![telangana Focus On student bus pass](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/646.jpg.webp?itok=epWIurL8)
గత నెల 31 వరకు 3 నెలలకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు
అవి ఇప్పుడు చెల్లుబాటు కావంటున్న కౌంటర్ ఉద్యోగులు
ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకువచ్చాక తిప్పి పంపుతున్న వైనం
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఏడాది జనవరి–ఫిబ్రవరి నుంచి అమలులోకి వచ్చే ‘ఒక నెల స్టూడెంట్ పాస్’ విధానం విద్యార్థులకు చుక్కలు చూపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు (టీజీఎస్‌ఆర్టీసీ) చెందిన సాంకేతిక విభాగం నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు బస్ పాస్ కౌంటర్లు–స్కూళ్లకు మధ్య చక్కర్లు కొట్టాల్సి వస్తోంది. దీనిపై యాజమాన్యం దృష్టి పెట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. టీజీఎస్‌ఆర్టీసీకి సంబంధించి ఎలాంటి బస్‌పాస్ కావాలన్నా ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్థుల విషయానికి వస్తే ఐదో తరగతి వరకు బస్ పాస్ ఉచితమే. ఆపై వయసు వాళ్లు మాత్రం సాధారణ లేదా రూట్ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఇలా దరఖాస్తు చేసే సమయంలో కనిష్టంగా నెల రోజుల నుంచి గరిష్టంగా మూడు నెలల కాలం వరకు బస్‌పాస్ జారీ చేస్తుంటారు. విద్యా సంవత్సరం ముసిగిన తర్వాత పాస్ దుర్వినియోగం కాకుండా ఉండటానికి జనవరి లేదా ఫిబ్రవరి నుంచి ఈ విధానాన్ని టీజీఎస్‌ఆర్టీసీ మారుస్తుంటుంది. అప్పుడు దరఖాస్తు చేసుకునే వారికి కేవలం నెల రోజుల కాల పరిమితితోనే పాస్ జారీ అవుతుంది. సాంకేతిక విభాగం నిర్లక్ష్యం కారణంగా ఇక్కడే సమస్య వస్తోంది.
సాఫ్ట్‌వేర్‌లో మార్పుల కారణంగా..
ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి సాఫ్ట్‌వేర్‌లో మార్పులు అమలులోకి వచ్చాయి. వీటి ప్రకారం ఆ తేదీ తర్వాత దరఖాస్తు చేసుకునే వారికి కాలపమితి ఎంపిక చేసుకునే అవకాశం ఉండదు. కేవలం నెల రోజులకు మాత్రమే పాస్ తీసుకునేలా దరఖాస్తు చేసుకోవాలి. ఒకసారి బస్ పాస్ కోసం దరఖాస్తు చేసుకున్నాక ఆ పాస్ తీసుకోవడానికి పది రోజుల సమయం ఉంటుంది. ఆ తర్వాత అప్లికేషన్ కాలపరిమితి ముగిసినట్లు అవుతుంది.
అంటే.. జనవరి 31 లేదా ఆ ముందు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మూడు నెలల పాస్ ఆప్షన్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇలా దరఖాస్తు చేసిన తర్వా త స్టూడెంట్స్ ఆ దరఖాస్తు ప్రింట్‌ఔట్ తీసుకోవాలి. దానిపై పాఠశాల, కాలేజీకి చెందిన అ«దీకృత వ్యక్తులతో సంతకం చేయించుకుని, స్టాంప్ వేయించుకోవడం తప్పనిసరి. దరఖాస్తు సైతం ఆన్‌లైన్‌లో నే ఆయా విద్యా సంస్థలకు చేరతాయి. వీటిని వారి తో ఫార్వర్డ్ చేయించుకుని వెళ్లి బస్‌పాస్ కౌంటర్‌లో అ«దీకృత అధికారి సంతకం చేసిన ప్రతి ఇస్తేనే పాస్ జారీ చేస్తాయి. ఇక్కడే అసలు సమస్య వస్తోంది.
సాంకేతికంగా మార్పులు చేస్తే సరి..
ఫిబ్రవరి 1కి ముందు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో ఎవరైనా మూడు నెలల కాలపరిమితితో పాస్ కావాలంటూ కౌంటర్లకు వెళ్లితే వాళ్లు తిప్పి పంపుతున్నారు. నెల రోజుల కాల పరిమితితో మరోసారి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, సంతకం–ఫార్వర్డ్ చేయించుకుని రావాలని సూచిస్తున్నారు. అదేమని ప్రశ్నస్తే.. మూడు నెలల కాల పరిమితితో ఇచ్చే పాస్‌ల జారీ ఫిబ్రవరి 1 నుంచి ఆగిపోయిన నేపథ్యంలో అప్లికేషన్ ఆన్‌లైన్‌లో కనిపించట్లేదని చెబుతున్నారు.
దరఖాస్తు మూడు నెలల పాస్ కోసమైనప్పటికీ అన్నీ సవ్యంగా ఉంటే నెల రోజులకు జారీ అయ్యేలా టీజీఎస్‌ఆరీ్టసీ వి«భాగం సాంకేతికంగా మార్పు చేస్తే సరిపోతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అలా చేయడానికి బదులు అసలు దరఖాస్తే చెల్లదంటూ మళ్లీ నెల రోజుల పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాలని తిప్పి పంపడం ఎంత వరకు సమంజసమని ప్రశి్నస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment