బస్‌పాస్‌ల పేరిట దోపిడీ | Exploit In The Name Of Bus Pas | Sakshi
Sakshi News home page

బస్‌పాస్‌ల పేరిట దోపిడీ

Published Thu, Jul 5 2018 9:09 AM | Last Updated on Thu, Jul 5 2018 9:09 AM

Exploit In The Name Of Bus Pas - Sakshi

తాండూరు బస్‌ స్టేషన్‌లో బస్‌ పాస్‌ కౌంటర్‌ వద్ద విద్యార్థులు 

తాండూరు : పెద్దేముల్‌ మండలానికి చెందిన భవాని తాండూరులో 8వ తరగతి చదువుతోంది. పేద కుటుంబం కావడంతో ప్రభుత్వం బస్‌పాస్‌ను ఉచితంగా అందించింది. బస్‌పాస్‌ తీసుకునేందుకు బస్‌స్టేషన్‌లో ఉన్న కౌంటర్‌ వద్దకు వెళితే రూ.60 చెల్లించాలని డిమాండ్‌ చేశారు. చేసేది లేక ఆ విద్యార్థి ఆరోజు పాస్‌ తీసుకోకుండానే గ్రామానికి వెళ్లిపోయింది.

మరుసటి రోజు రూ.60 చెల్లించి బస్‌ పాస్‌ పొందింది. బస్‌పాస్‌ల పేరిట ఆర్టీసీ ఉద్యోగులు దోపిడీకి పాల్పడుతున్నా సంబంధిత అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా బస్‌పాస్‌ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చింది.

జూన్‌లో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కాగానే విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రావాణాశాఖ అధికారులు గ్రామాల్లోనే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత బస్‌ పాస్‌లు అందించేందుకు నియమించింది. ఇదే అదునుగా భావించిన సదరు అధికారులు విద్యార్థుల నుంచి పాస్‌ ఫీజు రూ.30లకు బదులుగా,  నిబంధనలకు విరుద్ధంగా రూ.60 వసూలు చేస్తూ అధిక డబ్బు వసూలు చేస్తున్నారు.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా కొనసాగుతున్న జిల్లాలలోనే ఇలా అక్రమ వసూళ్లకు ఆర్టీసీ ఉద్యోగులు పాల్పడడం గమనార్హం. వికారాబాద్‌ జిల్లాలో మొత్తం తాం డూరు, పరిగి, వికారాబాద్‌ పట్టణాల్లో ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఆర్టీసీ డిపోల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఉచితంగా బస్‌పాస్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి, అమలుచేస్తోంది.

విద్యార్థులు బస్‌పాస్‌ల విషయంలోఇబ్బందులు పడవద్దన్న ఉద్దేశంతో రెండు మూడేళ్లుగా మండలాల్లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు వెళ్లి ఆర్టీసీ ఉద్యోగులు బస్‌ పాస్‌లనుపంపిణీ చేస్తారు. గతేడాది జిల్లాలోని 18 మండలాల విద్యార్థులకు మూడు ఆర్టీసీ డిపోల నుంచి33వేల మంది విద్యార్థులకు ఉచిత బస్‌ పాస్‌లనుఅందించారు. అయితే బస్‌ పాస్‌లను జారీ చేసేందుకు ఆన్‌లైన్‌ ఫీజు పేరిట గతేడాది రూ.30లుతీసుకుంటే ఈ ఏడాధి అనందనంగామరోరూ.30 వసూలు చేసినట్లుతెలిపారు.

నిబంధనలకు విరుద్దంగా వసూళ్లు

జిల్లాలోని 18 మండలాల్లో ప్రతిఏటా దాదాపు 33 వేల మందికి బస్‌ పాస్‌లు జారీ చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు తాండూరు పరిగి వికారాబాద్‌ ఆర్టీసీ డిపోల పరిధిలో బస్‌ పాస్‌లను జారీ చేసేందుకు వికారాబాద్‌ డిపో పరిధిలో 9 మంది, పరిగిలో 9మంది, తాండూరులో 7 గురు ఆర్టీసీ ఉద్యోగులను నియమించారు.

పాఠశాలలు ప్రారంభమైన నాటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులుప్రతి రోజు ఒక్కొ మండలానికి వెళ్లి బస్‌పాస్‌ల ప్రక్రియ నిర్వహిస్తున్నారు. జూన్‌ నెలలో మొత్తం 18 వేల మంది విద్యార్థులకు ఉచిత బస్‌ పాస్‌లను అందించారు. అయితే ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ నిభందనల ప్రకారం విద్యార్థుల నుంచిరూ.30 తీసుకోకుండా రూ.60 వసూలుచేస్తున్నారని విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయుల నుంచి విమర్శలు వస్తున్నాయి.

మంత్రి ఇలాఖాలోనే దోపిడీ 

ఆర్టీసీ బాస్‌గా వ్యవహరిస్తున్న తాండూరుఎమ్మెల్యే, రాష్ట్ర రావాణాశాఖ మంత్రిపట్నం మహేందర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇలాఖాలోనే ఆర్టీసీ అధికారులు దోపిడికి తెరలేపారు. జిల్లాలోనే అధికంగా తాండూరు ఆర్టీసీ డిపోలో విద్యార్థుల నుంచి అధికంగా డబ్బులను వసూలు చేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 18వేల మంది విద్యార్థులకు బస్‌ పాస్‌లను అందించి దాదాపు రూ.5లక్షల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అధికంగా డబ్బులు వసూలు చేయొద్దు.. 

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న ఉచిత బస్‌ పాస్‌లలో ఆర్టీసీ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. విద్యార్థుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయడం సరికాదని. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొఓక్కారని ఆరోపించారు. ఉప్పల రాజేశ్, ఏబీవీపీ తాండూరు ఇంచార్జ్‌

ఫిర్యాదు చేస్తే సస్పెండ్‌ చేస్తాం..

ఆర్టీసీ డిపోల పరిధిలో గ్రామాలలోని విద్యార్థులకు ఉచిత బస్‌పాస్‌లలో ఆర్టీసీ ఉద్యోగులు అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని ఫీర్యాదు చేస్తా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. తాండూరు ఆర్టీసీ డిపోలో జరిగిన సంఘటన తమ దృష్టికి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల నుంచి డబ్బులను వసూలు చేసిన విషయమై విచారణ చేస్తాము.   భవానీప్రసాద్, డివిజనల్‌ మెనేజర్,ఆర్టీసీ డిపో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement