తాండూరు, న్యూస్‌లైన్: తాండూరు అసెంబ్లీ ఎన్నిక ఫలితం వెల్లడిలో ఉత్కంఠ కొనసాగింది. శుక్రవారం వికారాబాద్ మహావీర్ ఆస్పత్రిలో తాండూరు అసెంబ్లీ ఓట్ల లెక్కింపును 31 రౌండ్లలో చేపట్టారు. అయితే 47(అంతారం-900 ఓట్లు), 62(కరన్‌కోట్793ఓట్లు), 35 (మంబాపూర్-294 ఓట్లు) పోలింగ్‌కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలు కౌంటింగ్ కేంద్రంలో పని చేయలేదు. అయితే ఈసీఎల్ నుంచి వచ్చిన ఇంజినీర్ పరిశీలించినా ఈవీఎంలు పని చేయలేదు.
పని చేయని మూడు ఈవీఎంల ఓట్ల లెక్కిపచేయకున్నా అప్పటికే అన్ని రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయి టీఆర్‌ఎస్ అభ్యర్థి పి.మహేందర్‌రెడ్డి 16,074 ఆధిక్యతనుసాధించారు. అయి తే ఈ ప్రక్రియ సాయంత్రం ఐదుగంటలోపే పూర్తయింది కానీ గెలిచిన అభ్యర్థిని ప్రకటించి, ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదు. దాంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఒక్కొక్కరుగా నాయకులు కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. పని చేయని మూడు ఈవీఎంలో మొత్తం 1984 ఓట్ల పోలయ్యాయి. ఈ విషయమై తాండూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి హరీష్ విషయాన్ని సార్వత్రి ఎన్నికల సాధారణ పరిశీలకురాలు అమృతవల్లి దృష్టికి తీసుకువచ్చారు.
ఆమె వచ్చి వివరాలు తెలుసుకున్నారు. ఈ విషయమై ఎన్నికల సంఘంతో మాట్లాడి వారి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోవాలని ఆమె సూచించారు. దాంతో హరీష్ ఎన్నికల సంఘంతో మాట్లాడారు. వెల్లడి కానీ మూడు ఈవీఎంల ఓట్లు తక్కువగా ఉండటం, అభ్యర్థి ఆధిక్యతను ప్రభావితం చేసే విధంగా లేకపోవడంతో ఎన్నికల సంఘం నుంచి గ్రీన్ సిగ్నల్‌రావడంతో రాత్రి ఏడు గంటల తర్వాత ఎన్నికల అధికారి మహేందర్‌రెడ్డికి ఎమ్మెల్యేగా గెలిచినట్టు ప్రకటించి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. దీంతో అందరూ ఊపరిపీల్చుకున్నారు.
తాండూరు ఫలితంపై ఉత్కంఠ
Published Sat, May 17 2014 12:44 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement