అత్యాచారయత్నం
యువకుడిపై కేసులు నమోదు తాండూర్ : మండలంలోని గోపాల్‌నగర్ గ్రామానికి చెందిన బాలిక(13)పై అత్యాచారానికి యత్నించిన తాండూర్ గ్రామానికి చెందిన ఆలేటి సిద్ధార్థపై పలు కేసులు నమోదయ్యాయి. ఎస్సై కె.అశోక్‌కుమార్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గోపాల్‌నగర్‌కు చెందిన బాలిక తాండూర్‌లో ఏడో తరగతి చదువుతోంది. శుక్రవారం పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు తాండూర్‌లో ఆటో కోసం ఎదురుచూస్తోంది. ఆ సమయంలో మోటారుసైకిల్‌పై వచ్చిన సిద్ధార్థ తాను గోపాల్‌నగర్ వైపే వెళ్తున్నానని, తనతో వస్తే తీసుకెళ్లి దింపుతానని నమ్మబలికి మోటారుసైకిల్ ఎక్కించుకున్నాడు. తాండూర్ శివారు దాటిన తర్వాత నిర్మానుష్య ప్రదేశం వైపు తీసుకెళ్లాడు. పక్కనే ఉన్న పొదల్లోకిలాక్కెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ బాలిక కేకలు వేసింది. అది విని సమీప పంట చేలల్లో పని చేస్తున్న వారు పరుగెత్తుకు వచ్చారు. వారి రాకను గమనించిన సిద్ధార్థ పారిపోయాడు. బాలిక తల్లిదండ్రులు తాండూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై శనివారం బెల్లంపల్లి డీఎస్పీ రమణారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో విచారణ చేపట్టారు. యువకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, నిర్భయ, పోక్సో కేసులను నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు ఎస్సై తెలిపారు. -
మురికికాల్వలో పడి చిన్నారి మృతి
తాండూరు: పారాడుతూ వెళ్లిన ఓ పసివాడు మురికి కాల్వలో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి వరకు ఇంట్లో సందడి చేసిన చిన్నారి కనిపించకపోయే సరికి ఆందోళన చెందిన తల్లి ఇంటి చుట్టూ వెతకగా మురికి కాల్వలో శవమై కనిపించాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా తాండూరు పట్టణం మల్రెడ్డిపల్లి వద్ద శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
12 మంది బాలకార్మికులకు విముక్తి
వివిధ పనులు చేస్తున్న బాలకార్మికులను పోలీసులు విముక్తి కల్పించారు. ఆపరేషన్ స్మైల్ల్లో భాగంగా ఎస్ఐ ఖలీల్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో పలు దుకాణాలతో పాటు పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో తనిఖీలు నిర్వహించారు.హోటల్‌తో పాటు అక్కడక్కడ చెత్త సేకరిస్తున్న బాలికాలను కూడా గుర్తించారు. మొత్తం 12 మంది బాలకార్మికులను గుర్తించి వారిని తాండూరు ఎమ్మార్సీ కార్యాలయంలో ఏంఈఓ శివకుమార్‌కు అప్పగించారు. వీరిలో 8 మంది బాలురు, 4గురు బాలికలు ఉన్నారని చెప్పారు. పట్టుబడిన బాలల్లో సగం మంది మధ్యలో బడి మానేసిన వారేన ని గుర్తించారు. బాల కార్మికుల తల్లిదండ్రులకు ఏంఈఓ శివకుమార్ కౌన్సెలింగ్ నిర్వహించారు. బడి మానేసిన పిల్లలను బడికి పంపిస్తామని తల్లిదండ్రులు హామి ఇచ్చారు. -
అక్కాచెల్లెళ్లను కాటేసిన పాము: చెల్లెలు మృతి
తాండూరు రూరల్ (రంగారెడ్డి) : ఇంటి ముందు ఆడుకుంటున్న అక్కాచెల్లెళ్లను పాము కాటు వేసింది. ఇది గుర్తించిన కుటుంబసభ్యులు వారిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా.. చెల్లెలు మృతి చెందింది. ప్రస్తుతం అక్క పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా తాండూరులో గురువారం చోటుచేసుకుంది. పట్టణంలోని రహమత్‌నగర్‌కు చెందిన అబ్దుల్, ఫాతిమా దంపతుల కూతుళ్లు సనాబేగం(6), సౌలీబేగం(3)లు ఇంటి ముందు ఆడుకుంటుండగా.. పాము కాటు వేసింది. దీంతో ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నిస్తుండగా.. సౌలీబేగం మృతిచెందింది. సనాబేగంను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.