Mahavir Hospital
-
మరో మూడు ఆస్పత్రుల్లో నైట్ షెల్టర్లు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల బంధువుల కోసం జీహెచ్ఎంసీ మరిన్ని నైట్ షెల్టర్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే 12 ఉండగా మరో మూడింటిని కొత్తగా ఏర్పాటు చేశారు. నిలోఫర్, మహావీర్, కోఠి ప్రసూతి ఆస్పత్రుల్లో రూ.4.8 కోట్లతో వీటిని ఏర్పాటు చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, నగర మేయర్ రామ్మోహన్‌లు వీటిని ప్రారంభించారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న తమ వారి కోసం వచ్చే అటెండెంట్లు రాత్రివేళ బస చేసేందుకు సరైన నీడ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నైట్ షెల్టర్లు వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి. -
అడ్డుగా ఉన్నాడనే అంతం
వికారాబాద్: వ్యక్తి హత్య మిస్టరీని వికారాబాద్ పోలీసులు ఛేదించి నిందితులను కటకటాల వెనక్కి పంపారు. వారం రోజుల క్రితం పట్టణంలోని ఏసీఆర్ జూబ్లీకాలనీలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి చంపిన విషయం తెలిసిందే. స్థానిక పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ వెంకటస్వామి కేసు వివరాలు వెల్లడించారు. మున్సిపల్ పరిధిలోని శివారెడ్డిపేట్కు చెందిన ఇబ్రహీంఅలీ, ఫరీదాబేగం దంపతులు. ఇబ్రహీంఅలీ కూలీపనులు చేస్తుండగా భార్య స్థానిక మహావీర్ అస్పత్రిలో వంట మనిషి. కొంతకాలంగా ఇబ్రహీంఅలీ మద్యానికి బానిసయ్యాడు. శివారెడ్డిపేటకు చెందిన ఆయన పెద్దఅక్క కొడుకు జమీల్‌తో ఫరీదాబేగంకు వివాహేతర సంబంధం ఏర్పడింది. కారు డ్రైవర్ అయిన జమీల్ ఉపాధి నిమిత్తం దుబాయికి వెళ్లాడు. అప్పుడప్పుడు స్వస్థలానికి వస్తూ తమ ‘సంబంధా’న్ని కొనసాగిస్తుండేవాడు. ఈ విషయం తెలుసుకున్న ఇబ్రహీంఅలీ పలుమార్లు భార్యను మందలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన కుంగిపోయాడు. ఎప్పటికైనా ఇబ్రహీంఅలీ తమకు అడ్డుగా ఉన్నాడని, ఆయనను ఎలాగైనా హత్య చేయాలని ఫరీదాబేగం పథకం పన్ని ప్రియుడు జమీల్‌కు చెప్పింది. ఈ నేపథ్యంలో జమీల్ వికారాబాద్‌లోని కొత్తగంజ్‌లో ఉంటున్న తన స్నేహితుడైన ఓ హోటల్ యజమాని యూసుఫ్‌ను ఫోన్లో సంప్రదించాడు. ఎలాగైనా ఇబ్రహీంఅలీని చంపేయాలని కోరాడు. చంపడం తనతో కాదని.. తన హోటల్లో కుక్‌గా పనిచేస్తున్న అశుకు డబ్బులు ఇస్తే ఆ పని చేస్తాడని యూసుఫ్ చెప్పాడు. దీంతో సుపారీ రూ.2 లక్షలకు కుదిరింది. యూసుఫ్ ఖాతాలో జమీల్ రూ.29,500లను వేశా డు. మిగతా డబ్బు పని పూర్తయ్యాక ఇస్తానని చెప్పాడు. దీంతో అశు, ఇబ్రహీంఅలీతో కలిసి ఈ నెల 1న రాత్రి ఏసీఆర్ జూబ్లీకాలనీలో మద్యం తాగాడు. పథకం ప్రకారం అశు ఇబ్రహీంఅలీకి ఎక్కువగా మద్యం తాగించాడు. అనంతరం బీరు బాటిల్ పగులగొట్టిన అశు లేవలేని స్థితిలో ఉన్న ఇబ్రహీంఅలీ గొంతు కోసి హత్యచేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫరీదాబేగం, జమీల్ల ఫోన్‌కాల్‌లపై దృష్టి సారించారు. ఈమేరకు ఫరీదాబేగంను అదుపులోకి తీసుకొని విచారించగా పైవివరాలు తెలిపింది. ఈమేరకు పోలీసులు యూసుఫ్, అశులను అరెస్టు చేసి సోమవారం ముగ్గురు నిందితులను రిమాండుకు తరలించారు. కార్యక్రమంలో సీఐ రవి,ఎస్ఐ శేఖర్లతో పాటు ఐడీ పార్టీ పోలీసులు రమేష్, బాలు ఉన్నారు. -
తాండూరు ఫలితంపై ఉత్కంఠ
తాండూరు, న్యూస్‌లైన్: తాండూరు అసెంబ్లీ ఎన్నిక ఫలితం వెల్లడిలో ఉత్కంఠ కొనసాగింది. శుక్రవారం వికారాబాద్ మహావీర్ ఆస్పత్రిలో తాండూరు అసెంబ్లీ ఓట్ల లెక్కింపును 31 రౌండ్లలో చేపట్టారు. అయితే 47(అంతారం-900 ఓట్లు), 62(కరన్‌కోట్793ఓట్లు), 35 (మంబాపూర్-294 ఓట్లు) పోలింగ్‌కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలు కౌంటింగ్ కేంద్రంలో పని చేయలేదు. అయితే ఈసీఎల్ నుంచి వచ్చిన ఇంజినీర్ పరిశీలించినా ఈవీఎంలు పని చేయలేదు. పని చేయని మూడు ఈవీఎంల ఓట్ల లెక్కిపచేయకున్నా అప్పటికే అన్ని రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయి టీఆర్ఎస్ అభ్యర్థి పి.మహేందర్‌రెడ్డి 16,074 ఆధిక్యతనుసాధించారు. అయి తే ఈ ప్రక్రియ సాయంత్రం ఐదుగంటలోపే పూర్తయింది కానీ గెలిచిన అభ్యర్థిని ప్రకటించి, ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదు. దాంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఒక్కొక్కరుగా నాయకులు కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. పని చేయని మూడు ఈవీఎంలో మొత్తం 1984 ఓట్ల పోలయ్యాయి. ఈ విషయమై తాండూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి హరీష్ విషయాన్ని సార్వత్రి ఎన్నికల సాధారణ పరిశీలకురాలు అమృతవల్లి దృష్టికి తీసుకువచ్చారు. ఆమె వచ్చి వివరాలు తెలుసుకున్నారు. ఈ విషయమై ఎన్నికల సంఘంతో మాట్లాడి వారి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోవాలని ఆమె సూచించారు. దాంతో హరీష్ ఎన్నికల సంఘంతో మాట్లాడారు. వెల్లడి కానీ మూడు ఈవీఎంల ఓట్లు తక్కువగా ఉండటం, అభ్యర్థి ఆధిక్యతను ప్రభావితం చేసే విధంగా లేకపోవడంతో ఎన్నికల సంఘం నుంచి గ్రీన్ సిగ్నల్రావడంతో రాత్రి ఏడు గంటల తర్వాత ఎన్నికల అధికారి మహేందర్‌రెడ్డికి ఎమ్మెల్యేగా గెలిచినట్టు ప్రకటించి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. దీంతో అందరూ ఊపరిపీల్చుకున్నారు.